- మహాసభల విజయవంతం కోసం ర్యాలీలు, ప్రభాతభేరీలు
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
చారిత్రకతను సంతరించుకునేలా హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఐ(ఎం) 22వ అఖిల భారత మహాసభల విజయవంతం కోసం ఊరూరా ప్రచారాలు ఊపందు కున్నాయి. నల్లగొండలో జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.సలీం, దండంపల్లి సత్తయ్య, నకిరేకల్‌లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, దేవరకొండలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య జెండాను ఆవిష్కరించారు. చిట్యాల, కట్టంగూరు, చండూరు, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, మాడ్గులపల్లి, తిప్పర్తి గ్రామాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో ప్రభాతభేరి నిర్వహించి 33వ వార్డు, చుంచుపల్లి, రుద్రంపూర్, దుమ్ముగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర శ్రీనివాస్ అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో బైక్ ర్యాలీ చేసి జెండావిష్కరణ చేశారు. జనగామ జిల్లా జనగామ పట్టణంలోని నెహ్రూపార్కు వద్ద జీపుజాతాను జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. మహబూ బాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 30 సెంటర్లలో పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌలి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గాడిపెల్లి ప్రమీల సమక్షంలో జెండా విష్కరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు అల్వాల వీరన్న ఆధ్వర్యంలో దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల, పెద్దముప్పారం, రేపోని నిదనాపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డోర్నకల్ మండలంలో 'తెల్లారింది లెగండోరు.. మహాసభకు రారండోరు' అంటూ మండల కేంద్రం డోర్నకల్, వెన్నారం, పెరుమాండ్ల సంకీస, గొల్లచర్ల గ్రామాల్లో నిర్వహించిన ప్రభాత భేరి మార్మోగింది.
Thu 19 Apr 06:09:28.739236 2018