Thu 19 Apr 16:17:40.005388 2018
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో సీపీఎం ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అనే విషయంపై మీడియా ఊహాజనితమైన వార్తలు కొనసాగుతున్నాయనీ..పాలకవర్గ పార్టీలతో ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవటం అనేది సీపీఎం చరిత్రలో ఎన్నడూ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. గతంలో ఒకసారి మద్దతునిచ్చామనీ అదికూడా బైటనుండి ఇచ్చామని తెలిపారు. సీపీఎం పార్టీకి ఓటు వేయమని ప్రజలకు విజ్నప్తి చేస్తున్నానమ్నారు. తాము పోటీ లేని ప్రాంతంలో బీజేపీని ఓడించమని ప్రజలను సీపీఎం కోరుతోందన్నారు. ఏ అంశంపైన అయినా భిన్నాభిప్రాయాలను తీసుకుని పార్టీ చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందే తప్ప ఏకాభిప్రాయం అనేది సీపీఎం చరిత్రలో లేదని ఏచూరి మరోసారి స్పష్టం చేశారు.