Thu 19 Apr 16:42:42.010916 2018
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) మహాసభలలో జస్టీస్ లోయ కేసును అత్యున్నత బెంచ్ కు తరలించాలని మహాసభ డిమాండ్ చేసింది. ఆయన మరణం పై స్వాంతంత్ర్య విచారణ జరగాలని దాఖలైన పిటీషన్ లను ముగ్గురు సభ్యల సుఫ్రీం బెంచ్ తిరస్కరించటం దురద్రుష్టకరమని మహాసభ అభిప్రాయ పడింది. జస్టీస్ లోయ మరణం వెనుక ఉన్న నిజనిజాలను వెలికితీసెందుకు ఈ కేసును అత్యున్నత అధికారాలు కల్గిన బెంచ్ రివ్యూ చేయాలని మహాసభ డిమాండ్ చేసింది.