Thu 19 Apr 18:40:38.375656 2018
హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు మరింత పెరిగిపోయాయని సీపీఎం సీనియర్ మహిళా నేత సుభాషిణి ఆలీ పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. కథువా, ఉన్నావ్ ఘటనల్లో బీజేపీ హస్తం ఉండడం శోచనీయమని, మహాసభల్లో ప్రత్యేక తీర్మానం తీసుకొస్తామన్నారు.