- సీపీఐ(ఎం) గుజరాత్ ప్రతినిధి నళినీ జడేజా
నవతెలంగాణ ప్రతినిధి - అమీన్‌నగర్
గుజరాత్ మోడల్ అన్న మోడీ మాటల్లో నిజం లేదనీ, ఎందులోనూ మోడల్ కాదని సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభల సందర్భంగా విచ్చేసిన ఆ రాష్ట్ర ప్రతినిధి, నళినీ జడేజా అన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలకు భద్రత లేదనీ, లైంగికదాడులకు, కిడ్నాప్‌లకు, అరాచకశక్తులకు గుజరాత్ రాష్ట్రం ఆలవాలంగా మారిందని విమర్శించారు. సంఘ విద్రోహశక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. రైతుల వద్ద భూములు తీసుకుని, 21 ఏండ్ల తర్వాత ఎలాంటి పురోగమనం లేకుండా, పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. దీపక్‌మిశ్ర జడ్జిమెంట్, ఉన్నావో ఘటన పథకం ప్రకారం జరిగాయన్నారు. రాజ్‌ఘాట్‌లో మతోన్మాదుల ఆగడాలు పెరిగాయన్నారు. గుజరాత్‌లో విద్యా వ్యాపారం పెరిగిపోయిందని పేర్కొన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కింద రూ.25 లక్షలు ఇస్తే, స్కూలు పెట్టుకో వచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండాలని చెప్పారు. అమ్మాయిల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యంలో మోడల్ అంటున్నారు.. ప్రభుత్వాస్పత్రికి వెళితే వైద్యం అందే పరిస్థితి లేదని విమర్శించారు. జనరిక్ మెడిసిన్ ఎవ్వరూ ఇవ్వరన్నారు. చిన్న పరిశ్రమలను మూసేశారని చెప్పారు. మీడియాని అడ్డం పెట్టుకొని జీఎంఐ మిషన్ ఓట్లను డబ్బులతో ఎమ్మెల్యేలను, పంచాయతీలను అమ్ముకొంటున్నారన్నారు. పేదల కష్టపడుతున్నారని అంటూ, తాగునీటికి మూడు కిలోమీటర్ల మేరకు వెళ్లి మోసుకొచ్చుకోవా లన్నారు. రేషన్ ఇవ్వాల్సినంత ఇవ్వరనీ, దొడ్డిదారిన అమ్ముకుంటు న్నారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే గుజరాత్ ఎందులో మోడల్ అని ఆమె ప్రశ్నించారు. లైంగిక దాడుల నుంచి బయట పడేందుకు ఆత్మరక్షణ పేరున రాష్ట్రంలో ఐద్వా ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహిస్తు న్నామని, మహిళలు మానసికంగా ధృడంగా తయారయ్యేలా మేలుకొల్పుతున్నామని అన్నారు. సర్పంచ్‌గా మహిళ ఉంటే, భర్త పెత్తనం చేస్తున్నాడని విమర్శించారు. విద్య, స్వావలంబనతోనే స్వయం నిర్ణయాలు తీసుకోగలమని అన్నారు. ఫలితంగా ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని అన్నారు.
Fri 20 Apr 04:35:27.120799 2018