హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభలలో ఉదయం ప్రారంభమైన సెషన్ లో నాలుగు తీర్మానలను చేశారు.
1. స్వల్ఫకాల పరిమితి కలిగిన ఉద్యోగాలను కేంద్రప్ లో ని ఎన్డీఎ ప్రభుత్వం అన్ని రంగాలకు విస్తరించడాని ఖండిస్తూ, కేంద్రం వేంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెనుకకు తీసుకోని కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని తీర్మానం చేసింది.
2. కార్మిక సంఘాలు, రైతు సఘాలు ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదిన నిర్వహించే 'మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ' ని బలపరుస్తూ , తీర్మానాన్ని అమోదించింది. దీనిలో తన పార్టీ కేడర్ మొత్తాన్ని పాల్గోనాలని కోరింది.
3.సిరియాపై అమెరికా మరియు నాటో దళాలు సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ తీర్మానాన్ని చేసింది. అదే విధంగా వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారసత్వాన్ని కలిగిఉన్న భారతీయులందరూ ఈ దమనకాండను ఖండించాలని కోరింది.
4.శాసనసభ ఎన్నికల తరువాత త్రిపుర లో సిపిఐ(ఎం)పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, పార్టీ కార్యలయాలపై బిజెపి, ఆరెస్సెస్ చేస్తున్న దాడులను ఖండింస్తూ, త్రిపుర ప్రజలకు అండగా ఉండాలని, కార్యకర్తలకు అండగా నిలబడాలని ప్రజాస్వామ్యవాదులను మహాసభ కోరింది.
Fri 20 Apr 15:41:08.391524 2018