భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ అఖిల భారత మహాసభలు విజయవంతం
కావాలని కోరుతూ ప్రపంచ నలు మూలల నుంచి పలు దేశాల కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు సౌహార్థ సందేశాలు పంపాయి.
సీపీఐ(ఎం) 22వ అఖిలభారత మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా మీకు, మీ ద్వారా మీ పార్టీ యావన్మంది సభ్యులకూ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తోంది. భారత రాజకీయాల్లో సీపీఐ(ఎం) ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నది. సోషలిజం సాధనకు దేశ వాస్తవిక పరిస్థితులకు తగిన పంథా కోసం నిబద్ధతతో అన్వేషణ సాగిస్తోంది. 22వ మహాసభలో తీసుకునే నిర్ణయాలు మీ పార్టీ పురోభివృద్ధికి, భారత ఆర్థిక, సామాజిక పురోభివృద్ధిలో పార్టీ మరింత కీలక పాత్ర పోషించేందుకు మార్గనిర్దేశం చేస్తుందన్న విశ్వాసంతో మేము ఉన్నాం. చైనా కమ్యూనిస్టు పార్టీ, సీపీఐ(ఎం) మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాల మధ్య, ఇరు దేశాల ప్రజల మధ్య మైత్రీ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంబంధాలు తప్పక తోడ్పడతాయి. పార్టీకి, పార్టీకి మధ్య సహకార సంబంధాలను సీపీఐ(ఎం)తో కలిసి పటిష్టపరచుకోవ డానికి సీపీసీ సిద్ధంగా ఉంది. భారత్-చైనా సంబంధాలను బలోపేతం గావించేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లేందు ఉభయులం కృషి చేద్దాం. మీ మహాసభలు దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాము.
Sat 21 Apr 13:04:09.341338 2018