Sat 21 Apr 15:38:03.535923 2018
హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నాలుగవరోజు నగరంలోని ఆర్టీసీ కళాభవనంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతు..మహిళా హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని మహాసభ ఆమోదించిందని బృందా తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలపైనా, చిన్నారులపైనా జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కులకు సంబంధించిన తీర్మానాన్ని కూడా మహాసభ ఆమోదం పలికిందన్నారు. పార్టీ వివిధ వర్గాల సమస్యలతో పాటు సామాజిక అంశాలపైన కూడా సీపీఎం పోరాటాలు చేస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయంగా వున్న సమస్యలపై ఎన్నో తీర్మానాలను మహాసభ ఆమోదం పలికిందని బృందాకరత్ తెలిపారు.