Sat 21 Apr 15:51:06.170198 2018
హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నాలుగవరోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ మాట్లాడుతు..సీపీఎం పార్టీలో వివిధ విభాగాల కింద 5కోట్ల 39 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. సీపీఎం పార్టీలో సభ్యులు కావాలంటే కేవలం మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతీ సభ్యుడి పనితీరును కూలంకషంగా పరిశీలించాకనే సభ్వత్వం ఇస్తామనీ..ఒకసారి సభ్యత్వం వచ్చిన తరువాత అది అలాగే కొనసాగే అవకాశం కూడా లేదనీ..ప్రతీ ఏటా సభ్యుడి పనితీరును పరిశీలించిన తరువాతనే సభ్వత్వాన్ని రెన్యువల్ చేస్తామని తెలిపారు. ఆటోమేటిక్ రెన్యూవల్ విధానం సీపీఎం పార్టీది కాదని స్పష్టం చేశారు బృందాకరత్.