Sat 21 Apr 17:23:34.53161 2018
హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా రేపు సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు నంధ్యాల నరసింహారెడ్డి, డిజి నరసింహారావు ఇతర రాష్ట్ర నాయకులు పరిశీలించారు. ఈ బహిరంగ సభకు సుమారు 3 లక్షలమంది పైన జనం హాజరవుతారని అంచనా. బహిరంగ సభకు ముందు సుమారు 25వేల మందితో మలక్ పేట నుండి సరూర్ నగర్ స్టేడియం వరకు ఎర్రసేన కవాతు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
(ఇన్ పుట్స్: నారయణ, 10టివి)