హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభల్లో నాల్గవ రోజు ఉదయం మూడు తీర్మానాలు ఆమోదించారు.
1. మహిళా రిజర్వేషన్ బిల్: చాలా కాలంగా పాలకవర్గాలు జాప్యం చేస్తు వస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్ ను వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సూర్యకాంత్ మిశ్రా తీర్మానం ప్రవేశపెట్టగా, మధు గార్గ్ బలపరిచిన ఈ తీర్మానం ఏక గ్రీవంగా అమోదం పొందింది.
2.ఉన్నావ్, కథువా హత్యాచార ఘటనలు: చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న హత్యాచారాలని ఖండిస్తూ, హత్యాచారం చేసిన వారికి అనుకూలంగా మాట్లాడుతున్న మతోన్మాద శక్తుల విధానాలను ఖండిస్తూ కేంద్ర కమిటీ సభ్యుడు, జమ్ము కాశ్మీర్ శాసనసభ సభ్యుడు మహ్మద్ యూసఫ్ తరిగామి తీర్మానం ప్రవేశ పెట్టగా, మాలిని భట్టాచార్య బలపరిచిన ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా అమోదించింది
3. వికలాంగుల హక్కులు: అంగవైకల్యం, మానసిక వైకల్యం కలిగిన వ్యక్తుల కొరకు తెచ్చిన చట్టం అమలు కొరకు మరియు అందులో వారికి ఇచ్చిన హక్కులు అమలు చేయాలని కేంద్ర కమిటీ సభ్యడు మురళీధరన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, బి ఝాన్సీ రాణి బలపరచిన ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది.