Sat 21 Apr 22:48:11.955113 2018
హైదరాబాద్: జలియన్ వాలాబాగ్ దురంతానికి (13-04-1919) వందవ సంవత్సరం వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది పాటు (13-04-2018 - 13-04-2019) వరకు ఆనాటి పోరాట స్పూర్తిని స్మరించుకుంటూ వివిధ ప్రజాచైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభల్లో తీర్మానం ఆమోదించబడింది. దీనిలో భాగంగా ఆనాటి వలసవాద పాలన జనంలో పెలుబికిన చైతన్యం, ఐక్యత మరియు ఈ ఘటన యావత్తు భారత్ దేశాన్ని ఎలా స్వాతంత్ర్య పోరాటం నడిపించింది, ఆనాటికి 12 సంవత్సరాల బాల్య దశలో ఉన్న భగత్ సింగ్ ను ఎలా విప్లవ భావాలవైపు నడిపేలా చేసింది అనే అంశాలని వివిధ కళా రూపాలలో, సాహిత్య రూపంలో ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆ పార్టీ కమిటీలను కోరింది.