హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ లపై దాడులు జరగకుండా రక్షించేందుకు ఉన్న అట్రాసిటీ ప్రెవెన్షన్ చట్టాన్ని నీరుగారుస్తూ సుఫ్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మరియు బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం ఆమోదించింది. 2015-2017 సంవత్సరాల మద్యకాలంలో దళితులపై 5.5%, ట్రైబ్స్ పై 4.7% దాడులు పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించగా, అట్రాసిటి చట్టం క్రింద 77% శాతం మాత్రమే కేసులు బుక్ చేయగా దానిలో 15% కేసులలో మాత్రమే అట్రాసిటీ చట్టం క్రింద కన్విక్ట్ లుగా గుర్తించడం, అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే పనిగా పరిగణిస్తున్నట్టు తీర్మానంలో పేర్కోంది.
అలాగే ఎప్రియల్ 2వ తేదిన సుప్రీం కోర్ట్ తీర్పును నిరసిస్తూ దళిత, సామాజిక, ప్రజాసంఘాలు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో, ఈ బంద్ చేస్తున్న వారిపై సంఘ్ పరివార్ శక్తులు చేసిన దాడులను మహాసభ ఖండించింది. బీహార్ రాష్ట్రంలో ఏకంగా ఏప్రియల్ 10 న అగ్రకుల బంద్ ('అప్పర్ క్యాస్ట్ బంద్' )కు పిలుపునివ్వటం అగ్రకులాల అహంభావానికి గుర్తుగా పేర్కోంది. సుఫ్రీం కోర్ట్ తీర్పుపై రివ్యూ పిటీషన్ వేసిన కేరళ ప్రభుత్వాన్ని ఈ సంధర్భంగా మహాసభ అభినందించింది.
అదేవిధంగా మహాసభ ఈ క్రింది డిమాండ్స్ చేసింది...
1. రాజ్యంగంలోని 9వ షేడ్యూల్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వారిపై దాడులను అరికట్టే అట్రాసిటీ ప్రెవెన్షన్ యాక్ట్(POA) భవిష్యత్ లో నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వాలు గానీ, కోర్టులు గానీ చేయవద్దు.
2. ఎప్రియల్ 2వ తేదిన భారత్ బంద్ సంధర్భంగా దళితులపై జరిగిన దాడులను పరిమిత కాల జ్యూడిషియరీ ఎంక్వైరీ ద్వారా నిగ్గు తేల్చి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే, దళితులపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలి.
3. ఎప్రియల్ 2వ తేది దాడులలో మరణించిన వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 1కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి, అదేవిధంగా గాయపడినవారికి తగిన పరిహారం చెల్లించాలి.
Press Release by CPI(M)