బ్యాడ్జీలు...కీచెయిన్లు...సీపీఐ(ఎం)జెండాలు...కండువాలు... కొయ్యబొమ్మలు...ఖద్దరు దుస్తులు... ఎర్రచొక్కాలు విక్రయిస్తుంటారు. వారికి అదే బతుకుదెరువు. ఒకటి కాదు...రెండు కాదు..దశాబ్దాలుగా వారికి అదే జీవనాధారం. వారంతా సీపీఐ(ఎం)తో అనుబంధం కలవారే. హైదరాబాద్‌లోని ఎమ్‌డీ అమీన్‌నగర్(ఆర్టీసీ కల్యాణ మండపం)లో జరుగుతున్న సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభ సందర్బంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు బ్యాడ్జీలు, కళంకారి వస్తులు, దుస్తులు అమ్ముతూ కనిపించిన పలువురిపై ప్రత్యేక కథనం.
ఈ పనిలో ఎంతో సంతృప్తి ఉంది : చిత్ర, హైదరాబాద్
మాది తమిళనాడు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మాది సీపీఐ(ఎం) సీనియర్ నేత శంకరయ్యకు సమకాలికుడు, ఆయన మిత్రుడు మారి మనువాళన్ మా పెద్దనాన్న. సీపీఐ(ఎం)నే నమ్ముకుని బతుకుతున్నాం. నా సోదరుడు బాలుతో కలిసి పార్టీకి సంబంధించిన బ్యాడ్జీలు, టోపీలు, మఫ్లర్లు, బ్యాగులను 30 ఏండ్ల నుంచి విక్రయిస్తున్నాం. పార్టీ సమావేశాలు, సభలు ఎక్కడ జరిగినా వెళ్తాం అది మాకు ఎంతో సంతృప్తినిస్తుంది.
Sun 22 Apr 05:50:34.739866 2018