- మెనూలో అడుగడుగునా జాగ్రత్తే
- ప్లేట్లు, గ్లాసులన్నీ ప్లాస్టిక్ రహితమే
నవతెలంగాణ- మహ్మద్ అమీన్ నగర్
వంద మందికి భోజన ఏర్పాట్లు అంటేనే హాట్ హుట్ అంటూ హడావిడి చేస్తాం. కానీ, సీపీఐ(ఎం) జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు అందుకు పూర్తిగా భిన్నం. రోజువారీ మెనూ ఎంపిక... వంటలు చేయించడం... వడ్డన వరకు అడుగడుగునా తీసు కుంటున్న జాగ్రత్తలు ఆమోఘం. పర్యావరణానికి ముప్పు వాటిల్లనివ్వకుండా భోజనశాలల్లో ఎక్కడా ప్లాస్టిక్ విస్తరా కులు, ప్లాస్టిక్ గ్లాసులు వాడకపోవటం ఆదర్శనీ యం. ఎప్పుడు ఎవరొచ్చినా ఓపికతో వడ్డించే వాలంటీర్ల కృషి అభినందనీయం. ప్లేట్ల శుద్ధి నుంచి వ్యర్థాల తొలగి ంపు వరకూ ఎప్పటికప్పుడూ తీసుకున్న జాగ్రత్తలు ప్రశంస నీయం.భోజనశాలల నిర్వహణ ఇంత క్రమశిక్షణాయు తంగా సాగటానికి రేయింబవళ్లు మూడువందల మంది వాలంటీర్లు (అందులో వంద మంది మహిళలు) అహర్నిషలూ కృషి చేశారు. ప్రతినిధులకు, వాలంటీర్లకు, పోలీసులకు, హైదరాబాద్ ఫెస్ట్‌కి వచ్చే వారికి భోజన వసతులను కల్పించడంలో రాష్ట్ర కమిటీ పక్కా ప్రణాళికతో ముందు కెళ్లింది. ప్రతినిధులు కోసం ఆర్టీసీ కల్యాణమండపంలో నాలుగు డైనింగ్ హాల్స్, టెంట్‌లో ఒక డైనింగ్ ఏర్పాటు చేశారు. వీఎస్‌టీ ఫంక్షన్ హాల్‌లో ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ప్రెస్‌కాన్ఫరెన్స్ సమయాల్లో మీడియాకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి తోపులాటలు, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అందరూ భోజనాలు చేయడానికి వీలైంది. మెనూ మాత్రం అందరికీ ఒకటే. మెనూ ఎంపికలో ఫుడ్ కమిటీ సభ్యులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భోజనశాలల్లో ఎక్కడా ప్లాస్టిక్ ప్లేట్లుగానీ, గ్లాసులను గానీ వాడనివ్వలేదు. ప్లేట్లను, మగ్గులను, గ్లాసులను ఎప్పటికప్పుడు కడిగేస్తూ, వేడినీళ్లల్లో శుభ్రపరుస్తున్నారు. పరిసరాలు కూడా, తిన్న ప్లేట్లు ఎప్పటి కప్పుడు పరిశుభ్రం చేయడం వల్ల నీట్‌గా ఉంటున్నాయి. పోలీసులు, సెక్యూరిటీగార్డులు, ఫెస్ట్ కొచ్చినవారు భోజనాల ఏర్పాట్లు చూసి ''ఇంతమందికి ఇంత బాగా ఏర్పాటు చేయ డం, ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా చూడటం సీపీఐ(ఎం) పార్టీకే సాధ్యమైందని'' చెప్పుకోవడం వినిపించింది.
మొత్తం 300 మంది వాలంటీర్లు ఫుడ్‌కమిటీలో పనిచేస్తున్నారు. అందులో వందమంది మహిళలే. ఉదయం నాలుగు గంటలకు లేచి, ఏడుకల్లా టిఫిన్ సెక్షన్‌కు సిద్ధంగా ఉంటున్నారు. అలా రాత్రి 11, 12 గంటల వరకూ వారు నిర్విరామంగా ప్రతినిధులకు, భోజనాలు చేసేవారందరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడం అభినందిం చాల్సిన విషయం. ఇదంతా పార్టీ స్ఫూర్తి వల్లే సాధ్యమైందనేది వాస్తవం.
Sun 22 Apr 06:27:24.375783 2018