- సీపీఐ(ఎం) మహాసభ పిలుపు
వికలాంగుల చట్టం-2016లోని పలు నిబంధన లున్నప్పటికీ అమలుకు నోచుకోకపోవడంపై సీపీఐ(ఎం) 22వ మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని అమలు చేయాలని మహాసభ శనివారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని మురళీధరన్ ప్రతిపాదించగా ఝాన్సీ రాణి బలపరిచారు. వికలాంగుల హక్కు లకు సంబంధించి ఐరాస రూపొందించిన తీర్మానం (యుఎన్‌పీ ఆర్‌డీ)పై సంతకం చేసిన భారత్ దానికనుగుణంగా ఈ చట్టాన్ని తెచ్చింది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. హక్కుల ప్రాతిపది కన రూపొందించిన ఈ చట్టానికి సమానత్వం, వివక్షకు తావులేకుండా చూడటం అనేవి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయి. 21 కేటగిరీల వ్యక్తులను ఈ చట్టం పరిధిలోకి తీసు కొచ్చారు. విభిన్న ప్రతిభావంతుల్లో పది శాతం మందికే ఇది వర్తిస్తుంది. ఒక అంచనా. విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, బృందాలు సాగించిన పోరాటాలు, ఉద్యమాల ఒత్తిడి మేరకు చట్టం అయితే తెచ్చారు. కానీ, దీనిని అమలు చేయ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండూ వీటి అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తు న్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆరు మాసాల్లో నిబంధనలు ఖరారు చేయాలని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నా చాలా రాష్ట్రాలు ఇంతవరకు ఆ పని చేయలేదు. మానసిక ఆరోగ్య భద్రతా చట్టం-2017 విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం. చట్టాల అమలులో నాన్పుడు వైఖరినవలంభించడం, ఈ రెండు చట్టాల అమలుకు బడ్జెట్ లో అరకొర కేటాయింపులు చేసి చేతులు దులిపేసుకుంటు న్నాయి. ఈ చట్టాల అమలుకు సంబంధించిన విధి విధానాలను వెంటనే ఖరారు చేయా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) 22వ అఖిలభారత మహాసభ డిమాండ్ చేసింది. ఆర్‌పీడీ యాక్టు, అలాగే ఎంహెచ్‌సీ యాక్టు అమలుకు తగినన్ని నిధులను సమకూర్చాలని కూడా మహాసభ డిమాండ్ చేసింది.
Sun 22 Apr 10:49:59.378866 2018