Sun 22 Apr 13:31:42.351957 2018
హైదరాబాద్ : నేటితో సీపీఎం జాతీయ మహాసభలు ముగియనున్నాయి. సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మహాసభకు హాజరవుతున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు భూపాల్ అన్నారు. మహాసభలో అగ్రనేతలు కేరళ సీఎం పినరయ విజయన్, జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యే తరిగామి, సీతారాం ఏచూరీ, ప్రకాశ్ కరత్, బివి.రాఘవులు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రసంగించనున్నారు. పోలీసులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. గ్రౌండ్ సరిపోకపోవడం వలన బయట జనం కూర్చోవడానికి వీఎంఎం హోమ్ నుంచి ఎల్ బీనగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డును వినియోగించుకోవడానికి పోలీసులు అనుమంతించారని తెలిపారు.