హైదరాబాద్: ఉన్నతవిద్యను వ్యాపారంగా మార్చడం, మరియు విద్యలో మతతత్వ ఎజెండా నేపథ్యంలో సిపిఐ(ఎం) మహాసభలో తీర్మాన్ని ఆమోదించారు. ఎమ్ హెహ్ ఆర్ డి, యుజిసీ లను ఉపయోగించి వివిధ విద్యాలయ్యాల్లోని స్వాతంత్ర ప్రతిపత్తిని బిజెపి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. యూపిఎ2 హయాంలో తీసుకువచ్చిన రాష్ట్రీయ ఉచ్చ శిక్ష అభియాన్ (రూసా) ను ఉపయోగించి విద్యను వ్యాపారీకరణ చేసే పని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తుందనీ, అలాగే సీట్లలో కోతలు విధిస్తూ నోటిఫికేషన్ ఇస్తోందనీ పేర్కొంది.
విద్య వ్యవస్థను తన చేతిలో పెట్టుకునేందుకు గాను,UGC, AICTE అధికారాలను స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్ మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ (HEERA) లాంటి ఏజెన్సీలను తీసుకురావడం ద్వారా విద్య కార్పోరేటికరణకు మార్గాన్ని సుగమం చేస్తుందని పేర్కొంది
ఈ నేపథ్యంలో మహాసభ డిమాండ్స్ ...
-రూసా(RUSA) ను వెనుకకు తీసుకోవాలి
- హీరా(HEERA) ఏజెన్సీని రద్దు చేసి పబ్లిక్ సెక్టార్ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి
- లోన్స్ స్థానం లో విద్యా సంస్థలకు గ్రాంట్స్ ఇచ్చి వాటిని బలోపేతం చేలి
-ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి
- ప్రైవేట్ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ ను వెనుకకు తీసుకోవాలి
- విశ్వవిద్యాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
- అన్ని రకాల రిసెర్చ్ స్కాలర్స్ కు ఫెల్లోషిప్ ఇవ్వాలి
- రిసెర్చ్ కొరకు ఫండ్స్ కేటాయింపులు పెరగాలి
Sun 22 Apr 14:43:46.198085 2018