Sun 22 Apr 18:03:23.554933 2018
హైదరాబాద్ : సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన స్టేజ్ పైకి త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరాయి విజయన్ చేరుకున్నారు. సీపీఎం జాతీయ మహాసభలకు సంబంధించిన భారీ బహిరంగ సభ జన సముద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటికే మహాసభ డెలిగేట్స్ పలువురు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మరికొంత సేపట్లో భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది.