Sun 22 Apr 19:03:55.853034 2018
హైదరాబాద్ : సరూర్ నగర్ అంతా అరుణ వర్ణం దాల్చింది. స్టేడియంలోని సభా వేదికపైకి ఎర్రదండు ఉత్సాహంగా ఉరికి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కొత్త పొలిట్ బ్యూరో సభ్యులు వేదికను అలంకరించారు. బీవీ రాఘవులుగారి అధ్యక్షతన సీపీఎం జాతీయ భారీ బహిరంగ సభ ప్రారంభమయ్యింది. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండవ సారి ఎన్నికయిన సీతారాం ఏచూరి , ప్రకాశ్ కరత్,పిళ్లై, బిమాన్ వాస్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరాయి విజయన్, మహిళా కామ్రేడ్ బృందాకరత్, అన్నె ముల్లా, బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, సుభాషిణీ అలీ, మహ్మద్ సలీం, మల్లు స్వరాజ్యం, తమ్మినేని వీరభద్రం, మధు, వీరయ్య, నాగయ్య, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్శింహారెడ్డి, జి.రాములు,సి, రాములు వంటి అగ్ర నేతలు వేదికను అలంకరించారు.