హైదరాబాద్ : బీజేపీ మతతత్వ ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు సీపీఎం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. వాటిపై సీపీఎం పార్టీ మహాసభ చర్చించిందని తెలిపారు. అందుకే సీపీఎం పార్టీ అంటే భూస్వామ్య పార్టీలకు కంటగింపుగా వుంటుందని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ బలపడితే ప్రజాస్వామాన్యాన్ని అపహాస్ం చేస్తారని కానీ ఎటువంటి పరిస్థితుల్లోను పార్టీలో అటువంటి పరిస్థితి రాదనీ..రానివ్వమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక సరళీకరణ విధానాలు పెరిగాయనీ..వీటి వల్ల ప్రజలకు నష్టం వాటిల్లితుందనీ, ప్రజల్లో అసమానతలు పెరుగుతాయని సీపీఎం పార్టీ ముందుచూపుతో ఎప్పుడు చెప్పిందని పినరాయి విజయన్ గుర్తు చేశారు. సంపదను పేదల అభివృద్ధికోసం వెచ్చించకుండా జాతీయ సంపదలో 55 శాతం సంపదనను సంపన్నులే అనుభవిస్తున్నారని వారికోసం మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. దీంతో సామాన్యులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పినరాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మోదీ ప్రభుత్వం యదేచ్ఛంగా అనుమతులను ఇచ్చేసిందని తెలిపారు. కార్మికుల ఆదాయం తగ్గిందని ప్రశ్నించే కార్మికుల గొంతులను పాలకులు నొక్కివేస్తున్నారని విమర్శించారు. అలాగే వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిపోవటంతో దేశంలో ప్రతీ అరగంటలు ఓ రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ..రోజు రోజుకీ పెరిగిపోతున్న వ్యవసాయ సంక్షోభంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి రైతన్నలకు సీపీఎం పార్టీ అండగా నిలబడుతోందని తెలిపారు. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు. బేటీ పడావో బేటీ బచావో పథకం ఏమాత్రం పనిచేయటం లేదనీ..దానికి కథువా, ఉన్నావ్ ఘటనలే ఉదాయరణలన్నారు.
Sun 22 Apr 19:51:08.722065 2018