హైదరాబాద్: చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మా సభలను విజయవతం చేసిన తెలంగాణ ప్రజలకు క్రుతజ్నతలు తెలియాజేసారు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్. దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది, రూపాయి విలువ పడిపోతూనే ఉందని నిత్యవసర దరలు ఆకాశాన్ని అంటుతున్నాయని. రైతు ఆత్మహత్యలు పెరిగాయాని ఆయన అన్నారు. నిరుద్యోగం ఎన్నడు లేనంత స్థాయిలో ఉంది. ప్రైవేటికరణ వల్ల పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగాలు కొల్పొతున్నారు. దేశంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతోంది. బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది, ఇచ్చిన వాగ్ధానాలు నేరవేర్చక పోగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. అచ్చే దిన్ కాదు...కచ్చే దిన్ అయ్యింది, ప్రజలను మోసం చేయలేమని గుర్తించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు ప్రజలను చీల్చుతున్నారు. ప్రజల మద్య అశాంతి స్రుష్టిస్తున్నారు. ప్రజల ద్రుష్టిని మరల్చేందుకు దళితులు, మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యామ్నాయం కాదు అవి రెండు నాణానికి రెండు ముఖాలు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రజా పోరాటాలతోనే ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తాం.
సీపీఎం 22వ జాతీయ మహసభలు రాజకీయ శంకాన్ని పూరించాయి. మతోన్మాదాన్ని, ఆర్దిక దోపిడిని వ్యతిరేకించే శక్తులను ఏకం చేస్తుంది. ప్రమాధం పొంచి ఉంది, శత్రువు మన తలుపు తడుతోంది. అన్ని వర్గాలతో కలిసి ఐక్య పోరాటాలు నిర్మించాలి ఆ భాద్యతను కార్యకర్తలు తమ బుజానికెత్తుకోవాలని మాణిక్ సర్కార్ తెలిపారు.
Sun 22 Apr 20:31:39.427647 2018