Sun 22 Apr 22:02:50.576297 2018
హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభల బహిరంగ సభలో పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు..దేశంలో మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయనీ..చిన్నారి అసిఫా పై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిమి పాలిస్తున్న వీరు నేరస్థుల రక్షకులని బృందా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మక్కా మసీదు ఘటనకు పాల్పడినవారిని నిర్ధోషులుగా విడుదల చేసేసారని విమర్శించారు.