Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పరవళ్ళు తీసిన వలపు పాట | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • మ్యూజిక్ లిటరేచర్
  • ➲
  • స్టోరి

పరవళ్ళు తీసిన వలపు పాట

Sun 04 Apr 00:45:44.443967 2021

ప్రేయసీ ప్రియుల ప్రేమ ప్రయాణం ఎంతో మధురంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, అంతలోనే అలగడం, మారాము చేయడం, మళ్ళీ ఒకరినొకరు అలకలు మాని కలిసిపోవడం ఇవన్నీ ప్రేమలోని తీయదనాలే కదా! ఇంకా - చుట్టూ ఉన్న సమస్త ప్రకతి తమదేనన్న ధైర్యంతో, స్వేచ్ఛతో సాగిపోతుంటారు ప్రేమికులు. ఆకాశంలో ఉన్న చుక్కల్ని ఒక్క చోట కలిపితే అవి తమ రూపా ల్లాగే ఉంటాయని, దారిలో కనిపించే పూలను జంటగా సాగే తమ అడుగులేనని ఊహించుకుంటారు.
మైమరపింపజేసేది మనసులను రంజింపజేసేది ప్రేమ. అది ఎద ఎదలో వింత గిలిగింతల్ని, సరికొత్త కవ్వింతల్ని కలిగించేది. ప్రేమికుల హృదయాల్లో తీయగా మ్రోగే మహౌన్నత మంత్రధ్వానం ప్రేమ. అలాంటి మహిమాన్వితమైన ప్రేమను గురించి ఎంత చెప్పినా తరగదు. నిజం చెప్పాలంటే ప్రేమను గురించి చెప్పేందుకు మాటలే లేవు. మౌనగానఝురియే ప్రేమ. ప్రేమ చిగురించేదాకా మన జీవనసరళి వేరు. ప్రేమ మొగ్గ తొడిగిన తర్వాత మనసుల్లో మొదలయ్యే వింత అల్లరి, సాగే జీవనసరళి వేరు. ప్రేమికుల మనసుల్లో ప్రేమ ఎదుగుతున్న కొద్దీ కలిగే ఊహలు కొండంత ఉత్సాహాన్నిస్తాయి. ఒకరంటే ఒకరికి అవ్యక్తమైన అనురాగం ఏర్పడినప్పుడు ప్రారంభమయ్యే వలపుకథ ఎలా ఉంటుందో చెబుతూ 'నేను లోకల్‌' (2017) అనే సినిమాలో శ్రీమణి ఒక పాట రాశాడు. ఆ పాటను ఇప్పుడు చూద్దాం.
తనలో కలిగిన పరవశానికి కారణం కథానాయికయే అని గుర్తించిన కథా నాయకుడు ఆమెను ప్రేయసిగా భావిస్తాడు. కథానాయిక మొదట నిరాకరించినా ఆ తర్వాత అతని ప్రేమను స్వీకరిస్తుంది. తన మనసునూ కానుకగా అందిస్తుంది. అందుకే తన ప్రాణం ఎక్కడీ అనే ప్రశ్నకు తన ప్రేయసినే సమాధానంగా చూపిస్తానని అంటాడు ప్రేమికుడు. మరి తన ప్రియుడితో కలిసి చేసే వలపు పయనమెప్పుడనే ప్రశ్నకు ఆ ప్రేయసి ప్రస్తుతం సాగే ఇరువురి గమనమే సమాధానమని చెప్పడం చాలా బాగుంది. ఇద్దరి మనసుల్లో ప్రేమ చేసిన కొంటె అల్లరే ఆ ప్రశ్నల్ని వేయించింది. జవాబుల్నీ చెప్పించింది. మాటల్నే మరిచే ఆనందాలవేళ ఇది. హాయిగా ప్రేమగీతాల్ని పాడుకోవడం తప్ప ఇంకేది ఆ సమయంలో జంటకు గుర్తుండదు. ఈ పులకింతలకు కారణం ప్రేమ కదా!
ప్రేయసీప్రియుల ప్రేమ ప్రయాణం ఎంతో మధురంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, అంతలోనే అలగడం, మారాము చేయడం, మళ్ళీ ఒకరినొకరు అలకలు మాని కలిసిపోవడం ఇవన్నీ ప్రేమలోని తీయదనాలే కదా! ఇంకా - చుట్టూ ఉన్న సమస్త ప్రకతి తమదేనన్న ధైర్యంతో, స్వేచ్ఛతో సాగి పోతుంటారు ప్రేమికులు. ఆకాశంలో ఉన్న చుక్కల్ని ఒక్క చోట కలిపితే అవి తమ రూపాల్లాగే ఉంటాయని, దారిలో కనిపించే పూలను జంటగా సాగే తమ అడుగులేనని ఊహించుకుంటారు. తామే మబ్బుల్లో చినుకులైపోయినట్టుగా, వారు వెళ్ళే ప్రతి చోట ఓ పూలతోట విరిసినట్టుగా భావిం చుకుంటారు. చుక్కల్ని కలిపితే తమ బొమ్మలు కనిపించడం, మబ్బుల్లో చినుకుల వ్వాలనుకోవడం మొదలైనవన్నీ అసాధ్యాలై నప్పటికీ వారికున్న ప్రేమబలమే ఆ అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది.
చూపులతో ముద్దాడుకోవడం నేర్చు కొమ్మని ప్రేమికుడు ప్రియురాలితో అంటాడు. అప్పుడామె - పెదవులతో పెదవులకు ముద్దుపెట్టమని అడిగే అలవాటు తనకు లేదని, ఆ అలవాటును మార్చమని అడుగుతుంది. అంటే - తన వయసుకు ఇన్నాళ్ళు ప్రేమ గాలి తగలలేదు కాబట్టి ఆమెకు ఆ సంగతులు తెలియవు. ఇక నీ రాకతో ఆ వలపుదనం తనకు అలవాటు కావాలని ఆమె పరో క్షంగా చెబుతుందని అర్థం. ప్రేమికుడు ఆమె కళ్ళకు కాటుకను దిద్దే వేలవుతానని అంటే, ఆ వేలు పట్టుకుని తనతో ఏడడు గులు నడిచే వేళ ఎప్పుడొ స్తుందా అని ఆమె ఎదురుచూస్తున్నానని చెబుతుంది. అంటే తనతో ముడిపడబోయే మధురమైన జీవితాన్ని తలచుకుని మురిసిపోతోందని అర్థం.
ఇలా ప్రేమికుల ఎదలో సాగే వలపుల లాహిరులను గూర్చి ఎంతో అద్భుతంగా చెప్పాడు శ్రీమణి. పరవళ్ళు తీసిన అందమైన అనురాగానికి వ్యాఖ్యానంలాంటిదీపాట.
... పాట ...
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం / ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం / అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం / ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం / మాటల్నే మరిచే సంతోషం / పాటల్లే మారింది ప్రతీ క్షణం.
నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా /
హౌ.. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా /
మబ్బుల్లో చినుకులు మనమంటా / మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట.
ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా /
ఆ పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా / కాటుకనే దిద్దే వేలవుతా / ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా.

- తిరునగరి శరత్‌ చంద్ర,
6309873682

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కల'వరమై'న పాట
స్నేహబంధమై నిలిచిన పాట
ప్రేమానుభూతియై పరిమళించిన పాట
సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట
లోకం గుట్టును విప్పి చెప్పిన పాట
భారతజాతికి జైకొట్టిన పాట
ప్రపంచ పోకడల పంచపదులు...
మనసు తెరకు కొత్తరంగులద్దిన పాట
పరవశింపజేసే మనసు పాట
గిలిగింతలు పెట్టే ప్రేమ పాట

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.