Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెంటాడుతున్న వైరస్‌? | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

వెంటాడుతున్న వైరస్‌?

Sat 10 Apr 23:03:12.222537 2021

      ఒక సంవత్సరం గడిచిపోయింది ఈ కరోనా మనల్ని వెంటాడటం మొదలుపెట్టి. మధ్యలో కొంత తగ్గుముఖం పట్టినట్లు కనపడ్డా, ఇప్పుడు తిరగబెట్టింది. ప్రపంచమంతా ఎంతో అల్లకల్లోలం చెలరేగింది. లక్షల మందిని కబళించింది. కోట్లాది మందిని మానసిక, ఆర్థిక క్షోభకు గురిచేసింది. చాలా చాలా పాఠాలనూ బోధించింది. అయినా గుణపాఠాలు తీసుకునేందుకు మనం సిద్ధం కాలేదు. దారీ తెన్నూ లేని, దిక్కూ మొక్కూ లేని జీవాల్లా ప్రజలు తల్లడిల్లి పోవడాన్ని మనం చూస్తున్నాం.
      వెంటాడుతున్నది వైరస్‌ అని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ ప్రకృతి అసమతుల్యత నుండి అనివార్యంగా జనించిన వైరస్‌ తన సహజ విస్తరణలో భాగంగానే వ్యాప్తి పెరుగుతున్నది. ఇప్పుడు చర్చించాల్సింది దాన్ని ఎదుర్కోవడంలో, దాని బారిన పడకుండా ఉండటంలో మనం చూపుతున్న శ్రద్ధాసక్తులు, వ్యూహాలు ఏమిటన్నది మన ముందున్న ప్రశ్న. తరతరాలుగా మానవ సమాజాన్ని నియంత్రిస్తూ, అనేక నియమ నిబంధనలతో పరిపాలిస్తున్న పాలనా కర్తలు, ఇప్పుడు నిర్వహిస్తున్న బాధ్యత గురించి చర్చించాల్సిన సమయం వచ్చింది. వైరస్‌ మూలంగా వచ్చే శారీరక కష్టాలకంటే పరిపాలకుల ఆలోచనలే ప్రజలను నిజంగా అనేక ఇక్కట్లకు గురిచేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యత వహించగల పాలకులు కొరవడటం వల్లనే అనేక ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవటం అత్యంత ముఖ్యమైన విషయమే. కానీ, ప్రాణంతో పాటుగా బతుకును కొనసాగించటమూ సవాలుగా మారిన సందర్భంలో పరిష్కారాలను ఎవరు సూచించాలి. లక్షలాది, కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్యగా బతుకుబండి లాగటం మారినపుడు ఏ ఒక్క ఆశనూ, భరోసానూ అందివ్వలేని వ్యవస్థ ఎందుకు?
      ఒకవైపు వేలాది మంది రైతులు తమ సమస్యను పరిష్కరించమని ఐదు నెలలుగా రోడ్లపైనే నివసిస్తూ ఆందోళన చేస్తున్నా వారి గురించి ఆలోచించలేని నేతలూ ప్రభుత్వాలూ, సేవకులూ మనకెందుకు! ఒకవైపు ప్రకృతి విలయ తాండవమాడుతున్న వేళ కార్మికుల హక్కులను కాలరాసి దోపిడి శక్తులకు దోచిపెట్టే సేవాతత్పరులు పాలకులుగా వుండటం వైరస్‌ కన్నా అత్యంత ప్రమాదకరమైనదిగా కనపడుతున్నది. ప్రజలకు బతుకుదెరువు ఒక సవాలు. దీనికి మార్గాన్ని చూపినవాడే నిజమైన నాయకుడు, పాలకుడు. కానీ ఆపద సందర్భాన్ని కూడా తన ప్రయోజనానికి, అధికార బలానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన కరోనా కన్నా విషతుల్యమైనది.
      ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకన్నా వ్యాపారుల ఆదాయాలు, లాభాలు ముఖ్యంగా మారింది. రాజకీయాలు, అధికారం చేజిక్కించుకోవడమూ అందుకోసం వేయాల్సిన ఎత్తులు, జిత్తులు వీటిపైన ప్రధాన దృష్టి పెట్టిన పాలకులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ గురించిన చర్చను తీసుకువచ్చిందా? విపత్తుల నుంచి ప్రజలు ఎలా బయటపడాలి. ప్రభుత్వం ఏం చేస్తే సవాళ్లను ఎదుర్కోవచ్చు అనే విషయాలను, ఎన్నికల సందర్భంగా కానీ రాజకీయ చర్చ సందర్భంగా కానీ మాట్లాడిందా? లేదు. రెండు వేల కోట్లు కావాలి వాక్సిను ఉత్పత్తిని పెంచటానికని కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వం వేల కోట్లు ఎన్నికల్లో గెలవటం కోసం ఖర్చు చేసింది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతూ ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది.
      దాని పర్యవసానంగానే నేడు ఉపద్రవం తిరగదీసింది. ప్రజల పట్ల బాధ్యత లేని పాలనాధిపతుల ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. వెంటాడుతున్న వైరస్‌ కనబడినా నిజంగా వెంటాడేది పాలకులే. వారి విధానాలే..!!

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిఖత్‌ భారత్‌ మహాన్‌
తిండిగలిగితె...
ఏం సమాజమిది!
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు
ఎటుపోతున్నం!
విశ్వాసాల్లోంచి... మూఢత్వంలోకి...
ధరల రుతువు
బేటీ బచావ్‌..!
కవితోత్సవం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.