Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గచ్చామీ.. | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

గచ్చామీ..

Sat 10 Apr 23:30:08.914876 2021

లాస్ట్‌ డెడ్‌బాడీకి కుట్లేస్తుండగా అసిస్టెంట్‌ అంటున్నాడు... ''టోటల్లీ ఫినిష్డ్‌ సార్‌ ఈరోజుకిక ఏ శవమూలేదూ''... డ్యూటీ దిగేందుకు గేట్‌ కీపర్‌ క్షణానికోసారి మార్చురీలోకి తొంగిచూస్తున్నాడు... దష్టి కిటికీలో నుంచి బయటకు సారించాడు డాక్టర్‌ డెడాన్‌ మతదేహం తాలూకు కుటుంబ సభ్యులూ బంధువులు వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నారు.. జేబులో ఫోన్‌ తీసి డ్రైవర్‌కు కాల్‌ చేశాడు.. మార్నింగ్‌ టు ఈవినింగ్‌ తాను సేకరించిన వాటిని కెమికల్స్‌లో అతిశుభ్రంగా క్లీన్‌ చేస్తున్నాడు.. వాటినొకొకటిగా తన కోటు జేబులో వేసుకుంటూ కారు వైపు మూవ్‌ అయ్యాడు..
కారు స్టార్టయ్యింది ఆసుపత్రి గేటు దాటి మెయిన్‌ రోడ్దెక్కింది.. పొద్దున చదివీ చదవని మియన్మార్‌ టైంస్‌ వెనుక సీట్లో అలానే పడి ఉంది.. శరణార్థులు అటు థారులాండ్‌ వైపు ఇటు భారత్‌ వైపు తలదాచుకునేందుకు పరుగు తీస్తున్నారన్న వార్తకన్నా ..శరణార్థులకు ఆశ్రయమివ్వొద్దని సరిహద్దు దేశాలు తమ భద్రతాధికారులకు హెచ్చరిక చేసిందన్న అంతర్జాతీయ వార్త మానవత్వానికి మచ్చలా అనిపించింది..
రోడ్లగుండా వెళ్తోంది కారు.. ప్రధాన వీధుల్లో టియర్‌ గ్యాస్‌ ప్రభావం ఇంకా ఉంది, అలజడి అప్పుడప్పుడే తగ్గుతోంది. ఆందోళనా సూర్యుళ్లు అప్పుడే ఇంటిబాట పట్టినట్టున్నారు.. నినదించి నినదించీ గొంతులప్పుడే ఆగినట్టున్నారు ఇంకా సన్నగా ''విరు వాంట్‌ ఫ్రీడం, విరు వాంట్‌ డెమోక్రసీ'' ఏకో ధ్వనిస్తున్నట్టనిపిస్తోంది.. ''కబర్‌ మా క్యారు బూ'' బెర్మిస్‌ గీతం మార్మొగుతోంది.. ఎర్రసముద్రం ఇప్పుడే ప్రవహిస్తూ వెళ్లిందా అన్నట్టు అక్కడక్కడా అరుణ పతాకాలు.. రెడ్‌ ఫ్లెక్సీలు, ఎర్ర రిబ్బన్లు కరపత్రాలు, ప్లకార్డులు, రబ్బర్‌ తూటాలు, చెల్లాచెదురుగా పడున్నారు. ఎవరో గుంపులుగా పరుగెత్తినట్టు ఎవర్నెవరో తరిమినట్టు సాక్ష్యంగా కుడి ఎడమల చెప్పులు అక్కడక్కడా తెగిపడున్నారు, కూడళ్ల వద్ద గోడలకతికించిన పోస్టర్లపై రక్తచారికలు అగుపడుతున్నారు.. జివ్వున ఎగిసిన డిజైన్లున్నారు..''
''కొన్నిదేశాల్లో గ్రామ దేవతల వద్ద నేల ఇలాగే రక్తం తాగుతుంటుంది'' అని అనుకున్నాడు డాక్టర్‌. ''ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి ఇప్పుడీ సైన్యమూ ఓ గ్రామ దేవతయ్యిందా'' అని ఆలోచిస్తున్నాడు.. రోడ్లపై భీతావహ దశ్యాల్ని చూస్తూ ''ఈయనగారికి రేపూ చేతిండా పనే ఉంటుందేమో'' అని డ్రైవర్‌ థాంగ్‌ గొణుక్కుంటున్నాడు.. డాక్టర్‌ తన కోటు జేబును తడుముతున్నాడు వెతుకుతున్నవేవో వేళ్లకు తగులుతుండేసరికి దీర్ఘంగా నిట్టూర్చాడు.. ప్రశాంత ప్రేమికుడైన డెడాన్‌ తన ఇంటిని యాంగోన్‌ నగర శివార్లలో నిర్మించుకున్నాడు.. ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది.. ఈలోగా ఆలోచనలోకి జారుకున్నాడు..
పీనుగుల కొట్టు, శవాలగది మార్చురీని సామాన్యజనం ఎందుకిలా అభివర్ణిస్తారో ఇపుడిపుడే అర్ధమవుతోంది తనకు.. పేరుకు ముందు డాక్టర్‌ పదాన్ని గొప్ప కీర్తికిరీటంలా మురిసిపోతాడు తను.. మెడికల్‌ కాలేజీ ఎమ్మెస్‌ పట్టా పొందినప్పుడేకాదు మెడికల్‌ ఎంట్రన్స్‌లో సీటు సాధించినప్పుడే ఉప్పొంగిపోయాడు.. డాక్టర్‌ అనే పదం గాడ్‌ అనే రెండక్షరాల కన్నా గొప్ప అని అతని భావన.. వత్తిపట్ల నిబద్దత ఎక్కువ. తనకు ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ ఠంచనుగా సమయానికల్ల డ్యూటీ దిగి వెళ్లిపోవాలనుకోడు.. ఆ రోజుకు ఆఖరి పేషెంట్‌ వరకూ భరోసానిచ్చాకే తనవాచ్‌ వంక చూసుకుంటాడు.. ఈలోగా తన సెల్‌ ఫోన్లో ఎన్నో టెక్స్ట్‌ లు, మిస్డ్‌ కాల్స్‌ ఉంటారు.. వాటన్నిటికీ డ్యూటీ దిగాకే రిప్లయిస్తాడు.. మొదట్లో అతని ముద్దుల భార్య ఐంద్రా క్యాజిన్‌ ''ఐ మిస్సింగ్‌ యూ'' అని వాపోయేది.. ఇప్పుడు ''ఐయాం విత్‌ యూ'' అని తోడ్పాటునిస్తోంది.. ''ఈనెల నీ జీతమేది అని ఏనాడూ అడగలేదు తను, ఈ నెల ఎందరికి స్వస్థతనిచ్చారు అంటుంది''.. ఆమె కళ్లకు అతనో తథాగతుడు.. ప్రియమైన కూతురు ఆంగ్‌ కూడా అంతే బొమ్మలకో, షికార్లకో మారాం చేయదు..
పేదరికం కారణంగా సరైన వైద్యం అందక తన తండ్రి ఆర్కర్‌ చనిపోవటం డాక్టర్‌ కావాలనే తన సంకల్పానికి కారణమయ్యింది.. తమ స్వగ్రామం దేV్‌ా బునో లోని చర్చ్‌కి తీసుకెళ్లినపుడల్లా తండ్రి తనతో చెప్పేవాడు.. ''వైద్యం దేవుని ప్రసాదం,అందరికీ పంచాలీ' అని.. అందుకేనెమో అతనిపేరు డెడాన్‌ అని పెట్టాడు..ఆ పేరుకు బర్మా భాషలో సంతోషం.. ఉద్యోగాన చేరింది మొదలు తననాశ్రయించే రోగుల పెదవుల్లో చిరునవ్వులు నాటేవాడు.. కానీ ఈ ఫిబ్రవరి నుంచి తను వ్యాధుల్ని తరిమే యోధుడిగా కాక శవాల్ని కోసే కూలీగా మార్చబడ్దాడు.. ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషాన్ని కాక బాధను మోసుకు పోవాల్సొస్తోంది.. కొద్దిరోజుల క్రితం దాకా తన చుట్టు సజీవ ప్రాణాలుండేవి. ఇప్పుడేమో శవాల గుట్టలు.. ఇది తనను కలచి వేస్తోంది.. శవాల్ని కోసేందుకు ఎమ్మెస్‌ చదవాలా అన్న నిస్పహ ఆవరిస్తోంది..
హారన్‌ మోగగానే పనివాడు గేటు తెరిచాడు.. కారు లోనికి ప్రవేశించింది ఇది వరకైతే పరుగెత్తుకొచ్చే పాపనెత్తుకొని గాల్లో గిరగిరా తిప్పేవాడు.. పాపకళ్లు గప్పి భార్య పెదవులపై ప్రేమలేఖ రాసేవాడు.. కానీ ఇప్పుడలా లేదు తనిప్పుడు శవాల గదినుంచొస్తున్నాడు.. బాత్‌ రూంలో స్నానం చేసి రాగానే కూతురు అయస్కాంతంలా అతుక్కు పోయింది.. కిచెన్‌ లోనుంచి పొగల కప్పుతో వచ్చింది భార్య.. కాఫీ కప్పుతో పాటు అదనపు సుగంధం ఆమె.. కాఫీ సిప్‌ చేస్తూ ఇవిగో అంటూ తాను జాగ్రత్తగా తీసుకొచ్చినవి కూతురికి అందించాడు.. ఇస్తుండగా వాటినోసారి పరిశీలనగా చూశాడు ''ఒక్క చుక్కన్నా రక్తం అంటివచ్చిందేమో'' అని.. లేదు ''ఆ రక్తమంతా బహుశా సైన్యాధ్యక్షుడి చేతులకే అంటి ఉంటుంది'' అనుకున్నాడు.. ''రేపెపుడైనా అతను నాకు తారసపడప్పుడో, లేదంటే టెలివిజన్‌ సెట్లోకొచ్చి శాంతి సందేశం వల్లిస్తున్నప్పుడో అతని చేతులు రక్తపుటేరులా కనిపిస్తాయా'' అని అనుకున్నాడు.. ''అంత రక్తపు చేతుల్ని అతని పసికూనలు చూసి ఎంత భీతిల్లుతున్నారో'' అనుకున్నాడు.. ''ఒకవేళ అతనికి పిల్లలు లేరేమో'', ''లేకపోవటమేంటి నాతో సహా ఈ దేశస్తులంతా ఆయన పిల్లలమే కదా'' అనీ అనుకున్నాడు..
ఈలోగా పాప వాటిని తన దోసిట్లోకి తీసుకొని ''వన్‌, టూ త్రీ, ఫోర్‌, మ్మ్‌.. ఈ ఫొర్టీన్‌తో కలిపి నా దగ్గర ఫోర్‌ హండ్రెడ్‌ ఎబోవ్‌ అయ్యారు'' అంది..
''డాడీ కెన్‌ ఐ ఆస్క్‌ వన్‌ క్వశ్చన్‌'' అనగానే ''ఎస్‌ డియర్‌'' అన్నాడు డాక్టర్‌.. కప్పు సాసర్‌లో పెడుతూ.
''జస్ట్‌ టెన్‌ డేస్‌ బ్యాక్‌ ఐ వజ్‌ ఆస్క్డ్‌ ఫర్‌ దీజ్‌'' అనగానే ''ఎస్‌'' అన్నాడు..
''అప్పుడేమన్నావు'', ''ఏమన్నాను''..
''అవి నా దగ్గరెందుకుంటారు'' అన్నావు..
''ఇంకేమన్నాను''.. అని అడిగాడు పాపనెత్తుకొని బాల్కనీ వైపు నడుస్తూ..
''అవి నా దగ్గరుండటానికి నేనేమన్నా సైనికుడ్నా, లేక పోలీస్‌ నా'' అన్నావ్‌..
''హా ఐ హావ్‌ రిమెంబర్డ్‌'' అన్నాడు..
''అయితే ఇప్పుడు నువ్వు పోలీస్‌ అయ్యావా''. ''నో''..
''సైనికుడయ్యావా'', ''నొనో''.. అన్నాడు..
అవెక్కడివో చెపితే పాప జడుసుకుంటుందనుకున్నాడు... అల్లర్లు, ఆందోళణలు, యుద్దాల్లేని అహింసా మంత్రపు శాంతిలోకం పిల్లలకు దక్కాలను కుంటాడుతను.. అందుకే ఓ కట్టు కథ అల్లాడు.. ''నేను వేటకెళ్లాను.. అడవిలో తవ్వుతుంటే రోజూ కొన్నికొన్నిగా పెద్దపెద్ద మట్టిబొమ్మలు బయల్పడుతున్నారు'' అని.. ''హా''.. అంటూ కళ్లు పెద్దవి చేస్తూ వింటోంది పాప..
ఆ రాత్రి పాప తన గదిలో బొమ్మలు ఊహిస్తూ తండ్రి చెప్పిన అడవి కథకు రూపమిస్తోంది.. పెన్సిల్‌తో పెద్దపెద్ద బొమ్మలు గెస్తోంది, వాటి తలల్లో, వీపుల్లో, మెడల కింద, వెన్నుల్లో, పొట్టల్లో గాయాలున్నట్తుగా చిత్రించింది..
మరుసటి ఉదయం ఇంటివద్ద వీడ్కోలు తీసుకోని ఆసుపత్రికి బయల్దేరాడు డెడాన్‌ రోడ్దు కూడలికొస్తుండగా పళ్లాలు, డ్రమ్ములు, తప్పెట్లు నినాదాలు, నిరసన ధ్వనులు అధికమవుతున్నారు.. సైన్యం మిడతల దండులా దూసుకొస్తోంది, తెల్లవారు ఝామునే టైప్‌ చేసుకున్న రాజీనామ లేఖ జేబులో ఉంది.. కారు దిగి తన గొంతు నరాలు పగిలేలా ఎలుగెత్తుతున్నాడు.. మూడువేల వందనంతో నిరసన తెలుపుతూ ''ప్రజాస్వామ్యం కావాలి సైనిక పాలన అంతమవ్వాలి'' ...ధన్‌ మంటూ తుపాకి పేలిన శబ్దం..
తన వద్ద ఉన్న బుల్లెట్లుతో ''విరు వాంట్‌ డెమోక్రసీ , సేవ్‌ ద ఫ్రీడం'' అనే నినాదాక్షరాలుగా పేరుస్తోంది పాప, కానీ.. ఇంకొక్కటి తక్కువ పడింది ''ఆ ఒక్క లోటు డాడీ ఈరోజు తీరుస్తాడు'' అనుకుంది.... ఆ బొమ్మల గొంతుల్లోనూ ఆఖరి శబ్దం అదే అయి ఉంటుందని అంచనా వేస్తోంది.. ఆ ఒక్క బుల్లెట్‌ కోసం ఇంటి వద్ద పాప ఎదురుచూపు.. ''ఆగేయాసియా పుత్రి, అటు బే ఆఫ్‌ బెంగాల్‌ నుండి ఇటు అండమాన్‌ దాక, పర్వతాల నడుమ బౌద్ధ దేవతా, శాంతిశరణం గచ్చామి, అహింసా శరణం గచ్చామీ'' అభ్యుదయవాదొకడు కవిత పాడుతున్నాడు.. బుల్లెట్‌ను ఎదురించి బ్యాలెట్‌ గెలిచే తీరుతుంది, నియంతత్వం పిడికిలి చీల్చుకొని ప్రజాస్వామ్యం పూర్వాకతి తప్పక పొందుతుంది.. ఇప్పుడో ఇంకాసేపటికో ఎన్నికల నిర్వహణ ప్రకటన హామీ వినపడొచ్చు కానీ.. కూల్చివేయబడింది ప్రజాస్వామ్యమొక్కటేకాదు.. బలిగొన్న ప్రాణాల మాటేమిటి, బాధిత శాంతి మాటేమిటి...

- శ్రీనివాస్‌ సూఫీ, 9346611455

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
04:52 PM

అండర్‌వేర్‌తో వెళ్లి ఓటేసిన ప్రజలు

04:43 PM

రాజకీయాలపై 'మెగా`అభిమానుల కీలక నిర్ణయం

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.