Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాదర్శకుడు 'సత్యజిత్‌ రే' @ 100 | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

మహాదర్శకుడు 'సత్యజిత్‌ రే' @ 100

Sat 01 May 19:40:13.856636 2021

   'రే'కి సినిమా పట్ల ఉన్న అభిమానంతో ప్రఖ్యాత సినీ విమర్శకుడు చిదానందదాస్‌ గుప్తాతో కలసి 1949లో కలకత్తా ఫిలిం సొసైటీని నెలకొల్పారు.ఆయన జీవితంలో ఇదొక మలుపు. మనదేశంలో ఇదే తొలి ఫిలిం సొసైటీ కూడా. ఈ నేపథ్యంలో తాను పని చేస్తున్న అడ్వర్టైజింగ్‌ కంపెనీ 'రే' ను లండన్‌ లోని హెడ్‌ ఆఫీసుకు పంపారు.ఇది మరో మలుపు. అక్కడున్న అయిదు మాసాల్లో ఆయన సుమారు వంద విదేశీ చిత్రాలు చూశారు. వీటిలో ప్రఖ్యాత ఇటాలియన్‌ నవ్య దర్శకుడు విక్టోరియా డిసీకా 'బైసికల్‌ థీవ్స్‌' కూడా ఉంది.
     భారత దేశ సామాజిక, సాంస్కృతిక రంగానికి బెంగాల్‌ రాష్ట్రం ముగ్గురు మహనీయులనందించింది. మొదటి వారు రాజా రామమోహనరారు, తరువాతి వారు రవీంద్రుడు కాగా కడపటి వారు సత్యజిత్‌ రారు .వీరు మువ్వురూ మూడు పార్శాలుగ భారత సమాజాన్ని ప్రభావితం చేశారు ''సత్యజిత్‌ రే'' అంటే భారతీయ సినిమాకు పర్యాయపదం. ఆయన గురించి రాయడమంటే భారతీయ సినిమా ఉత్తరార్ద్రపు చరిత్రను రాయడమే అవుతుంది. పూరా ్వర్ద్రపు చరిత్ర అంతా మూకీ టాకీల వికాసమే ఐతే, ఉత్తరార్ద్రం అంతా రే తో మొదలైన నవ్య సినిమా ఉద్యమమే మన సినిమాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలార్జించి పెట్టింది. సత్యజిత్‌ రే అంటే ఒక కళామూర్తి. మహామనిషి. సాటిలేని మేథావి. ఆ మహా దర్శకుడు రూపొందించిన, కళాఖండాలనదగిన 'రే' ను ప్రపంచ సినీ సీమలోనే చిరంజీవిని చేశాయి.
       భారతీయ సినిమారంగంలో వ్యాపార దృక్పథంలో రూపొందుతున్న చిత్రాలు సినిమా 'కళ'కు గొడ్డలిపెట్టులా తయారవుతు న్నాయనే నిజాన్ని టాకీలు వచ్చిన మూడవ దశకంలోనే గుర్తించి, మన సిని మాలను మరో వైపు మళ్ళించి, వాటిని నవ్య మార్గం పట్టించి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత 'సత్యజిత్‌ రారు' కే దక్కుతుంది.
       నేడు ''రే'' 100వ జయంతి.రే గురించి రాయడమన్నా, మాటాడటమన్నా అది భారతీయ సినిమా సాధించిన అంతర్జాతీయంగా సాధించిన విజయాలను మననం చేసుకోవడమే అవుతుంది. బెంగాలీలు ప్రేమగా ''మానిక్‌ దా''అని పిలుచుకునే సత్యజిత్‌ రే1921 మే 2న కలకత్తాలో సుకుమార్‌, సుప్రభాడే దంపతులకు జన్మించారు. కాలేజీ చదువుతున్నపుడే ఫోటోగ్రఫీ, చిత్రకళలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్‌ తరువాత బాయిస్‌ ఓస్‌ పేపర్‌ వారు నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతిని అందుకున్నారు. నిజానికి రే కుటుంబం యావత్తూ కళాకారుల నిలయం. తండ్రి సుకుమార్‌ రే బెంగాలీలో బాల సాహిత్యకారునిగా పేరు గడించారు. అయితే 'రే'కు రెండేళ్ళ వయసున్నపుడే ఆయన మరణించారు. తాత ఉపేంద్ర కిశోర్‌ రే కూడా చిత్రకారుడు. ఆయన బెంగాలీలో 'సందేశ్‌' అనే బాలల పత్రికను నిర్వహించేవారు. అలా తండ్రి తాతల నుండి పుణికిపుచ్చుకున్న సాహిత్య, చిత్రకళలతో బాటు 'రే' క్రమంగా సినిమాల వైపు తన దృష్టిని మరల్చారు.
       'రే' బాల్యం నుండి స్వతహాగా చిత్రకారుడు. చిత్రకారుడుగానే ఎదగాలని రవీంద్రుని వద్ద శిష్యరికం చేశాడు. కానీ ఆయన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా శాంతినికేతన్‌ నుండి ఇంటి కొచ్చి ఉద్యోగాన్వేషణలో పడి ఒకానొక అద్వర్టైజ్‌ కంపెనీలో ఆర్టిస్టుగా చేరి అనతి కాలంలోనే పై పైకి ఎదిగాడు. అంతలోనే సినిమారంగం వైపు ఆయన దృష్టి మళ్ళి తొలుత 'ప్రిజనర్‌ ఆఫ్‌ జెండా' ఆధారంగా ఒక స్క్రీన్‌ ప్లే రాసుకుని నాటి ప్రముఖ దర్శకుడు బిమల్‌ రారు వద్దకు వెళితే ఆయన సలహా మేరకు'ఘర్‌ బైరే' కథ ఆధారంగా మరో స్క్రీన్‌ ప్లే రాసుకుని ఒక నిర్మాత, దర్శకులను ఒప్పిం చారు. కానీ రే వారి వ్యాపార దృక్పథాన్ని అనుసరించలేనని ఖరాఖండిగా చెప్పేసి బయటికొచ్చారు.
       1940 లో డిగ్రీ అవగానే 'రే'శాంతినికేతన్‌ లో చేరడం ఒక మలుపు.'అనంతరం ఆయన కమర్షియల్‌ ఆర్టిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. 1943 లో డి.జి. కుమార్‌ వద్ద చేరారు. . ఇలా రే 1946 నాటికి సినిమా నిర్మాణం వైపు పూర్తిగా ఆకర్షితుడైనారు.
ఇంతలోనే పాశ్చాత్య సినీ ప్రముఖుడు జీన్‌ నాయర్‌ 'ది రివర్‌' అనే సినిమా నిర్మాణం కోసం కలకత్తా వచ్చారు. సత్యజిత్‌ రే, మృణాల్‌ దా, రిత్విక్‌ ఘటక్‌ మొదలైనవారు ఆ షూటింగ్‌ స్పాట్‌కు వెళ్ళి చూశారు. దాంతో 'రే' తాను కూడా సినిమా తీయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆయన కలకత్తాలో విడుదలయ్యే హాలీవుడ్‌ చిత్రాలన్నిటినీ విడవక చూసేవారు. అలా చూసిన సినిమాల్లోని టెక్నికల్‌ గుణాలను విశ్లేషిస్తూ నోట్సు రాసుకునేవారు. క్లాసిక్స్‌గా పేరొందిన 'బెన్‌హర్‌', 'దికౌంట్‌ ఆఫ్‌ మాంటిక్రిస్టో', 'థీఫ్‌ ఆఫ్‌ బాగ్దాద్‌, 'అంకుల్‌ టోమ్స్‌ కేబిన్‌' చిత్రాల ప్రభావం ఆయనపై మొదటి నుండి ఎటూ ఉండనే ఉంది. ఇంకా రష్యన్‌ దర్శకుడు ఐసెన్‌ స్టీన్‌ 'బెటిల్‌ షిప్‌ పోటీమ్‌' చిత్రంను ఆయన 25సార్లు చూశారు. '' 'ఐ సెన్‌ స్టీన్‌' 'ఇవాన్‌ ది టెర్రిబుల్‌ 'చూసిన రోజును నేనెప్పుడూ మరువను'' అని చాలా సందర్భాలలో చెప్పుకున్నారాయన.
       'రే' కి సినిమా పట్ల ఉన్న అభిమానంతో ప్రఖ్యాత సినీ విమర్శకుడు చిదానందదాస్‌ గుప్తాతో కలసి 1949లో కలకత్తా ఫిలిం సొసైటీని నెలకొల్పారు.ఆయన జీవితంలో ఇదొక మలుపు. మనదేశంలో ఇదే తొలి ఫిలిం సొసైటీ కూడా. ఈ నేపథ్యంలో తాను పనిచేస్తున్న అడ్వర్టైజింగ్‌ కంపెనీ 'రే' ను లండన్‌ లోని హెడ్‌ ఆఫీసుకు పంపారు.ఇది మరో మలుపు. అక్కడున్న అయిదు మాసాల్లోఆయన సుమారు వంద విదేశీ చిత్రాలు చూశారు. వీటిలో ప్రఖ్యాత ఇటాలియన్‌ నవ్య దర్శకుడు విక్టోరియా డిసీకా 'బైసికల్‌ థీవ్స్‌ '' కూడా ఉంది. ఈ చిత్రం చూడగానే తాను అప్పటికే చదివిన విభూతి భూషణ్‌ బందోపాధ్యాయ 'పథేర్‌ పాంచాలి' నవల గుర్తొచ్చింది. తిరుగు ప్రయాణంలో ఓడలోనే 'పథేర్‌ పాంచాలి' స్క్రిప్టు రాశారాయన.
అంతకు ముందు 1946లోనే బిబూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రచించిన ప్రఖ్యాత నవల 'పథేర్‌ పాంచాలి'ని కుదించి, బాలల కోసం దానిని మరో పేరుతో వెలువరిస్తూ, బొమ్మలు వేయమని రే'కు ఇచ్చారు. అంతకు మునుపే ఈ నవలను అనేకసార్లు చదివిన ఆయనకు చిత్రాలు వేస్తున్నప్పుడు సినిమాగా తీసేందుకు చక్కగా ఈ కథ పనికి వస్తుందని గ్రహించి 'పథేర్‌ పాంచాలి'ని సినిమాగా తీయాలని అనుకున్నారు.
       అయితే 1951లో భారతదేశంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన విక్టోరియా డిసికా చిత్రం 'బైసికిల్‌ థీవ్స్‌' ఆయనను బలంగా సినిమా నిర్మాణం వైపు ఆకర్షితుణ్ణి చేసింది. అందుకే రే 'పథేర్‌ పాంచాలి' గురించి చెప్పేముందు 'బైసికిల్‌ థీమ్స్‌' గురించి చర్చించడం ఎంతైనా అవసరం. ఒక నిరుద్యోగికి ఆనుకోని విధంగా పోస్టర్లు అతికించే ఉద్యోగం దొరికినా ఆ ఉద్యోగం సైకిల్‌ ఉన్నవారికే ఇస్తామని షరతు పెట్టడంతో ఇంట్లో చిల్లిగవ్వలేక పెళ్ళాం దుస్తులు, ఇంట్లోని సామానులు అన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముతో సైకిల్‌ కొని ఉద్యోగం సంపాదించుకుంటే రెండు రోజులకల్లా ఆ సైకిల్‌ నెవరో దొంగిలించుకు పోతారు. సైకిల్‌ పోగొట్టుకున్న యువకుడు, అతని ఐదేళ్ళ కొడుకూ సైకిల్‌ కోసం వెదుకుతుండగా నాటి యూరప్‌ నగరాల దారిద్య్రాన్ని ఆ ఐదేళ్ళ కుర్రాడి కళ్ళతో మనకు 'డిసికా' బైసికిల్‌ థీవ్స్‌ లో చూపిస్తడు.'రే' తన ''రే' 'పథేర్‌ పాంచాలి' చిత్రంలో కూడా 'అపు' కళ్ళ ద్వారా బెంగాలీ గ్రామీణ జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
       అలా ''రే' 'పథేర్‌ పాంచాలి' స్క్రీన్‌ ప్లే వ్రాసుకుని 'స్క్రిప్టు చేతబట్టుకుని చాలామంది నిర్మాతల వద్దకు వెళ్ళారు. సినిమా అనుభవం లేని 'రే'ను గాక మరో దర్శకుడితో అయితే తీస్తామని వారు చెప్పారు. మరికొందరు పెద్ద తారలతో తీస్తామన్నారు. 'రే' అంగీకరించక తానే స్వంతంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కొందరు మిత్రులను సమీకరించి వారి సహకారాన్ని తీసుకున్నాడు. స్వంతంగా సినిమాను నిర్మించాలనుకున్నాడు గానీ మరి డబ్బు గురించిన సమస్య వచ్చిపడిందాయనకు.
       'రే' తొలుత తన జీవిత భీమా పాలసీపై ఏడువేల రూపాయల లోన్‌ తీసుకున్నాడు. మిత్రులు కొంత ఇవ్వగా మొత్తం తొమ్మిది వేలా ఐదు వందల పెట్టుబడితో సినిమా నిర్మాణం మొదలైంది. కెమెరామెన్‌ గా సుబ్రతో మిత్రా, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వంశీ య్చంద్రగుప్తా, దలాల్‌ దత్తాను ఎడిటర్‌ గా తీసుకున్నాడాయన. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో ఇంద్ర ఠాకూరాణిగా చిరస్మరణీయమైన పాత్రను పోషించిన చున్ని బాలదేవికి రోజుకు 20 రూపాయలుమాత్రమే ఇచ్చేవారు. సుబీర్‌ బెనర్జీ, జమీదాస్‌ గుప్తాలు బాలతారలు. వీరికి పారితోషికం ఏమీ లేదు. ఇలా సినిమా చిత్రీకరణ మొదలైంది. 'పథేర్‌ పాంచాలి' షూటింగ్‌ మొదలైన వైనాన్ని 'రే' మాటల్లో చెప్పాలంటే....
       'పథేర్‌ పాంచాలి' షూటింగ్‌ మొదలైన రోజు నాకింకా గుర్తు. అవి పండుగ రోజులు. అక్టోబర్‌ నెల. పూజ ప్రారంభమైన రోజు అదే. మా షూటింగ్‌ లోకేషన్‌ కలకత్తాకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా టాక్సి గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ మీదుగా వెళుతుంటే అటూ, ఇటూ చిన్న చిన్న పట్టణాలు, పెద్ద పెద్ద ఊళ్ళు కనిపించాయి. పండుగనాటి ఆనందో త్సాహాలు, డోలు వాయిద్యాలు, ఒక్కోచోట ఉత్సవ విగ్రహాలు ఎన్నో కనిపించాయి. అవన్నీ శుభసూచకాలని, అదృష్టం కలిసివస్తుందనీ ఎవరో అన్నారు. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నాయి. ఏమైనా ఆ మాట నమ్ముదామనే అనుకున్నాను. ఎందుకంటే నిర్మాణంలో ప్రతిభ, సామర్ధ్యం, డబ్బు మొదలైన వాటితోపాటు కొంత అదృష్టమూ అవసరమే'' ఆని వ్రాసుకున్నాడాయన.
అయితే 'పథేర్‌ పాంచాలి'ని తెరకెక్కించడంలో 'రే' ఎదుర్కొన్న అవాంతరాలు, కష్టాలు, అన్నీ ఇన్నీ కావు. అప్పటి వరకు తను సేకరించిన సొమ్ము తొమ్మిదిన్నరవేలు ఎక్కడా సరిపోలేదు. సినిమా షూటింగ్‌ అప్పుడప్పుడూ ఆగిపోయేది. ఒక దశలో యూనిట్‌ సభ్యులకు తిండి పెట్టేందుకు కూడా డబ్బులు కరువయ్యేవి. దాంతో 'రే' తన భార్య 'విజయ' నగలు తాకట్టు పెట్టాడు. ఆ సంగతి తన తల్లికి తెలియనీయలేదు.అప్పటికి విజయ గర్భవతి కావడంతో సీమంతం చేస్తున్నప్పుడు నగలు పేట్టుకోవలసి వచ్చింది. విషయం బయట పడకుండ కొన్ని నగలను తన స్నేహితురాలివద్ద తెచ్చుకుని . తన అత్తగారికి (సుప్రభా డే) తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ విషయాన్ని 'రే' 1958లో న్యూయార్క్‌ లోని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ కటింగ్‌ను భార్యకు పంపుతూ ఈ సంఘటన వివరాలేవీ కనబడకుండా సిరా పూశాడు. కానీ ఆయన తల్లి సుప్రభా డే కు అన్నీ తెలుసు. కానీ తెలీనట్టే ఉండింది. ఆ ఇంటర్వ్యూ కటింగ్‌ను చూసి తనలో తానే నవ్వుకుందామె.
       మళ్ళీ 'పథేర్‌ పాంచాలి' నిర్మాణంలోకి వెళితే సినిమా నిర్మాణానికి తప్పనిసరై రే తను      ప్రాణప్రదంగా దాచుకున్న పుస్తకాలను (లైబ్రరీని) అమ్ముకున్నాడు. ఆ డబ్బూ చాలలేదు. సినిమా సగం కూడా పూర్తవలేదు. దాంతో నాటి బెంగాల్‌ ముఖ్యమంత్రి బి.సి.రారుతో తన తల్లికి ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని ఆయనను వెళ్ళి కలుసుకున్నాడు. తాను అప్పటిదాకా తీసిన చిత్రాన్ని ఆయనకు చూపించాడు. సినిమా టైటిల్‌ 'పథేర్‌ పాంచాలి' (్‌ష్ట్రవ రశీఅస్త్ర శీట ్‌ష్ట్రవ =శీaస)ని బట్టి ఇదేదో రోడ్డు రవాణాపై డాక్యుమెంటరీలాగ ఉందని భావించిన ఆయన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ నుండి సినిమా నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఆ విధంగా ఎట్టకేలకు రెండు లక్షల వ్యయంతో 'రే' పథేర్‌ పాంచాలి'ని పూర్తిచేసాడు. 'పథేర్‌ పాంచాలి సినిమా వలననే బెంగాల్‌లో సినిమా విభాగం నేటికీ రోడ్లు భవనాల శాఖలోనే ఉంది.
       అలా రూపొందిన 'పథేర్‌ పాంచాలి' 1958లో ఆగస్టు 26న కలకత్తాలోని మూడు థియేటర్లలో విడుదలైంది. కానీ సినిమా ప్రేక్షకులు ఎప్పుడు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో, ఎప్పుడు త్రిప్పికొడతారో చెప్పలేని స్థితి. ఈ చిత్రం ఎలా పోతుందోననే దిగులు 'రే'లో ఉండనే ఉంది. కానీ ఆయన మిత్రుల, శ్రేయోభిలాషులు కూడా కొంత ఆందోళన పడ్డారు.వారందరి ఊహలను, అంచనాలను మించి ఈ చిత్రం అనూహ్యమైన ప్రజాదరణకు నోచుకోవడంతో భారతీయ సినిమా రంగం ఒక మహత్తరమైన మలుపు తిరిగింది. ఏ అయిదారు వారాలు పోతుందో అనుకున్న థియేటర్ల యాజమాన్యానికి ఈ చిత్రం ఒక సమస్యగా మారింది. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం అదే యేడు సెప్టెంబరు 30న భారీ తారాగణం దిలీప్‌ కుమార్‌, దేవానంద్‌, బీనారారులు నటించిన జెమినీ వారి 'ఇన్సానియత్‌' కలకత్తాలో విడుదల కావలసి వుంది. (ఈ చిత్రం బి.ఎ.సుబ్బారావు తెలుగు చిత్రం పల్లెటూరి పిల్ల 1951కు రీమేక్‌). కానీ 'పథేర్‌ పాంచాలి'కి రోజురోజుకూ ప్రేక్షకాదరణ పెరిగి 14 వారాల పాటు ఏకధాటిగా ఆడింది.
       ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన 'రే' 'పథేర్‌ పాంచాలి'లో ఏముందీ అంటే 'పథేర్‌ పాంచాలి' ఒక సజీవ గ్రామ జీవన కావ్యం. అందులో మనం చూసేది కేవలం దారిద్య్రం కాదు. ఒకరకంగా ఈ చిత్రంలో కనపడిన పేదరికం భారతీయ సినీ ప్రేక్షకులను బాగా కదిలించింది. 'అపూ' ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కుర్రాడు. తండ్రి అర్భకపు కవి. అతడి సంపాదనతో ఇల్లుగడవటం కష్టంగా ఉంటుంది. దుర్గ అనే ఆరేళ్ళ పాప అతడికి అక్క అప్పు తండ్రి ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుందని కలలు కంటూ ఆ ఉ ద్యోగంతో తన కుటుంబం సంతోషంగా ఎలా గడుపుతుందని ఊహిం చుకుంటాడు. కానీ ఉద్యోగం రాదు. బీదరికంలో మగ్గుతుంటారు. చిరిగిన బట్టలు వేసుకుని దుర్గ వీధి బడిలో చదువుతుంటుంది. పక్కింటివారు దుర్గపై నెక్లెస్‌ దొంగతనం నేరం వేస్తారు. ఇంట్లోని ముసలమ్మ (చున్ని) చచ్చిపోతుంది. దుర్గ జ్వరంతో బాధపడుతూ మరణిస్తుంది. దాంతో అపూ సంసారం కష్టాలపాలై బ్రతుకుదెరువుకై ఊరు వదిలి బెనారస్‌ వెళ్ళడంతో కథ ముగుస్తుంది. ఈ కథ నవలలో సగం మాత్రమే. 'పథేర్‌ పాంచాలి లో గల మానవత్వం, భావన ప్రధానమైన అంశాలు. జీవన వాస్తవాలు' నన్ను ఆకర్షించాయి. అందుకే సినిమా తీసేందుకు దాన్ని ఎన్నుకున్నాను. అయితే నవలలో సగంకంటే ఎక్కువగా నేను తీయలేకపోయాను. కుటుంబం బెనారస్‌ వెళ్ళడంతో సినిమాను ముగించాను అంటాడు 'రే'.
'పథేర్‌ పాంచాలి' సినిమాగా ఎంతగా సంచలనం సృష్టించిందో ఇది నవలగా వచ్చిన కాలం కూడా సంచలనాన్నే సృష్టించింది. బబూతి భూషణ్‌ బందోపాధ్యాయ రాసిన ఈ నవల 1930లో ఒక ప్రముఖ బెంగాలీ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. రచయిత పుట్టి పెరిగిన గ్రామీణ వాతావరణం అంతా ఒక ఆత్మ కథలాగా వ్రాశారు. ఇందులో కథ ఏదీ లేదని మొదట ఒక ప్రచురణకర్త పుస్తకంగా వేయడానికి ఒప్పుకోలేదు. నిజానికి మొదట పత్రికలవారు కూడా ఒప్పుకోలేదు. పాఠకుల ప్రతిస్పందన మేరకే కొనసాగిస్తామని చెప్పారు. కానీ అనూహ్యంగా అప్పు, దుర్గల కథ పాఠకులకు నచ్చింది. సీరియల్‌ పాపులర్‌ అయింది. ఏడాది తరువాత పుస్తకంగా వెలువడి బెస్ట్‌ సెల్లర్‌ జాబితాలో చేరిపోయింది 'పథేర్‌ పాంచాలి'.
       'రే' 'పథేర్‌ పాంచాలి' చిత్రాకి వచ్చినన్ని అవార్డులు ఆయనకు మరే చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. కేన్స్‌ చిత్రోత్సవంలో 'బెస్ట్‌ హ్యూమన్‌ డాక్యుమెంట్‌' రాష్ట్రపతి ఉత్తమ చిత్రం అవార్డు, అడెన్‌ బరో, మనీలా, శాన్‌ ఫ్రాన్సిస్కో, బెర్లిన్‌, వాంకోవర్‌, న్యూయార్క్‌, టోక్యో, డెన్మార్క్‌ లో జరిగిన చిత్రోత్సవంలో పాల్గొని పురస్కారాలను అందుకుంది.
       1955లో తొలి జాతీయ అవార్డులలో 'పథేర్‌ పాంచాలి' తో పోటీపడిన బి.ఎన్‌.రెడ్డి తెలుగు చిత్రం 'బంగారు పాప' (1954)రెండో స్థానంతో సరిపెట్టుకుంది.అలా ఆనాడు తప్పిపోయిన స్వర్ణం మన తెలుగుకు 65 ఏండ్ల పాటు దక్కలేదు. ఇది తెలుగు సినిమా స్థాయిని పట్టి చూపుతుంది. ఆ తరువాత 2015లో ''బాహుబలి''అనే గ్రాఫిక్స్‌ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవార్దుకు ఎంపికవడం ఆశ్చర్య పడవలసిన విషయం. అయితే మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇంత సంచలనం సృష్టించిన 'పథేర్‌ పాంచాలి' చిత్రంవల్ల 'రే'కు ఆర్థికంగా ఒరిగిందేమీ లేదు. ఈ 'పథేర్‌ పాంచాలి' 1982 జూలై నాటికి దేశ విదేశాలలో ప్రదర్శితమై 10.64 లక్షలు వసూలు చేయగా వాటిలో వాటాగా 'రే'కు దక్కింది మూడువేలే అంటే నమ్మరేమో. కానీ ఇది పచ్చి నిజం. ఏది ఏమైనా సరే వచ్చింది పేరు, బెంగాల్‌ ప్రభుతకు దక్కింది పైకం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖవారు పథేర్‌ పాంచాలి కలెక్షన్లలో కొంత ధనాన్ని 'రే' కు చెందాలని తీర్మానించినా దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనే లేదు. ఏది ఏమైనా భారతీయ సినీ పరిశ్రమలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టిన 'పథేర్‌ పాంచాలి' సెల్యులాయిడ్‌ అనే పదానికి సరైన నిర్వచనంగా నిలిచిపోయింది.పథేర్‌ పాంచాలితో సత్యజిత్‌ రే భారత దేశంలో నవ్య సినిమా ఉద్యమానికి ఆద్యుడైనారు. వాస్తవానికి ఈయనకన్నా ముందుగా బెంగాల్‌లో రిత్విక్‌ ఘటక్‌, తపన్‌ సిన్హా మృణాల్‌ సేన్‌లు, కేరళలోపి.రాందాస్‌ (న్యూస్‌ పేపర్‌ బారు 1955) లు కొంత వాస్తవిక ధోరణితో సినిమాలు తీసినా,పథేర్‌ పాంచాలి అంతర్జాతీయ ఖ్యాతి పొందడంతో రే భారతీయ నవ్య సినిమాకు ఆద్యుడైనారు.
       ఆ తరువాత రే చలన చిత్ర జైత్రయాత్ర మొదలైంది.దేశ దేశాలలో ఆయన పేరు మారు మోగిపోయింది.భారతీయ సినిమా అంటేనే రే పర్యాయపదం అయ్యారు.ఆ తరువాత ఎన్నో కళాకండాలనదగిన సినిమాలు తీశారు.
       సత్యజిత్‌ రే ''పథేర్‌ పాంచాలి'' ట్రయాలజీగా ఆ తరువాత 'అపరాజిత' (1956), 'ఆపూ సంసార్‌'(1959) తీశారు. వీటిమధ్యన మూడవ చిత్రంగా 'పరేశ్‌ పాథర్‌'(1957), నాలగవ చిత్రంగా 'జలసాఘర్‌'(1958) తీశారు.ఈ చిత్రాలలో శ్రేష్టమైన సంగీతానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇలాంటి సంగీతం మన దేశంలో రూపొందించిన మరే చిత్రంలోనూ లభించలేదని సినీ విమర్శకులు ప్రశంసించారు. పోతే మాధవీ ముఖర్జీ, సౌమిత్రా చటర్జీ, ఉత్తవమ్‌ కుమార్‌, షర్మిలా ఠాగూర్‌,షబానా ఆజ్మీ, స్మితాపాటిల్‌, అపర్ణా సేన్‌ ,కాళీ బెనర్జీ,కనికా మజుందార్‌ ,బిశ్వంభర రారు ,అనిల్‌ చటర్జీ,వహీదా రహెమాన్‌ ,జయబాధురీ వంటి తారలు ఆయన దర్శకత్వంలో నటించి మహానటీ నటులుగా ఎదిగినవారే.
       ముఖ్యంగా సౌమిత్ర చటర్జీలోని సహజ నటుడిని తొలుత గుర్తించింది రేనే.1956లో 'అపరాజిత' తీస్తున్నప్ఫటినుండే రేతో ఆయనకు పరిచయం.1958లో ''జల్సాఘర్‌'' సెట్లో కలిసేందుకు వెళ్ళినపుడు చూడగానే నా తరువాతి చిత్రం ''అపూర్‌ సంసార్‌''లో నువ్వే హీరోవని ప్రకటించేశాడు రే.అలా 1959లో మొదలైన వారి కలయిక 1990వరకు ఓ 30ఏండ్లు నిరాటంకంగ కొనసాగింది. రే తీసిన చిత్రాలలో 15లో నటించడం సౌమిత్ర నట జీవితంలో ఒక రికార్డు.వీరువురి కలయిక భారత చలన చిత్ర రంగంలో కళాఖం డాలనదగ్గ చిత్రాలు రూపొందేం దుకు దోహదపడింది. అకిరకురసోవా - ముఫెనీ,ఫెలినీ -మాస్ట్రో యాన్నీ, స్కోర్‌ సీ-డి నీరో,డికాప్రియో,బెర్గ్‌మెన్‌ -మాక్స్‌వోన్‌ సిడోల కాంబినేషన్‌లతో పోల్చవచ్చు.ఒక నవ్య సినీ దర్శకుడితో ఏ నటుడైన ఇన్ని చిత్రాలు చేసిన సందర్భం ఇండియాలో వేరెవరివిషయంలోను జరగలేదు.అపూర్‌ సంసార్‌ తరువాత రే తీసిన దేవి(1960), తీన్‌ కన్యా(1961),అభిజాన్‌
(1962), చారులత(1964),కా పురుష్‌ (1965),అరణ్యేర్‌ దిన్‌ రాత్రే(1970),అశాని సంకెత్‌ (1973),సోనార్‌ కెల్లా(1974), జోరు బాబా ఫె˜లూనాథ్‌ (1978),హిరక్‌ రాజార్‌ దేశ్‌ (1980),ఘర్‌ బైరే(1984),సూకూమార్‌ రే(1987), గణశత్రు (1989), శాఖ-ప్రశాఖ(1990) చిత్రాలలో హీరో సౌమిత్ర చటర్జీనే.'అపూ సంసార్‌' లో అపూర్వకుమార్‌ రే,'దేవి'లో ఉమా ప్రసాద్‌ ',తీన్‌ కన్యా'లో అమూల్యా,'అభిజాన్‌ 'లో నర్సింగ్‌ ,'చారులత'లో అమల్‌, 'కాపురుష్‌ -ఓ- మహాపురుష్‌లో అమితాబ్‌ రే,'అరణ్యేర్‌ దిన్‌ రాత్రే'లోఆషీమ్‌ ,'ఘర్‌ బైరే'లో సందీప్‌ ,'గణశత్రు'లోడా. అశోక్‌ గుప్త పాత్రలను రే సౌమిత్ర చటర్జీ కొరకే సృస్టించిడని సినీ విమర్శకులు పేర్కొంటారు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచ సినీ చరిత్రలో భారతదేెశానికి సమున్నత స్థానం కల్పించారంటారు. అపూర్‌ సంసార్‌లో సౌమాత్ర నటనకు కేన్సు,కార్ల్‌ వివరీ,వెనీస్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంస లందుకున్నదంటే అదంతా రే దర్శకత్వ ప్రతిభనే.
       భారతీయ సినీ విమర్శకులు, సినీ చరిత్రకారులు రేను సాంస్కృతిక పునరుజ్జీవన కారకుడని వ్యవహరించడం సర్వ సామాన్యం. ఆయన ఉత్తమమైన ఇతి వృత్తాలను ఎంపిక చేసుకునే విధానం దేశ విదేశీ సంప్రదాయాలతో అలవోకగా కలగలిసిపోగల ప్రతిభ ఆయనలోని ప్రత్యేకత. నిజానికాయన సినీ రచయిత, దర్శకుడు మాత్రమే కాదు. స్వతహాగ చిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు.ఇంకా చెప్పాలంటే ఆయన చేయలేనిదేదీలేదు.విషాద గీతాలతో హృదయాలను కలచివేసే గీతాలు,భావోద్వేగాల భరితమైన తొలి చిత్రం
       పథేర్‌్‌ పాంచాలి' మొదలుకుని ఆసక్తికరమైన బాలల కథల గోపీ గానే బఘు గానే, హిరాక్‌ రాజ దేశ్‌ ,సోనార్‌ కెల్లా,జోరు బాబా ఫేలూ నాథ్‌ చిత్రాల వరకు ఆయన కథా వస్తువులు,ప్రయోగాలు,రూపకల్పనలు అన్నీ మన ఉహకందకుండానే మారిపోతుంటాయి.భారతీయ సమాజం ఎట్లా నాశనమవుతున్నదో 'జల్సా ఘర్‌ ','షత్రంజ్‌ కె ఖిలాడి'చిత్రాలలో చూపుతారు.వీటికి పూర్తి అపసవ్య దిశలో తీసిన చిత్రాలు' తీన్‌ కన్యా'',''చారులత'', ''ఘర్‌ బైరే''లు. ఇంకనూ 'మహానగర్‌ ','జనారణ్య','ప్రతిద్వంది' చిత్రాలు కలకత్తా మహా నగరంలోని జీవన శైలిని లోతుగ చర్చిస్తారు.రే చివరి మూడు ''గణశత్రు-శాఖ ప్రశాఖ-అగంతక్‌ ''చిత్రాలలో తన తొలినాటి చిత్రాలలోకన్నా రెండడుగులు ముందుకు వేసి బాధామయ సన్నివేెశాలను మరింత ఆర్ద్రంగ చూపుతారు. ఇంకా చరిత్ర,సైన్స్‌ ,కాల్పనికత, ఇతిహాసాలతో మరికొన్ని సినిమాలు తీయాలను కున్నా ఆయనకు సరైన వనరులు వసతులు సమకూరలేదు.ఆయనేప్పుడూ ఏక కాలంలో రెండు సినిమాలు తీయలేదు.1955 నుండి 1979 వరకు24 ఏళ్ళలో ఏడాదికొకటి చొప్పున 24 సినిమాలే తీయడంలో ఆయన నిబద్ధత కనిపిస్తుంది.ఇదే విషయాన్ని మరింత విపులంగా తన ''అవర్‌ ఫిలింస్‌ దెయిర్‌ ఫిలింస్‌ '' పుస్తకంలో ఇలా రాసుకున్నారు-''వరుసగా రెండు సినిమాలు తీయడానికి నేను ఏమాత్రం ఇష్టపడను.జీవితంలోని వివిధ పార్శాల మీద దృష్టి సారించడానికి ఇష్టపడతాను.చరిత్రలోని పలు కాలాలను,చిత్రీకరణలోని పలు పద్ధతులను పరిశీలిస్తూ నిర్మాణపరంగా వైవిధ్యాలను అనుసరించడమంటే నాకు చాలా ఇష్టం.''
       సత్యజిత్‌ రే చిత్ర నిర్మాణంలో ప్రాచీన అర్వాచీన శైలులకు నడుమ తనకు తానొక సేతువుగా వ్యవహరిస్తాడు. ఇదే ఆయనలోని ప్రత్యేకత.ఇందుకుఉదాహరణగా ఆయన తీసిన''చారులత''ను చెప్పుకోవచ్చు.ఇది ఆయనకు నచ్చిన స్వీయ చిత్రంకూడా.ఈ చిత్రంలో భూస్వామ్య వ్వవస్థలో స్త్రీల జీవన స్థితిగతులను కథగాచూపుతారు.ఇందులో చారులత తన సంకుచిత ప్రపంచాన్ని పుస్తక పఠనంతో విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది.ఇందులో దర్శకుడిగా రే ప్రగతిశీలమైన ఆలోచన మనకు కనిపిస్తుంది.అట్లానే ''మహానగర్‌ ''లోస్త్రీల ఆలోచనను మరో నాలుగడుగులు ముందుకు వేయిస్తారాయన.ఇందులో భర్తకు నౌకరి పోతుంది.దాంతో ఆమె తానే ఉద్యోగం చేసి కుటుంబాన్ని నడపించాలనుకుంటుంది.కానీ స్త్రీ విమోచన సిద్ధాంతం ఆచరణలోకి వచ్చేసరికి అది అంత సులభం కాదని తెలిసి పోతుంది.అలా తన చిత్రాలలో రే స్త్రీల రూపు రేఖలకు అందానికి ప్రాధాన్యత నివ్వడంతో బాటు స్వతంత్రంగ,ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయని కూడా నిరూపిస్తారు.ఇందుకు ఉదాహరణగా 'అశాని సంకేత్‌' చిత్రాన్ని చెప్పుకోవచ్చు.చివరి చిత్రం ''అగంతక్‌ ''లో మధ్యతరగతి అనుమానాలు, అసహనాల నుండి మమతా శంకర్‌ బయటపడిన తీరు రే ప్రతిభకు అత్యుత్తమ నిదర్శనం.
       ఈ నేపధ్యంలో సత్యజిత్‌ రారు దేవి (1960), తీన్‌కన్యా (1961) కాంచన్‌ జంగా (1962), మహానగర్‌ (1963), చారులత (1964), కాపురుష్‌ ఓ - ఓ మహాపురుష్‌ (1965), నాయక్‌ (1966) చిడియా కానా (1967), గోపీగానే భఘు గానే (168), అరణ్యేర్‌ దిన్‌ రాత్రి, ప్రతిద్వంది, సీమాబద్దా (1971), అశాని సంకేత్‌ (1973) సోనార్‌ కెల్లా(1974), జనారణ్య(1975) షత్రంజ్‌ కె ఖిలాడి (హిందీ), జోరు బాబా ఫేలూనాథ్‌ (1978) హీరేక్‌ రాజ్యార్‌ దేశే (రత్నాల రాజ్యం 1980), పికూ, సద్గతి(1981), ఘర్‌ బైరే (1984), గణశత్రు (1989), శాఖ ప్రశాఖ (1990), అగంతక్‌ (1991)లతో సహా మొత్తం 27 కథా చిత్రాలు తీశారు. ఇంకా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సిక్కిం, ఇన్నర్‌ ఐ, బాల, సుకుమార్‌ రే అనే డాక్యుమెంట రీలను కూడా తీశారు.
       రే తీసిన ప్రతి చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవార్డులం దుకున్నవే. చిడియాకానా, జనారణ్య సోనార్‌ కెల్లా చిత్రాలకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, జనారణ్య, గణశత్రు, జోరు బాబా ఫేలూనాథ్‌, మహానగర్‌ ,నాయక్‌, ప్రతిద్వంది, షత్రంజ్‌ కె ఖిలాడీ, శాఖ ప్రశాఖ, అగంతక్‌ చిత్రాలకు కేంద్రప్రభుత్వ అవార్డులు వచ్చాయి.ఇక రే తన సినిమాలకు అందుకున్న అంతర్జాతీయ అవార్డులు అసంఖ్యాకం సత్యజిత్‌ రే కు వ్యక్తిగతంగా లభించిన అవార్డులూ అసంఖ్యాకమే. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, ఢిల్లీ యూనివర్సిటీ, రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, ఆక్స్‌ ఫర్డ్‌ ,కలకత్తా యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్లు, రామన్‌ మెగసెసె అవార్డు (1967), స్టార్‌ ఆఫ్‌ జెకోస్లొవేకియా, బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌ స్పెషల్‌ అవార్డు, వెనిస్‌ ఫిలిం ఫెస్టివల్‌ స్పెషల్‌ గోల్డెన్‌ లయన్‌ అవార్డు, బ్రిటిష్‌ ఫిలిం ఇన్స్టిట్యూట్‌ ఫెలోషిప్‌, ఫ్రాన్స్‌-రీజియన్‌ డి హానర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మిట్టరాండ్‌ చే డి-హానర్‌ గౌరవం,ప్రత్యేక ఆస్కార్‌, భారతరత్న వంటి పురస్కారాలు ఆయనను వరించి తమ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసుకున్నాయి. భారత ప్రభుత్వం ఆయన పేరున 15 రూపాయిల తపాలా బిళ్ళను విడుదల చేసింది.
       రచయిత, చిత్రకారుడు, దర్శకుడు, సంగీత దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞతో ప్రపంచ సినీ సీమను ఏలిన 1992 ఏప్రిల్‌ 24న మృతిచెందారు. రే భౌతికంగా లేకపోయినా ఆయన చూపిన నవ్య సినిమా మార్గం నేటికీ ఎందరినో ప్రభావితం చేస్తోంది. అందుకే సత్యజిత్‌ రే భారతీయ చిత్ర సీమపై వేసిన ముద్ర అచిరకాలం ఉంటుంది.
       రే కుటుంబం యావత్తూ కళాకారుల నిలయం. తండ్రి సుకుమార్‌ రే బెంగాలీలో బాల సాహిత్యకారునిగా పేరు గడించారు. అయితే 'రే'కు రెండేళ్ళ వయసున్నపుడే ఆయన మరణించారు. తాత ఉపేంద్ర కిశోర్‌ రే కూడా చిత్రకారుడు. ఆయన బెంగాలీలో 'సందేశ్‌' అనే బాలల పత్రికను నిర్వహించేవారు. అలా తండ్రి తాతల నుండి పుణికిపుచ్చుకున్న సాహిత్య, చిత్రకళలతో బాటు 'రే' క్రమంగా సినిమాల వైపు తన దృష్టిని మరల్చారు.
    ఒక నిరుద్యోగికి ఆనుకోని విధంగా పోస్టర్లు అతికించే ఉద్యోగం దొరికినా ఆ ఉద్యోగం సైకిల్‌ ఉన్నవారికే ఇస్తామని షరతు పెట్టడంతో ఇంట్లో చిల్లిగవ్వలేక పెళ్ళాం దుస్తులు, ఇంట్లోని సామానులు అన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముతో సైకిల్‌ కొని ఉద్యోగం సంపాదించుకుంటే రెండు రోజులకల్లా ఆ సైకిల్‌ నెవరో దొంగిలించుకు పోతారు. సైకిల్‌ పోగొట్టుకున్న యువకుడు, అతని ఐదేళ్ళ కొడుకూ సైకిల్‌ కోసం వెదుకుతుండగా నాటి యూరప్‌ నగరాల దారిద్య్రాన్ని ఆ ఐదేళ్ళ కుర్రాడి కళ్ళతో మనకు 'డిసికా' బైసికిల్‌ థీవ్స్‌ లో చూపిస్తడు.'రే'
    'పథేర్‌ పాంచాలి'ని తెరకెక్కించడంలో 'రే' ఎదుర్కొన్న అవాంతరాలు, కష్టాలు, అన్నీ ఇన్నీ కావు. అప్పటి వరకు తను సేకరించిన సొమ్ము తొమ్మిదిన్నరవేలు ఎక్కడా సరిపోలేదు. సినిమా షూటింగ్‌ అప్పుడప్పుడూ ఆగిపోయేది. ఒక దశలో యూనిట్‌ సభ్యులకు తిండి పెట్టేందుకు కూడా డబ్బులు కరువయ్యేవి. దాంతో 'రే' తన భార్య 'విజయ' నగలు తాకట్టు పెట్టాడు. ఈ విషయాన్ని 'రే' 1958లో న్యూయార్క్‌ లోని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
    సత్యజిత్‌ రే మార్గంలో బుద్దదేవ్‌ దాస్‌ గుప్తా, గౌతం ఘోష్‌, ఆదూర్‌ గోపాల కష్ణన్‌ , అరవిందన్‌, శ్యామ్‌ బెనెగళ్‌ , గోవింద్‌ నిహలానీ, గిరీష్‌ కర్ణాడ్‌ , షాజీ కరుణ్‌, బి.నరసింగ రావు, జుహ్నూ బారూవా, పఠాభి, గిరీష్‌ కాసరవళ్ళీ, ఎం.టి. వాసుదేవనాయర్‌ , ముజఫర్‌ అలీ, అమోల్‌ పాలేకర్‌ వంటి ఎందరో దిగ్దర్శకులు పయనించి కళాఖండాలన దగిన చిత్రాలు తీసి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
    రే భౌతికంగా లేకపోయినా ఆయన చూపిన నవ్య సినిమా మార్గం నేటికీ ఎందరినో ప్రభావితం చేస్తోంది. అందుకే సత్యజిత్‌ రే భారతీయ చిత్ర సీమపై వేసిన ముద్ర అచిరకాలం ఉంటుంది.
- హెచ్‌.రమేష్‌ బాబు, 7780736386

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.