Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సల్లంగా...ఉండు తల్లీ ! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • చైల్డ్ హుడ్
  • ➲
  • స్టోరి

సల్లంగా...ఉండు తల్లీ !

Sat 01 May 20:01:48.319735 2021

నాన్న పని మీద బ్యాంకుకు బయలుదేరుతున్నారు. మాకు స్కూల్‌ కు సెలవు కావడంతో వస్తానన్నాను. ఎందుకమ్మా మిహిరా ! పదోతరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అన్నారు. అందులోనూ ఎండలు మండిపోతున్నాయి. నాన్నా .. ప్లీజ్‌ వస్తాను అన్నది. అమ్మ కూడా తననే సమర్థించంటంతో ఇక తప్పదన్నట్లు తండ్రి మిహిరను టూవీలర్‌ మీద ఎక్కించుకొని బ్యాంకుకు బయలుదేరారు. నేను బండి మీద కూర్చున్నానే కానీ నా మనసంతా బ్యాంకు చుట్టూ తిరుగుతుంది. బ్యాంకు ఎలా ఉంటుంది ? అక్కడ ఏం చేస్తారు ? అన్న ఆలోచనలే నన్ను వెంటాడాయి. ఇంతలోనే మా వెహికల్‌ బ్యాంకు దగ్గర ఆగింది. నాన్న బండి స్లో చేయగా నేను దిగాను. బండిని పార్కింగ్‌ ప్లేసులో నిలిపి వచ్చిన అనంతరం ఇద్దరం బ్యాంకు లోపలికి నడిచాం. నాన్న అన్నయ్యకు డబ్బులు పంపాలని లైనులో నిలబడ్డారు. నేను ఓ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చొన్నాను. నాకు బ్యాంకుకు రావడం అదే ఫస్ట్‌ టైం. లోపల లైట్లు, ఫ్యాన్లు నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. సిబ్బంది కంప్యూటర్ల ముందు కూర్చొని టకటకా పని చేస్తున్నారు. వచ్చే పోయే జనాలతో బ్యాంకు సందడిగా ఉంది. నేను నాన్న వైపు చూశాను. లైన్‌ చాలా పెద్దగా ఉంది. ఇంతలో ఒక వృద్ధురాలు కౌంటర్‌ ముందుకు వెళ్లి సారూ ... వెయ్యి రూపాయలు కావాలంటూ పాసుబుక్‌ ముందుంచింది. క్యాషియర్‌ ఎగాదిగా చూసి ఇలా అడగ్గానే ఇచ్చేస్తామా ... విత్‌ డ్రాయల్‌ ఫాం పూర్తిచేసి పట్టుకురా అన్నాడు. పాపం ఆమెకు అర్థం కాలేదు. ఎలాగోలా విత్‌ డ్రాయల్‌ ఫాం సంపాదించి కనపడిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటుంది. కొందరు ఆమెను చూసి విసుక్కుంటున్నారు. మరికొందరు ముందుగానే ఆమె ఎక్కడ తమ దగ్గరకు వస్తుందోనన్న భయంతో చొక్కా జేబులో కనపడుతున్న పెన్నులను ప్యాంట్‌ జేబులోకి మార్చారు. చదువుకున్న వారు సైతం చదువురాని వారిగా మారిపోయారు. అందరూ అయిపోయినట్టున్నారు. చివరకు నా దగ్గరకు వచ్చింది. పాపా .. వెయ్యి రూపాయలు తీసుకోవాలి. ఇది రాసిస్తే కాని ఇవ్వరట. నేను చదువుకోలేదు. కాస్త రాసి పెట్టవూ అని దీనంగా అడిగింది. నేను భయంతో నాన్న దగ్గరకు పరిగెత్తి నిలబడ్డాను. నాన్న నన్ను చూసి నువ్వు పదో తరగతి చదువుతున్నావు. అందులోనూ ఇంగ్లీషు మీడియం. భయపడకుండా ఇప్పుడే నీ బుర్రకు పదునుపెట్టి రాయి అంటూ పెన్ను చేతికిచ్చారు. నేను వృద్ధురాలి వద్దకు వెళ్లి పాస్‌ బుక్‌, ఫాం తీసుకున్నాను. దాని మీద ఆమె పేరు, అకౌంట్‌ నెంబరు, తేది, బ్రాంచి పేరు, కావాల్సిన నగదు మొత్తం అంకెలు, అక్షరాల్లో రాసి ఆమెకు ఇవ్వటమే కాదు దగ్గరుండి వేలిముద్ర వేయించి ఇచ్చాను. ఆమె నా కళ్ళలోకి చూస్తూ దేవుడు నిన్ను సల్లగా చూస్తాడు ... సల్లంగా ఉండు తల్లీ అంటూ నా తల మీద చెయ్యి వేసి లైన్‌ లో నిలబడటానికి వెళ్లింది. ఆమె నా తల మీద చెయ్యి వేస్తే నన్ను దీవించినట్లే అనిపించింది.
చాలా సంతోషం వేసింది. పరుగున వెళ్లి నాన్నకు చెప్పి ఆనందాన్ని పంచుకున్నాను. అప్పుడు నాన్న కోట్లు సంపాదించినా ఇవ్వలేని ఆనందాన్ని మంచిపని చేసి సంపాదించావు అని మెచ్చుకున్నారు. ఇంతలో మరో నలుగురు నా దగ్గరకు వచ్చి మాక్కూడా రాసిపెట్టమ్మా అన్నారు. నాన్న నావైపు చూస్తూ బెస్టాఫ్‌ లక్‌ మిహిరా అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాము - కుక్కపిల్ల
గీయించిన బొమ్మ
సాధించాలి
నాన్న ఇచ్చిన ఆస్తి
నిర్మల హృదయం
సోమరిపోతు సోమన్న
చదివింది గుర్తుకు రావడం లేదా...?
మిత్రుల తెలివి
వెంకడి వారసుడు
అవ్వను చేరదీసిన మురళి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.