Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమ్మను మించిన ప్రేమ ఏమున్నది లోకంలో... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

అమ్మను మించిన ప్రేమ ఏమున్నది లోకంలో...

Sat 08 May 23:32:04.903119 2021

Mother! My mother
When it midnight, I woke with tears falling on my knee
You knew the pain of your child, My mother.
Your caring hands, tenderly removing the pain
Your love, your care, your faith gave me strength,
To face the world without fear and with His strength. అమ్మ ఇచ్చిన ఆ బలమే ఆయన్ని ఒక గొప్ప శాస్త్రవేత్తగా, భారతదేశ ప్రథమ పౌరుడిగా నిలపెట్టింది అంటూ అబ్దుల్‌ కలాం తన తల్లి గురించి చెబుతారు. ఇలా ప్రతి మనిషి జీవితంలో అమ్మ జ్ఞాపకాలు యేదో ఒక సందర్భంలో గుండెని తాకుతూనే వుంటాయి. అమ్మలో వున్న ఆ ప్రత్యేకత, గొప్పతనం ఏంటి?
మనకు తెలియని ఎంతో ఉంది
''అమ్మ'' అన్న మాటకి నిర్వచనం చెప్పటం అంటే సముద్రాన్ని కమండలంలో ఇమడ్చటానికి ప్రయత్నం చేసినట్టే.. అనేది నా భావన. ''సృష్టి రహస్యం'' గురించి మనం ఎంత తెలుసుకున్నా మనకీ తెలీనిదీ, తెలుసుకోవలసినదీ ఇంకా చాలా వుంటుంది. అమ్మ గురించి కూడా అంతే!
అలసి పోయితి నంతలో కలత దీర
క్యారు క్యారని గుండెలో మారుమ్రోగే
విస్మరించితి బందిన వేదనంబు
నవతరించిన నవ్య భాగ్యమ్ము వలన... దీనినే తల్లి ప్రేమ అంటారు.
అంతే కాదు! బిడ్డకి జన్మ ఇచ్చిన మరునిమిషం నుంచీ ఆమె చేసే ప్రతి ఆలోచనా, వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం వెనకా మనకి కనిపించేది మాతృ హృదయమే! ఆలాంటి మాతృమూర్తుల గురించి మనసుతీరా మాట్లాడు కోవటం కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ ''అంతర్జాతీయ మాతృదినోత్సవం''.
నేపథ్యం మనందరికీ తెలిసిందే...
కని, పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుచేసుకోవటం కోసం మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌గా పిలవబడే ''రియా'' దేవతకు నివాళలు అర్పించే నేపథ్యంలో మొట్టమొదటి సారిగా గ్రీస్‌ దేశంలో ఈ ఉత్సవం ప్రారంభించబడిందనేది ఒక కథనం. అలాగే పాత్యాశ్చ దేశాల్లో పిల్లలు చిన్న వయసులోనే తల్లితండ్రుల్ని వదిలి బయటికి వెళ్లి స్వతంత్రంగా బతికే పద్ధతి వుంది. వాళ్ళు తమ తల్లితండ్రులతో ఓ రోజన్నా సంతృప్తిగా, సంతోషంగా గడపటం కోసమే మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే వంటివి ఏర్పాటు చేసుకోవటం జరిగింది అనేది ఓ వాదన. సివిల్‌ వార్‌ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ''మదర్స్‌ ఫ్రెండ్షిప్‌ డే'' నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్‌ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆమె కూతురు మిస్‌ జర్విస్‌ మదర్స్‌ డే గురించి చేసిన ప్రచారం కారణంగా 1911, మే 9న అమెరికాలోనీ అన్ని రాష్ట్రాలు దీనిని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 1914లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ ఉడ్రో విల్సన్‌ మాతృదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనీ చెప్పటమే కాకుండా, ఆ రోజునీ జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించటం జరిగింది.
కేవలం జన్మ ఇవ్వడం వల్లే కాదు
కేవలం జన్మ ఇవ్వడం వల్లే అమ్మకి అంత గొప్ప స్థానం ఇవ్వలేదు. జన్మ ఇచ్చింది మొదలు వాళ్ళని ఓ మనిషిగా తీర్చిదిద్దే వరకూ ప్రతి దశలో అమ్మలు వాళ్ళకి తమ సహకారం అందిస్తారు. ఆ ప్రక్రియలో చాలా మంది అమ్మలు తమని తాము కోల్పోతారు. దాదాపు ఒకటిన్నర శతాబ్దం నుంచి చాలా మంది అమ్మాయిలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా ఏంతో అండగా నిలుస్తున్నారు. అంతమాత్రాన ఉదయం లేవగానే వాళ్ళ చేతికి ఒక కప్పు కాఫీ అందిస్తారనుకోవటం, పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయటం, లంచ్‌ బాక్స్‌ పెట్టటం సాయంత్రం వాళ్ళ చేత హోంవర్క్‌ చేయించటం వంటి పిల్లల బాధ్యతల్లో మగవారి భాగస్వామ్యం వుంటుంది అనుకోవటం మాత్రం పొరపాటే. ఒకవేళ ఉన్నా తక్కువ శాతం మందిలో ఉంటుంది.
మనందరికీ తెలిసిన మరో విషయం...
రోజువారీ కూలీ మీద ఆధారపడి బతికే నిరుపేద కుటుంబాల్లో 90శాతం కుటుంబాలు స్త్రీల సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాయి. మగవాళ్ళు సంపాదించినా, ఆ డబ్బులు వాళ్ళ తాగుడికి, ఇతర వ్యసనాలకు ఖర్చు చేయటమే కానీ ఇంటికోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా తక్కువ. అందుకే ఆ కుటుంబాల్లో పిల్లల పోషణ, వాళ్ళ బట్టలు, చదువులు, పుస్తకాలు ఇవన్నీ కూడా తల్లి బాధ్యతే అవుతోంది. దానికోసం పది రూపాయలు వస్తాయంటే అదనంగా కష్టపడతానికి కూడా ఆ అమ్మలు సిద్ధపడుతున్నారు.
తల్లుల బాధ్యత మరింత పెరిగింది
కొన్ని మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడవాళ్లు కూడా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పటం లేదు. ఏ వర్గంలో అయినా కూడా మగవాళ్ళ వ్యసనాలు, పిల్లల పట్ల, కుటుంబం పట్ల వారి బాధ్యతా రాహిత్యం పిల్లల పెంపకంలో తల్లుల బాధ్యతల్ని మరింతగా పెంచుతున్నాయి. విదేశాల్లో వుంటూ, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్స్‌ అవసరం ఈమధ్య కాలంలో ఎక్కువగా వుంటోంది. వారి అవసరాల్ని అవకాశంగా తీసుకొని చాలా మంది మధ్యతరగతి తల్లులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఖండాంతరాలకు వెళుతున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా వెళ్లివచ్చిన కొందరు అమ్మలతో వృత్తి రీత్యా నాకు యేర్పడిన పరిచయమే నేను ఈ వ్యాసం రాయటానికి ముఖ్య కారణం అయింది.
కొన్ని ఉదాహరణలు...
నన్ను కలిసిన అందరి ఆడవాళ్ళ జీవిత అనుభవాలూ దాదాపుగా ఓకే రకంగా ఉన్నాయి. ఉదాహరణకి వసుధ గురించి బ్రీఫ్‌గా చెప్తాను. వసుధ భర్త హరీష్‌ వ్యాపారాల్లో బాగా దెబ్బతిని, అప్పులపాలై ఉన్న ఆస్తినంతా అమ్మేసుకోవల్సి వచ్చింది. అప్పటిదాకా సమాజంలో ఏంతో గొప్పగా బతికిన అతను, ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని చేతకాని వాడిలాగా మిగిలిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దాంతో తీవ్రమైన డిప్రెషన్‌కి గురయ్యి ఏ పనీ చేయకుండా ఇంట్లోనే కూర్చునే వాడు. కాలేజీ చదువులకి వచ్చిన పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. అది భరించలేక వసుధ హరీష్‌తో బయటికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించమని ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. ఆమె అలా చెప్పినప్పుడల్లా ఇంట్లో పెద్ద గొడవ జరగడమే గానీ హరీష్‌ మాత్రం గడప దాటి బయటకి వెళ్ళేవాడు కాదు. ఒక్కొక్క సారి వసుధ మీద చేయి కూడా చేసుకునే వాడు.
''ఈ పోటీ ప్రపంచంలో కనీసం చదువు కూడా లేకపోతే మా భవిష్యత్తు యేమిటి'' అన్నట్టు పిల్లలు చూసే చూపులు వసుధ గుండెని కోసినట్టు వుండేవి. ఈ సమస్యలకి ఇంక తనే ఏదో ఒక పరిష్కారం ఆలోచించి, పిల్లల జీవితాన్ని ఒడ్డున పడేయాలి అనుకుంది. అపుడే ఆమెకి ఆడవాళ్ళని బేబీ సిట్టర్‌ కింద విదేశాలకి పంపే ఏజెన్సీస్‌ గురించి తెలిసింది. విదేశాల్లో మనకి దగ్గర బందువులు ఎవరైనా ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్‌ తీసుకొని మిగిలిన ఏర్పాట్లన్నీ ఏజెన్సీ వాళ్ళే చేస్తారు. అలా వసుధ కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి వాళ్ళ భవిష్యత్తు కోసం ''అమ్మ'' ''ఆయా''గా మారి అమెరికా వెళ్ళింది. అక్కడ ఆమె చేయాల్సిన పనులు పిల్లల్ని చూడటం, వంటావార్పు చేసిపెట్టటం. జీతం నెలకి లక్షకు పైనే వుండేది. కానీ రోజంతా విశ్రాంతి వుండదు. జీతం తీసుకున్నన్ని రోజులూ సెలవనేది ఉండదు. తనకంటూ రూపాయి ఖర్చు ఉండదు. అందుకే వసుధ రెండు మూడుసార్లు అమెరికాలో పనిచేసి రావటం వల్ల పిల్లలు బాగా చదువుకుని మంచిగా సెటిల్‌ అయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా చక్క పడ్డాయి. వసుధ లాగా పిల్లల భవిష్యత్‌ కోసం మనదేశం నుంచి విదేశాలకి బేబీ సిస్టర్స్‌గా వెళ్ళే ఆడవాళ్ళ సంఖ్య ప్రతియేటా గణనీయంగానే పెరుగుతోంది.
అమ్మలు వదిలేయలేరు
పెద్దగా చదువు ఉండదు, అక్కడి భాష తెలీదు, వాళ్లు ఎవరి ఇంట్లో పని చేయాలో ఆ ఇంట్లో ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళో కూడా తెలీదు, ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు వుండదని తెలిసినా తల్లులు తమ మానప్రాణాల్ని కూడా లెక్కచేయకుండా పిల్లల భవిష్యత్‌ కోసం తెగించి వెళుతున్నారంటే అది వాళ్ళు చేస్తున్న త్యాగం అనే చెప్పాలి. ఒక కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది అంటే దాని ప్రభావం కేవలం ఒక్క మగవాడి మీదే వుండదు. కుటుంబ సభ్యులు అందరి మీదా వుంటుంది. వాళ్ళ భవిష్యత్‌ కూడా దాని మీద ఆధారపడి వుంటుంది. అలాంటప్పుడే భార్యాభర్తలిద్దరూ ధైర్యంగా నిలబడి నిర్ణయాలు తీసుకోగలగాలి. అంతేగానీ కష్టాలు రాగానే భార్యాపిల్లల్ని గాలికి వదిలేసి, బాధంతా తనదే అన్నట్టు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు అంటే దానికి కారణం వాళ్ళపై వారికి వుండే మితిమీరిన ప్రేమ (రవశ్రీట షవఅ్‌తీవసఅవరర) అనే చెప్పాలి. పరిస్థితులు ఎలా వున్నా వాళ్ళు తమ గౌరవమర్యాదలకి, కాంఫర్ట్స్‌కి ఇచ్చుకునే ప్రాధాన్యం పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి ఇవ్వరు. కానీ తండ్రులు వదిలేసినట్టు పిల్లల్ని అమ్మలు వదిలేయలేరు కదా !
వాళ్ళు అమ్మలు కదా...
ఇంత కష్టపడినా వాళ్ళకి మిగులుతొంది ఏంటి ? వీళ్లు సంపాదించిన డబ్బు మీద అధికారం మగవాళ్లదే! ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించేదీ వాళ్ళే! ఒక వేళ ఆడవాళ్లు ఏదైనా సలహా ఇవ్వబోతే ''సంపాదించి తెచ్చానన్న అహంకారమా'' అంటూ ఎదురు దాడులు. చాలా మంది మగవాళ్ళు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా ఆమె శీలాన్ని కూడా శంకించటానికి వెనకాడటం లేదు. ఇలాంటి విషయాల్లో సమాజం కూడా మగవారికి వత్తాసుపలకటం అనేది సిగ్గుపడాల్సిన విషయం. నిజానికి ఆడవాళ్లు కూడా మగవాళ్ళ లాగ ''నా పొట్ట నిండితే చాలు. కుటుంబం, పిల్లలు ఏమైతే నాకేంటి'' అనుకుని ఉంటే వాళ్ళకి ఇన్ని అవస్థలు, అవమానాలు పొందాల్సిన అవసరం వుండేది కాదు. కానీ వాళ్ళు ''అమ్మ'' లు కదా! అలా ఆలోచించలేరు.
ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తే పిల్లల్ని పోషించగల ఆర్థిక స్తోమత లేకపోయినా తల్లులు న్యాయస్థానాల్లో పోరాటాలు చేసి మరీ తమ పిల్లల్ని తమ దగ్గరే వుంచుకుంటున్నారు. వారిని భారంగానో, బాధ్యత గానో ఫీల్‌ అవటం లేదు. పిల్లల భద్రతే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ భవిష్యత్‌ కోసం తపన పడటమే కానీ, భవిష్యత్తులో వాళ్ళు మనల్ని చూస్తారా? చూడరా అన్న ఆలోచన కూడా ఆ అమ్మలకి రాదు. అందుకే అమ్మలది ఎప్పుడూ అన్‌ కండిషనల్‌ లవ్వే.
అమ్మలు కోల్పోయిన జీవితం
ఇంత కష్టపడినా పెద్దవయసులో ఒంటరిగా మిగిలిపోతున్న తల్లులు ఎంతో మంది వున్నారు. వీటన్నిటినీ మౌనంగా భరించటం వల్లే చాలా మంది ఆడవాళ్లు ఎన్నో రకాల శారీరక మానసిక రుగ్మతలకిలోనై జీవితంలో ఆనందాన్ని, మనశ్శాంతినీ కోల్పోతున్నారు. సమాజంలో తల్లితండ్రుల్ని పట్టించుకోని పిల్లలు ఎంతమంది ఉన్నారో, తమ తల్లుల త్యాగాల్ని గుర్తుంచుకుని వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకునే పిల్లలు కూడా అంతే మంది వున్నారు. అదెంతో సంతోషించ తగ్గ విషయం. కానీ... ఈ మొత్తం ప్రాసెస్‌లో అమ్మలు కోల్పోయిన జీవితాన్ని, అనుభూతుల్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలమా? బదులు ఇవ్వగలరా?
ఇలా ప్రయత్నిద్దాం...
సమాజంలో, కుటుంబంలో అమ్మల శ్రమకి గుర్తింపు, గౌరవం కల్పించి, ఆమెని ప్రపంచానికి ఓ ఆదర్శ మహిళగా చూపిద్దాం. నిజానికి ఇవన్నీ ఆమె సొంతమే. మనం దోచుకోవద్దు. అప్పుడైనా అమ్మలు మిగిలిన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. అదే వారికి ఈ ''మాతృదినోత్సవం'' సందర్భంగా మనం ఇచ్చుకో గల కానుక.
- అమ్మాజీ గోపలూరి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌


అమ్మ ఉంటే గుండె ధైర్యం..

అమ్మ గురించి చెప్పమంటే ఎవరి మనసైనా ఆర్ద్రమైపోతుంది. దాదాపుగా ప్రతి తల్లి తన పిల్లల్ని కని పెంచడంలో ఎన్నో వదులుకుంటుంది. తనని తాను మర్చిపోతుంది. మా అమ్మ మట్టుకు మేం ఒక వయసుకి వచ్చాక మళ్ళీ తాను చేయాలనుకున్నవి ఎన్నో చేసింది. తన చుట్టూ ఉన్నవాళ్ళని, విద్యార్ధులని, మమ్మల్ని ప్రభావితం చేసింది. అమ్మ డా. పుట్ల హేమలత తన పదమూడవ ఏటనే తొలి కథ ప్రచురించబడింది. ఎన్నో కవితలు రాసింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్ళు ఆమె సాహిత్యానికి దూరమైంది. మళ్ళీ 2010 నుంచి ఆమె కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సొంతగా పుస్తకాలు చదివి నేర్చుకుంది. ఆ ఆసక్తితో 'అంతర్జాలంలో తెలుగు సాహిత్యం' అనే అంశంపై రాజమండ్రిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తొలి పరిశోధన చేసింది. అదే విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ instructor పని చేసింది. తనకిష్టమైన వ్యాసరచనలో ఎంతో కషి చేసింది. మూడు తెలుగు సాహితీ పరిశోధక వ్యాసాల సంకలనాలు ప్రచురించింది. ఎన్నో సాహితీ సభలు నిర్వహించింది. ఎంతోమంది పరిశోధక విద్యార్ధులకు చేయుతనిచ్చింది. ప్రతి స్త్రీ తన గురించి తాను ఆలోచించుకోవాలి, అనుకున్నది సాధించాలి అని అమ్మ ప్రత్యేక్షంగా చేసి చూపించింది. ఆమెతో పోల్చుకునే సాహసం చేస్తే నేను రెండు తరాలు వెనకే ఉన్నాననిపిస్తుంది. చివరి క్షణం వరకూ తను భాగమైన ప్రజాస్వామిక రచయిత్రుల వేదికను హత్తుకునే ఉంది. ఇంటర్నేషనల్‌ పుస్తకాలలో తొలి తెలుగు క్రైస్తవ రచయిత్రిగా చోటు సంపాదించుకుంది.
నాకు ఇంగ్లీష్‌లో బాగా నచ్చే వాక్యం - 'A clean house is a sign of wasted life' నిరంతరం ఇల్లు సర్దుకుంటూ ఉండడం, వంటగదిని బుర్రలో మోసుకుతిరగడం అమ్మ ఎప్పుడూ చేయలేదు. ఇంట్లో అందరం వంట చేస్తాం, ఇంటి పనులు చేస్తాం. అమ్మ పనులకి తన ఇల్లు, కుటుంబం ఎప్పుడూ అడ్డం కాలేదు. అమ్మ లేక రెండేళ్ళు దాటుతుందంటే చెప్పలేని భారమైన వేదన అది. అమ్మకి కూడా చావుంటుందని నమ్మలేని పిచ్చితనం ఇది. ఆమె పోయిన తర్వాత తాను స్థాపించిన తొలి తెలుగు మహిళా సాహిత్య పత్రిక 'విహంగ' ను నేనూ, అమ్మ అనుంగు శిష్యుడు, సబ్‌ ఎడిటర్‌ అరసిశ్రీ పూర్తి బాధ్యతలు తీసుకున్నాం. ఈ పత్రికను 2011లో ప్రారంభించింది అమ్మ.
అమ్మ 2019లో నన్ను ఒంటరి పక్షిని చేసి గూడు వదిలి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎంత అధైర్యం, గుబులు పట్టుకుందో చెప్పలేను. ఉన్నన్నాళ్ళు నేను నిశ్చింతగా ఉన్నానన్న విషయమే తెలియలేదు. అదశ్యమైతేనే అమ్మ అర్ధమౌతుందంటే ఏ కూతురు తట్టుకోగలదు? అమ్మని, తన భావజాలాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నంలో ఆమె పేరు మీద స్మారక పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించాం. ఇప్పటి వరకు హేతువాద లక్ష్మీ, పద్దమ్‌ అనసూయ, రజిత కొమ్ము, నస్రీన్‌ ఖాన్‌, నేలపూడి సమీర, యాకమ్మ తాళ్లపల్లికి డా. పుట్ల హేమలత స్మారక పురస్కారాలను ప్రదానం చేశాం. వీళ్ళంతా రచయిత్రులు, పాత్రికేయులు, ఆలోచనాపరులు. అన్నం పెట్టే అమ్మ ప్రతి స్త్రీలో ఉండవచ్చు కానీ స్త్రీలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని తపించే అమ్మ ఉండడం ఒక గొప్ప అనుభూతి. నువ్వు ఉన్నప్పుడు గుండెల నిండా ఏదో ధైర్యాన్ని ఇచ్చిన ఈ మదర్స్‌ డే, విమెన్స్‌ డేలు ఇప్పుడు ఒంటరి దుఖంతో వెలవెలబోతున్నాయి మా. ఇప్పుడు ఎవరికని థాంక్స్‌ చెప్పుకోను? నిన్ను తలచుకుంటూ గడపడం తప్ప.
- మానస ఎండ్లూరి


వ్యక్తిగత జీవితం అమ్మ నుంచే...

మా అమ్మ దాసరి శిరీష... ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఒకటి ఉంటుందని తెలియకుండానే నేర్పింది. తను ఉద్యోగం చేసింది. అందరు అమ్మల్లా సెలవురోజుల్లో వంటగదిలో పడి ఆవకాయ, మురుకులూ అంటూ సమయాన్ని పాడు చేసుకోకుండా తన రచనలు రాయడం, పుస్తకాలు చదవడం, సంగీతాన్ని వినడం, మంచి స్నేహితులను సంపాదించుకోవడం మీద సమయాన్ని పెట్టింది. మాకు పుస్తకాలని, పాటలని అలవాటు చేసింది. ఈ రోజు నేను కథలు రాస్తున్నాను అంటే అది ఆమె నన్ను ప్రభావితం చేయడం వలనే. దయ, కరుణ, సింప్లిసిటి కూడా ఆమె నేర్పినవే. నేను చాలా గర్వపడే ఒక incident ఉంది. నా టీనేజ్‌లో మా పక్కింట్లో ఒకరిద్దరు ఆడవాళ్ళుండేవాళ్లు. వారి గురించి జనాలు చెవులుకొరుక్కునే వాళ్లు. ఆ ఇంట్లో మగాయన ఉన్నట్లుండి చనిపోతే ఎవరూ సాయానికి రాలేదు. అమ్మ మాత్రమే వచ్చి ప్రభుత్వ వాహనాన్ని పిలిపించింది. ఆ డ్రైవరు ఆ ఇంటామెతో మొరటుగా మాట్లాడబోతే గట్టిగా నుంచుని దెబ్బలాడింది. చుట్టూ ఎంతమంది మగవారున్నారో! అందరూ ఆ పక్కింటాయన మీద నిందలేసేవారే గానీ సాయానికి మాత్రం మా అమ్మే ముందుకు వచ్చింది. అమ్మలు మాతత్వానికన్నా ఎక్కువగా ధైర్యంగా నిలబడడం నేర్పించాలి తమ ఆడపిల్లలకు.
- అపర్ణ తోట
తల్లుల్ని బతికించుకుందాం
తల్లి అంటే ప్రకృతి. తల్లంటే ప్రాణదాత. తల్లి లేకుండా ప్రపంచం లేదు. యివ్వాళ ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా మానవ సంవ్యాప్తమైన అనేక అంశాలపై సెలబ్రేట్‌ చేస్తున్నా, దానిలో విశిష్టమైనది, ప్రత్యేకమైనది మాతృదినోత్సవం. అందుకే యునైటెడ్‌ స్టేట్స్‌ వాళ్లు కూడా మదర్స్‌ డేను సెలబ్రేట్‌ చేస్తున్నారు. ప్రకృతిని ధ్వంసం చేసిన కార్పొరేట్‌ కాలుష్యాల నేపథ్యంలో యివ్వాళ కరోనా మారణ హోమం సృష్టిస్తుందని చెప్పాలి. ప్రకృతి మాతను, పర్యావరణ ధ్వంస నేపథ్యాలుగానే ఈ భయంకరమైన వైరస్‌ వ్యాపిస్తోంది. తల్లి లేకుంటే పిల్లలు లేరు. సమస్త కోటి ప్రాణులకు తల్లే జీవం. జీవి రక్షణకు తల్లే పునాది. తల్లి లేని పిల్ల మనలేదు. అది పశువు, పక్షి, చెట్టు పుట్ట సమస్త జీవజాలమంతా తల్లి సంరక్షణలోనే బతికి బట్టకడుతుంది. అందుకే మానవ ప్రపంచంగా చూస్తే... తల్లి లేని ప్రపంచాన్ని, సమాజాన్ని, కోణాన్ని వూహించలేము. యునైటెడ్‌ స్టేట్స్‌ పిల్లల సంరక్షణ, ఆరోగ్యము, భద్రత తల్లుల పరంగా చూపి బాధ్యత పెట్టినా... యిది సమాజాల, దేశాల బాధ్యతగా చూడాలి. పిల్లల సంరక్షణ బాధ్యత కేవలం తల్లులదిగా కాకుండా సమాజాలు, సమూహాలు దేశ బాధ్యతగా పరిగణించాలి. 3వ ప్రపంచ దేశాల్లో తల్లులకు ఆహారలేమి, బలవర్థక ఆహారలేమి వల్ల బాలింతలుగా పురిట్లోనే చనిపోతున్న తల్లులు లక్షలు కోట్లల్లో వున్నారు. యివ్వాళ మదర్స్‌డే సెలబ్రేషన్స్‌ తల్లుల్ని బతికించే సెలబ్రేషన్స్‌ అంతర్జాతీయంగా జరగాలి. యునైటెడ్‌ స్టేట్స్‌ మదర్స్‌డే ని మాల్‌ న్యూట్రిషన్స్‌ ప్రపంచ తల్లులందరికి అందించి, ప్రపంచానికి ప్రాణం పోసే తల్లులు బతికే ఆరోగ్య లక్ష్మీలు ప్రపంచ వ్యాప్తంగా, విస్తృతంగా అమలు జరిగేట్లు చూడాలి. ఇవన్నీ మారుమూల ఆదివాసీ గ్రామాల దాకా చేరాలి. తల్లి సంరక్షణ అంటే సమాజ రక్షణ సమాజ పరిరక్షణ. సమాజానికి రక్తమాంసాలందించే తల్లుల్ని బతికించుకుందాం.
- జూపాక సుభద్ర


పవిత్ర యజ్ఞం

అందమైన కలలకు
మధురమైన అనుభూతులకు
ప్రతిరూపమే మాతత్వం

పండంటి బిడ్డకు
జన్మనివ్వడానికి
తన జన్మను సయితం
ఫణంగా పెట్టగల
త్యాగమే మాతత్వం

నవమాసాల
పరమ పవిత్రమైన
యజ్ఞఫలమే మాతత్వం

పురిటి వాసనలతో పులకరిస్తూ
భాషకందని భావాలతో
తన బిడ్డను పలకరిస్తూ
తన జన్మ సార్ధకమయ్యిందని
ఉప్పొంగే ఉత్సాహమే మాతత్వం

మమతల్ని రంగరించి
మురిపాలను స్రవించి
పసివాడి ఆకలి తీర్చుతూ
తాను పొందే తన్మయత్వమే
మాతత్వం

బుడి బుడి నడకల్ని
పసివాడి బోసి నవ్వుల్ని
వచ్చీ రాని మాటల వయ్యారాల్ని
తలచుకుంటూ అనుభూతుల్లో రమించే
తల్లుల అద్భుత స్వానుభవమే
మాతత్వం
- యం యస్‌ రాజు

అమ్మ కదా అంతే...
శిశువు తొలిరోదన నుంచి ఎవరైనా గమనించారా! 'మ్‌.. ఆ.. మ్‌.. ఆ..' అని ధ్వనిస్తుంది. తెలుగు తమిళ్‌ కన్నడలో అమ్మ అన్నా, పంజాబ్‌లో మా అన్నా, బెంగాలీలు 'మాయీ' అన్నా చూడండి మతం ప్రాంతం భాషలకు అతీతంగా తల్లిని సంబోధించేందుకు 'మ' అన్న శబ్దం కచ్చితంగా ఉంది. చివరకు ఆంగ్లంలో కూడా మామ్‌ లేక మదర్‌. ఇందులోనూ మ శబ్దం. భలే కదా! ఇకపోతే ఈ మదర్స్‌ డే లు, ఫాదర్స్‌ డే లు జరుపుకోవటం పట్ల మన సంస్కతి కాదు వంటి అనేక చర్చలు జరిగే ఉన్నాయి. కానీ, ఇలాంటివి వేడుకగా చేసుకోవటం ఈనాటి అవసరం అనే అనిపిస్తుంది. ప్రపంచమంతా కుగ్రామం అయిపోయి మనుషులు సాంకేతికంగా ముందుకు పోయాక, తల్లిదండ్రుల వద్ద ఉండే బతుకుతెరువులు ఏవీ లేవు. దూరం వెళ్ళాల్సిందే. చిన్న కుటుంబాలు తయారై ఒక్కరోజు పెద్దవాళ్ళు వస్తే భారంగా భావించి ఆదరించలేని స్థితులు ఎక్కువయ్యాయి. వద్ధాశ్రమాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక్కరోజైనా అమ్మ కష్టాన్ని త్యాగాన్ని గుర్తు చేసుకోవటాలు, అమ్మతో కాసేపు గడిపి వెళ్ళటాలు, ఎక్కడ ఉందో తెలియని అమ్మ ఫోటో ఒకటి వెతికి ప్రొఫైల్‌ పెట్టుకోటాలు లాంటివి మంచిదే కదా!
అసలీ మదర్స్‌ డే ల వెనక ప్రపంచ యుద్ధాల నాటి గొప్ప చరిత్ర కూడా ఉంది. గూగుల్‌ చేస్తే చాలా సమాచారం తెలుస్తుంది. తల్లికి, మాతత్వమనే ఉద్వేగానికి విలువ ఇస్తూ ఈ రోజును జరుపుకోవాలని నిర్ణయింపబడింది. ప్రపంచంలో ప్రతి దేశమూ ఆ భావనను గౌరవిస్తూ. ఈ రోజును ఓన్‌ చేసుకున్నాయి. మన దేశంలో మే రెండవ ఆదివారం మదర్‌'స్‌ డే గా నిర్ణయించి జరుపుకుంటున్నాం.
తన చిన్ని బొజ్జలో మనను తొమ్మిది నెలలు మోసి ఈ లోకానికి తొలి ఆహ్వానం పలుకుతుంది అమ్మ.
అమ్మే ఆది గురువు.
ఆమే మొదటి స్నేహితురాలు.
లలితలాలిత్యంగా తల నిమురుతూ బుదరించి చెప్తుంది ఒక అమ్మ. బెత్తం చేతిలో పట్టుకుని వాయిస్తూ బడికి తోలుతుంది మరో అమ్మ. అమ్మల స్వభావాలు వేరైనా, వాళ్ళ అంతిమ లక్ష్యం తమ సంతానం శ్రేయస్సే. తొలి గురువు తొలి స్నేహితురాలే కాదు ఆమె తొలి ప్రొటెక్టర్‌. మనకేమన్నా గాయమైతే తనకే అయినంత విలవిల్లాడుతుంది. పిల్లల ఇష్టాలకు వకాల్తా పుచ్చుకుని వాదించే లాయర్‌ కూడా తను. పిల్లల కోసం తను పోషించని పాత్రే లేదు జీవితంలో. పొరపాటున పిల్లలు దూరమైతే ఆమెలోన అనంతమైన దుఃఖ నదై ప్రవహిస్తుంటుంది. అమ్మ కదా అమ్మ అంతే.
వ్యక్తిగతంగా మా జీవితంలోనూ అమ్మ ప్రభావం చాలా ఎక్కువ. మాకు ఊహ తెలియని వయసులోనే మా నాన్న మరణించటంతో, ఆయన ఉద్యోగం, మా ముగ్గురి బాధ్యత అమ్మ పైనే. మా గురించి ఎంతలా ఆలోచించేదంటే.. ముస్తఫానగర్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ లోని ఆఫీస్‌ కు ఆటో కు మూడు రూపొయలు. ఆ మూడు రూపాయలు మిగిలిస్తే పిల్లల కు ఏమన్నా కొనొచ్చు అనుకునేదీ. నడిచి వెళ్ళేది. ఇప్పటికీ అంటుంటారు తెలిసిన వాళ్ళు జానకీదేవి గారితో నడవలేమమ్మా అని. ఆమె త్యాగాల శిథిలాల్లో ఇది ఓ ఉదాహరణ మాత్రమే. సమాజం నోటిని జీవితాన్ని ఏకకాలంలో ఈదింది. అమ్మ కదా అమ్మ అంతే.
అమ్మంటే ఏం నిర్వచనాలు ఇవ్వగలం కొత్తగా.
దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సష్టించాడు అంటుంటారు.
నేనంటాను.. భూమి విస్తరించిన మేరా అమ్మ ఆవరించి ఉంది అని.
ఆమె వాత్సల్యం ఆకాశమంత
ఆమె అనురాగం సముద్రం అంతకుమించి.
- ఫణిమాధవి కన్నోజు

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.