Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మనసున మోగే 'మధురమై'న పాట | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • మ్యూజిక్ లిటరేచర్
  • ➲
  • స్టోరి

మనసున మోగే 'మధురమై'న పాట

Sun 30 May 14:42:00.082579 2021

ప్రేమించే వయసు వచ్చాక యువహృదయాల్లో చెలరేగే తలపుల ప్రవాహానికి అంతు ఉండదు. కొత్త కొత్త కోరికలు, ఏవేవో తెలియని అనుభూతులు, వింత వింత పరవశాలు.. ఇలా ఇవన్నీ ప్రేయసీ ప్రియుల హదయాలను గిలిగింతలతో ముంచెత్తేవే. తనను చేరిన తోడు తన జీవితంలో తెచ్చిన కొంగ్రొత్త మార్పుకు.. ప్రేయసి, అలాగే - తనను చేరిన నీడ తన మనసున కలిగించిన సరికొత్త సంతోషానికి.. ప్రియుడు - ఒకరికొకరు రుణపడిపోతుంటారు. ఇదే ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఈ అనురాగపు తీయందనాలకు ప్రతీకగా, ఈ రుణానుబంధానికి సంకేతంగా నిలిచిన అద్భుతమైన పాటను 'నిశ్శబ్దం' (2020) సినిమాలో 'శ్రీజో' రాశాడు.
ప్రియుడి రాక వల్ల ప్రేయసి జీవితంలో కలిగిన మార్పు ఆమె ఉజ్జ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. అది మధురాతిమధురంగా ఆమెకు తోస్తుంది. అందుకే నీ రాక వల్ల మనసున ఏదో తెలియని పరవశం చెలరేగిందని, అది మధురంగా ఉందని, మొట్టమొదటిసారిగా ఎదని హాయిగా తాకే మేలుకొలుపు స్వరాన్ని విన్నానని, ఆ స్వరం నీదేనని, అది నీ హదయం నుంచి ప్రయాణమై నన్ను చేరిన మహిమ అని ప్రేయసి ప్రియునితో తన అనుభూతిని తెలియజేస్తుంది.
ప్రియునితో ప్రేయసి చేసే ఈ స్నేహం, సాగించే ఈ ప్రయాణం తనకు తననే కొత్తగా చూపించిందట. అది అరచేతిలోకి ఆకాశాన్ని దించినంత కొత్తగా.. అరచేతిలో ఆకాశాన్ని చూపించడం అసాధ్యమే. కాని అతనితో చేసే వలపు ప్రయాణం ఆకాశాన్ని అరచేతుల్లో దింపుకునేంతటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, అంతటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందని ఇక్కడ అర్థం. కలలన్నీ రంగు రంగుల విన్యాసాన్ని తెలిపాయి. జీవితం సంతోషాల వెల్లువలో పరుగులెత్తుతుంది. ఇదంతా నీ చెలిమి మాయేనని ప్రేయసి ప్రియునితో అంటున్న మాటలివి.
నీతో కలిసి చేసే ఈ ప్రయాణం నేనడగని ఒక వరం. నేను కోరకుండానే అది నన్ను చేరింది. స్నేహమంటే ఇంత అందంగా ఉంటుందా? అని అనిపిస్తుంది. నాకు ఒక కొత్త జన్మ ఎదురైందా? నేను కొత్తగా మళ్ళీ పుట్టానా? అన్నంత హాయిగా ఉన్నానని, నాలోని మౌనమంతా ఒక కావ్యమై నేడు కరిగింది వినమని..అంటూ ప్రేయసి తన భావనను వినిపిస్తుంది.
ఆమె పొందిన పరవశాన్నే ప్రియుడు కూడా పొందుతున్నాడు. ఆమె తలపులతోనే బ్రతుకుతున్నాడు. అందుకే.. నీ హదయం సముద్రమైతే, నా ఇల్లు మేఘాల్లో ఉంది. అప్పుడు నా ప్రణయం చినుకై నీ వైపు చేరుతుంది. నీలో కలుస్తుంది. నీ కదలిక ఓ గానమైతే, దానికి నా ఊపిరే గమకమౌతుంది. అది నీ ప్రాణమై స్పందిస్తుంది. నిజానికి నువ్వు అంటే నేనే. ముమ్మాటికీ అది నిజమే. మనసు ఒకటై, మనమే ప్రేమై కలకాలం జతగా, హాయిగా కలిసి ఉండిపోవాలి. అంటూ ప్రియుడు తన ఎదలోని ప్రేమమాధుర్యాన్ని ప్రేయసితో పంచుకుంటాడు.
చాలా చక్కనైన పదాలతో, చిక్కనైన భావాలతో సాగిన పాట ఇది. అందమైన ప్రేమబంధానికి భాష్యం చెప్పిన పాట ఇది. ప్రేయసీ ప్రియుల హృదయాల్లోని ప్రేమను ఎంతో సున్నితంగా ఆవిష్కరించిందీ పాట..
పాట
మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే
తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలుపే స్వరమే విన్నా
అది నీ ఎద నుండి పయనమై నన్ను చేరే మహిమ..
అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమే
వర్ణాల విన్యాసం తెలిపె కలలే
నీతోటి సావాసం నేనడగనీ వరమే
ఇంత అందమా స్నేహం..
నీతో కొత్తలోకం ఊహించనిదే
మరుజన్మై ఎదురైతే నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని..
కడలేమో నీ హదయం మేఘాన నా నిలయం
ప్రవహించే నీ వైపే చినుకై ప్రణయం
నీ కదలికే గానం నా ఊపిరే గమకం
స్పందించే నా ప్రాణం..
నువ్వంటేనె నేను..అంటే నిజమే
మనసొకటై అది మనమై ప్రేమై కాలమంతా ఉండిపో గుండెల్లో జతపడి..
- తిరునగరి శరత్‌ చంద్ర,
6309873682

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కల'వరమై'న పాట
స్నేహబంధమై నిలిచిన పాట
ప్రేమానుభూతియై పరిమళించిన పాట
సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట
లోకం గుట్టును విప్పి చెప్పిన పాట
భారతజాతికి జైకొట్టిన పాట
ప్రపంచ పోకడల పంచపదులు...
మనసు తెరకు కొత్తరంగులద్దిన పాట
పరవశింపజేసే మనసు పాట
గిలిగింతలు పెట్టే ప్రేమ పాట

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.