Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బోనాలు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

బోనాలు

Sun 11 Jul 05:55:16.12637 2021

బోనాల పండుగొచ్చిందంటే ఊరంతా సందడి సందడిగా మారిపోతుంది. సందడి అంటే మనుషులు కూడటం, దేవతకు నైవేద్యం పెట్టడం, డప్పు కొట్టడం, పసుపూ కుంకుమలు పూదిచ్చి, వేప మండలు కట్టి కడవలను తలపై పెట్టుకుని గుంపులు గుంపులుగా స్త్రీలు పురుషులు అమ్మోరు ఆలయాలకు వెళ్ళడం, కోడినో, మేకపోతునో ఇచ్చి ప్రాణాలకు రక్షణ కల్పించమని మొక్కడం, వేడుకోవడం, నా చిన్నతనంలో రంగులద్దిన రథాలు కదిలిపోతున్న దృశ్యంలా కనపడేది. పిల్లలుగా మా కన్నులు పండుగ చేసుకునేవి.
     బోనాలంటే భోజనం. దేవతకు అన్నం వొండి ఊరేగింపుగా తీసుకెళ్ళి అర్పించడం చేస్తారు. అమ్మ చెప్పేది, 'ఆషాడంలో వచ్చే ఈ పండుగలప్పుడు ఓ కోడిని అమ్మోరుకు అర్పిస్తే మన ఆరోగ్యాలు పాడవకుండా కాపాడుతది బిడ్డా' అని. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారమిది. ఈ బోనాల పండుగను ఎక్కవగా పేదలు, మధ్య తరగతి ప్రజలు జరుపుకుంటారు. అగ్రవర్ణాలు, ధనిక వర్గాలు జరుపుకోగా నేనయితే చూడలేదు. దేవత అవసరం పేదలకే ఎక్కువ. ఎందుకంటే, కష్టాలు చుట్టుముట్టేది ఎక్కువగా వాళ్ళనే కదా! అనారోగ్యాలు వాళ్ళనే వెంటాడుతాయి. మృత్యువు కబళించేదీ వారినే.
     కష్టాలు, కడగండ్లు, భయాలు మొదలైనప్పటి నుండే దేవతల అవసరం ఆరంభమయిందనేది మనం ఎప్పుడూ చెప్పుకుంటున్న విషయమే. 'నేనున్నాను, అన్నీ చూసుకుంటాను' అనే ఒక భరోసా మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత శక్తిని నింపుతుందో! అట్లా మనల్ని కాచేవాడు ఒకడున్నాడు. మనం వేడుకోవడమే చేయాల్సింది అన్న తలంపు అనాదిగా ప్రజల జీవనంలో కొనసాగుతున్నది. ఆ సందర్భానికి కొన్ని పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లలోనూ ఉన్నత వర్గాల వారు పెట్టుకునేవి, నిమ్న వర్గాలు ఏర్పాటు చేసుకున్నవి వేరువేరుగా వుంటాయి. ఉన్నత వర్గాల్లో వ్రతాలుంటాయి. పేదవాళ్ళ ఇళ్ళల్లో నోములంటారు. అభిషేకాలు, అర్చనలు ఒక వైపు మొక్కులు ముడుపులు మరో వైపు. 'బోనాలు' అనే మాట సాధారణ శ్రామిక జనంలోంచి వచ్చిన పదం. సామాన్యులకు బువ్వ చాలా ముఖ్యమైనది. అందుకనే అదే పదాన్ని దేవతను కొలిచేందుకూ పెట్టుకున్నారు. జనులు ఏవైతే ఆహారంగా వినియోగిస్తారో దేవతకు కూడా అవే పెడతారు.
      వర్షాకాలంలో వచ్చే ఈ బోనాల పండుగ సందర్భంగా, ఈ కాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులు, ముఖ్యంగా వెనకట కలరా చలిజ్వరాలు విస్తరించేవి. అలాగే వర్షాలు పడి నీరు కలుషితమవటంతో వచ్చే రోగాలు రాకుండా చూడమని వేడుకోవడం చూస్తాము. హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతంలో బోనాలు పెద్ద యెత్తున జరుపుతారు. ఆ సమయంలో అమ్మోరు 'రంగం' నిర్వహిస్తారు. పరిపాలనా ఫలాల గురించీ భవిష్యవాణి పలుకుతుంది. ఎలా వుంది. ఎలా వుండబోతోంది కూడా. ప్రజలు ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా హెచ్చరిస్తుంది. నాయకులు ఏం చేయాలో వివరిస్తుంది. ఇదంతా ఒక రకమైన సమీక్షలాంటిది. దేవత పేరుతో జరిగే ఓ వ్యాఖ్యానం.
      ఏదిఏమైనా బోనాల పండుగ తెలంగాణలో ప్రజలు సమూహంగా జరుపుకునేది. వారి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకోవాలి. పరిపాలకులు సామాన్యుల ఆరోగ్యానికి భరోసానివ్వాలి. వైద్య రంగాన్ని పటిష్ట పరచాలి. కలుషితం కాని మంచినీటిని అందరికీ అందించాలి. ఈ కరోనా కాలాన అందరికీ కడుపు నిండా భోజనం అందాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడిపాట్లు
నాన్న
చే జీవితం యువతకు ఉత్తేజం!
అందాల కాశ్మీరు..!
ఏమిటీ ఉన్మాదం!
నిఖత్‌ భారత్‌ మహాన్‌
తిండిగలిగితె...
ఏం సమాజమిది!
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.