Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గేర్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

గేర్‌

Sun 01 Aug 05:17:32.231056 2021

అతను... మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్న రోజుల్లో... 'థియరీ ఆఫ్‌ మెకానిక్స్‌' లో ఇష్టమైన అంశం... 'గేర్‌ సిస్టమ్స్‌'.
పళ్లున్న చక్రాలు ఒకదానిపై మరొకటి మమేకమై తిరుగుతుంటే ఆ రాపిడిలోంచి పవర్‌ జెనరేట్‌ అవుతుంటే.. అని లెక్చరర్‌ చెప్తున్న కొద్ది.. ఆ పవరేదో అతని నరాల్లోకి ఎక్కుతున్నట్టుండేది.. ఒక చక్రం తిప్పడం, దాన్ని ఆనుకొనున్న మిగితా చక్రాలు తిరగడం అతనికి నచ్చిన ప్రక్రియ...
శ్రద్ధగా విన్నాకా, క్లాస్‌ ముగిస్తూ లెక్చరర్‌ అన్న మాట... ''లైఫ్‌..గేర్లు మార్చుతూ నడిపే బండి. స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర గేర్‌ డౌన్‌ చేసి స్లో అవ్వు గానీ...బండాపకూడదు!'', అని.
అది అరవై యేళ్ళొచ్చిన అతని చెవుల్లో ఇంకా ప్రతి ధ్వనిస్తూనే ఉంది. అంత వయసులో కూడా ఆలోచనలు 'న్యూట్రల్‌'లైజ్డ్‌ గా లేవు... 'రివర్స్‌ గేర్‌' వేసి వెనక్కి తిరిగి చూస్తే, యంత్రాలతో ముడి పడి ఉన్న అతని బంధాలకను కుంటా ఆలోచనలు కూడా యాంత్రికంగా సాగాయి... జీవితం మొత్తం ఒక్కసారిగా గేర్లుగా విభజించిన కళ్ళ ముందు కదలాడుతుంది...
గేర్‌-1 :
బజాజ్‌ చెతక్‌ బండి.. మొదటి గేర్‌లో ఆంబులెన్స్‌ వెనుక ఆసుపత్రికి బయలుదేరింది. భార్య నొప్పులు అక్కడక్కడా ట్రాఫిక్‌లో కూడా బండి వరకు వినబడుతున్నాయి. ఆశ్చర్యంగా ఆసుపత్రి చేరేలోపే ఆంబులెన్స్‌లోనే పుట్టాడు... ఆ వాహన ప్రియుడు.! ఇంకా విచిత్రమేమిటంటే, ఆంబులెన్స్‌ గేర్లు మార్చినప్పుడు పుట్టాడని!! ఆగకుండ కొడ్తున్న హారన్‌లా ఏడుస్తు... కొత్త షోరూం బండిలాగా నిగనిగలాడుతున్నాడు... అతనికి మాటలొచ్చాకా, ''మమ్మీ బండికి పాలు పట్టించాలి పెట్రోల్‌ బంకుకి తీసుకెళ్లవా?'', ''మమ్మీ బండి పంక్చర్‌ అయ్యింది... వెహికల్‌ డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్లవా?'', అంటూ కార్‌ బొమ్మలు ఇల్లంతా పర్చి అన్న ముద్దు మాటలకి తల్లి తెగ నవ్వుకునేది. అప్పుడే కొనిచ్చిన మూడు గీరల సైకిల్‌ తొక్కుతూ ఒకసారి తండ్రి చెతక్‌ కి పోటీగా వెళ్ళాడు, కానీ గేర్లు మార్చుతూ తండ్రి వేగం పెంచడంతో అందుకోలేకపోయాడు. అప్పుడు పడింది కన్ను, గేర్ల మీద!
కాస్త పెద్దయ్యాక, చెతక్‌ బండి తండ్రి నడుపుతుంటే ముందట నిల్చొని ఊరంతా చుట్టేస్తూ, వెనక్కి వెళ్తున్నట్టుగా కన్పిస్తున్న కొండలు, చెట్లను విచిత్రంగా చూస్తుండేవాడు... అలా రోజు బండి మీద తిప్పడంతో అతనికి ఓ రోజు తెలియలేదు, ఇంటిల్లిపాదీ ఊరు విడిచి వెళ్తున్నట్టు..! బరువెక్కిన గుండెలతో తండ్రి బండి నడుపుతుంటే, వెనుక నుండి లేచిన ఎర్రటి ధూళిలోంచి దూరమవుతున్న పోచమ్మ గుడి.. కొసరుగా కన్పిస్తున్న దొర గడీ.. సన్నగా విన్పిస్తున్న సాంచెల చప్పుడు... చల్లని గాలిని లేపే చిలకల వాగు స్పర్శ... ఊరు విడిచేటప్పటి దశ్యాలు జ్ఞాపకాలుగా మదిలో తిరుగుతూనే ఉన్నాయి.
గేర్‌-2 :
సిటీ హంగులుకు దగ్గరగా టౌన్‌గా పిలవబడే ఊరది. అప్పుడే మొదలైన ఇంగ్లీష్‌ మీడియం గోలకి, అతన్ని రోజు ఆటోలో స్కూల్‌ డ్రెస్‌తో కుక్కి పంపేవారు, ఆటో వాడు గేర్‌ మార్చినప్పుడల్లా భుజానికున్న బ్యాగు బరువెంతో తెలుస్తుండేది. ఏదో ఎదగాలని టౌన్‌కి వచ్చిన తండ్రి, కొడుకు నిద్ర లేవక ముందు బయటికెళ్తే మళ్ళీ పడుకున్నాకా వచ్చేవాడు. అలా అతను తండ్రిని ఆదివారాల్లో ఆశ్చర్యంగా చూస్తూ ఆనంద పడేవాడు.
అనుకోకుండా ఓ సాయంత్రం స్కూల్‌ నుండి వచ్చిన అతనికి, సంబురంగా తల్లి వచ్చి, ''నాన్నకి గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చిందిరా..'', అంటూ ముద్దు పెట్టింది. అలా కొన్ని నెలల తర్వాత కొన్న కొత్త టూవీలర్‌పై ముగ్గురు కలిసి తిరిగారు, అతనికి ఆటో ఇబ్బంది తప్పింది. బండిపై తండ్రికి తల్లికీ మధ్యలో కూర్చునే వాడు.. ఏదో ఒక వైపు మాత్రమే చూస్తూ, ప్రపంచాన్నే చుట్టేస్తూన్న అనే ఫీలింగ్‌తో తెలియకుండానే నిద్రలోకి జారేవాడు.
గేర్‌-3 :
ఇంటి సామాన్లు ఎక్కించుకొని బైపాస్‌ మీద మూడో గేర్‌ మీదుంది లారీ... ప్రభుత్వ ఉద్యోగమన్నాకా ట్రాన్స్ఫర్లు మామూలే కదా... ఈ సారి జిల్లా కేంద్రానికి. అతనప్పటికే టెన్త్‌ క్లాస్‌ ఫలితాల్లో స్కూల్‌ బ్రోచర్‌ మీద జైల్‌ గది నెంబర్‌ లాగా ర్యాంక్‌ వేసుకొని పడ్డ ఫోటోకి, ఇంటర్మీడియట్‌లో ఉచితంగా సీట్‌ వచ్చింది. అతనిలో కన్పడ్డ 'స్పార్క్‌'కి, తురుము పీట మీదేసి తరిమారు.. రెండేళ్ల కాలం కరిగే వరకు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ అయిపోగానే తండ్రి చెప్పిన సీఏ కోర్సు కాదని, తల్లికి ఇష్టమైన ఆర్ట్స్‌ని పక్కకు పెట్టి, కలలుగన్న మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వైపు వెళ్ళాడతను. ఏదో సాధించాలి అని జాయిన్‌ అయ్యి, 'అసలేం సాధిస్తావు?' అన్న ప్రశ్నలతో నలిగిపోయి, ఎలా సాధించాలి అన్న క్లారిటీ వస్తున్న రోజుల్లో అతనికి... ఆమె పరిచయమైంది.!
డ్రాఫ్టర్‌తో గీసిన డ్రాయింగ్‌లా చక్కగా ఉంటుందామె. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉండే అతని ప్రేమ, ఆమెని చూడగానే బుల్లెట్‌ బండి చప్పుడిలా గుండెలో మార్మోగేది.. నిశీధిలా ఉండే ముఖం హెడ్‌ లైట్‌లా వెలుగుతుండేది. కానీ ఎంత ట్రై చేసిన ఈ గేర్‌ 'పడట్లేదేంటి'? అని అనుకుంటున్న సమయానికి, క్లచ్‌ వైర్‌తో కమ్యూనికేషన్‌ ఉండాలి కదా అని ఆమె నెంబర్‌ కనుక్కొని మాట్లాడడం మొదలెట్టాడు. అలా ఆ రోజు నుండి అతని తల్లి తర్వాత, బండి బ్యాక్‌ సీట్‌ ఖాళీ తనాన్ని ఆమె వచ్చి నింపేది. అలా ఆ వాహన ప్రియుడు ఆమెకి ప్రియుడైయ్యాడు.
నాలుగేళ్ల చదువు అయిపోయాకా... లెక్చరర్‌ చెప్పినట్టుగా ప్రయాణంలో స్పీడ్‌ బ్రేకర్లు వస్తునే ఉన్నాయి... గేర్‌ డౌన్‌ చేయక తప్పలేదతనికి..
గేర్‌- 4 :
అనుకోకుండా తండ్రికి ఆక్సిడెంట్‌ అవ్వడంతో ఇంటిల్లిపాదీ హడలెత్తిపోయింది. ఇల్లు కోసం, చదువుల కోసం దాచిన డబ్బంత ఒక్కసారిగా హాస్పిటల్‌ బిల్లు మొత్తం మింగేసింది. కేవలం ఫ్రాక్చర్లు, దెబ్బలతో బతికి బయటపడ్డాడన్న ఆనందం ముందు... ఆర్థికంగా నలిగిపోతున్న బాధ కప్పేసినా, అది ఎక్కువ రోజులైతే కుదరలేదు..పెట్రోల్‌ అయిపోయిన బండిలా, ఇంటిని నెట్టుకొచ్చారు.. అతను ఊహించనిది ఏంటంటే చివరికి మందుల కోసం బండిని కూడా అమ్మేయాల్సి వస్తదని!!
డబ్బు మీద ఏదో కసి... తండ్రితో పాటు తను కూడా ఇంటి ఆర్థిక భారం మొయ్యాలనుకున్నాడు ఎందుకంటే... బండి సింగిల్‌ స్టాండ్‌ వేసినప్పుడుండే బరువు, డబుల్‌ స్టాండ్‌ వేసినప్పుడు ఉండదని తెల్సు కాబట్టి జాబ్‌ ట్రైయల్స్‌ మొదలెట్టాడు. కాని కుదరలేదు, కాస్త ఓపిక పట్టి ఊర్లోనే మాస్టర్స్‌ చేస్తూ తండ్రికి సేవ చేసాడు.
ఈ లోపే ప్రేమించిన అమ్మాయికి ఇంకెవరితోనో పెళ్లి కుదిరిందని తెలియగానే... అతనికున్న మనోవేదన ఎక్కువైంది. అతనేంటో ప్రూవ్‌ చేసుకునే అవకాశం కూడా దొరకలేదని, చంద్రుడ్ని చూస్తూ, దిండు తడుపుకుంటూ, నిద్ర చెరిపేసుకున్న రాత్రులు చాలానే ఉన్నాయి... కుటుంబం నిలదొక్కుకోడానికి తల్లి రాత్రి పగలు ఏవేవో పనులు చేస్తుంటే, ఆ కష్టాన్ని చూస్తూ అతనికి రోజు రోజుకి కసి పెరిగుతూండేది.
కొద్ది కాలానికి పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి.. గ్రీన్‌ సిగల్‌ పడగానే బయల్దేరిన బండిలా, అతను ప్రపంచంతో పోటీగా బయలుదేరాడు. జీవితం కూడా కొన్ని మలుపులు తిప్పేటప్పుడు అవతల వ్యక్తికి 'ఇండికేటర్‌' లా తెలియజేస్తుంది.. అలా అతని తండ్రికి అర్థమైంది, కొడుకు ఏదో సాధించ బోతున్నాడని. గ్యాప్‌ లేకుండా నెక్స్ట్‌ గేర్లు టకటకా మార్చేస్కుపోయాడు..
గేర్‌-5 :
మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం వచ్చాకా.. పెళ్లి చేసారు. షాక్‌ అబ్సర్వర్‌లా భుజాలుపై బరువు బాధ్యతలను బ్యాలెన్స్డ్‌గా మోస్తున్నాడు. కానీ ఏదో వెలితి, 'దక్కాల్సింది' దక్కలేదని బాధ... బరువెక్కిన మనసుతో బాగా తాగేసి ఇంటికెళ్ళేవాడు.
భరించలేక భార్య ఓ సారి, అతని బండిలో పెట్రోల్‌ బదలు కిరోసిన్‌ పోసి పెట్టింది... స్టార్ట్‌ చేస్తే వచ్చిన పొగకు అతను వేడెక్కిన సైలెన్సర్‌లా అయిపోయాడు... కానీ బాడీలోకి ఏది పడితే అది పోయకూడదని అతనికి అర్థమైయేలా తెలియ జేసింది. మందు, పొగ మానేసాడు.
ఆమె పుట్టినరోజుకి బహుమతిగా ఆమెకి ఇష్టమైన స్కూటీని ఇచ్చినప్పుడు... ఆమె ఆశ్చర్య పోయింది!! ఎందుకంటే ఆ బండికి గేర్లే ఉండవు, గేర్లంటే ఇష్టపడే అతను అవి లేని బండి ఇవ్వడంలో అతని ప్రేమ ఉందని గ్రహించి.
ఆమెకున్న అర్థం చేసుకునే గుణంతో అతను ధైర్యంగా కలలు సాకారం చేసుకోడానికి ముందడుగేసాడు.. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న తన ఐడియాలను బాస్‌ ముందు గుమ్మరించాడు.
గేర్‌-6 :
అప్పటి వరకు కాళ్ళ దగ్గరుండే గేర్‌ ఇప్పుడు చేతికి దగ్గరగా ఉంది. ప్రేమగా చేయితో నిమిరి, ఫోర్త్‌ గేర్‌ వేసి కారు వేగం పెంచాడు. ఈ సారి ప్రయాణంలో అతనికి పిల్లలు కూడా తోడైయ్యారు. అందుకే అతి వేగం మానుకున్నాడు. కార్‌ టాప్‌ లో ఫ్లోటింగ్‌ విండో తెరవగానే పిల్లలు సంబురంగా లేచి బయటకి చూస్తుంటే అతనికి తను చెతక్‌ మీద తిరిగిన రోజుల గుర్తొచ్చేవి.
అతనప్పటికీ ఓ వెహికల్‌ కంపెనీకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఆ రోజు ఆఫీసు పార్టీకి ఇంట్లో వాళ్ళను కూడా తీసుకెళ్ళాడు. అతను చేపట్టిన 'ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌' ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అయ్యి కంపెనీ లాభాల్లో నడుస్తుందన్న విజయ గర్వంతో పార్టీలోకి అడుగు పెట్టాడు. మొట్టమొదటి ఆటోగేర్‌ కారును నడిపి చూపించాడు.. అతన్ని అభినందిస్తూ బాస్‌, ''కంపెనీ చేపట్టబోతున్న గేర్‌ లెస్‌ సిస్టమ్‌ (సింగిల్‌ గేర్‌) కూడా నీకే అప్పజెప్తాను'', అని అనౌన్స్‌ చేయగానే... అతను సున్నితంగా తిరస్కరించాడు. అతనికెందుకో గేర్స్‌ అంటే ఇష్టం, దాని వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళకు గేర్‌ లెస్‌ ఉపయోగపడతాయేమొ.. కానీ అతనికి ఆ ప్రాజెక్ట్‌ చేయాడానికి మనసొప్పలేదు.
పార్టీలో అతను మాట్లాడుతూ, ''నాది గ్రేట్‌ లైఫో కాదో తెలీదు కానీ, గేర్డ్‌ లైఫ్‌ అని మాత్రం చెప్తాను. ఏ వయసులోని వేగం ఆ వయసుకున్నప్పుడు, దాన్ని కంట్రోల్‌ చేసే గేర్‌ సిస్టమ్‌ మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా హ్యాండిల్‌ చేస్తున్నావనేది చాలా ముఖ్యం..'' అన్న అతని మాటలకు చప్పుట్లు మారుమోగుతూనే ఉన్నాయి...
అప్పుడే.. సడన్‌గా లైట్స్‌ ఆన్‌ అయ్యాయి....
అతను ఇంతసేపు రివర్స్‌ గేర్‌లో గుర్తుచేసుకున్న జీవితంలోంచి తేరుకున్నాడు.
గడియారంలో దాగున్న (కాల)చక్రాల్లో గేర్‌ మారింది... పన్నెండవుతుంది...
బెలున్స్‌ పేలాయి, ''హ్యాపీ బర్త్‌ డే తాతయ్య'', అంటూ వచ్చి హగ్‌ చేసుకున్నాడు మనవడు. కేక్‌ కట్‌ చేసాకా, ''తాతయ్య నీకో గిఫ్ట్‌. చిన్నప్పుడు నువ్వు చేయలనుకున్నదే.. ఓ లోటు తీరబోతోంది'', అంటూ పెద్ద గిఫ్ట్‌ ప్యాక్‌ ఇచ్చాడు... ఓపెన్‌ చేసి చూసాడు...
అతని కండ్లలో ఏదో బాల్యపు ఆనందం.. లైఫ్‌ సైక్లిక్‌ ప్రాసెస్‌లో భాగంగా మళ్ళీ మొదటిదే అనుకొని, ఉండబట్టలేక ఎక్కి తొక్కడం మోదలెట్టాడు... ఒంట్లోని శక్తంతా ఉపయోగిస్తూ.. ఆశ్చర్యంగా... గేర్‌ సైకిల్‌!!!

- కె.వి.మన్‌ ప్రీతమ్‌,
8179306464

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్యూషన్‌
మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.