Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అతి గారాబం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • చైల్డ్ హుడ్
  • ➲
  • స్టోరి

అతి గారాబం

Sat 31 Jul 21:35:01.863763 2021

రామాపురం అనే గ్రామంలో రామయ్య నివసించేవాడు, ఊరూరు తిరిగి బట్టల వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య పేరు లక్ష్మి. వీరికి పెళ్ళై ఆరు సంవత్సరాలైనా సంతానం కాలేదు. ఎన్నో పూజలు చేసారు, సంతానం కలగలేదనే బాధతో రామయ్యకు నిద్రపట్టేది కాదు, కొద్ది రోజుల తర్వాత దైవ కటాక్షంతో, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి,
లేక లేక కలిగిన సంతానం కావడంతో, ఇంటి కులదైవం పేరుతో, ఈశ్వరయ్య అని నామకరణం చేశారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. కొడుకు పెద్దవాడయ్యాక ఉన్నతమైన చదువులు చదివించి, మంచి ప్రయోజకుణ్ణి చేయాలని రామయ్య తపన. ఊర్లో గల సర్కారు బడిలో చేర్పించాడు. ఈశ్వరయ్య రోజు స్కూలుకు వెళ్లే క్రమంలో, సుధాకర్‌ అనే స్నేహితుడు తోడయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం బలపడింది,
సుధాకర్‌ పేదింటి అబ్బాయి కావడంతో, ఈశ్వరయ్య తను తెచ్చిన భోజనంలో సగం సుధాకర్‌కు పెట్టేవాడు. ఇది రామయ్యకు సరిపోయేది కాదు, ''వాళ్ళు పేదవాళ్ళు, మనం ధనవంతులం, వాడు సరిగా స్నానం కూడా చేయడు. మంచి బట్టలు వేసుకోడు, అలాంటి వాడితో స్నేహం చేయొద్దు. మనకు కూడా అలాంటి అలవాట్లే వస్తాయి'' అని కొడుకుని దండిస్తుండేవాడు రామయ్య. తండ్రి మాట జవదాటే వాడు కాదు ఈశ్వరయ్య. ఆ రోజు నుంచి సుధాకర్‌తో స్నేహం మానేసాడు. తను ధనవంతుల అబ్బాయిననే గర్వం ఈశ్వరయ్యలో బాగా పెరిగిపోయింది. సాటి విద్యార్థులను ఎవరినీ లెక్క చేసేవాడు కాదు, హేళన చేసేవాడు.
ఎక్కాలు సరిగా చెప్పలేదని, ఉపాధ్యాయుడైన రఘు రామయ్య ఒకరోజు ఈశ్వరయ్యని ఘాటుగా దండించిన సంగతి రామయ్యకు తెలిసి గొడవకు దిగాడు. ''నేనే నా కొడుకుని కొట్టను, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం, కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చారు, ఇంకోసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదు'' అంటూ ఉపాధ్యాయున్ని తీవ్రంగా మందలించాడు రామయ్య. ఆ రోజు నుంచి ఈశ్వరయ్య బడిలో మరింత ఎక్కువగా అల్లరి చేయసాగాడు. ఉపాద్యాయులు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదు.
ఒకసారి తన స్నేహితుడు సుధాకర్‌ని, పాఠం ఒప్పజెప్ప లేదని, వాళ్ళ నాన్న రంగయ్య ముందరే ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించాడు, ''ఇంకా బాగా కొట్టండి గురువుగారు, భయం ఉంటే గానీ చదువు రాదు, కొట్టినందుకు నేనేమి అనుకోను'' అని రంగయ్య ఉపాధ్యాయునికి చెప్పి వెళుతుంటే, సుధాకర్‌ని చూసి ఈశ్వరయ్య గట్టిగా నవ్వేశాడు. '' మీ నాన్నకు నీపై కొంచెం కూడా ప్రేమ లేదు, నిన్ను బాగా కొట్టమని చెబుతున్నాడు'' అంటూ గట్టిగా హేళనగా నవ్వాడు ఈశ్వరయ్య. సుధాకర్‌ మౌనంగా ఉండిపోయాడు.
ఒకరోజు పక్క పిల్లాడితో గొడవపడి గాయపరిచాడని, ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యను కొట్టాడు, ఇది తెలుసుకున్న రామయ్య ఉపాధ్యాయుడైన రఘురామయ్య పైకి దాడికి దిగి, కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇలా కొంత కాలం జరిగిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఒక రోజు రఘు రామయ్య వీధిలో నడుస్తూ వెళుతుండగా రామయ్య కనిపించాడు, ''రామయ్య ఎలా ఉన్నారు. కొడుకు బాగున్నాడా'' అని అడిగాడు. ఆ మాటతో రామయ్య బోరున ఏడ్చేసాడు. ''ఒక్కగానొక్క కొడుకు కదాని గారాబంగా పెంచాను, వాడు ఏ తప్పు చేసినా వెనక్కి వేసుకొచ్చాను. గారాబమే నా కొంప ముంచింది, వాడికి చదువు అబ్బలేదు, అల్లరిగా తిరుగుతూ రౌడీలా మారిపోయాడు, ఉద్యోగం సంపాదించి దర్జాగా ఉండాల్సిన వాడు, జైలులో నాలుగు గోడల మధ్య ఉన్నాడయ్యా'' అంటూ రఘురామయ్య పాదాలపై పడి, క్షమించమని వేడుకున్నాడు రామయ్య,
రామయ్యని పైకి లేపి ఓదార్చాడు ఉపాధ్యాయుడు ''మీ పిల్లవాడి జతలో సుధాకర్‌ అనే అబ్బాయి ఉండాలి కదా, అతను ఎక్కడున్నాడు, పాపం చాలా పేదవాడు అతను'' అడిగాడు ఉపాధ్యాయుడు. ''ఆ పిల్లవాడిని ఒకప్పుడు పేదవాడని హేళన చేశాను, కానీ వాడు బాగా కషి చేసి పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యాడు, నా కొడుకుని అరెస్టు చేసి జైల్లో పెట్టింది కూడా అతనే'' అనగానే ఆశ్చర్యపోయాడు ఉపాధ్యాయుడు రఘురామయ్య ''అతి గారాబమే నిన్ను ముంచింది, చిన్న పెద్ద అనే తేడా గల నీ అహంకారమే నీ పతనానికి దారి తీసింది, తల్లిదండ్రుల తర్వాత గురువులే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టేది, అలాంటి గురువునే నువ్వు ధూషించావు. ఇప్పటికైనా మారు'' అంటూ వెళ్లిపోయాడు రఘురామయ్య.
''బాగా బుద్ధి వచ్చింది'' అంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు రామయ్య.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాము - కుక్కపిల్ల
గీయించిన బొమ్మ
సాధించాలి
నాన్న ఇచ్చిన ఆస్తి
నిర్మల హృదయం
సోమరిపోతు సోమన్న
చదివింది గుర్తుకు రావడం లేదా...?
మిత్రుల తెలివి
వెంకడి వారసుడు
అవ్వను చేరదీసిన మురళి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.