Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దున్నపోతు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

దున్నపోతు

Sun 29 Aug 05:32:26.717926 2021

ఒక రోజు.. రాత్రి..
ఊర్లో డప్పు చాటింపు విన్పించింది.. చాటింపు విని అందరూ ఆశ్చర్యపోయారు. బయటికి ఏం మాట్లాడక పోయినా.. గుసగుసలు పెట్టుకున్నారు. కొందరు యువకులు బహిరంగంగానే విమర్శిస్తే పెద్దలు, మహిళలు వాళ్ళపైన మండిపడ్డారు. వాడవాడకి తిరుగుతూ బక్కడు తన మాదిగ డప్పుతో చాటింపు వేస్తున్నాడు.
     'ఇందుమూలంగా సమత్త పెజానీకానికి తెల్వజేయునదే మనగా.. మనూరి ధర్మారావ్‌ దొర తన గోదాటి కోసం లచ్చ రూపాలు బోసి ఒక దున్నపోతుని కొనుక్కొచ్చారు. దాన్ని ఎవరు వరిపొలల్లల్ల, పత్తి చేండ్లల్ల పడ్డ కొట్టొద్దు.. తిట్టొద్దు. ఆ పోతురాజు ఎవరి పంట చేల్లల్ల పడ్డ దొరగారికి ఫిర్యాదు చేస్తే నష్ట పరిహారం ఇస్తారహౌరు..' అంటూ చాటింపు చేస్తున్నాడు.
     అలాగే.. పొద్దు గాల్ల దొరగారి బర్లమంద పోయినంకనే.. ఊరోళ్ళ మంద పోవాల్నని.. ఎవరినైనా తమ తమ బర్రెల్ని ముందు విడిచిపెట్టినట్లయితే.. రెండు వేల జుర్మానా కట్టాలని దొరవారు ఆగ్నాపించారహౌ..' డడ్డనకడమ్‌.. డడ్డనకడమ్‌.. అంటూ బక్కడు డప్పు వాయించి చాటింపు వేస్తున్నాడు.
     తెల్లారింది...
     వూరంతా ఇదే చర్చ.. దొరతో కొంత సన్నిహితంగా ఉండే వాళ్లయితే పోతురాజుని చూడటానికి వచ్చారు. అల్లనేరేడు పండు రంగుతో.. పొట్టి కొమ్ములతో.. చిన్న పాలేరు కొబ్బరి పీచుతో దాని శరీరాన్ని కడుగుతున్నాడు.. నూనె రాసినట్టు శరీరమంతా నిగనిగా మెరిసిపోతుంది.
     పోతుని చూసొచ్చిన కొందరైతే.. ఃఅబ్బా.. దాని ఒడ్డు పొడువు చెప్పతరం గాదు.. యములోడి వాహనం లెక్కనే వున్నదిః, అని ఒకరంటే..
     'బర్రెలైతే దాన్ని సూత్తనే సుడికాచ్చేటట్టున్నాయిః అని మరొకరు దున్నపోతు అందాన్ని, దాని రూపాన్ని పదింతలు చేసి చెప్పడంతో.. ఊరంతా దాన్ని చూడాలన్న ఆసక్తి, ఉత్సహం కలిగాయి.
     ఇంతలో కాట్రేవుల పండగొచ్చింది..
     దొరగారి మందలోని ఆవులకి, బర్రెలకి బంతిపూల దండలు కొమ్ములకి కట్టి.. హౌళీ కంటే ఘనంగా వాటికి రంగులు చల్లారు పాలేర్లు. పోతురాజుకైతే.. పెండ్లి కొడుకుల తాయారు చేశారు. ఆ రోజు బయటికి వచ్చిన పోతుని ఊరంతా విస్మయంగా, ఆశ్చర్యంగా చూసింది. బర్రెలున్నవాళ్లైౖతే భయం భయంగా చూసారు.
     దాని మెడకు దొరసాని ఒక చిన్నగంట కట్టింది. అది నెమ్మదిగా నడుస్తుంటే గంట శబ్దం వినిపిస్తుంది.
     రెండో రోజునే..
     రాజయ్య వణికిపోతున్నాడు..
     పెద్ద పాలేరు వెంకడు సంతోషంగా చేతులు కట్టుకొని.. మూసి మూసి నవ్వులు నవ్వుతున్నాడు. దొర వరండాలోకి ఇంకా రాలేదు.
     రాజయ్య భయం భయంగా చూస్తున్నాడు.
     "అరే ఎంకన్న.. నీకు దండం పెడతరా.. పాత పగ మనసులో పెట్టుకొని దొరకు ఎక్కియ్యకురా
     "నా పొలానికి.. నీ పొలంలొంచి వెళ్ళడానికి దారియ్యవా.. దొర రాని.. నీ సంగతి జెప్తా.." ఉరిమి చూస్తూ అన్నాడు వెంకడు.
     "దారేం ఖర్మరా.. పొలాన్నే తీస్కో.. కానీ దొరకి చాడీలు చెప్పకురాఃః రాజయ్య అనేలోగానే దొర ఏదో వూరికెల్లబోతూ ఆగిండు. దొరని చూడగానే ఃఃతప్పయింది దొర.. అది మీ దున్నపోతని తెల్వది దొర" అని కాళ్ళ మీద పడ్డాడు.
     "తెల్వదారా.. చాటింపు విన్లేదా" అన్నాడు దొర గంభీరంగా..
     "విన్లేదు దొర.. నేనూర్లే లేను దొర" అన్నాడు లేవకుండానే
     "దొరా.. వీనికి ఎందుకు తెల్వది దొర.. లం.. కొడుకు నాటకాలుడుతుండు దొర.." వెంకడు కడుపులోని కసి కక్కేస్తున్నాడు.
     "నిజంగా.. నాకు తెల్వదు దొర .."
     దొర అదేదీ పట్టించుకోకుండా.. "మల్లిగా.. చిన్న కచ్చురం కట్టురా.. గా ఛిల్వకోడూర్‌ దాకా పోయి రావాలె.." అన్నాడు.
     "రాజయ్య.. కాళ్ళ మించి లే.. నీ పొలంలో నా పోతు రెండడుగులు వేసిందో.. లేదో.. దాని వీపు మీద కొడతావా.. నాకచ్చి చెప్పవా", కోపంగా అన్నాడు దొర.
     "అది మీ దున్నపోతని తెల్వది బాంచన్‌"
     'దాని తోకని మెలేసి ఇరుస్తావా"
     "దాన్ని.. ముట్టుకునుడు సుత.. ముట్టుకోలేదయ్యా"
     "అరేరు.. ఈరిగా.. దాని తోకని తాకినందుకు.. వీడి ముడ్డి మీద కాల్చిన సలాకతో సురుకు వెట్టిండ్రు" అని కోపంగా అరిచి.. బయటకెళ్ళాడు.
     వాకిట్లో.. చిన్న కచ్చురంలో కుసోగానే.. రాజయ్య అరుపు విన్పించింది.
     వారం తర్వాత...
     ఓ రోజు దొర బంగ్లామీదికెళ్లి చిన్న పాలేరు తిరుపతి పడితే పక్క బొక్కలు రెండు, మూడు ఇరిగినై అని తెలిసి.. దొర తన సొంత కారులో పట్నం తీసుకపోయి.. సిమెంట్‌ పట్టిలేయించి.. దొర ధర్మాత్ముడు అనిపించుకున్నాడు. దొర దగ్గర పనిచేసే పాలేరోళ్లను సంత బిడ్డల్లా చూసుకుంటాడని పెద్ద పాలేరు ఎంకన్న ప్రచారం చేసిండు.
     కానీ.. మరో వారం రోజుల్లో ఒక రహస్యం నిశ్శబ్దంగా వూరంత పాకింది. కానీ ఎవరు నోరు విప్పలేదు. నిజానికి.. తెల్కపిండి తట్టు పొరపాటున కొంచెం దూరం పెట్టినందుకు.. ఇనుప గొలుసులతో కట్టేసిన దున్నపోతుకు అది నోటికందనందుకు చిన్న పాలేరుని డొక్కలో కుమ్మిందిని. అందుకే తిరుపతి గాడికి పక్క బొక్క విరిగాయని విషయం నెమ్మదిగా తెలిసింది.
     అప్పట్నుంచి ఆ దున్నపోతంటే ఊరోళ్ళకి హడల్‌.. దొరకయినా భయపడలేదు గాని.. అది ఎదురైందంటే పారిపోయేవారు.
     అదే పొగరు తలకెక్కినట్టు దానికి కోపమొస్తే ఎదురైనా వాళ్లనల్లా కొమ్ములు వంచి తరిమేది.
     ఏగిలి వారంగనే...
     లస్మవ్వ మందోట కాడికి ఉరికురికి వచ్చింది. లస్మవ్వను చూసిన బర్లు కాసే కొండమల్లి గాడు జడుసుకున్నాడు...
     "ఈ మొరుదోపుది తెల్లారంగనే రావట్టె.. ఎం తిడ్తదో ఏమోఃః అనుకున్నాడు. అప్పటికే బిర్రుబిర్రున వచ్చిన లస్మవ్వ ఃఃఒరే కొండమల్లిగా.. యాడోన్నావురో... నీ మోల్ధారం తెంప.. నా బర్రె రాత్రికి ఇంటికి రాలేదురా.. యాడికి పోయిందో జాడ చెప్పరాదురా.. మొన్న కాట్రేవులకి పెట్టిన్నాడే నీకు సంచెడు వడ్లు పెట్టిన గదరా మల్లిగా.. తిన్న రేవు మరువద్దురా.. నీ బొందవెట్ట.." అంటూ మందలో తన బర్రెను వెతుక్కుంటుంది.
     మందోట దగ్గర పిల్లలు సొట్టలు పడ్డ ఇనుప తట్టల్లో పెండ నింపుకుంటున్నారు. కొందరు పెండ దొబ్బుడాట ఆడుకుంటున్నారు.
     "అరేరు రాజుగా గిప్పుడు నా వంతు.." అంటూ శేషు గాడు పెండను ముద్దగా చేసి నేలకు కొట్టాడు. పెండ మధ్యలో పెద్ద రంధ్రం పడింది. ఆ ఖాళీల్లో శేఖర్‌ గాడు తన పెండను నింపుతూ.. 'అబ్బో.. బాగనే పొక్కపడ్డది' అంటూ, "అరేరు గా శేషుగాన్ని జెరంత సూడుండ్రి" అన్నాడు.
     శేషుగాడు ఓ బర్రె భూమ్మీద పెండ వేయకముందే బర్రె తోక లేపగానే అక్కడ తట్ట పట్టుకొని నిల్చున్నాడు.. కానీ బర్రె మూత్రం పోసింది.
     అందరూ.. 'దాని ఉచ్చను పట్టుకుంటావ్‌ రా' అని నవ్వారు. వాడు వీళ్ళని పెండతో కొట్టడానికి రావడంతో లేచి పరుగులు తీశారు. ఇద్దరు పిల్లలు లస్మవ్వ చుట్టు తిరిగారు.
     "ఓ పోరగాండ్లు.. ఏం ఆటల్రా ఇవి పొద్దుగాల్నే మందోట కాడికి వచ్చిండ్రు.. భుజాలు వోయి బుబ్బడాలైతది బిడ్డ.." కసిరింది లస్మవ్వ.
     నిఖిల్‌ గాడు "అరేరు శేషు.. బడ్డీక్‌ (కబడ్డీ) ఆడుదామారాఃః అడిగాడు. "ఓ.. నువ్వైతే బాత తొక్కకముందే గూత మారుత్తావ్‌.. ఏమైనా అంటే తొండి పెడ్తవ్‌.. నేనాడా" అన్నాడు.
     "అది ఐదీతల బర్రెరా.. పెయ్య దుడ్డెను పెట్టి నెల రోజులన్న గాకపాయె.. దుడ్డె బొక్కు రాత్రంతా ఒర్రవట్టె.. దాని ఉసురు నీకు తగలదారా.." అంది కోపంగా లస్మవ్వ. ఇంకా వదలది అనుకొని కొండమల్లి గాడు బయటికొచ్చిండు. నాలుగు కుంచల వడ్లు జోలి తీసి ఇంకా బాగా తిడుతదని..
     "అది కాదు సిన్ని.. పెట్టిన చెయ్యి మర్సిపోతామా. నీ బర్రెని బంజరు దొడ్ల పడేసిండ్రు" ఆ మాట విని లస్మవ్వ గుండె జారిపోయింది.
     "ఎవడురా బంజరుదొడ్లే పడగొట్టింది.. ఆని మైలపోలు తియ్య.. ఆని తలపుండ్లు కడగ.. ఆని మోల్ధారం తెంప" అంది తిట్టి పోస్తూ ..
     "నాకిప్పుడే తెల్సిందే.. ఎవని చేండ్లనన్న పడ్డది కావచ్చు" అన్నాడు కొండమల్లి గాడు.
అరవయ్యేళ్ళ లస్మవ్వ ఆరాటంగా.. ఆయాసంగా గ్రామ పంచాయతీ పక్కనే వున్న బంజారుదొడ్డి కాడికి ఉరికురికొచ్చింది.
     లస్మవ్వ ఆరాటం చూసి పటేల్‌ అడిగిండు, ఃఃఏమైంది లస్మవ్వ... నీ బర్రె బంజరుదొడ్డ్లే పడిందని ఉరికొస్తున్నవా.. రెండువేల రూపాయిలు జుర్మానా కట్టిపో.. లేకపోతే దొర ఊకొడు.. చిమ్మెట పెట్టి ముక్కుల చీమిడి తీత్తడుఃః.
     "నా బర్రె ఏమైనా లంగతనం జేసిందా.. దొంగతనం జేసిందా.. అవునోరు పరంధాములు. ఎందుకు రెండువేలు కట్టాలే.. ఎవలి చేండ్లనన్న పడ్డదా.. ఎవలి చేనుకల్న దునికిందా.. మందోటల ఉన్న బర్రెని తీసుకొచ్చి బంజారుదొడ్లే ఏసిండ్రు.. నియ్యతి గుండాలె. నా బర్రె ఎం తప్పు జేసిందని రెండు వేలు కట్టాలే.."
     పటేల్‌ ముసిముసిగా నవ్విండు..
     "గవన్ని నాకేం ఎరుకనే.. దొర మాట చెప్పే వరకు నీ బర్రెనైతే ఇడిసిపెట్టేది లేదు.. నీ పైసలు మేమేమన్న కడుక్క తాగుతామా.. రాసీదు ఇచ్చుడేనాయే" అన్నాడు.
     "నా బర్రె గురించి దొరకెందుకు జెప్పాలే.. దొరికేం సంబంధం.. ఇంగో గోటితో పోయేదాన్ని గొడ్డలితో తెగేటట్టు చెయ్యకు పట్వారి నువ్వు".
     ఏమైంది పటేలా.. పొద్దుగాల్నే లస్మవ్వతో ని పంచాయతీ పెట్టినవ్‌.." చెంబట్క వోత అడిగిండు రామసామి.
     "ఏం లేదు చారి.. బంజరుదొడ్లే పడ్డ ఏ జంతువైనా.. రెండు వేల జరిమానా కట్టి ఇడ్సిపెట్టుకోవాలని వూర్లె తీర్మానం చేసిరి, గీ లస్మవ్వదో కిరికిరి పెడతాందిఃః అన్నాడు.
     "అదికాదోరు చారి.. మందోటల వున్న బర్రెని తీసుకొచ్చి బంజారు దొడ్లేసిండ్రు.. ఎందుకంటే గీ మనిషి సప్పుడు జేత్తలేడు" అంది లస్మవ్వ రోషంగా.
     "ఏమైంది పటేలా.." అటుగా వస్తు అడిగిండు కొమటి కైలాసం.
     పటేల్‌ నవ్విండు..
     "నీకు నవ్వులాటగా వుందానోరు పరంధాములు.. సంగతి జెప్పరాదు.." అప్పుడే అటుగా వాస్తు అడిగిండు గొల్ల సత్తయ్య.
     పటేల్‌ ఇంకా నవ్విండు... నలుగురైదుగురు జమైతుండ్రు..
     "నీ... నవ్వినంకనన్న చెప్పు, శెప్పినంకనైనా నవ్వుఃః కోపంగా అంది శంకరమ్మ. బంజరుదొడ్లే పడ్డ పెండనంత ఎత్తుకుంటూ.. మాటలు విని ఃఃఅది కాదే శంకరవ్వ.. రోజు ఏగిలి వారంగా దొరగారి మందవోయినంక ఊర్లె మంద పోవాల్నాయె.. లస్మవ్వ ఏం జేసిందంటే.. దొరగారి మంద వొంగనే.. బర్రెనిడిసింది .." పటేల్‌.
     ఆ మాట వినగానే లస్మవ్వ రెండు చేతులెత్తి దండం పెడ్తూ.. ఃఃఅయ్యా నేనిడిసి పెట్టలే బాంచన్‌.. తను ఉగు తెంపుకొని కుడితి బక్కెట్‌ తన్ని అదే పోయింది బాంచన్‌..ఃః
     "గదానికే బంజరుదొడ్లే పడగొట్టిండ్రానోరు.. ముసల్దాని మొఖం జూసి ఓ ఐదు వందలకు తీస్కొని ఇడిసిపెట్టుండ్రి" అప్పుడే వచ్చిన ఉపసర్పంచ్‌ చెప్పాడు.
ఆ మాట వినగానే బొడ్లే సంచిదీసి ఃఃఇగో రెండు వందలున్నాయి బాంచన్‌.. నా బర్రెని ఇడిస      "పెట్టుండ్రి.. బాంచెన్‌ కాల్మొక్త" అంటూ పటేల్‌ కాళ్ళ మీద పడ్డది.
     పటేల్‌ పరంధాములు వెనక్కి జరుగుతూ...గిదేం పనే లస్మవ్వ.. లే.. లే.. పొద్దుగాల పొద్దుగాల్నే నా కాళ్ళమీద పడ్తున్నావ్‌. లే.. లే" అని నవ్విండు.
     "అసలు కథ జెప్పనియ్యే..
     లస్మవ్వ బర్రె ఏం జేసిందనుకున్నారు.. దొరగారి మందల కల్సిపోయింది. దొర రెండేళ్లుగా తన బర్రెలు సుడికత్తా లేవాయే.. వాటి గోసగావట్లే అని పంజాబ్‌ నుంచి మొన్ననే లక్ష రూపాయలు పెట్టి.. ఓ మంచి దున్నపోతుని కొనుకచ్చిండు.."
     అవునవును.. ఆ పోతు నల్లగా నిగనిగలాడుతూ యమ ధర్మరాజు వాహనం లెక్కనే వున్నది. దానికి పోతురాజు అనే పేరుపెట్టిండ్రు. నేను జూసిన దాన్ని" అన్నాడు చేతులో పెండ తట్ట, మాసిపోయిన జబ్బల బనీనుకి చినిగిపోయిన తెల్ల రంగు లాగుకు పెండమరకలతో పన్నెండేళ్ల రాజు గాడు.
     అయితే ఆ పోతు పాడుగాను.. వచ్చినప్పట్నుంచి దొర బర్రెల మీద ఒక్కదాని మీదనన్న పారలేదు. లస్మవ్వ బర్రెలో ఏం కనిపించిందో దానికి.. లస్మవ్వ బర్రె మీద పారింది. గది దొరగారి వాకిట్లనె జరిగింది.. దొర జూసిండు.. ఇంకేంది కన్నెర్ర జేసిండు. దొరగారి మందకంటే ముందే బర్రెనిడిసిపెట్టిన లస్మవ్వ బర్రెని బంజారుదొడ్లకు వోయింది.." అని చెప్పిండు.
     "లచ్చ రూపాయిలు పోసి పోతుని కొనుక్కొచ్చింది వూరొళ్ల బర్ల మీద పారడానికా.." అని కూడా అన్నారు ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పాడు పట్వారి.
     "అరే.. దొర ముందటనే జరిగిందా.. అయితే మనకు తెల్వది", అందరూ జారుకున్నారు. గిట్లనే నిన్న, మొన్న రెండు బర్రెలకు జరిమానా వేసిండ్రు..
     అందరూ వెళ్ళిపోయాక.. పట్వారి లస్మవ్వతో మెల్లిగా అన్నాడు ఃఃదొరకి నేను ఏదో విధంగా నచ్చజెప్తా.. ఆ రెండొందలు నాకిచ్చయేఃః, అంటూ లాక్కొని అంగి జేబులో పెట్టుకున్నాడు. లస్మవ్వ బంజరు దొడ్లోని బర్రెను ఈడ్చుకుంటూ తోల్కపోయి మళ్ళా మందోటలో ఇడిసిపెట్టింది.
     పొద్దు గూట్లె పడంగానే..
     లస్మవ్వ బర్రె ఉరుక్కుంటూ వచ్చింది. తనివి తీరా నాలుకతో దుడ్డె బొక్కుని నాకింది. లస్మవ్వ ఇంటెనుక మట్టుకి కట్టేసిన తన బర్రెని కంక కట్టే తీస్కొని ఇయ్యరమయ్యర జోపింది. బర్రెది మందం తోలైనా.. వాతలు పడి నల్లటి సారలు పడుతున్నాయి. బాధగా ఃహ్రాయి.. హ్రాయిః అని అరుస్తూ.. మెడకు కట్టేసిన ఇనుపగొలుసును తెంపుకొని పారిపోవాలన్న బాధగా మట్టు చుట్టూ తిరుగుతుంది. లస్మవ్వ మనవరాలు రాధ పసిగడుగులున్న బక్కెట్‌ తీస్కొని ఇంటెనుకకొచ్చింది.
     అప్పటికే లస్మవ్వ.. "నిన్ను పోశవ్వ మింగ.. నిన్ను మైసమ్మ ఆర్నామ్‌ కొట్ట. నీ కనరు కాట్లేవెట్ట.. నిన్ను ఇడ్పిచ్చుటానికి రెండొందలు జర్మాన కడితిని.. ఇంకోసారి బంజరు దొడ్ల పడ్తావా", అంటూ చితకబాదుతుంది. బర్రె పెయ్యి మీద అక్కడక్కడా తోలు చిట్లి రక్తం కారుతుంది.
     రాధ ఉరుకొచ్చి.. కంక బరిగె ఇగ్గుకుంటూ "అవ్వ.. ఆపవే .. పాపం అది మూగదే . దాన్ని సంపుతవే.. నీ బొందవెట్ట గీ పసిగడుగులు (నీళ్లు, తౌడు, అన్నం మెతుకులు, ఉప్పు) దాన్ని తాగనియ్యే.. అవ్వ.. బాంచెన్‌ కొట్టకే" అంటూ లస్మవ్వ చేతుల్లోని కన్కకట్టేను తీస్కోడానికి ప్రయత్నం జేసింది.
     "దీన్ని వెలుకానికి ఇంకా పసిగడుగులు దెచ్చినవానె.. గడ్డిపొస కూడా బెట్ట.. బంజరు దొడ్లే పడి నా మానం దీసింది" అంటూ బర్రెని మరింత చితక బాదుతోంది. రాధ ఎంత వాదించిన లస్మవ్వ వినట్లేదు..
     "రెండొందలు జరిమానా కట్టిన.. దీన్ని అర్నమియ్య" రాధా లస్మవ్వని పక్కకు ఇగ్గింది.
బఱ్ఱె సహనం సచ్చి కుమ్ముతే.. ముసల్ది నడుమిర్గ పడ్తదని భయం. బర్రె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బాధగా అరుస్తుంది. ఇనుప తనుగు తెంచుకొని పారిపోవాలని తిరుగుతుంది.
     రాధవ్వ చెయ్యి ఇడిపించుకొని.. బర్రెని మరింత బాదింది లస్మవ్వ. రాధవ్వ మళ్ళీ అడ్డుపడింది..
     అయినా... దీన్ని దొంగలెత్తుకపోను.. దీన్ని కోతకు ఇయ్య.. నీకు గోమర్లు పడ్తే తీసేసిన నీ కండ్లల్ల బుసులు తోడితే తీసిన.. నువ్వు పోతుని కన్నా.. జున్నుపాలు పిండక నీ దుద్దబొక్కకే ఇడిసిపెట్టిన. నీ నాలుకకు రుచి తగులాలని తెల్క పిండిని పెట్టిన, కైశిప్ప తోని గీకిన పాలగోకు వాడల పోరగాండ్లకు కాకుండా నీ దుడ్డె బొక్కకే తీసిపెట్టిన. నీ వల్ల నేను గురుజేత్తు బంగారం కొనుక్కుంటినా.. మాసమెత్తు ఎండి కొనుక్కుంటినా..ఃః అని ఇంకా కొడుతూనే ఉంది. కొట్టి కొట్టి కంక బద్ధ చెదిరిపోయింది.
     రాధవ్వ కోపంగా అరిచింది..
     "అవ్వ.. ఆపవే .. అయినా దానికి దొరగారి పోతని తెల్వది గదనే.. ఇంకాపు. ఏందే బర్రెని చంపుతావా" అని కింద రొచ్చులోనే కూల బడింది...
     "సంపినా సంపుతా.." లస్మవ్వ
     "గిప్పుడు దాన్ని కొడితే ఎం ఫాయిదానే.. నీకు నీ అవ్వ పేరే పెట్టిండ్రు కదా.. దాని సాలు నీ బర్రెకచ్చింది" రాధవ్వ ఏడుస్తూ అంది. ఆ మాటకు లస్మవ్వ నోట మాటరాక ఆగిపోయింది. రాధ లేచి లస్మవ్వని మెల్లగా ఇంటిలోపలికి తీసుకెళ్లింది.
     పసిగడుగుల బక్కెట్‌లో మూతి పెట్టిన బర్రెకు అవి రుచించలేదు. దాన్ని కొమ్ములతో కుమ్మింది.. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బాధగా వాళ్ళ వైపు చూస్తుండి పోయింది. పసిగడుగుల పుల్లటి వాసనకు ఈగలు జబ్బుమని లేచి వాలుతున్నాయి.
     బర్రెకు తాకిన దెబ్బలకన్నా రాధవ్వ మాటకి మనసు గిలగిలా కొట్టుకుంది. నులక మంచంల పడుకొని కళ్ళల్లో నీళ్లు కదలాడుతుంటే... మూల వాసానికి కట్టిన వెలిసిపోయిన బాసింగాలనే చూస్తుండి పోయింది.
     'తన అవ్వ సాలు పడ్డద', ఉలిక్కి పడింది లస్మవ్వ. చప్పున అవ్వ చెప్పిన వినాయకులు గాడు గుర్తొచ్చాడు...
     మనసు మూలల్లో మరుగునపడిన దశ్యాలేవో కళ్ళల్లో కద లాడాయి.. తన వల్లే వినాయకులు గాడు చచ్చిపోయాడా...?!
     ఒక్కరాత్రి వాడితో పడుకున్నందుకు.. వూరోళ్ళు తను బర్రెని కొట్టినట్టు కొట్టి చంపేసారు కదా... తప్పు నాదేనని అవ్వ మొత్తుకున్నా... ఎవరు విన్లేదు. తనకు పదమూడేళ్లకే రాజేశంతో పెండ్లి జేశారు. యాడాదికే రాజేశం పాము కుట్టి చనిపోతే ముండ బొడ్డిని జేసిండ్రు..
     అవ్వకు పదహారేండ్ల వయసుండగా...
     ఒకనాడు.. పంచాయతీ పెద్దలంతా కూసోని ఏదో ఊరి సమస్యని విపరీతంగా చర్చించుకుంటున్నారు. తాను, వినోద, సుజాత, రంగవ్వ, సత్తెవ్వ చంకలో బిందెలు పట్టుకొని చెలిమె నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు.. పంచాయత్‌ పెద్దమనుషుల్లో... ఒకాయన గట్టిగా, 'ఈ బర్రెలకి కూడా మంచి పోతుల్ని సూడాలేః అన్నాడు. అంతా గట్టిగా నవ్వారు.
     " ఏందే.. సూరన్న కాక.. మమ్మల్ని జూసి వక్కడవక్కడ నవ్వుతుండ్రుఃః కోపంగా అడిగింది సుజాత. పంచాయతీ పెద్దల్లో ఒకాయన .. ''అది కాదు బిడ్డ.. ఇక్కడ పోతు పంచాయతీ జరుగుతుంది. ఊర్లో ఇంటింటికి బర్రలున్నాయి. ఒక్కటి సూడికి రాకపాయి. పాలు పెరుగుకు గోస గావట్టె... ఇంత పాడిని ఇంట్ల పెట్టుకొని పాల కోసం పక్కూర్లోకి పోవడ్తిమి. అందుకు వూరోలందరం మనిషికిన్ని పైసలేసుకొని.. ఒక పోతుని కొనాలనుకుంటున్నం బిడ్డ ..'' అన్నాడు.
     ఆ మాటల్లోని అంతరార్ధం ఎరిగాక.. అందరి మొహాల్లో సిగ్గు చిటారుకొమ్మేక్కింది. నవ్వుతు వాగు దగ్గరికి పరిగెత్తారు. తను మాత్రం అక్కడే నిల్చుంది.
     ''మనం ఎం జేయాలంటే ఇంటింటికి పోయి ఎవరికెన్ని బర్రెలున్నాయో లెక్కవెట్టాలె. రెండు మూడు బర్రెలునోళ్లు ఎక్కువ పైసల్‌ ఇయ్యాలే. పైసలన్నీ జమైనాక జగిత్యాల అంగట్లోకి పోయి... బలమైన దున్నపోతుని కొనుక్కు రావాలె''.
     ''ఇంటింటికి అంటే ఎవలిత్తరు.. బర్రెలునోళ్లే పోతుకు డబ్బులియాలే..''', అన్నాడొక పెద్దమనిషి. నేనంటాను గదంటే... బర్రెకి ఐదువందలైయ్యాలే'', ఇంకో పెద్దమనిషి.
     ''అయిదు నూర్లంటే కష్టం.. బర్రెకు మూడు వందలేసుకుందాం'' అన్నాడొకాయన. తాను అక్కనుంచి వాగు వైపు కదిలింది.
     ఓ అర్ధ రాత్రి.. నక్సలైట్లు గడీ మీద పడి దొరను దారుణంగా చంపేసారు. గుమ్మాల కొద్ది ఉన్న ధాన్యాన్ని బావిలో పారబోసిండ్రు. అడ్డుకున్న పాలేరోల్ని తుపాకులు పెట్టి బెదిరించిండ్రు. ఎడ్ల కొట్టంలో కట్టేసిన ముప్పై వరకు ఆవుల్ని బర్రెల్ని విడిచిపెట్టారు. తుపాకుల శబ్దానికి అవి చెల్లా చెదురై పరిగెత్తాయి. ఊరు గజగజ వణికిపోయింది. బాంబులతో గడిని పేల్చేశారు. పోతు రాజు మాత్రం అచేతనంగా అలాగే నిల్చుండి పోయింది. అప్పట్నుంచి ఊర్లోకి పోలీసుల జీపులు.. విలేకర్లు ఎవరెవరో వచ్చి పోతున్నారు.
     ఆ రోజు నుండి పోతురాజును ఎవరు పట్టించుకోలేదు. పంచాయతీ నాటి తీర్మానాన్ని కూడా అందరూ మర్చిపోయారు. పోతురాజు దీనంగా ఊర్లో అడవిలో తిరుగుతూ ఉండేది. దాని మెడకి పుండైంది. శరీరమంతా జనిగలు పట్టి రక్తాన్ని పీల్చిన దాన్ని ఎవరు పట్టించుకోలేదు. గోమార్లు ఈగలు పట్టి బక్కచిక్కి మునపటి హుందాతనం లేక ప్రతి ఇంటి ముందుకొచ్చి అరిగోసోలే నిల్చుండేది. ఎవరైనా కుడితి నీళ్లు పెడితే తాగేది. శరీరమంతా పాకుతున్న పుండుపై ఈగలు కొండ దోమలు జొబ్బుమనడంతో దాన్ని వాకిట్లకి ఎవరు రానిచ్చే వారు కాదు. దాన్ని చూసి దొరున్నప్పుడు పోతురాజు నల్లగా నిగనిగలా అల్లనేరేడు పండ్లలెక్క ఎలా ఉండేది. దొర కంటే గంబీరంగా హుందాగా అడుగులో అడుగులేసుకుంటూ ఎలా వచ్చేది అని ఊరోలంతా గుసగుసలు పెట్టేవారు. ఇప్పుడు బయటకే అనేస్తున్నారు.
     లస్మవ్వ ఇంటి ముందు దీనంగా నిల్చుంది పోతురాజు. మెడకిందైనా పుండు మీద వాలుతున్న ఈగల్ని తోకతో కొట్టుకోలెక పోయినంత బలహీనమై... పక్క బొక్కలు తేలి.. సొల్లు కార్చుకుంటూ.. దీనంగా నిల్చుంది.
     లస్మవ్వని చూడగానే ముందుకు రాబోయి.. ఎవరో దొంగ గొడ్లకు కట్టే మెడ కొడెం కాలికి తగిలి నిల్చుండిపోయింది.
     లస్మవ్వ దాన్ని చూసి జాలిపడుతూ.. ఇంట్లోంచి కుడితి నీళ్ల బక్కెట్‌ తెచ్చి ముందర పెట్టింది. దూప తీరెనోడు తాగినట్టు.. ఈగల్ని చెవుల్లో అదిలించుకుంటూ తాగింది. 'అంబా' అని అరిచింది.
     లస్మవ్వకి ఆ పిలుపు.. అమ్మా అన్నట్టుగా విన్పిస్తుంది.
     లస్మవ్వకి కొన్నాళ్లకు పెండ్లయింది...
     లస్మవ్వ పెండ్లి పందిరి దగ్గరకి వచ్చి నిల్చుంటే.. గంభీరమైన దాని రూపం జూసి తన అత్తగారోళ్ళు బిత్తరవోయిండ్రు. అందరిలోనూ పోతురాజు గురుంచే చర్చ.
     లస్మవ్వ తన అత్తగారింటికి పోయేరోజు... పోతురాజును కూడా గుర్తుకుతెచ్చుకొంది.
     లస్మవ్వ ఆర్నెల్లు తమ్ముడి కొడుకు దగ్గరుండడానికి గొల్లపల్లికి పోయింది. వచ్చి రెండు మూడు రోజులైనా .. పోతు రాజు కన్పించక పోతే.. అటుగా వెళ్తున్న మల్లేశం మామని అడిగింది, ''మామ.. పోతురాజు కన్పిస్తలేడేన్దే'' అని.
     ''నీకింకా తెల్వది కదా బిడ్డ... మూన్నెల్ల కింద ఆకలితో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయింది.. దొరవోయినంక.. దాని బతుకు ఆగమైంది. దాని మూతికి పచ్చగడ్డి కూడా ఎర్కలేకపాయె.. తేలకపిండి తిన్నపానం.. ఎవలు పట్టించుకోలే. దొర వోయినట్టు పిడాత పోయినా మంచిగుండేది. గడీల పాపాలన్నీ దానికే చుట్టుకున్నాయి'' నిట్టుర్చాడు మల్లేశం.
     ''నీకు ఎరుక లేదుగానీ బిడ్డా.. ఊరోళ్ల బర్రెలు కూడా దాన్ని కుమ్మేసినాయి.. కుక్కలు కూడా దాన్ని చూస్తే చాలు భయంకరంగా మొరుగేటియి. దొరున్నన్ని రోజులు పోచమ్మ ముందర పోతలింగం లెక్క సాగించుకుంది.. ఇప్పుడేమైంది, రాజు వోయినంక రండ కొడుకు అన్నట్లయింది'' మల్లేశం.
     ''పాపం దున్నపోతు'' చిన్నగా నవ్వుకుంది లస్మవ్వ.
- కె.వి.నరేందర్‌, 9440402871

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్యూషన్‌
మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.