Sun 29 Aug 00:57:39.862391 2021
Authorization
ప్రియా..!
పగలో, రేయో అర్థం కానంతగా
ఆకాశం నిండా మబ్బులు కమ్మేసాయి
అయితే ఏమిటిలే?
నీ కలల దీపాల్ని కళ్ళల్లోకి తీసుకుని,
నీ తలపుల వెలుగుల వెంబడి
నీ పిలుపు వినవస్తున్న వైపుగా ....
గుండె నిండా ధీమాతో అడుగులు వేస్తున్నాను.
సఖీ..!
నీ ప్రేమ నాకు తోడై నడవగా నీడై నిలువగా
ఎన్నో ఊసులు.... ఎన్నెన్నో ఊహలు...
మరెన్నో వాగ్ధానాలు....
ప్రియమైన ప్రమాణాలు...
అన్నీ మూట కట్టుకుని,
పున్నమి రోజుల్లో మనం కలసి నడచిన దారుల్లో....
నీకై నడచి.. నడచి
అలసి...సొలసి...
నీ హదయ సామ్రాజ్యం దిశగా వస్తున్న నన్ను
పిల్లగాలులు అనుసరిస్తున్నాయి
ప్రకతి అందాలు స్వాగతం పలుకుతున్నాయి
నిశ్శబ్దం సైతం నాదమై
నీ మాటల మధురలాను పంచుతుంటే
నా నిజాయితీ ఇప్పుడు సాక్షిగా నిలుస్తున్నది....
నేస్తమా..!
అనంతమైన భావోద్వేగంతో
ఊహలు ఎగిసిపడుతుంటే
నీ పెదాల్ని తాకడానికి పూలన్నీ
తపించిపోతున్నాయి...
సంపెంగలతో సరితూగే
నీ పాదాల సుకుమారాన్ని స్పశించేందుకు
నదీనాదాల సోయగాలన్నీ పోటీపడుతున్నాయి...
నీ కురుల పరిమళాల బిక్ష అడగడానికి...
మేఘాలు వంగి వంగి నిన్ను పిలుస్తున్నాయి....
నా మాట వినకపోయినా
ఈ సష్టి మాటయినా విని..
నాకు చేరువగా రా ప్రియా...!
- పొన్నం రవిచంద్ర, 9440077499