Sun 12 Sep 05:11:39.174238 2021
Authorization
కనకదేహమయి ఈ సుకన్య ఎవరు?
ముగ్ధ, మత్త మంజులమూర్తి
వివర్ణ వదనాన వ్యక్తమైనది,
మధుర కపాదష్టి ప్రసరిస్తున్నది !
ఆమెను కౌగలించుట అనుచితం,
తనభార్యకు చేసే మోసం
మన్మధలీల సదా అనాలోచితం,
ప్రబలమైనది అతి చాపల్యం!
కర్ణవీరునికి వేదన నొసగె,
మత్స్య ఛేదన విలువను పెంచె
సూతపుత్రుని ఉత్సాహం చూసె,
పాండుపుత్రునితో బంధం కలిసె !
పరుల చేతితో చేయి కలపటం,
కాదా నరుని అపరాధం?
అంతా అందురు నను అబలా, దాసీ
ఆజ్ఞాధీనను, కానీ సబలను!
వ్యాకులపత్ని ఆలోచనలు,
అపుడే విన్నది అధిక కుతూహలబీ
ఉచ్చస్వరాన కన్య అన్నది,
''ఓ దేవీ !, నా దోషం కాదు!''
పూర్ణపురుషుడు నాధుని చిరునవ్వులు చూస్తున్నది,
రణరక్షకుడు గాండీవి, మదంగం హసిస్తున్నది బీ
కంపితపతి చూసి, రెప్పవేయక సతి యోచించింది,
వీరుడు విరూపాన్నీ
నిశ్చల నియతిభారాన్నీ సహిస్తున్నాడు!
(సైరంధ్రి అనువాద కావ్యంలోంచి)
గుజరాతీ మూలం,
హిందీ అనువాదం :
డా. వినోద్ కుమార్ జోషి
తెలుగు సేత : డా, సి. భవానీదేవి, 9866847000