Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • మ్యూజిక్ లిటరేచర్
  • ➲
  • స్టోరి

సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట

Sun 03 Oct 03:37:52.206569 2021

ఈ దౌర్జన్యం ఇంకా ఎన్నాళ్ళు? తరతరాలుగా న్యాయానికి జరిగే ఈ అన్యాయాన్ని ఎవరూ ఆపలేరా? ధర్మం కోసం ఇలాగే నిరంతరం పోరాడుతూనే ఉండాలా? ఆశలు తొలగిపోయి నిరాశల చీకట్లు నిన్ను చుట్టు ముట్టినా నువ్వు చతికిలబడిపోకుండా తొలివెలుగులా ప్రకాశిస్తూ, ప్రశాంతమైన బాటలో నువ్వనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని హెచ్చరిస్తుందీ పాట. న్యాయం కోసం ఎన్నేళ్ళైనా, ఎన్నాళ్ళైనా సాగమని ప్రబోధిస్తుంది.
     మన భారతదేశ న్యాయవ్యవస్థ అందరికీ ఆదర్శప్రాయమైనది. మన రాజ్యాంగంలో రాయబడిన శాసనాల ఆధారంగానే మన హక్కులు, అధికారాలు నిర్ణయించబడతాయి. అన్యాయం జరిగినపుడు ఏ శిక్షలు విధించాలో కూడా అందులోనే రాయబడ్డాయి. అయితే - న్యాయానికి రక్షణ, అన్యాయానికి శిక్షణ అనేది అనాదిగా జరుగుతున్నదే. జరగాల్సింది కూడా అదే. కొన్ని సందర్భాల్లో న్యాయానికి రక్షణ లేకపోవచ్చు.
    ఇక్కడ - 'నాంది' (2021) సినిమాలో ఒక సగటు మనిషికి కూడా జరిగిన అన్యాయం అదే. ఏ పాపం తెలియని, ఏ నేరం చేయని, ఎవ్వరికీ హాని తలపెట్టని ఒక నిజాయితీ గల పౌరుడికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుందీపాట. తనకు జరిగిన అన్యాయానికి, తన మీద పడ్డ నిందని తానే తుడిచివేసుకోవడానికీ ఆ పౌరుడే ప్రతిఘటించడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఈ న్యాయ,అన్యాయాలకు మధ్య జరిగే ఈ సంగ్రామంలో న్యాయం వైపు నిలబడి మ్రోగే ఈ మహౌజ్జ్వల గీతాన్ని రాసిన కవి చైతన్యప్రసాద్‌. భాషా వేశంలోను,భావ ప్రకటనలోను ఆయనకు ఆయనే సాటి. అధ్యయన శీలంతో ఎంతో అనుభవాన్ని పొంది, వినూత్న అభి వ్యక్తితో సన్నివేశాల కనుగుణంగా పాటను కవిత్వీకరించడంలో చైతన్యప్రసాద్‌ దిట్ట.
    సినిమాకథ పరంగా చూస్తే కథానాయకుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించ డానికి తనవైపు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ తాను పెట్టుకున్న దరఖాస్తు సెక్షన్‌ - 211 కు చెందినది. అంటే ఐదేళ్ళు తాను అన్యాయంగా శిక్షను అనుభవించిన బాధితుడనని, నిందితుడిని కానని తాను చెప్పుకుంటూ పెట్టుకునే దరఖాస్తు ఇది.
    ఈ దౌర్జన్యం ఇంకా ఎన్నాళ్ళు? తరతరాలుగా న్యాయానికి జరిగే ఈ అన్యాయాన్ని ఎవరూ ఆపలేరా? ధర్మం కోసం ఇలాగే నిరంతరం పోరాడుతూనే ఉండాలా? ఆశలు తొలగిపోయి నిరాశల చీకట్లు నిన్ను చుట్టు ముట్టినా నువ్వు చతికిలబడిపోకుండా తొలివెలుగులా ప్రకాశిస్తూ, ప్రశాంతమైన బాటలో నువ్వనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని హెచ్చరిస్తుందీపాట. న్యాయం కోసం ఎన్నేళ్ళైనా, ఎన్నాళ్ళైనా సాగమని ప్రబోధిస్తుంది.
    నువ్వనుకున్న గమ్యాన్ని ఈరోజే చేరాలి. ఈ యుద్ధంలో న్యాయానికి గెలుపు ఉన్నదో,లేదో అన్న సందేహాన్ని విడిచిపెట్టాలి. నీ ప్రయత్నం ఫలించాలంటే నీ సంకల్పం బలంగా ఉండాలి. ఒకవేళ నీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, నీ దారులన్నీ ఎడారులై మూసుకుపోయినా, విధి నీ ప్రాణాలతో చెలగాటమాడినా, నీ సంకల్పమే, నీ ఆశయమే సందేశమై, ఒక సంఘర్షణై నిలవాలి.
    ఈ అవినీతి చర్యలను గోతిలో పాతడానికి నీ సంకల్పమే నాంది కావాలి. నిద్రలేని రుద్రవీణ ఎలుగెత్తి వినిపించడానికి, గాయపడిన న్యాయమనే సింహం తిరిగి గర్జించడానికి, రాక్షసాన్ని కూల్చడానికి ఇదే నాంది కావాలి.
    అడుగు ముందుకు వేశాక భయపడితే ఇక భవిష్యత్తు లేదు. అది బతుకే కాదు. యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు నీ సాహసమే నీకు తోడు కావాలి. వెనుకడుగు వేస్తే అది సమరమనిపించుకోదు. సవాళ్ళను ఎదుర్కొంటూ, అరాచకాల్ని ధిక్కరిస్తూ సాగిపో. ఇక సహనంతో నువ్వు ఆగిపోతే మార్పు రాదు. మంచి జరగదు. ఇన్ని రోజులు భరించిన బాధల్ని గుర్తుచేసుకో. దగాలు ఇక కుదరవని చెప్పు. దిగులు ఇక వదలమని జగతికి చాటి చెప్పు. నీ నిజాయితీ గెలిచి ప్రపంచాన్ని మేల్కలిపే తీర్పు ఇదే రోజని తెలియజెప్పు.
    నీ కంటినీరు మంటలాగ మారడానికి, నువ్వు రక్తాన్ని ధారవోసి, నీలా అన్యాయమైపోతున్న ఎందరెందరికో కొత్తబాటను వేయడానికి, నువు కోరుకున్న సరికొత్త చరిత్రను రాయడానికి, చేవచచ్చిన శాసనాన్ని నీ సంకల్పంతో మార్చడానికి ఇదే నాంది కావాలి. ఒక్క ఉక్కు గుండె తలచుకుంటే సాధించలేనిదేదీలేదని నువ్వు నిరూపిం చాలి. నువు పోరాటంలో జయిస్తే, న్యాయం ఎప్పటికీ గెలుస్తుందన్న నమ్మకాన్ని నిలబెట్టినట్టు. అందుకే పొరాటం చేసి విజయాన్ని సాధించమని మహౌన్నత సందేశాన్నిస్తుందీపాట. అన్యాయం జరిగినప్పుడల్లా న్యాయం వైపు నిలబడి శంఖారావమై నినదిస్తుందీపాట.
పాట‌:-
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా దౌర్జన్యాలా జ్వాలా? / న్యాయం కోసం ధర్మం కోసం సాగాలమ్మా మీలా? / నిరాశలా నిశీథులే నిరంతరం ఆవరించినా / ప్రభాతమై ప్రకాశమై ప్రశాంతమై సాగుమా / చేరాలమ్మా చేరాలమ్మా నీ గమ్యాన్నే నేడూ / సమరం మధ్య సంకోచాలా సందేహాలే వీడూ / నీ దారులే ఎడారులై ప్రాణాలతో ఆటలాడినా /సంకల్పమే సందేశమై సంఘర్షణై సాగుమా.
    ఇదే నాంది ఘాతుకాల్ని గోతిలోన పాతడానికీ /ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ / ఇదే నాంది గాయపడ్డ న్యాయసింహ గర్జనానికీ / ఇదే నాంది రాక్షసాన్ని కూల్చడానికీ.
    భయపడితే భవిత లేనే లేదు / పిడికిలినే వీడరాదు / సమరములో సాహసాలే తోడు / వెనుకడుగే వేయరాదు / సవాలు కెదురుపడూ సయ్యంటు తిరగబడూ / సహించి నిలబడితే మార్పే రాదూ / దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ / జగాన్ని మేల్కలిపే తీర్పే నేడూ.
    ఇదే నాంది కంటినీరు మంటలాగ మారడానికీ /ఇదే నాంది రక్తమోడ్చి కొత్తబాట వేయడానికీ / ఇదే నాంది చేవలేని శాసనాన్ని మార్చడానికీ / ఇదే నాంది ఒక్క ఉక్కు గుండె శక్తి చాటడానికీ.
- తిరునగరి శరత్‌ చంద్ర , 6309873682

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కల'వరమై'న పాట
స్నేహబంధమై నిలిచిన పాట
ప్రేమానుభూతియై పరిమళించిన పాట
లోకం గుట్టును విప్పి చెప్పిన పాట
భారతజాతికి జైకొట్టిన పాట
ప్రపంచ పోకడల పంచపదులు...
మనసు తెరకు కొత్తరంగులద్దిన పాట
పరవశింపజేసే మనసు పాట
గిలిగింతలు పెట్టే ప్రేమ పాట
మనసున మోగే 'మధురమై'న పాట

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.