Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హింస తాక‌ని బాల్యం బాల‌ల‌ హ‌క్కు‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

హింస తాక‌ని బాల్యం బాల‌ల‌ హ‌క్కు‌

Sun 10 Oct 04:14:11.645847 2021

లైంగిక వేధింపులు - లైంగిక హింస అంటే అత్యాచారం జరిగితేనే అది వార్త అది కూడా అన్ని సార్లు అందరి విషయంలో కాదు. పిల్లలపై జరిగే లైంగిక హింస పలు రకాలు. ఏ రకంగా జరిగినా అది పిల్లల్ని కృంగ తీస్తుంది. జీవితాంతం వెంటాడుతుంది.
   తొమ్మిది రోజుల 'బతుకమ్మ ఉత్సవాలు ఆరంభమయి కొనసాగుతున్నాయి, తెలంగాణ సంస్కృతికి అచ్చమైన ప్రతిరూపంగా వున్న పండుగ పేరులోనే 'బతుకమ్మ!' అని వుందంటే సరిగా బతకలేక పోతున్నదన్న ధ్వని వినపడుతోంది. నిజమే తరతరాలుగా ఆడపిల్లలు అనేక కష్టాలను , వివక్షతలను ఎదుర్కొంటూనే వున్నారు. నేటికీ అవేమీ తీరలేదు. మరిన్ని కొత్త కష్టాలు, కొత్త అసమానతలు, అవమానాలు వస్తున్నాయి. ఆకాశంలో సగమని, స్త్రీ పురుషులు సమానమని అందంగా ఎన్ని చెప్పుకున్నా, రాసుకున్నా... ఆచరణలో అసమానతనే చూస్తున్నాము. అవిగాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, హింస స్త్రీలపైనా, చిన్న పిల్లలపైనా పెరిగాయి. చిన్నారుల బతుకుకు భరోసా లేకుండా పోయింది. సమస్యను మూలాల నుంచి పరిష్కరించాలన్న సంకల్పము పాలకులకు లేకపోగా స్త్రీ రెండవతరగతి పౌరులుగా, వంటింటియే పరిమితమవ్వాలన్న ఆలోచనలు నేడు రాజ్యమేలుతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొని స్థయిర్యంగా ముందుకు పోవటానికి 'బతుకమ్మ' పండగను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ సందర్భంగా సమాజంలో ఎలాంటి హింస, ఎంత అన్యాయంగా ఆడపిల్లలపై జరుగుతోందో తెలుసుకోవడానికి దేవి గారి వ్యాసం దోహదపడుతుంది.

     వరంగల్‌లో తొమ్మిది నెలల పసికూనని తల్లి వడి నుంచి ఎత్తుకెళ్ళి అత్యాచారం హత్య చేసిన ఘాతుకం. చేసినవాడు 19 ఏండ్ల వాడే. వీధుల్లో పెరిగాడు. మత్తుకు బానిస తాను అత్యాచారాన్ని భరించాడు. ఈ ఘటన చేసినపుడు ఏం చేస్తున్నాడో తెలీని స్థితిలో ఉన్నాడు. చట్టం అతని మానసిక రోగిగా గుర్తించినది. సమాజం నివ్వెర పోయింది.
    ''హైదరాబాద్‌లో ఆరేండ్ల బాలికపై అఘాయిత్యం''తో రాష్ట్రం ఉలిక్కిపడింది. నిందితుడి ఆత్మహత్య జరిగింది. ఇదే సమయంలో చెత్తసేకరించుకునే కుటుం బంలో 13 నెలల బిడ్డ బలైయ్యింది. కాని ఎవ్వరికి తెలియదు.
     రోజువారిగా రొటీన్‌గా బాలలపై రకరకాల హింసలు జరిగిపోతూనే వుంటాయి. కాని ఒక సమాజం దేన్ని నేరంగా పరిగణిస్తుందో దానిని బట్టి స్పందన కూడా వుంటుంది. ఇంట్లో బాలల్ని నిందించడం, తిట్టడం, కొట్టడం సర్వసాధారణం. ఇవన్నీ వారి మంచికే వాళ్ళ మాట వినడం లేదు కాబట్టి అని సమర్థించుకుంటాం. చదవకపోతే కఠినంగా దండించాలనేది మన అలవాటు. ఇవన్నీ పిల్లలపౖెె ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో కూడా మనం ఆలోచించం.
    ఇక లైంగిక వేధింపులు - లైంగిక హింస అంటే అత్యాచారం జరిగితేనే అది వార్త అది కూడా అన్ని సార్లు అందరి విషయంలో కాదు. పిల్లలపై జరిగే లైంగిక హింస పలు రకాలు. ఏ రకంగా జరిగినా అది పిల్లల్ని కృంగ తీస్తుంది. జీవితాంతం వెంటాడుతుంది.
    అభివృద్ధి చెందిన దేశాలలో 60 ఏండ్ల క్రితమే దీనిపై చర్చ ప్రారంభం అయ్యింది. దానిని తీవ్రమయిన నేరంగా పరిగణించడానికి వారికి 20 ఏండ్లు పట్టింది. ఎందుకంటే 'చైల్డ్‌ ఎబ్యూజ్‌'' బాలలపై లైంగిక హింస 96 శాతం కుటుంబాలలో జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బాబాయిలు, మామలు, అన్నదమ్ములు, ఇరుగుపోరుగు, తల్లిదండ్రుల స్నేహితులు, సన్నిహితు అంటే బిడ్డలకు పరిచయస్తులు తెలిసిన వాళ్ళ వల్లనే 96 శాతం జరుగుతుంది. మన దేశపు గణాంకాల్లో ప్రతీ ఏడాది ఇది ప్రస్పుటం అవుతున్నది.
    దీనిని నేరం చేయటం కుటుంబ నిర్మాణానికి దెబ్బ అని భావించడం వలన తీవ్రమయిన చర్చ జరిగింది. పిల్లలు విశ్వసించే ఆధారపడే పెద్దలు ఈ పని చేస్తారని చాలా మంది అంగీకరించలేదు. పరిశోధకులు కూడా దీనిని వెనక్కి నెట్టేశారు.
    1672లో బిడ్డపై అత్యాచారం చేసిన తండ్రికి శిక్షపడింది. కాని 1984 తర్వాతనే దీనిని నేరంగా పరిగణించారు. పిల్లలకు లైంగిక చర్యలపై పూర్తి
    అవగాహన ఉండదు. వారి వయస్సు రీత్యా ఇటువంటి చర్చలకు లేదా సంబంధాలకు వారు అంగీకారర తెల్పడం సాధ్యం కాదు. 18సంవవత్సరాల వరకూ అంటే వారి అవగాహన పెరిగిన తర్వాతనే అది అనుమతిగా భావించవచ్చు. కాబట్టి 18 సంవత్సరాల లోపు బాలలపై అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరితో ఏ రకమైన లైంగిక చర్యలకు పాల్పడినా అది నేరమే అవుతుంది.
    లైంగిక అత్యాచారం అంటే కేవలం అమ్మాయిలపైనే జరుగుతుందని మన భావన అబ్బాయిలపై లైంగిక బలత్కారం జరుగుతుందనేది మన సమాజంలో చాలా మంది ఊహకు కూడా అందదు. మన దేశంలో లైంగిక హింసకు గురవు తున్న వారిలో 58 శాతం బాలికలు 49 శాతం బాలురు.
    చాలా దేశాలలో 13 సంవత్సరాలు దాటాకా వారి సమవయస్కులతో సన్నిహితంగా మెలగడం నేరం కాదు. కాని పెద్దల లైంగిక చేష్ట నేరం. మన దేశంలో ఇక విచిత్ర స్థితి ఉంది. బాలలపై లైంగిక హింస పాశ్చాత్య సంస్కృతి అని నెట్టేస్తారు. కాని ''అర్షాభవిత్‌ కన్యా'' రజస్వల కాని బాలికకు పెళ్ళి చేయాలి అన్న మనువు రెండు వేల ఏండ్ల నుంచి కన్యలు, బాలికలు స్వచ్చత పవిత్రతలను వాటిపై ముసలి భర్తల అత్యాచారా హక్కును మన మెదళ్ళలో స్థాపించి పోయారనేది కప్పిపెడతారు.
    బహుశా బాలికలపై భర్తలు చేసేది ఎంతటి లైంగిక క్రూరత్వం అయినా అత్యాచారం కాదని ఈ ఛాందసులు భావిస్తుండొచ్చు. బాల్య వివాహం నిషేదచట్టంపై చర్య ప్రారంభం అయ్యింది. ఒక తొమ్మిదేండ్ల బాలికపై యాభైఏండ్ల భర్త మళ్ళీ మళ్ళీ అత్యాచారం చేయటం వలన మరణించిన సందర్భంలోనే యిప్పటకీ అది కొనసాగుతూనే వుంది.
    బీజేపీ ప్రభుత్వం వచ్చాక సమవయస్కుల మధ్య కూడా లైంగిక సమ్మతి వయస్సు 18 సంవత్సరాలకు పెంచారు. దానితో నేడు మనకు నమోదవుతున్న బాలికలపై అత్యాచారాల్లో 30 శాతం 18 ఏండ్లలోపు బాలబాలికలు కలిసి పారి పోవడం వలన నమోదు అవుతున్నవి.కాని పెద్దలు చేసే బాల్య వివాహాల్లో (ఇది మన దేశంలో 29 శాతంగా వుండేది కరోనా తర్వాత 39కి పెరిగాయి) భర్తకి ఎంత వయస్సున్నా భార్యకి 16 సంవత్సరాలు దాటితే అది నేరం కాదని మన చట్టం చెబుతుంది. చట్టాల మధ్యగల ఈ పరస్పర విరుద్దాంశాల్ని సవరించమని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి సూచించింది కూడా రెండేళ్ళు కావస్తున్నది. కాని ప్రభుత్వానికి పట్టలేదు.
    అంటే తాళిగట్టితే అత్యా చారం చేసే హక్కుని మన సమాజం అంగీకరిస్తున్నది. ఈ మనస్తత్వం ఉంది కనుకనే బాలికలపై జరిగే లైంగిక అత్యాచారాల పైనే ఆక్రోశం వెల్లడి అవుతుంది. మగ పిల్లలపై జరిగిన వార్తలు వస్తే ఎట్లా స్పందించాలో తెలియక మన సమాజం వెర్రి చూపులు చూస్తున్నది.
    బిడ్డకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి తన లైంగిక అవసరాలు ప్రేరణ లేదా సంతృప్తి కొరకు బిడ్డలను లైంగికంగా వినియోగించడం నేరం. అది బలవంతంగా అయినా ఆశ చూపించి, చేరదీసి బెెదరించినా, లాలించినా, బిడ్డ సమ్మతించినా కూడా నేరమే.
    లైంగికంగా ఉపయోగించడం అంటే బిడ్డలకు నగ చిత్రాలు, ఫొటోలు చూపడం, వారి జననాంగాలు చూప మనడం పెద్దల జననాంగాలు ప్రదర్శిం చడం వంటి చర్యలు అంటే తాకకుండా చేసే చర్యలు కూడా నేరమే. గతేడాది నాగ్‌పూర్‌ కోర్టు బట్టలూడతీశాడు కాని తాకలేదు కాబట్టి నేరం జరగలేదని ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోమని చివాట్టు కూడా పెట్టింది.
    (Protection of Children from Sexual Offences Act, 2012 - ఫోక్సో అనే చట్టంలో ఏది లైంగిక హింస నే దానిపై విస్తారమైన వివరణ ఉంది)
    అయితే అడపాదడపా 4 శాతం అపరిచితులు పిల్లలపై చేసే లైంగిక అత్యాచారాలు అది కూడా అమ్మాయిలపై జరిగితే సమాజం గోలుగోలు మంటుంది. కాని ఎక్కడా చర్చకు నోచుకోకుండా కాలరాయ బడుతున్న పిల్లలు. ఏడాదికి రెండున్నరల లక్షల మంది బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. వీరిని లైంగిక వ్యాపారానికి బలిపెడుతున్నారు. 'కన్యలతో సంపర్కం వల్ల సుఖ వ్యాధులు, ఎయిడ్స్‌ తగ్గుతాయి. పురుషత్వం తిరిగి వస్తుందనే మూఢత్వం వల్ల ఇటీవలి కాలంలో 10 ఏండ్లలోపు బాలబాలికల అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. దీన్ని బాల్యాన్ని హరించడంగా భావించి ప్రభుత్వాలను నిలదీసే వారే లేరు.
    బాలలపై జరిగే లైంగిక హింస పెద్దలు వారిని తాకారాని చోట తాకటం, ముద్ద పెట్టడం, నలిపివేయటం, హత్తుకోవడం, గిచ్చడం వంటి వాటితో ప్రారంభమై లైంగిక సంపర్కం దాకా చేరతాయి. ఇవి మూడేండ్ల వయస్సులో ప్రారంభం అయి 15-16 ఏండ్లు వచ్చేదాకా కొనసాగవచ్చు. పిల్లలను లాలించి, భయపెట్టి లొంగతీసుకుంటారు. అధికంగా ఇవేమి అసలు బయటకు రావు.
    ఒక వేళ పెద్దల దృష్టికి వచ్చినా ''పిల్లల భవిష్యత్తు'' దృష్టిలో పెట్టుకుని మౌనం వహిస్తారు. కొన్ని సార్లు పిల్లల్నే తప్పు పడతారు.
    పిల్లలకు భయం, అపరాధ భావనలతో పాటు తాము చెప్పినా పెద్దలు నమ్మరనే అభిప్రాయంతో జరిగింది చెప్పరు. కాని లైంగిక హింసకు గురవుతున్నా పిల్లల ప్రవర్తన విపరీతంగా మారుతుంది. దీనిని గుర్తించడానికి అభివృద్ధి చెందిన దేశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక్ష శిక్షణ ఉంటుంది.
    పిల్లలపై లైంగిక అత్యాచారాల ద్వారానే కామం సంతృప్తి పడే వికృత ధోరణి పెడోఫిలి అంటారు. ఈ విపరీత మానసిక వాంచలకు చికిత్స చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మాదకద్రవ్యాలు బూతు చిత్రాలు మనిషి వాంచలకు అదుపు తప్పి వికారంగా క్రూరంగా తయారు చేస్తున్న నేపథ్యంలో బలహీన మనష్కులు నేరస్తుంలగా మారతారనేది గమనించాలి.
    పుట్టుకతోనో, రక్తం కారణంగా వారసత్వంగానో సమాజంలో నేరస్తులు తయారుకారు. పరమ జుగుస్పాకరమైన నేరాలు అత్యంత నిస్సహాయులయినే బాలలపై జరుగుతున్నాయంటే అ సమాజం తీవ్రంగా దిగజారిందనే అర్థం. బాలల భద్రత కల్పించడంలో వైఫల్యం వ్యవస్థీకృతం అయ్యింది. వ్యక్తులను మాత్రమే (వారు చేసి నేరానికి వారు బాధ్యతే కాని) బాధ్యుల్ని చేసి తీవ్రంగా శిక్షించమని అరవడం ద్వారా సమాజం తన అపరాధ భావన నుంచి తన వైఫల్యం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం బాలల భద్రతకు, యువతరం పక్కదార్లు పట్టకుండా వారికి వేరొక వ్యాపకం కల్పించేందుకు విధానాలు రూపొందించి వాటికై పనిచేయడానికి సమయం, నిధులు, అన్నింటికంటే ఒక ముందుచూపు. చిత్తశుద్ధి కలిగి ఉండాలి. అవి లేనపుడు నేరస్తుడ్ని చంపి ఒక రక్తం ప్రదర్శనకు రక్తి కట్టిస్తుంది. పోలీసులు నేర విచారన, పరిశోధనలో తమ చేతకాని తనానిన్న తమ శ్రద్ధ లేని తనాన్ని చట్ట విరుద్ధ హత్యల ద్వారా కప్పిపుచ్చుకుంటారు. నేరస్తులు మరణిస్తాడు. నేరం నిరాఘాటంగా కొనసాగుతుంది.
    ''చైల్డ్‌ ఫోర్న్‌'' బాలలతో చేసే బూతు చిత్రాలు అన్ని దేశాల్లో నిషేధం అన్ని సర్వేయింజన్లలో నిషేధం. కాని అంతర్జాతీయంగా బాలల బూతు చిత్రాలు తయారు చేసి అందిచే 51 మందిలో 17 మంది భారతీయులే ఇది కూడా జర్మనీ పోలీసులు కూపీలాగి మనకు వెల్లడించారు. వీరిని అరెస్టు చేశారా? శిక్షించారా? అసలు పట్టించుకున్నారా? ఎవరికీ తెలియదు. ఇవ్వాళ ప్రతివారి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ దానిలో 'జియో' వ్యసనంగా ఉన్న ఈ చూసేది ఎంత ప్రభావితం చేస్తాయో ప్రభుత్వాలకు తెలియదా! టెక్నాలజీపైన మాద్యమాలపైన బతుకుతున్న నేతలేకదా! యువత బూతుచిత్రాల్లో ఉండాలని ఏలికలు కోరుకుంటే అందులో ఆశ్చర్యం ఏముంది?
    ఇక 'అదాని'' రేవులో దొరికిన 3000 కిలోల నాణ్యమై హిరాయినూ, ఎక్కడబడితే అక్కడ లభిస్తున్నది. గంజా, చరస్‌ రకరకాల మాదకద్రవాలు ప్రతి గల్లీలో ప్రవహిస్తున్నా సారా ఎక్కడన్నా మెదడును తెలివిలో వుంచుతున్నాయా!
    చదువుల గురించి, ఉపాధి ఉద్యోగాల గురించి నేరం గురించి అడగకుండా యువత బూతు చిత్రాలతో, మాదకద్రవాలతో నిషాల్లో ఉంటే బాలలకు భద్రత కరువయితేనే ప్రభుత్వాలు భద్రంగా వుంటాయి కదా! అవులను చంపడం జాతీయ నేరం, అరాచక మూఠాలు శైర్య విహారం చేస్తాయి. బాలలపై , అకృత్యాలు అక్రమ రవాణా అంతగా పట్టించుకునే అవసరం వుందా! అనేది ప్రభుత్వాల ఆలోచన, బాలల్ని కాపాడుకునేంతగా స్పందన ప్రజలకు వుందా లేదా అనేది వారే తేల్చుకోవాలి.
    ''అర్థం చేసుకోలేని సమ్మతి యివ్వలేని పిల్లలతో బలవంతంగా జరిపే లైంగిక చర్యలే బాలలపై లైంగిక హింస (child sexual abuse-(sa) వీటివల్ల తీవ్రమైన భౌతిక, మానసిక నష్టం ''హాని జరుగుతుంది'' డబ్ల్యూహెచ్‌ఓ
    ''బాలలపై లైంగిక హింస రేటు : 8శాతం నుంచి 31 శాతం వరకూ బాలికలపై 3 శాతం నుంచి 17 శాతం బాలురపై ఉంది. భారతదేశంలో 53శాతం మంది పిల్లలు విభిన్న రకాల హింసలకు గురవుతున్నారని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే తెలుపుతున్నది. వీటిలో నగంగా పొటోలు తీయడం, లైంగిక దాడి, ఆమోదయోగ్యం కాని విధంగా స్పర్శించడం వంటి లైంగిక హింసలు అనేకం ఉన్నాయి''
    ''కరోనా మహమ్మారి వలన ఒక సమాజికసంక్షోభం ఏర్పడ సూచనలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ల సమయంలో స్త్రీలపై పిల్లలపై హింస తీవ్రంగా పెరిగింది. ఆర్థిక సంక్షోభం వలన సంరక్షకులు పిల్లలపై హింసాత్మకంగా వేధింపులకు పాల్పడుతున్నారు. స్కూల్స్‌ మూతబడి పిల్లలు బందీలవడం కూడా ఒక కారణం.''
    ''ఇండ్ల నుంచి కదలకుండా బయటకు పోకుండా ఉండాల్సిన ఒక కొత్త జీవిత పరిస్థితి వల్ల పిల్లలు ఒక మానసిక వేదనకు లోనవుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో చివరి రెండు వారాల్లో చైల్డ్‌ హెల్ప్‌లైనుకు వచ్చే కాల్స్‌ 50 శాతం పెరిగాయి. వాటిలో 3 శాతం హింసకు సంబంధిచినవే.''
    హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో జరిగిన ఘటనను ఎలా చెప్పాలో కూడా తెలియక నిశ్శబ్దం పాటించే పిల్లలు అసంఖ్యాకం.
    ''2018లో రోజుకి 108 మంది బాలలు లైంగిక హింసకు గురయ్యారు. 2019లో 1 లక్షా 48 వేల కేసులు నమోదు కాగా వీటిలో 35.6 శాతం లైంగిక హింసవి. 2020లో లక్షా 34 వేల కేసులు నమోదు కాగా వీటిలో బాలలపై హిసం 38.5 శాతం లైంగిక హింస కేసులే''
    ''మన దేశంలో సరి అయిన ఆధారాలుదొరకలేదనే కారణంతో ప్రతిరోజూ పోలీసులు బాలలపై అత్యాచారం కేసులు 4 మూసేస్తున్నారు''.
    ''అత్యాచారానికి ముందు తర్వాత కూడా నిందితులు పోర్న్‌ చూస్తున్నారు. వరల్డ్‌ కాంగ్రెస్‌ (×××)
పోర్న్‌గ్రఫి గురించి అరెస్టు అయిన వారిలో 70శాతం మంది బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
    బాలలతో చేసే బూతు చిత్రాలు (చైల్డ్‌ పోర్న్‌) ఏడాదికి 5వేల కోట్ల డాలర్ల ఆదాయం యిస్తూ వేగంగా విస్తరిస్తున్న వ్యాపారం.
    12 కోట్ల మంది అమ్మాయిలు 20 ఏండ్ల వయస్సు రాక ముందే ఏదో ఒక లైంగిక కార్యకలాపంలోకి బలవంతంగా నెట్టబడుతున్నారు.
    దేశంలో 15-19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల్లో 77 శాతం మంది వారి భర్త లేదా స్నేహితుడి వల్ల లైంగిక హింసను అనుభవిస్తున్నారు.
    17లక్షల మంది పిల్లలు భారతదేశంలో సెక్స్‌ వ్యాపారంలో ఉన్నారు. వీరిలో 25 శాతం మంది 12 సంవత్సరాల లోపు వారే. 70శాతం మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలే ఈ వ్యాపారంలో 7 కోట్ల డాలర్ల ఆదాయం ఏడాదికి వస్తుంది.
    - దారిద్య్రరేఖకు దిగువన అమ్మాయిలు ఎక్కువగల కటుంబాలు గుర్తించడం
- కౌమార వయస్సుకు ముందే వారికి చదువు ఏర్పాటు చేసే అవగాహన కలిగించడం
- స్థానిక సంస్థలకు బాలలపై లైంగిక హింసపై అవగాహన కల్పించడం
- టీచర్లు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు శిక్షణ ఇవ్వడం.
- బాలలపై జరిగే లైంగిక హింసపై తల్లిదండ్రుకు అవగాహన కల్పించడం
- బాలలపై జరిగే లైంగిక హింస నివారణకు రాజకీయ నిబద్ధత
- హింసకు పాల్పడిన వారిపై తీవ్రమైన చట్టపరంగా కఠినంగా సత్వరం వ్యవహరించడం వంటి వాటితో నివారణకు ప్రయత్నించాలి.
- దేవి

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.