Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాణ దీపం... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి

ప్రాణ దీపం...

Sun 10 Oct 00:26:09.527035 2021

చుట్టూ చీకటి కొండలు
పల్లేర్లు పరుచుకున్న దారులు
అడుగు తీసి అడుగు వేస్తే
పాదాలకు చుట్టుకొనే పగల పాములు
దూరమెంతో.. చేరే తీరమెక్కడో
అంతు చిక్కని అనంత పయనం

ఏ గాలికి దీపం ఎప్పుడు ఆరుతుందో
చిల్లుపడి, నావ ఎక్కడ మునుగుతుందో
అంతా తాయిమాయి తండ్లాట

అయినా నడక సాగాలి
నడకలింకా నేర్వని నాలుగు పసి కెరటాలను
తీరానికి చేర్చే తిమిర సమరంలో
ఏకాంత కడలివీ నువ్వే
అలలనెదిరించి నడిచిన నావవూ నువ్వే
అలసటెరుగక నడిపిన సరంగువూ నువ్వే

తిమింగలాలను తప్పించి
అమంగళాలను దాటించి
కాలాన్ని కత్తిమొనపై నిలిపి
కడకు తీరానికి మమ్ముచేర్చి
అందనంత దూరానికి నువ్వెళ్ళిపోయావు

నువ్వు లేని లోకమిప్పుడు
చుక్కలు రాలిన ఆకాశంలా
మొక్కలు మొలవని ఎడారిలా
దిక్కులు కానరాని దిగులు ప్రయాణంలా
దీనమై, హీనమై, శూన్యమై
బ్రతుకు రంపపు కోతై లోలోన రక్తమోడుతుంది

ఇయ్యాల అమ్మల దినమంట
తాతలైన వాళ్ళైనా, తండ్రులైన వాళ్ళైనా
పావురంగా, గావురంగా
అమ్మ ఒడిలో పసిపిల్లలై
ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నరు
నన్నెందుకమ్మా అమ్మ లేని వాన్ని చేశావు

పొద్దుపొడుపు కంటే ముందు
పొద్దుగాల్ల లేసి నీ మొకమే జూ సెటోన్ని
ఇప్పుడు ఏ దిక్కు జూసినా
శూన్యమే దిక్కైంది

ఇంద్రలోకమో... చంద్రలోకమో
నాకైతే తెల్వదు గానీ
చంద్రబింబం లాంటి నీ మొకం మీద
ముద్దు పెట్టుకునుటానికి
అన్ని లోకాలూ దాటి నీ
కన్నపేగు కోసం ఒక్కసారి కదిలి రామ్మా

బతుకు నాకిచ్చి నువ్వెళ్ళి పోయినంక
ఇప్పుడు బతుకమ్మ పండుగచ్చింది
ఏ వరుసలో ఏ పువ్వు పేర్చినా
నీ నవ్వు మొకమే కనిపిస్తుంది.

నువ్వు లేవన్న నిజం
నిలువెల్లా నిప్పులా కాలుస్తుంది
కనులు మూసినా తెరిచినా
కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్రే గుర్తొస్తుందమ్మా
నెత్తిమీద నిండు వడ్ల బస్తా
ఒక చేతిలో నేను

ఇంకో చేతిలో సాయానికో కట్టె
గంగలో దిగి
ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు
ఒక్కో బస్తా నువు జారగొడుతుంటే
నీ దుక్కంలో కారిన కన్నీళ్ళతో
కలిసి పారినట్లే అనిపించింది గంగ.

తాత ఇచ్చిన నాలుగు వడ్ల బస్తాల సాయం కోసం సాహసోపేతంగా నడిచిన నీ అడుగులు
నా బతుకు పయనంలో
భరోసా నింపిన పాద ముద్రలు

ఇంటిని కాజేయాలని
కాచుకున్న గుంట నక్కలను
గడ్డపారతో అడ్డంగా నిల్చొని ఎదిరించిన
నీ గుండె నిబ్బరమే కాదె
నా గుండెల్లో గుట్టంత ధైర్యాన్ని నింపింది.

లేమితనంలో నువ్వు
ఒక్కో కడపా ఎక్కి దిగుతుంటే
నీ వేలు పట్టుకొని నడిచిన నన్ను
తెలిసీ తెలియని వయసులోనే
తొలిచిన ప్రశ్న
ఇంతగా పేరుకున్న అంతరాలు
అంతమయ్యేదెట్లా?
ఆనాటి అలజడులే కదమ్మా
నాకు కొత్త దారుల్ని పరిచయం చేసింది

రోజంతా ఉపాసమున్న మాకు
పెరట్లో అట్టిగనే కాసిన ఆనెపుకాయలను
ఉడికించి ఆ పూట ఆకలి దీర్చి
పిడికెడు బియ్యమైనా దొరకని పరీక్షా కాలాన
ఎట్టికి దెచ్చిన తౌడును రొట్టెలుగా కాల్చి
తినిపిచ్చి తీరొక్క శోకం దీసిన
దుక్కంలోంచే కదమ్మా నేను
దూసిన కత్తినై మెరిసింది.

దీపంతోపాటు, నువ్వూ కాలిపోతూ
ఎన్ని రాత్రులనో కరగదీసి
బీడీలు చుట్టి, ఊపిరితిత్తుల్ని
పొగజూరిన ఉత్తి తిత్తులుగా మార్చుకున్న
నీ వేదనలోంచే కదా నాలో వేల శోధనలు వెల్లువెత్తింది

ఇప్పటిదాకా ముళ్ళ గాయాలను నువ్వు మోసి
పూల వాసనలు మాకు పంచావు
నన్ను పూలు లేని కొమ్మను చేసి
గాలికి మలిగిన వత్తివై నువ్వారిపోయావు

ఇప్పుడు నాకంటూ మిగిలిందల్లా
తడియారకుండా ఉన్న
నీ తలపుల తవ్విపోతలే
నడిచే దారుల్లో
నీ విలువల విత్తనాల్ని నాటుకోవడమే
పొడిచే పొద్దు
నీ ముద్దు మోమేనని మురిసి పోవడమే.

మాలో వెలుగుతున్న, మమ్మల్ని వెలిగిస్తున్న
ప్రాణ దీపం నువ్వే కదమ్మా !

- గాజోజు నాగభూషణం, 9885462052

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నడిచే గాయాలు
నాన్న నాకు నచ్చలేదు
ఒకటో తారీఖు జీతం..
మూడ్స్‌
సౌప్తిక పర్వం
ఆ కన్నులు
#(ఐ (లవ్‌) యూ)
అక్షరమై జీవిస్తావ్‌ ......
ఊరొక సందూక పెట్టె!
మదిలో మాట..!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.