Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెలుగుల క‌ళ‌లు వెల్లి‌విరిసే పండుగ దీపావ‌ళి | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

వెలుగుల క‌ళ‌లు వెల్లి‌విరిసే పండుగ దీపావ‌ళి

Sun 31 Oct 02:20:22.803771 2021

పండుగలు ఎన్ని రకాలుగా వున్నా మన సమాజంలో సంప్రదాయికంగా వస్తూ సంస్కతిలో ఒక భాగంగా మారిన వీటన్నింటిలో జీవితాలలో కుటుంబాలలో సంతోషాలు నింపటం, కోర్కెలు నెరవేరటం, బాధలు, వేదనలు
తొలిగిపోవటం ఆశించి చేసుకోవడమే వుంటుంది. ఆ రకంగా చూసినపుడు దీపావళి పండుగను వెలుగునునింపే దీపావళిగా పేర్కొనవచ్చు. వెలుగు అనేది శుభానికి మంచికి ప్రతీకగా సంతోషానికి సంకేతంగా చూస్తారు. చీకటి వేదనకు, బాధకు, కష్టాలకు ప్రతీకగా పేర్కొంటాము. అందుకనే అమావాస్యనాటి చీకటిని పారద్రోలే విధంగా దీపాలను వెలిగిస్తారు. వెలుగులతో ఆనందిస్తారు.
వెలుగుల కళలు వెల్లివిరిసే పండుగ దీపావళి. దీపాలను వరసగా పేర్చి, ఇంటిల్లిపాది తెలుగు తోరణాలను కట్టి, ఆనందపు కాకరవత్తుల్ని మమతల మతాబులను వెలిగించే పండుగ దీపావళి. తరతరాలుగా పండుగలు అనేక విధాలుగా ఏర్పడి, ఒక సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నాయి. రాజులు కేంద్రంగా వారి విజయాలు, విస్తరణలు సందర్భంగా ఏర్పడ్డవి కొన్నయితే, స్త్రీలు వారి ఆశలు, కోర్కెలు నెరవేరాలని చేసేవీవున్నాయి. ఇక మూడవది ప్రజలు తమ శ్రమకు తగిన ఫలము అందినపుడు జరుపుకొనే ఆనందపు సందర్భాలూ పండుగలయ్యాయి. భారత, రామాయణ పురాణాల పరంగానూ చేసుకుంటున్న పండుగలూ వున్నాయని చరిత్ర పరిశోధకులు సురవరం ప్రతాపరెడ్డి 'మన పండుగలు' అనే రచనలో విపులంగా వివరించారు. ఏ పండుగలోనయినా ఉన్న ఒక సానుకూల అంశమేమంటే పదుగురు కలుసుకోవటం, సామూహిక ఉత్సవాలు, సమూహపుకలబోతలు. ముఖ్యంగా వ్యవసాయిక సమాజంగా వున్న మన దేశంలో భూమికీ మనిషికి వున్న సంబంధంలోంచి అనేక సందర్భాలు ఏర్పడతాయి. ఏరువాక మొదల వ్వటం, తొలిపంట ఇంటికి చేరటం, అనుకున్నంత ఫలం అందటం, వ్యవసాయంలో ఉపయోగించే పశువులకు సంబంధించీ కొన్ని ఏర్పడి సాగుతున్నాయి.
పండుగలు
ఎన్ని
రకాలుగా వున్నా మన సమాజంలో సంప్రదాయికంగా వస్తూ సంస్కతిలో ఒక భాగంగా మారిన వీటన్నింటిలో జీవితాలలో కుటుంబాలలో సంతోషాలు నింపటం, కోర్కెలు నెరవేరటం, బాధలు, వేదనలు తొలిగిపోవటం ఆశించి చేసుకోవడమే వుంటుంది. ఆ రకంగా చూసినపుడు దీపావళి పండుగను వెలుగునునింపే దీపావళిగా పేర్కొనవచ్చు. వెలుగు అనేది శుభానికి మంచికి ప్రతీకగా సంతోషానికి సంకేతంగా చూస్తారు. చీకటి వేదనకు, బాధకు, కష్టాలకు ప్రతీకగా పేర్కొంటాము. అందుకనే అమావాస్యనాటి చీకటిని పారద్రోలే విధంగా దీపాలను వెలిగిస్తారు. వెలుగులతో ఆనందిస్తారు.
ఆశ్వయిజ బహుళ చతుర్దశిని. నరక చతుర్దశిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ఆధారంగా చూసినట్లయితే కృతయుగంలో వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అందుకనే అతన్ని నరకాసురుడని పిలిచారు. ఒక తల్లిచేత తప్ప ఎవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందుతాడు. ద్వాపరయుగంలో మహావిష్ణువు కృష్ణుడుగా, భూదేవి సత్యభామగా అవతరిస్తారు. అప్పటికీ నరకాసురుడు మానవలోకాన్ని, దేవలోకాన్ని సంక్షోభంలోకి నెట్టి బీభత్సం సృష్టింస్తుంటాడు. యజ్ఞయాగాలను ధ్వంసమొనరుస్తుంటాడు. అప్పుడు దేవగణం, మానవగణం దేవుడిని వేడుకోగా కృష్ణుడు, సత్యభామా సమేతుడై నరకాసురుని ఆగడాలు అరికట్టేందుకు పూనుకుంటాడు. భీకరయుద్ధంలో సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణిస్తాడు. తన పుత్రుడి పేరైనా కలకాలం నిలిచివుండేలా చేయమని సత్యభామ కృష్ణుని ప్రార్థంచడంతో ఆ రోజును నరక చతుర్దశిగా పిలువడుతుందని వరం ప్రసాదిస్తాడు. నరకాసురుని పీడవిరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబురాలు జరుపుకుంటారు. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని ప్రారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచాకాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పండుగ అయింది అని చెప్పుకుంటారు.
ఇంకా దీపావళికి అనేక కథలూ వాడుకలో వున్నాయి. రామాయణంలో రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తున్న సందర్భంలో సీతను రావణాసురుడు లంకకు ఎత్తుకెళ్ళగా రామరావణ యుద్ధం జరిగి సీతను తిరిగి తీసుకుని అయోధ్యకు వచ్చిన రోజునే దీపావళి అని కొందరంటారు. ఇక భారతం ఆధారంగా - కౌరవుల మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడు సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి పాండవులు వచ్చిన రోజని చెపుతుంటారు. అమృతం కోసం పాలసముద్రాన్ని దేవదానవులు చిలుకుతుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఉద్భవించిందనీ కొందరు చెప్పుకుంటారు.
సామాజిక పరంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను జరుపుకుంటారని, మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కతజ్ఞతగా పూజలు చేస్తారని చెబుతారు.
ఇన్ని కథలూ ప్రచారంలో వున్నప్పటికీ నరకాసురుని వధను ఎక్కువగా చెబుతారు. రైతుపంట చేతికి రావటమూ సమద్ధిగా పండటమూ సామజిక వాస్తవికతకు దగ్గరగా వున్న విషయం. పురాణాల కథను చూసినప్పటికీ 'ఆర్యులు వచ్చాక, ఇక్కడ ఉన్న రాజులను ఓడించి రాజ్యాలను ఆక్రమించుకున్నాక, ఇక్కడి వారిని రాక్షసులని పిలిచేవారు. గెలిచిన తమను దేవగణ వారసులుగా చెప్పుకొన్నారు. ఆర్యుల విజయగాధల ఆధారంగానే ఈ పండుగలు జరుపుతున్నారనే వాదనకూడా ప్రచారంలో వుంది. ఉదాహరణగా తమిళనాడులో రావణాసురున్ని కొలిచే ఆలయాలూ వున్నాయి. అదే విధంగా కేరళలో విష్ణుమూర్తి అవతారమైన వామనునిచే చంపబడిన బలిచక్రవర్తి పేర ఓనం పండుగను కేరళీయులు జరుపుకొంటారు.
పురాణాలపరంగా, సామాజికపరంగా, చరిత్రపరంగా పండుగలను విశ్లేషణ చేస్తున్నప్పటికీ, నేడు దీపావళిని పండుగను జరుపుకోవటంలో ఏఏ కోర్కేలు, ప్రజల ఆశలు ప్రతిఫలించాలో చర్చించడం చాలా అవసరమైన ముఖ్యవిషయం. జీవితంలో వెలుగు రాకుండా అడ్డుపడుతున్న అంశాలేమిటి? చీకటిలా ముసురుకుంటున్న వేదనలు ఎలా తొలుగుతాయో
ఆలోచించాల్సిన సమయమిది. ఇప్పుడు దేశంలోని అన్నదాతలు తీవ్ర బాధలకు, వేదనలకు గురవుతున్నారు. దాదాపు సంవత్సరకాలంగా దేశరాజధానిలో నిరసన తెలుపుతున్న రైతులు, తమ జీవితాలను అంధకారంలోకి నెట్టివేసే మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. వీరి మాటను, కోర్కెను వినకపోగా అన్నదాతలపైకి కార్లతో తొక్కించి ప్రత్యక్షంగానే నాయకులు చంపేస్తున్న సందర్భంలో ఈ దీపావళి వచ్చింది. దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతు ఆనందంగా ఎప్పుడుంటాడో అప్పుడే నిజమైన దీపావళి, మహారాష్ట్రలో, రాజస్థాన్‌లో. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలేకాదు. మన తెలంగాణలో కూడా రైతు సంతోషంగా లేడు. అప్పులు కట్టలేక, వడ్డీలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దీన పరిస్థితులు మనం చూస్తున్నాము. వీళ్ళ బాధలకు కారకులైన వారిని తరిమివేసినప్పుడే నిజమైన దీపావళి జరుగుతుంది. ఆ దీపావళి రావాలని కోరుకోవాలి.
ఇక దేశంలో ఉప్పు, పప్పుతోపాటు, ఉల్లిగడ్డలు, కూరగాయలు, పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు పెనుభారంగా తయారయినవి. పండుగలను పంచభక్ష్య పరమాన్నాలతో జరుపుకొనే పరిస్థితులు మగ్యమైపోయాయి. పండుగంటే కొత్తబట్టలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళతో బంధువుల సందడిలో జరుపుకోవడానికి అనువైన పరిస్థితులేవి నేడు కనపడటమేలేదు. కరోనాకాలాన ఊడిన కొలువులు, మాసివేయబడిన పరిశ్రమలు, చేస్తున్నవారికీ కనీస వేతనమూ అందని దౌర్భాగ్యాల నేపథ్యంలో మనసుల్లో వెలుగులెలా నిండుతాయి! ప్రపంచంలోనే ఆకలి దేశంగా ఉన్నత స్థానానికి ఎగబాకిన సందర్భాన కళ్ళల్లో దీపాలు వెలుగుతాయా!
డెబ్బయి అయిదేండ్లుగా ప్రజలు సమకూర్చుకున్న ప్రభుత్వ సంపదను వేలం వేస్తూ అమ్మేసుకుంటున్న పాలకుల పనితనాన్ని చూస్తూ, మీకింతా మీకింతా భిక్షం వేస్తాం, తాయిళాలిస్తాం, మాకే ఓట్లు వేసి గెలిపించాలని ఊకదంపుడు దంచుతున్న రాజకీయక ఊసర వెల్లులు నిర్లజ్జగా సంచరిస్తున్న సమయాన అలుముకున్న చీకట్లు ఎలా తొలుగుతాయి! ఆటను, పాటను సైతం విద్వేషపూరితంగావిస్తూ ప్రజల మధ్య విభేదాలు సష్టిస్తూ, మాన వత్వాన్నీ మరచి మంటలు రాజేసే రాక్షసులు కంటపడుతూ వుంటే చూస్తూ ఊరికెలావుంటాం.
ఈ దీపావళి దీక్షా దీపావళి కావాలి. మన చుట్టూ అలుముకుంటున్న ఈ బాధల, వేదనల చీకట్లను తరిమికొట్టేందుకు, బతుకుల్లో సంతోషాలు, ఆనందాలు పూసే వరకూ విశ్రమించకుండా పోరును సాగిస్తామనే లక్ష్యంతో ఆశయంతో దీపాలు వెలిగించాలి. ఈ చీకట్లకు కారకులైన నేటి నరకాసురులకు చరమగీతం పాడుతామని దీపాల వెలుగులే ప్రమాణాలై ప్రజ్వరిల్లాలి! ఎవరో వచ్చి మనకు వెలుగును అందిస్తారని ఎదురు చూడటం కాదు. పురాణాల కథలల్లో దేవుళ్ళు అవతారాలెత్తి వస్తారనుకోవద్దు. రాజులు యేలే కాలంలో రాజునే దేవుడిగా భావించారు. కానీ నేడు ప్రజాస్వామ్యయుగంలో నడుస్తున్నది ఇందులో ప్రజలే నాయకులు. అందుకే ప్రజలు చైతన్యవంతమై భుజం భుజం కలిపి మన ఆశలను ఆశయాలను మనమే సాధించుకోవాలి. ఈ దీపావళి మనకు ఆ స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం!
- కె. ఆనందాచారి

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.