Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పొక్కిలి | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

పొక్కిలి

Sun 14 Nov 02:50:55.027639 2021

ఈ నలబై ఏళ్లలో దసరా పండగున్న ఐదు రోజులు తప్ప మిగతా జీవితమంటా ఏదో ఓ పనిజేసుకుంటూనే బతికారు ఆ దంపతులు. బిడ్డల పెండ్లీలయినంకా... బరువు బాద్యతలు కొంచెం తీరినంకా లక్ష్మీతో పనిమానిపించి తను మాత్రం పనిచేస్తూనే ఎలాగోలా ఎవరిజీవితాలు వాళ్లు కష్టపడుతూ వెల్లదీస్తూనే ఉన్నారు.ఇలా మార్చి 22వ తేది వాళ్ల జీవితాన్ని చిన్నాబిన్నం చేసేవరకూ ఉన్నంతలో సంతోషంగానే బతికారు. ఇప్పటికి నాలుగు నెళ్లైంది మూడుపూటలా
కడుపునిండా తిని. ఎన్నడూ రాని కష్టం ఈ కుటుంబాన్నివిపరీతంగా కుంగదీసింది.
  అరే, ఆకిలంత పొక్కిలి జెయ్యకు బిడ్డా... గిప్పటికే హైద్రాబాద్ల సాబాష్‌ బండలేపియ్యకుండా లీల్లచ్చినప్పుడల్లా గీ బురదేందని వాడకట్టోల్లంత తిట్టవట్టే... ఇంకా అండ్ల నువ్వు పొక్కిలి జేస్తే ఎట్ల బిడ్డా... అని వాకిట్లో ఆడుకుంటున్న మనమరాలిని అదలిస్తూనే లోపలికెళ్లాడు లక్ష్మణ్‌. అప్పటికే ఇంట్లో వంటచేసి తినడానికి లక్ష్మణ్‌ కోసం ఎదురుచూస్తున్న ఆమె బార్య లక్ష్మీ 'బిడ్డ జేసే పొక్కిలి గాదు నువ్వుజేసే పొక్కిలి గురించి జెప్పు, గిప్పుడు ఎనిమిదైతంది ఇంకెంతసేపు జూడాలే బువ్వ తిననీకి తొమ్మిదైతే గేటు బంజేత్తమని కిరాయోల్లకి జెప్పుడు గాదు మనం గూడుక సందియ్యద్దు. సరే సరే జల్దిరాపో ఆకలైతాంది తిందాం అన్న బార్య అదిలింపుతో పాంటు షర్ట్‌ విప్పి కాళ్లు చేతులు మోఖం కడుక్కొని టీవీ ముందటికొచ్చి కూర్చున్నడు లక్ష్మణ్‌. దిగూట్ల పెట్టిన బాటిల్‌ బయటకి తీసి పెగ్గుపోసుకొని లిలబడే తాగి, మరోపెగ్గు కలుపుకొని వచ్చి బార్య వడ్డించిన అన్నం తింటూనే... ఉగాది పండగ సీజన్‌ గదా... మా బట్టల షాపుల గిరాకీ ఎక్కువున్నది ఎనిమిది దాక పంజేయాలని జెప్పిండ్రు ఏం జేత్తం మరి తప్పదు గదా... అన్నడు. ఏంది తప్పేది సప్పుడు జేక నీ నౌకరి బంజేరు మన దాబాపైనేసిన రెండు రేకుల షెడ్ల కిరాయి ఆరేలు చాలవా మనం బతకనీకి, ఉన్న ఇద్దరు బిడ్డలు ఆళ్లుల్లతోని ఉన్నదాంట్ల మంచిగనే బతకవట్టె ఎందుకింత ఆరాటం మనిషికి, ఏం జేసుకుంటాం ఇదంతా అంటుంది. ఏందే చాలేది, గీ పట్నంల ఆరువేలు ఎంత కడుపుగట్టి బతికినా రెండువారాలు జాలయి. మరి తతిమ రోజులు అళ్లుల్లని అడుక్కొని బతకమంటవా... నాకింక గా కర్మవట్టలే... నా కాళ్లు చేతులు ఆడినంత కాలం నా పని నేనే జేసుకొని బతుకుతా... సరే గని పొల్ల తిన్నదా... పండుక్కి బిడ్డల్లత్తుండ్రా... చేగోళ్లు జేయనీకి సామాను తెచ్చినవా... అళ్లుల్లకి బట్టలు వెడ్దామా...అని ఇంకా ఏదో అడగబోతుంటే లక్ష్మీ అడ్డుతగులుతూ... ఆ పెడ్తం తిరు దసురకి పెడ్తం మల్ల ఉగాదికి పెడ్తం ఎన్ని సార్ల పెడ్తం గయినా మనం కడుపుకట్టుకొని సంపాయిం చిందంతా బోయినంక ఆళ్లకి గాకపోతే ఎవులకు బెడ్తం. ముందు పెరుగేసుకొ.... దావఖానకు బోయినవా... మందులు తెచ్చుకొమ్మంటే ఇంటున్నవా... ముందు నామాటిను నువ్వు అని లక్ష్మీ రోజూ అన్నం తినేట్టప్పుడు చెప్పే మాటల్నే చెపుతుంది. ఆ సరే సరేలే అన్నీ తెచ్చుకున్న గా సంటిదాన్కి తినపెట్టి పడుకో... అని పల్లెం పట్టుకొని జాలాట్ల కెల్లి కడుక్కచ్చుకొని సిగరేట్‌ ముట్టిచ్చుకుండు లక్ష్మణ్‌. నలబై ఏళ్ల క్రితం ఉన్నఊరు ఆవునూరిని వదిలి పెళ్లైన కొత్తల్న పట్నంకి బతనీకి వచ్చాడు లక్ష్మణ్‌. దొరికినకాడల్లా ఆలూ మగలూ పన్జేసుకుంటూ... ఖైరతాబాద్‌ బస్తీల అరవై గజాల్లో నోటరీ ఇల్లు సంపాదించి, ఉన్న ఇద్దరు కూతుర్లకి మంచి చదువులు చదివించి, వాల్ల పెండ్లి తనకన్నా పనిమంతులయి మెరుగ్గా ఏసీరూముల్లో పన్జేసుకొని ఈఎమ్‌ఐల్లో ఇల్లుకొనుక్కున్న అళ్లుల్లకిచ్చి చేశాడు. ఈ బస్తీకొచ్చి బతకడానికి వాళ్లకి నామోషి, ఆ మార్బుల్‌ జారుడులో బతకడానికి వీళ్లకి ఇబ్బంది, ఇలా అటు మద్య తరగతికి, ఇటు ఊళ్లో తన తండ్రి బతికిన లేకి బతుక్కి మద్యస్థంగా బతుకుబండిని సాగదీసు కుంటూ వస్తున్నాడు లక్ష్మణ్‌. ఈ నలబై ఏళ్లలో దసరా పండగున్న ఐదు రోజులు తప్ప మిగతా జీవితమంటా ఏదో ఓ పనిజేసుకుంటూనే బతికారు ఆ దంపతులు. బిడ్డల పెండ్లీలయినంకా... బరువు బాద్యతలు కొంచెం తీరినంకా లక్ష్మీతో పనిమానిపించి తను మాత్రం పనిచేస్తూనే ఎలాగోలా ఎవరి జీవితాలు వాళ్లు కష్టపడుతూ వెల్లదీస్తూనే ఉన్నారు. ఇలా మార్చి 22వ తేది వాళ్ల జీవితాన్ని చిన్నాబిన్నం చేసేవరకూ ఉన్నంతలో సంతోషంగానే బతికారు. ఇప్పటికి నాలుగు నెళ్లైంది మూడుపూటలా కడుపునిండా తిని. ఎన్నడూ రాని కష్టం ఈ కుటుంబాన్ని విపరీతంగా కుంగదీసింది. అప్పటివరకూ పనిచూపిచ్చిన బట్టల దుకాణం మూతపడి పనిలేదు పొమ్మంది. ఇంట్లో కిరాయికుండే బక్కప్రాణాలు తనలాగే పనిదొరక్క ఖాళీ చేసి వెల్లిపోయారు. అటు ఉద్యోగం లేదు, ఇటు కిరాయి లేదు, దాచుకున్న పదివేలు ఎంత గీచి ఖర్చుపెట్టుకున్నా రెండు నెళ్లుకూడా రాలేదు. అటు బిడ్డల బతుకు ఆగమైంది. ఇద్దరు అళ్లుల్లకి నో వర్క్‌ నో పే అని రెండు నెళ్లైంది. ఈఎమ్‌ఐలు ఇప్పటికిప్పుడు కట్టకున్నా... భవిష్యత్‌ తలుచుకొని అళ్లుల్లు ఆగమాగం ఐతుండ్రు. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు, ఇప్పుడే గిట్లుంటే రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటయో అని భయపడుతుండ్రు. ఉద్యోగం కాదు కదా సగం జీతంకి కూడా కొలువు దొరుకుతదో లేదోనని టెన్షన్తో బతుకుతుండ్రు. నెలకి ముప్పైవేళు ఈఎమ్‌ఐలు ఏడికేయి కట్టాల్నని పరేషాన్‌ ఐతుండ్రు. ఇంతలో చిన్నళ్లుడు కొంచెం దగ్గు, ఆయాసంతో జరం వచ్చిన రెండురోజులకే టీవీల వార్తలు జూసి ఆగమాగమైపోయి అయ్యే అసలు రోగం వచ్చిందేమోనని ఆత్మహత్యా ప్రయత్నం చేసిండు. మెత్తానికి ప్రాణాపాయం నుంచైతే బయటవడ్డడు. లక్షణ్కి కాళ్లు చేతులు ఆడుతలేవు, బిడ్డల్నీ అళ్లుల్లని ఇంటికి పిలిచి దైర్యం చెప్తుండు. గప్పుడెప్పుడో మా తాత కాలంల గత్తరొచ్చి ఊరు ఊరంతా ఖాళీ చేసి బాయిలకాడ్నే బతికిండ్రట, నా బిడ్డలు పుట్టనీకి రెండేండ్ల ముందు ఖైలాబ్‌ బడ్తదని ఉన్నయన్ని ఊర్సుకొని తిన్నం, తర్వాత పుణే మిల్లుల పన్జేసేటప్పుడు ప్లేగొచ్చి సచ్చిపోతమంటే దాన్ని తట్టుకొని బతికినం... గాబట్టే గియ్యాల్ల మీరందరూ ఈడున్నరు. భయమెందుకు, ఆగో గా పసిపోరల జూడుండ్రి. ఆళ్లేం జూసిండ్రు. ఎందుకాగమాగం ఐతున్నరు, కాలం ఎప్పుడు ఒక్కతీరుగుండదు, పొక్కిలి వడ్డ వాకిలి శాన్పుతోటి సక్కగ గాకపోదు, భయపడకుండ్రి బిడ్డా.. బోదాం పా ఆవునూరికే బోదాం పా... ఓ నెళ్లాల్లు కలోగంజో తాగి బతుకుదాం... మా ఊరెప్పుడూ ఆకల్తోటుంచది. అనంగనే ఆ మాటల్తోటి దైర్యం తెచ్చుకున్న లక్ష్మీ కూడా అవ్‌ బోదాం పా మనూరికి బోదాం పా... కాలమాగుతదా ఏంది, ఎదిరిచ్చి నిలవడ్దాం... నా మనుమరాళ్ల బతుకుజూడద్దా.. ఆళ్ల పెండ్లి జూడద్దా... బుగులొద్దు, ఇంట్ల పొక్కిలి తీర్చే శాన్పు కాలమే జల్తది... అనడంతో ఆమెతో పాటు గొంతుకలిపారు అందరూ, భతుకుపై భరోసా తెచ్చుకొని.
- సుధీర్‌ గంగాడి, 9394486053

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పరీక్ష
అర్థం - పరమార్థం
బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.