Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొంగజపం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

కొంగజపం

Sat 18 Dec 22:59:04.531026 2021

దేవున్ని కొలుస్తూనో, స్మరిస్తూనో ఉండటాన్ని జపం అంటారు. మరి ఈ కొంగజపమేమిటి అనే సందేహం మనకేమీకలగదు. ఎందుకంటే కొంగజపం కథ మనందరికీ తెలుసు. అయినా ఆ కథను స్మరించుకొనేలా మన నేతల చేతలు కనపడుతుంటాయి. పూర్వము ఓ వద్థ కొంగ, చెరువు వొడ్డున రాతి మీద ఒంటి కాలితో మౌనంగా ధ్యానం చేస్తూ వుంటుంది.
   దాని ముక్కుకు ఎక్కడ బలౌతామోనని భయపడే చేప పిల్లలు ఆశ్చర్యపోయి చూశాయి. కొంగపాపం చేపలవైపు కూడా చుండకుండా ఎంతో భక్తితో జపం చేస్తూ వుండటం గమనించిన చేపలు. ఓ ఖగోత్తమా! ఏమిటి అలా మౌనంగా వున్నారు! మావైపే చూడటం లేదూ అని అడుగుతాయి. అప్పుడు ఆ వద్థ కొంగ నాయనలారా! మిమ్ములను చంపి తినీతినీ నేననేకపాపములు చేసినాను. ఈ పాపాన్ని కడిగేసుకోవటానికి ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను. ఈ ముసలి తనములోనైనా మోక్షము ప్రసాదించాలని వేడుకుంటున్నాను. జీవహింస చేయరాదని నిర్ణయము తీసుకున్నాను. ఇప్పటి వరకు మిమ్ముల బాధపెట్టినందుకు క్షమించండి. నేనిక ఆహారమే మానివేసినాను. అని ఆ మీనములకు సౌమ్యముగా విన్నవించింది. ఆ మాటలు నిన్న చేపలు పాపం. కొంగ మనసు మారిందని, అహింసవ్రతాన్ని స్వీకరించిందని నమ్మి తపస్సు చేస్తున్న కొంగ చుట్టూ నిర్భయంగా తిరుగుతూ వున్నాయి. తన చుట్టూనే తిరుగుతున్న చేపలను చూసీ చూసీ ఎవరికంట పడకుండా కొంగ తన ముక్కున కరచుకుని మింగుచూ శ్రమలేకుండా ఆహారాన్ని సంపాదించుచూ చెరువులోని చేపలన్నింటినీ స్వాహా చేసెను.
   ఇది అసలు కథ అచ్చం అలానే జరుగుతున్నది నేటి మన దేశ రాజకీ(యి చిత్రాన్ని చూస్తే, మొన్న ప్రత్యేకంగా కాశీ విశ్వనాధున్ని దర్శించుకునేందుకు మన ప్రధాని వెళ్లారు. గంగలో మునిగారు. పవిత్రా గంగాజలాన్ని కలశంలో తీసుకునివచ్చి, కాశీవిశ్వేశ్వరుని ఆలయానికి వెళ్ళారు. వేలకోట్లతో ఆలయ విస్తరణ పర్యవేక్షించారు. ఒక్కరోజు పర్యటనలో ఐదు రకాల వస్త్రాలంకరణలతో ప్రధాని మనకు దర్శన మిచ్చారు. ఆ సందర్భంలోనే కెమెరావైపుకు తిరిగి మంచి పోజులు కూడా పెట్టారు. అవరభక్తుని అవతారమెత్తారు చూడ ముచ్చటగా వున్న దృశ్యాలన్నీ మనలను ఆనందపరుస్తవి.
   ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడయినా ఎక్కడికయినా తిరిగే హక్కువున్నది. తన భక్తినీ కొనసాగించవచ్చు కానీ త్వరలోనే ఉత్తరప్రదేశలో ఎన్నికలు జరుగబోతున్నవి. ఆ ఎన్నికలు కేంద్రానికి ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీకి కీలకంగా మారింది. ఎందుకంటే మొన్నటి చారిత్రాత్మక రైతు ఉద్యమ ప్రభావం ఉత్తరప్రదేశ్‌నూ తాకటం వల్ల నాయకమన్యులకు సెగపెరిగింది కూడా. ఏ యెండకు ఆ గొడుగు. పట్టటం, ఎక్కడి పాట అక్కడ పాడటం, రంగులు మార్చే ఊసరవెల్లులు, అనే సామెతలన్నీ కేవలం సామెతలు కావు. మనుషులలో, అదీ రాజకీయాలలోనైతే అచ్చంగా సరిపోయే సామెతలవి.
   పోయినేడు కరోనా మహమ్మారి దాడిలో ఉత్తరప్రదేశ్‌లో ఆక్సీజన్‌ అందక, ఆసుపత్రులలో బెడ్లుదొరకక, వైద్యం కరువయి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆఖరకు స్మశానంలోనూ స్థలాలు లేని దుస్థితి దాపురించింది. గంగా నదిలో శవాలు ప్రవహించాయి. దుఃఖం ఏరులైపారింది. అప్పుడు కనీసం కన్నీళ్లు తుడవటానికి కూడా ఏ నాయకుడూ రాలేదు. ఓదార్పును అందివ్వలేదు. కనీస భరోసాను కలిగించలేదు. రాజకీయం చేయటం నా వుద్దేశం కాదు కానీ కళ్ళముందు జరుగుతున్న తంతు కదా ఇది! ఒకవైపు మన ప్రాంతంలో రైతులు పండించిన పంటను కల్లాల్లో పెట్టుకుని, కన్నీళ్లతో కడతేరిపోతుంటే, మేము వడ్లు కొననే కొనమని కేంద్రం మొండికేసింది. వందల కోట్లు ఖర్చుపెట్టి గుళ్లుగోపురాలు కడుతూవున్నది. ప్రచారార్భాటానికీ వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఇదెక్కడి నాయకత్వనీతి రీతి!
   అందుకే పురాణ కథలు ఊరికనే పుట్టలేదు. పరిస్థితులు, మునుషుల ప్రవర్తనలు, పాలకులతీరుతెన్నుల ప్రతిబింబంగానే వెలువడ్డాయని ఇలాంటివి చూసినప్పుడు అని పిస్తూ వుంటుంది. కొంగ జపమూ అంతే!

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిఖత్‌ భారత్‌ మహాన్‌
తిండిగలిగితె...
ఏం సమాజమిది!
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు
ఎటుపోతున్నం!
విశ్వాసాల్లోంచి... మూఢత్వంలోకి...
ధరల రుతువు
బేటీ బచావ్‌..!
కవితోత్సవం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.