Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కల'వరమై'న పాట | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • మ్యూజిక్ లిటరేచర్
  • ➲
  • స్టోరి

కల'వరమై'న పాట

Sat 18 Dec 23:47:05.061784 2021

ఇలలో కూడా ఆమెను చూసినప్పుడు కలలో పొందిన అవ్యక్తమైన ఆనందాన్నే మళ్ళీ పొందుతుంటాడు. కలలో ఊహించుకున్న తీయని బంధాన్ని, ఇలలో కూడా ఆమెతో కలిసి పంచుకోవాలనుకుంటాడు. ఆమె ఇలలో కూడా కనిపిస్తుంది. ఇద్దరి మధ్యన పరిచయం జరిగి, ప్రేమ చిగురించి ఒక్కటవుతారు. అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటారు. ఇప్పటికీ ఏ పెళ్ళి వేదికను చూసినా, ప్రతి జంటలో, ప్రతి మనసులో ఈ పాటే వినబడుతుంటుంది. కాలాలు మారినా,తరాలు గడిచినా ఈ పాట చెరిగిపోదు. శ్రీమణి సాహిత్యంతో పాటు గోపీసుందర్‌ సంగీతం, సిద్‌ శ్రీరామ్‌ గానం కూడా ఈ పాట విజయానికి కారణాలే.
   కలలోని ఆనందాన్ని ఇలలో కూడా పొందితే ఆ అనుభూతికి అంతే ఉండదు. ఆ ఆనందం అనుభూతులకు కూడా అందనిదే అయితే అది ఒక వరమనే చెప్పాలి. అలాంటి కల వరమై ఎదురై నిలిచిన సందర్భాన్ని మధురమైన పాటగా మలిచాడు గీత రచయిత శ్రీమణి. అదే - 2018లో పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన 'గీతగోవిందం' సినిమాలోని 'తెల్లతెల్లవారే వెలుగురేఖలా' అనే పాట. శ్రీమణి రాసే ప్రతి పాట సరికొత్త అభివ్యక్తులను, అందమైన పదాలను పొదుగుకుని కనబడుతుంది. ఈ పాట కూడా అలాంటి పులకింతలూరే పదాలతో అల్లినదే.
   అప్పటికీ హీరోకి హీరోయిన్‌తో ప్రత్యక్ష పరిచయం లేదు. కాని ఆమెను కలలోనే తొలిసారి చూశాడు. అదీ వాళ్ళిద్దరికి పెళ్ళి జరిగినట్టుగా. తనకు, తన ఇంటికి తగినట్లుగా ఉండే అందమైన అణకువ కల్గిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని హీరోకి ఎప్పటి నుంచో కోరిక. అందుకే అలాంటి అమ్మాయే అతనికి కలలో కనబడింది. కలలో ఆ అమ్మాయితో జరిగిన పెళ్ళి అతని జీవితానికి సరికొత్త సంతోషాన్నిచ్చింది. అతని ఇంటికి వెలుగును తెచ్చింది. దివి నుంచి దేవత దిగి ఇంటికి వచ్చిందా అన్నంత వైభవాన్నిచ్చింది. చిన్నప్పుడే అమ్మ దూరమైన అతని జీవితంలోకి ఆమె అమ్మ ప్రేమను మూట గట్టుకుని వచ్చి తన కుటుంబ సభ్యులకు ఆ లోటు తీర్చిందా అన్నంత సంబరాల్ని, ఆశ్చర్యాలను కుప్పవోసిందని అతడు భావిస్తుంటాడు..
   తెల్లవారుతున్న సమయంలో విరజిమ్ముతున్న వెలుగురేఖలా, పచ్చదనాన్ని ఆవరించుకున్న పచ్చి మట్టితో చేసిన ప్రతిమలా, స్వచ్ఛమైన పాలల్లో, వెన్నలో తేలియాడుతున్న నురగలా, అచ్చమైన తెలుగింటిలో విరిసిన పూలకొమ్మలా ఆమె తనను చేరుకుందని మురిసిపోతుంటాడు. ఆ దేవుడు పంపిన దేవకన్య నా ఇంట్లో ఇలా ఆమె రూపంలో అడుగుపెట్టిందని, బ్రహ్మకళ్ళలోని కాంతిరేఖలే వాళ్ళ అమ్మలా మారి మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో తన ఇంటికి వచ్చి వాళ్ళ సంతోషానికి సంకేతమై లాలీ పాడుతోందని భావిస్తుంటాడు.
   ఆరు రుతువులు తెలుసు కాని, ఏడో రుతువై ఈ బొమ్మ తన ఇంటికి వచ్చిందని, హారతి పల్లెం ఆమెను చూసి హాయిగా నవ్విందని, వదినమ్మా అని ప్రేమగా హీరో చెల్లెలు పులకించిపాడుతూ ఆహ్వానిస్తుంది. ఆకాశంలోని చుక్కల రెమ్మగా, నట్టింట్లో నడిచే నెలవంకగా ఆమెను ఊహించుకుంటుంది అతని చెల్లెలు. ఈ సన్నివేశాన్నంతా అతడు కలలో మనసునిండా చూస్తున్నాడు. ఆమెను సంప్రదాయానికి ప్రతీకగా, శుద్ధమైన పద్మినీజాతికి చెందిన స్త్రీగా, ప్రేమతో నిండిన సౌభాగ్యవతిగా, శర్వాణీగా తన ఆలోచనల్లో ఆరాధించుకుంటాడు.
   ఆమె హృదయం చేసే శబ్దానికి మెడలో కదులుతున్న తాళిగా మారి ప్రతి నిమిషం ఆయుష్షును పెంచుతా నంటాడు. నిద్ర వచ్చే వేళ ఆమె కళ్ళలోన ముసురుకున్న కలలన్నింటిని కాటుకలా మారి చదువుతానంటాడు. నంగనాచి కూనా అంటూ చిలిపిగా పిలుస్తూ తన అందంతో ఆకర్షించు కుంటుందని, తన చిరునవ్వుతోనే వశపరుచుకుం టుందని, తన మూతిముడుపుతో ముల్లోకాలను మింగేయగలదని అంటాడు. తన రెండుకళ్ళల్లోన ఇంద్రధనస్సును దాచి అర్ధరాత్రి వేళ నిదురపోతున్న సమయాన ఆ హరివిల్లు కాంతితో, కన్నుల వెలుగులతో నిద్రను చెరిపేస్తుందని ఆంటాడు. అంత అందంతో అలరిస్తూ తన సరసన చేరకపోతే సతమతమైపోయి ఏ రాక్షసరాశిలో, ఏ ఘడియల్లో పుట్టావో నీవు అంటూ వయసులోని ఆరాటాన్ని స్పష్టం చేస్తాడు హీరో. అతని ఊహల్లో ఊరేగుతూ, అతని ప్రాణానికి దీపమవుతూ, అతని బ్రహ్మచర్యదీక్షను చెరిపేసింది ఆమెనే అంటూ చెబుతాడు..
   ఏకాంతాలన్ని కూడా తమకు ఏకాంతం లేదే అని ఒక్కసారిగా మీద పడ్డాయట. ఎందుకంటే - మన ఇద్దరిని ఏకాంతంలో ఒక్కటి చేసి వదిలేశాయి కాబట్టి. సంతోషాలకు సెలవులేదట. ఎందుకంటే - మనతోనే కొలువై ఉన్నాయి కాబట్టి. అంటే - అంతులేని సంతోషాలకు, తీయనైన ఏకాంతాలకు నెలవైన కాపురం మనదేనని హీరో పరవశంతో అంటున్న మాటలివి. అంతే కాదు - కాసింతైనా ఆహ్వానం పలకని
   ఒంట్లోకి నేను వెళ్ళలేనని విరహం మన ఇద్దరి దగ్గరికి రాకుండా, మనతో వేగలేనని వెళ్ళిపోయింది. కష్టం,నష్టం అనే తన సొంతవాళ్ళు లేరని కన్నీరు నిలువనీడలేక ఒంటరైపోయింది. ఇంత గొప్ప అదృష్టం నా ఒక్కడిదేనంటూ గ్రహించిన ఈ ప్రపంచం నాపై పగబట్టింది. అని హీరో అంటున్నాడు. తనను చేరిన అమ్మాయి వల్లే ఇంత వైభోగం, అదృష్టం, చెరిగిపోని ఆనందాల చిరునామా తన సొంతమైందని హీరో భావిస్తుంటాడు. పై పంక్తుల్లో వినూత్నమైన, ఉన్నతమైన భావ సరిగమలు వినిపిస్తున్నాయి. శ్రీమణి ప్రత్యేకముద్ర కనబడుతుంది.
   ఆమె చేరిన ఈ జన్మనే నాకు అదృష్టం. ఆమెలో సగమై బ్రతికే జీవితమే ధన్యం. ఆమె నుదుటన చేరిన కుంకుమ బొమ్మ వెయ్యేళ్ళ ఆయుష్షును అందించి దీవించిందని, ఈ సంతోషాల సమ్మేళనం శాశ్వతమైనదని హీరో కలగంటూ పులకరిస్తున్నాడు.
   కల చెదిరిపోయినా - ఆ అనుభూతి అతనిని అంత తొందరగా విడిచిపోలేదు. కలలో కలిసిన ఆమెను ఇలలో వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఇలలో కూడా ఆమెను చూసినప్పుడు కలలో పొందిన అవ్యక్తమైన ఆనందాన్నే మళ్ళీ పొందుతుంటాడు. కలలో ఊహించుకున్న తీయని బంధాన్ని, ఇలలో కూడా ఆమెతో కలిసి పంచుకోవాలనుకుంటాడు. ఆమె ఇలలో కూడా కనిపిస్తుంది. ఇద్దరి మధ్యన పరిచయం జరిగి, ప్రేమ చిగురించి ఒక్కటవుతారు. అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటారు. ఇప్పటికీ ఏ పెళ్ళి వేదికను చూసినా, ప్రతి జంటలో, ప్రతి మనసులో ఈ పాటే వినబడుతుంటుంది. కాలాలు మారినా, తరాలు గడిచినా ఈ పాట చెరిగిపోదు. శ్రీమణి సాహిత్యంతో పాటు గోపీసుందర్‌ సంగీతం, సిద్‌ శ్రీరామ్‌ గానం కూడా ఈ పాట విజయానికి కారణాలే.
పాట
   తెల్లతెల్లవారే వెలుగురేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టిబొమ్మలా/అల్లి బిల్లి వెన్నపాల నురగలా అచ్చతెలుగు ఇంటి పూలకొమ్మలా/దేవ దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగేపెట్టేనంట/బ్రహ్మకళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట/వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో రుతువై బొమ్మా హారతి పల్లెం హాయిగ నవ్వే వదినమ్మా/వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా/సాంప్రదాయినీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ శర్వాణీ
   ఎద చప్పుడు కదిలే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయువునే పెంచేయనా/కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకనై చదివేనా/చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా ముల్లోకాలు మింగే మూతి ముడుపుదానా/ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా/ఏ రాకాసి రాశో నీది ఏ ఘడియల్లో పుట్టావే ఐనా/వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో రుతువై బొమ్మా నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా/వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా
   ఏకాంతాలన్నీ ఏకాంతం లేకా ఏకరువే పెట్టాయే ఏకంగా/సంతోషాలన్నీ సెలవన్నదీ లేకా మనతోనే కొలువయ్యే మొత్తంగా/స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక/కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువనీడలేక/ఎంతదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా/నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా/మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటన కుంకుమ బొమ్మా ఓ వెయ్యేళ్ళాయుష్షంటూ దీవించదమ్మా.
- తిరునగరి శరత్‌ చంద్ర

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్నేహబంధమై నిలిచిన పాట
ప్రేమానుభూతియై పరిమళించిన పాట
సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట
లోకం గుట్టును విప్పి చెప్పిన పాట
భారతజాతికి జైకొట్టిన పాట
ప్రపంచ పోకడల పంచపదులు...
మనసు తెరకు కొత్తరంగులద్దిన పాట
పరవశింపజేసే మనసు పాట
గిలిగింతలు పెట్టే ప్రేమ పాట
మనసున మోగే 'మధురమై'న పాట

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.