Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'మల్లా నా ఎదాన్నే' | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

'మల్లా నా ఎదాన్నే'

Sun 26 Dec 04:06:38.351762 2021

నీలమ్మ దండం బెడుతూ....సారూ వానితోని నేను బత్కలేను సారూ, నాకు సాయం జెయ్యకుంటే పిల్లలు నేను ఏదన్న మందు బోసుకొని సత్తమ్‌ సారూ! వానితోని వుండలేక, ఆని కొట్లకు, తిట్లకు, సేతలకు యేగలేక బైటికెల్లొచ్చిన సారూ, నాకు ఆడొద్దు సారూ! తాగొచ్చి యింట్ల తినే గిన్నెల గూడ వుచ్చ బోస్తడు సారు, ఆడ పిల్లల ముందట బట్టలిప్పుకొని తిరుగుతడు సారూ! నా సీరె, రైక సింపి బరిబాతుల బైటికెెల్లగొడ్తడు సారూ. నా జీతమ్‌ గుంజుకొని మొత్తం దాగుతుంటడు. తాగుడుతోనే గట్టయిండు. నేను పిల్లలు యెట్ల బత్కాలె.
   'అరే ఏంది యిడువు, దాన్నిడువు, ఓ రానక్కా, సదక్కా, రాండ్రే...' 'అబ్బో! బాడ్కావు తాగిన బలమున్నట్లున్నది. ఎవ్వల్కి వశమైతలేడు' 'యిడువురా' యిడువు దాని రైకె సినుగుతది యిడువు 'ఓ అన్నా జరగాన్ని బట్టుకొని యిడిపియ్యుండ్రి తాగి పెండ్లాన్ని గట్ల గొట్టి యీనెంజేత్తండు దాన్ని సంపేత్తడు, దాని రైకెల పైసల కోసం గుంజు తండు 'రాండ్రే...అరె అది సత్తదిరా బాడ్కావ్‌' యిట్లా లొల్లి లొల్లిగా మున్సిపల్‌ వర్కర్లు మొత్తుకుంటండ్రు.
   రోడ్డు మీద వున్న యిద్దరు మగవాల్లు రోడ్డు మీద వూడ్సే నీలమ్మను ఆమె బర్త బాగా తాగొచ్చి కొడ్తాంటె, నీలమ్మతోని పంజేసే యింకో రెండు మూడు గ్రూపులోల్లు వురికొచ్చి యిడిపిచ్చినా యిడుస్తలేడు. ఆల్లు రోడు మీద బొయే ఆల్లీల్లను బతిమి లాడుతుండ్రు.
   'ఓ సారూ, ఓ అన్నా గాన్ని జర కొట్టకుంటాపుండ్రి అని ఒకామె 'ఓ నీలక్కా... అని పుర్సల్ల మీద ఒక్క తన్నుదన్నే. ఎన్కకు అట్లనే యిర్సుక పడ్తడని యింకో కామె అరుస్తంది. యింతల యి రోడ్డుమీద పోయే యిద్దరు యూత్‌ పిలగాండ్లొచ్చి యిడిపియ్యబోతె 'అరే ఎవ్వనివిరా నా పెండ్లం నా యిష్టం, నేను కొట్టుకుంటా సంపుకుంటా చల్‌ దెంగేయుండ్రి' అని వాల్లను నూకెయ్య బోంగనే ఆ యూత్‌ పిలగాండ్లు జెర రెచ్చిపోయి ఒక్క లాగుడు లాగితె నీలమ్మ జాకెటు సినిగి ఆమె బర్త సురేష్‌ చేతిలకు బొయింది. నీలమ్మ ఏడ్సుకుంట బొబ్బ బెట్టుకుంట కొంగు గప్పు కొన్నది. గుంజేసినంక గూడా మల్లా లేసి ఆంబోతోలె నీలమ్మ మీద బడబోతే యింకా నలుగురు మొగోల్లు గూడిండ్రు.
   ఏందిరబరు నీ పెండ్లమైతతే యింట్ల గొట్టుకో...గీ బజార్ల బడి గొట్టుడేంది. యిదేం పద్ధతి అని యింకోతను న్యాయం సెప్తండు. నీలమ్మ తోని పంజేసే రాణి, సరమ్మ, శారద, సంధ్య, కిట్టమ్మ గిట్ల అందరు కూడిండ్రు. శారద సైడు మీద పంజేసే మొకద్దంను ఫోన్‌జేసి బిల్సింది. మొకద్దం కలీం పాష వచ్చి 'గీన్ని పోలీసుల్తోని చెప్పి తొక్కిద్దాం పాండ్రి' సారూ ఒక్కసారి గాదు రొండు సార్ల గాదు యిప్పటికి మూడు సార్ల బొయి పోలీసు సార్లకు నెత్తిబోను మొత్తుకున్నమ్‌ సార్‌. పాపం నీలక్క యీని బాదలు వడలేక యెల్లచ్చింది ఆనింటి కాన్నుంచి. దీనికి దిక్కులేరు దెన్నెలేరు. ఆడు సెడ్డ బాడ్కావు సారూ....సైడు మీదికి తాగచ్చి సీరె, రైకె సినిగె దాక గొడ్తడు మేమడ్డ మొచ్చినమని మమ్ముల గూడ గొట్టిండు. రాళ్లతోని పెల్లలతోని కట్టెలతోని మమ్ముల గూడ గొడ్తండు సారూ....నీలక్కకు యిద్దరాడబిల్లలు ఆల్లెట్ల బత్కాలె, గీడు పంజేసే కాడికి తాగచ్చి గిట్ల కొడ్తండని యింట్లకెల్లి యెల్లచ్చింది. గీడు రాయి నా కాలు మీద యెత్తెత్తె నా కాలు యిరిగితె దావుకాండ్ల యేల రూపాలు బోసి బాగు జేయించుకున్న....'సంద్య.
   అవు సారూ గీడు అద్దుమ రాత్రి' నా పెండ్ల మేదే, సైడు మీద కనబల్లే...ఎవందగ్గెరికి తోలిండ్రే' మీరుజెయ్య బట్టే నా పెండ్లమ్‌ నాతోని సంసారం జేత్తలేదు, పెండ్లమ్మొగనికి మీరే యెడ బాపుతుండ్రే' అని మా యిండ్ల మీది కొస్తె మా మొగలూకుంటారా సారు. రోజు ఏడుపే నీలక్కది, ఏనాడు కడుపు నిండదిని కండ్లారా నిర్దబొయింది లేదు. మేము పెండ్లమ్మొగడు ఆయిబాయిగ కలిసుండాలనే అనుకుంటమ్‌ గానీ పెండ్లమ్మొగడు యేరు గావాలని మేమెందుకంటమ్‌' రాణమ్మ.
   ఒక్కకాడ పంజేసేటోల్లమ్‌ కొడ్తాంటె సూత్తమా, ఆడు మొగడే కాని యెవడన్న గానీ వూకుంటమా! మేమడ్డం బోతె మమ్ముల్ని గూడ కొడ్తే... పోలీస్‌ టేషన్‌కి బొయి సప్తె..... ఆల్లంటరు 'ఆడు సైకో మేమేం జెయ్యలేము మీరే ఏమన్న జేసుకోండ్రి' అనంటె ఎల్లసారూ! యాడికి బోయి ఎవరాదుకుంటరు మమ్ముల. ఎవలకు జెప్పుకోము ఆ తాగుబోతోన్ని సూసినవు గదా మీరు వచ్చి జెర మా కోసం మాట్లాడుండ్రి పోలీస్టేషండ్ల' అని సదమ్మ బతిలాడింది కలీంపాషని.
   ఓ నీలక్కా రాయె అందరం బోదాము జెర సెవులకెక్కెటట్లు పోలీసులకు జెప్పు అని సైడు మీదున్న మున్సిపల్‌ మహిళా వర్కర్లంతా కలీంపాష ధైర్యం జూసుకొని పోలీస్‌ స్టేషన్‌కి బొయిండ్రు.
   నీలమ్మ, నీలమ్మతోని పంజేసే రాణమ్మ, సదమ్మ, కిట్టమ్మ, సంద్య, శారద గిట్ల పది మంది దాక పంజేత్తరు. యీల్లంత జౌట్‌ సోర్సింగ్‌ల లంచాలు బెట్టి వచ్చినోల్లే. ఇరువై ఏండ్ల కింద సైదాబాద్‌ మున్సిపాల్టిల గౌరుమెంటు కొలువు యిత్తమంటే గంటె పుస్తెలమ్మి కొందరు, అప్పులు దెచ్చి కొందరు ముప్పయి, నలుబై వేలు గట్టి వూడ్సే పనికి కుదిరిండ్రు. 'ఏ నౌకరైతేంది గౌరుమెంటులే గదా రేపు, రేపు ఎప్పుడైనా పర్మనెంటు జెయ్యరా' అని నిమ్మత పడి రోడ్లన్ని సాఫ్‌ జేస్తుంటరు. రోడ్లన్ని అద్దాలోలె మెరుస్తున్నయంటే....వాల్ల సేతుల సీపురు కట్టలైతేనే వూడ్సి వూడ్సి వాల్ల సేతులు సీపురు కట్టలోలె అరిగి పోయినయి. యీల్లు పొద్దుగాల మూడు గంటల రాత్రికి లేసి వూడ్సుకొని, తోముకొని యింట్ల అన్నమ్‌ వండి నాలుగ్గంటలకల్లా సైడు మీద వుండాలె. కూరగాయలు నూనె గిట్లుంటె కూర గూడ వండి పిల్లలకు అన్ని సగ పెట్టి వస్తరు. లేకుంటె వుత్త అన్నమ్‌ వండి సీకట్ల ఒక్కలే నడ్సుకుంట సైడు మీదికొచ్చి తోటి మహిళా వర్కర్ల తోని యింత చాయి బొట్టు దాగి సీపుర్లతోని వంగితే.... మల్లా పదకొండయే దాకా చేత్తనే వుంటరు. తిండి లేదు, మద్యల మల్లా చాయి దాగి రెండెంటి దాకా జేసి యిండ్లకు బోతరు. యిండ్లల్ల ఆల్లకు సక్కటి బత్కుండది. యింట్ల మొగని పరేషాన్‌ పిల్లల పరేషాన్‌ వుండి బేచైన్‌ బేచైన్‌ గుంటయి ఆల్ల జీవితాలు.
   అట్లా జి.హెచ్‌.ఎమ్సీ(GHMC)లో నీలమ్మ యిరువై ఏండ్ల సంది స్వీపర్‌గా జేస్తుంది. పెండ్లి గాక ముందే నౌకరిల జేరింది. నా బిడ్డకు నౌకరుందని నీలమ్మ తల్లిదండ్రులు బిర్రుగనే పెండ్లి జేసిండ్రు నౌకరి లేని సురేష్‌కిచ్చి. సురేష్‌ దోస్తులు 'నీకేందిరా నౌకరున్న పెండ్లమ్‌ దొరికిందనీ, మా రాజువని' అని సంబరపడ్డరు. పెండ్లయి నంక యిద్దరు బిడ్డలు బుట్టే దాకా మంచిగనే వుండెటోడు. ఏ కూలి బడితే ఆ కూలికి బొయేటోడు, యింటి కాడ యిన్ని పైసలిచ్చి యిన్ని తాగెటోడు. కానీ యీ మద్దెన తాగుడెక్కువైంది. యింట్లకు పైసిస్తలేడు, కూలికి బోతలేడు, నీలమ్మను జీతమ్‌ పైసలియ్యి అని కొట్టుడు, తిట్టుడే గాదు తాగి బట్టలిప్పుకొని ఆడపిల్లల ముందు తిరుగుకుంటా, యింట్ల ఏడబడితె ఆడ మూత్రమ్‌ బోస్తూ ఆడి పిల్లల్ని భయపడేటట్లు జేస్తుంటె నీలమ్మకు వశంగాక పిల్లలతో మొగని యింట్ల నుంచి బైటికెల్లొచ్చి తన తోటి పంజేసే ఆడోల్లుండే బస్తీలకొచ్చి వుంటుంది. తాగుడు లేక ముందు సురేష్‌ మంచోడే అంటది నీలమ్మ. యిల్లిడ్సి వచ్చినా నీలమ్మ భర్త తను పనిజేసే సైడు మీదికొచ్చి పైసలియ్యి లంజే అని ఆమెను రోడుమీద పశువును కొట్టినట్లు కొడ్తే....తోటి స్వీపర్లు అడ్డంబోతే వాల్లంగూడ కొడ్తుండు. పోలీస్టేషన్‌కు బోతే వాల్లు గూడ మీ భార్య భర్తల కొట్లాట అని పట్టించుకుంటలేరు అని ఆకరికి మొకద్దమ్‌ ని తీసుకొని పోలీస్టేషన్‌కి వచ్చిండ్రు.
   ''ఓ నీలక్కా! అయ్యా ఎట్ల జెప్పుకోవాలె యిజ్జత్‌ బోతదని అన్ని సెప్పకుంట వుండేవ్‌ ఇగ అన్ని కుల్లమ్‌ కుల్ల జెప్పు బయపడకు'' అని తోటి ఆడోల్లు బలమిచ్చిండ్రు కలీం పాషా అందర్నియెంటేసుకొని పాపం బేచారికి న్యాయం జెయ్యాలనీ లేకుంటె వాడు కొట్టే దెబ్బలకు సచ్చిపోతదనీ వున్నిద్దరు ఆడపిల్లలు ఆగమైతరని స్వీపర్లందర్ని తీసుకొనొచ్చిండు. తాగుబోతోనితోని నీలమ్మను కాపాడనీకి వచ్చిండు.
   ఎస్‌.ఐ.తోని 'సాబ్‌ గరీబ్‌ ఔరత్‌ హై సాబ్‌, రోజు సైడు మీదకొచ్చి యిజ్జద్దీస్తుండు, దారూసీకే బౌత్‌ మార్తే సాబ్‌, యే బేచారికో మదత్‌ కరో సాబ్‌' అని నీలమ్మ భర్త తాగొచ్చికొట్టే ఆగడాలన్ని చెప్పిండు. వెంటనే నీలమ్మ దండం బెడుతూ....సారూ వానితోని నేను బత్కలేను సారూ, నాకు సాయం జెయ్యకుంటే పిల్లలు నేను ఏదన్న మందు బోసుకొని సత్తమ్‌ సారూ! వానితోని వుండలేక, ఆని కొట్లకు, తిట్లకు, సేతలకు యేగలేక బైటికెల్లొచ్చిన సారూ, నాకు ఆడొద్దు సారూ! తాగొచ్చి యింట్ల తినే గిన్నెల గూడ వుచ్చ బోస్తడు సారు, ఆడ పిల్లల ముందట బట్టలిప్పుకొని తిరుగుతడు సారూ! నా సీరె, రైక సింపి బరిబాతుల బైటికెెల్లగొడ్తడు సారూ. నా జీతమ్‌ గుంజుకొని మొత్తం దాగుతుంటడు. తాగుడుతోనే గట్టయిండు. నేను పిల్లలు యెట్ల బత్కాలె. మా అన్నదమ్ములు, తల్లిదండ్రులు గూడ ఆనికి బయపడి ఏంజేత్త లేరు. నేనేడికి బోదు యెవలను అడుగుదు సారూ! యీడికి నాలుగైదు సార్ల మీ టేషన్‌ కొచ్చిన సారూ! నాకు న్యాయం జెయ్యుండ్రి సారూ! ఆని తాగుడు మాన్పియండ్రి సారూ! మీరు బట్టించుకోకుంటె మాకెవ్వలు దిక్కు. జెర దయుంచుండ్రి సారూ! ఎవ్వలకంగుత లేడు. మీరయితేనే వంచుతరు సారూ సైడు మీద సందుల్ల ఒక్కొక్కరమే వుంటమ్‌. కత్తులు బట్టుకొని తిరుగుతడు సంపుతనని, నేంజత్తె నా పిల్లలాగమైతరు, మీ కాల్లు మొక్కుత సారూ యింట్లనే గిట్ల మమ్ముల గోస బెడ్తండు. బైటికి బోతె కుక్క గూడ గానది, నాకు న్యాయం జెయ్యుండ్రని సి.ఐ కాళ్ల మీద బడ్డది. ''మీరే న్యాయం జెయ్యాలె సార్‌ యిప్పటికి నాలుగు సార్లచ్చినమ్‌ యింతకు ముందు వేరే సారుండె'' వాడు సైకో అమ్మా మేమేం జెయ్యలేము మీరు మీరు జూసుకోండ్రన్నడు సారు మీరట్లనొద్దు సార్‌'' కిట్టమ్మ మాట గలిపింది.
   'అవ్‌ సాబ్‌ వో బేకార్‌ ఆద్మీకు దమ్కీ దేనా' మత్‌ పీనా బోలో సాబ్‌ వో బేకారికో బచానా సాబ్‌ అని సిఐ మనసుల నాటిండ్రు.
   ''సర్లే ముందు అప్లికేషన్‌ యిచ్చిపోండ్రి, తర్వాత చూద్దామ్‌'
   ''గట్లనకుండ్రి సార్‌ ఆన్నిప్పుడే పిలిపిచ్చి లోపటెయ్యుండ్రి సార్‌, ఆడు సక్కగైతడు'' అవును సార్‌ మీరు ఆన్ని ఏదన్న జేసెదాక మేమింటికి బోము యీన్నే కూసుంటము నీలక్క కోసం. యేడ సంపేత్తడో అని భయమైతంది అని అందరు గట్టిగ నిలబడిండ్రు. ఆల్ల బాధపడలేక సి.ఐ నీలమ్మ భర్తను పిలిపిచ్చిండు. స్టేషన్‌కి రాంగనే ఎస్సై పటా పటా నాలుగు దెబ్బలెయ్యంగనే కిందబడి 'నా సంసారం నాగ్గావాలె, నాభర్య నాగ్గావాలె' నాకేమద్దు అని సి.ఐ కాళ్ల దిక్కు సేతులు కొట్టుకుంటండు. ''వాయ్యో సొక్కంపూసోలె మాట్లాడ్తండు గియన్ని డ్రామాలె సార్‌, యీన్ని లోపలేసి కేసు పెెట్టుండ్రి' స్వీపర్లంత బొబ్బ వెట్టినట్లు అన్నరు. 'అవుసార్‌ ఆడు జేల్లనే వుండాలె! గట్ల నన్న తాగకుంట వుంటడు. తాగి తాగి గిట్ల పెండ్లాం పిల్లల్ని ఆగం జేసిండని తిట్టుకుంట బైటి కొచ్చిండ్రు.
   'నీలమ్మా ఫికర్‌ జెయ్యకు అల్లా దువా వుంటది. యిగవాడు బైటికి రాడు మీరందరు యింటికి బోండ్రి బిడ్డా' అని చెప్పి యెల్లిపోయిండు మొకద్దమ్‌.
   అబ్బా! నీలక్కా! పీడ బొయిందే, నా అసోంటి మొగడుంటే ఏ ఆడిది బతికి బట్ట గట్టదే. అబ్బబ్బ ఏంగోసిది' కిట్టమ్మ
   ఏ తల్కాయ నొత్తంది యింత చారు దాగి పోదామని శారద బొయి డబ్బా పిలగాన్ని పిల్సింది అందరు బాయి దిగి ''యిగబోయియ్యాలన్న జెర కడుపునిండ దిని కండ్లార నిద్రవో నీలక్కా అనుకుంట ఎవలిండ్లకు ఆల్లు బొయిండ్రు.
   నీలమ్మ పెనిమిటిని పోలీసు స్టేషండ్ల బెట్టిన మూడు రోజులైనంక, ఓ రోజు రాత్రి నీలమ్మ యింటి తలుపు ఎవరో కొడుతుండ్రు. గీరాత్రెవరు తలుపుగొడ్తండ్రు? మల్లా టేషండ్ల నుంచి నా తావు దొర్కిచ్చుకొని వచ్చెనా ఏంది! అని బుగులు వడుకుంట తీసేటాలకు పిల్లలు గూడ భయపడుకుంట తల్లెంబడే లేసిండ్రు.
   ఎవలు మీరు? అ 'మేము పోలీసులము' అనంగానే నీలమ్మకు సల్లసెమటలొచ్చినయి' వాయ్యో వాన్ని గిట్ల తీస్కచ్చిండ్రా ఏంది' అనుకొని 'గీరాత్రేందిసారూ! ఆడ మనిషిని ఏమున్నా రేప్పొద్దుగాల రాండ్రి' అన్నది నీలమ్మ తలుపు తీయకనే.
   అరే! బుద్దున్నదా! పని పాటలేక నీయింటి తలుపు గొట్టనీకొచ్చినమా! రోడ్లూడిసే దానికే గింత పొగరుంటే మాకెంతుండాల్నే...తీత్తవా ఒక్క తన్ను తన్నాల్నా తలుపును' అని పోలీసులు దురుసుగ మాట్లాడంగనే...కాల్జేతులు వణుకుతుంటే... తలుపు తీసింది. ఒక్క తన్ను దన్నితె యిరిగిపొయే తలుపుకు గింతసేపా ఆ....నీ మొగనికి టక్కరైంది కాల్జేతులు యిరిగి గాందిల వున్నడుపో'....అని పిల్లల్ని, నీలమ్మను కొందికి మీదికి చూసుకుంటా యెల్లి పోయిండ్రు.
   గీ అద్దుమ రాత్రి యాడికి బోదు ఆడిపిల్లల్ని దీసుకొని. యీని తాగుడు పాడువడ, తాగి తాగి గీ తెర్లాయె. యీని పాసి పీడ మల్లా నా యెదాన బడె, యిడిసి పెట్టి వుంటె సుట్టాలు, పక్కాలు వాడిపోస్కుంటరు. ఏంజేతు? అని వలపోసుకుంటాంటె...అజా యినబడ్తంది. తెల్లార్తంది గానీ నా సీకట్లకెన్నడు తెల్లారాలె అనుకుంటా... పిల్లల్ని తీసుకొని గాంది దావుకానకు బొయింది నీలమ్మ.
- జూపాక సుభద్ర, 9441091305

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:22 PM

ఐపీఎల్ : రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.