Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కర్లీ హెయిర్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

కర్లీ హెయిర్‌

Sun 09 Jan 02:44:48.823348 2022

నిండార తలస్నానం చేసిన అందమే వచ్చి బస్‌ ఎక్కింది. తన హెయిర్‌ మంచుపొగల్లా హోయలు పోతున్నది. మల్లెతీగలు స్వేచ్ఛారాగమై గాలిలో ఎగిరినట్లుగా, ఆకుపచ్చతీరానికి చేర్చేదారుల్లా అవి రింగులు తిరిగి ఉన్నాయి. చెయ్యెత్తు మనిషి, బలమైన శరీరం, గురుత్వాకర్షణ శక్తినంతా రంగరించి నింపుకున్నట్టున్న తన కళ్ళు. ఏదో వెదుకుతూ వచ్చి అజ్ఞాత్‌ పక్కనే కూర్చుంది కర్చీఫ్‌ తీసుకుని. ఆ అమ్మాయి కర్లీ హెయిర్‌లో అజ్ఞాత్‌ కళ్ళు చిక్కుకు పోయాయి తొలి చూపులోనే. తన ముఖంపై మిణుకుమనే మొటిమెల నక్షత్రాలు చాలా అందంగా మెరుస్తున్నాయి. చీకట్లో జాబిలి అందం పెరిగినట్టు, వెన్నెల వెలుగు చిక్కనైనట్టుంది.
   మూడువైపులా ముచ్చటగొలిపే ఎత్తైన నల్లనికొండలు. ఆ కొండలపై పచ్చని దీపాలను పేర్చినట్టు చెట్లు. ఇంకోకవైపు అమ్మపాలలాంటి నీటి సముద్రం. మధ్యలో చిక్కని యాపచెట్లతో కూడిన చక్కని జనావాసం. అన్ని మతాల దేవుళ్ళు మీటింగ్‌ వేసుకున్నారేమో.! ఆ గుట్టలను ఎవ్వడూ మైనింగ్‌ చేయకుండా వాటిని మనమే కబ్జా చేయాలని. అందుకే గుట్టకో మతం గుడికట్టుకుంది. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. అవి దిక్కులు కావు. పల్లెల నుంచి ఆ టౌన్‌కు దీపదారులు.
   అలాంటి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార్లు కృషి చేస్తున్నారు. వారికంటే ముఖ్యంగా అధికారపార్టీ నాయకులు కంకణం కట్టుకుని ఉన్నారు. ప్రెస్‌ మీట్‌లు పెట్టి అనౌన్స్‌ చేశారు. నూటపదికోట్లతో అభివృద్ధి చేసి మాట మీద నిలబడతామని. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పని మొదలైంది. ఎక్కడికక్కడ టౌన్‌ అంతా రోడ్లను తొవ్విపోశారు. ఆ మట్టిలో నుండి దుమ్ములేపుకుంటూ బస్టాండ్‌కు దూసుకొచ్చింది బస్‌. ఆ దుమ్ముగుమ్మాన్ని దాటి పొడపొడల గట్లు దాటుకుని వస్తుంది. ప్రయాణికుల్ని ఎంతోమందిని తనలో దాచుకుంటూ భువనగిరి బస్టాండ్‌కు చేరింది బస్సు. ఓ నిండు గర్భిణిలా. ఒక్కరొక్కరుగా దిగి ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోతున్నారు. రెండు పుస్తకాలు, డైరీ పట్టుకుని ఓ మోస్ట్‌ ఎలిజబుల్‌ స్టూడెంట్‌లా అజ్ఞాత్‌ కూడా బస్‌ దిగాడు. తనకోసం ఎదురుచూస్తున్న వెంకన్న బైక్‌ ఎక్కి సెమినార్‌కి వెళ్ళాడు.
   సెమినార్‌ పూర్తవగానే అజ్ఞాత్‌ తన సహచరులతో బస్టాండ్‌ వచ్చారు.
   ''సెమినార్‌ బాగా జరిగింది. అను కున్నదానికంటే ఎక్కువమంది స్టూడెంట్స్‌ వచ్చారు. స్టూడెంట్స్‌ కంటే ఎక్కువగా లెక్చరర్సే ఇన్స్‌పైర్‌ అయ్యారని పించింది. అన్నింటికంటె ముఖ్యంగా ఓ సినిమా హీరో దగ్గరనో, సెలబ్రేటీల వద్దనో తీసుకున్నట్టు మీ దగ్గర విద్యార్థులు ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం మన క్యాడర్‌కు గొప్ప ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నిజంగా అది నాకుకూడా కొత్తగా, గొప్పగా అనిపించింది అజ్ఞాత్‌.'' అంటూ సెమి నార్‌కు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నాడు మహెందర్‌.
   '' బస్‌ వచ్చింది వెళ్తా మహేందర్‌''
   అన్నాడు అజ్ఞాత్‌
   '' నీకోసం సీటు పెట్టారు మనవాళ్ళు'' అంటూ సెండాఫ్‌ ఇచ్చాడు మహి. బస్‌ ఎక్కి విండో తెర్చి కూర్చున్నాడు అజ్ఞాత్‌.
   ''పక్కన ఎవరైనా ఉన్నారా.?''అని అడిగి తన పక్కన పెట్టమని కర్చీఫ్‌ ఇచ్చింది ఓ పెద్దావిడ బయటనుంచి.
   ఇప్పుడే నిండార తలస్నానం చేసిన అందమే వచ్చి బస్‌ ఎక్కింది. తన హెయిర్‌ మంచుపొగల్లా హోయలు పోతున్నది. మల్లెతీగలు స్వేచ్ఛారాగమై గాలిలో ఎగిరినట్లుగా, ఆకుపచ్చతీరానికి చేర్చేదారుల్లా అవి రింగులు తిరిగి ఉన్నాయి. చెయ్యెత్తు మనిషి, బలమైన శరీరం, గురుత్వాకర్షణ శక్తినంతా రంగరించి నింపుకున్నట్టున్న తన కళ్ళు. ఏదో వెదుకుతూ వచ్చి అజ్ఞాత్‌ పక్కనే కూర్చుంది కర్చీఫ్‌ తీసుకుని. ఆ అమ్మాయి కర్లీ హెయిర్‌లో అజ్ఞాత్‌ కళ్ళు చిక్కుకు పోయాయి తొలి చూపులోనే. తన ముఖంపై మిణుకుమనే మొటిమెల నక్షత్రాలు చాలా అందంగా మెరుస్తున్నాయి. చీకట్లో జాబిలి అందం పెరిగినట్టు, వెన్నెల వెలుగు చిక్కనైనట్టుంది. ఆ బ్లాక్‌ చుడీదార్‌లో తన ఫేస్‌గ్లో. ఇంతలోనే ఇంకో ఆవిడవచ్చి తన పక్కన కూర్చోవడంతో అజ్ఞాత్‌కు మరింత దగ్గరగా జరిగింది. ఆ అమ్మాయి కర్లీ హెయిర్‌ లీవ్‌ చేసి ఉండడంతో వైట్‌ షర్ట్‌ వేసుకున్న అజ్ఞాత్‌ భుజాలపై పరుచు కుంది ఓ నల్లనిజలపాతంలా. అది ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌ చిత్రం కంటే అపురూపంగా కనిపిస్తుంది.
   అప్పటికే ''నేనెందుకు నాస్తికున్నయ్యాను'' భగత్‌ సింగ్‌ పుస్తకం చదువుతున్నాడు అజ్ఞాత్‌. ఆ అమ్మాయి కూడా ఆ పుస్తకంలోకే తొంగి చూస్తుంది.
   ఇంతలో బస్‌ కదిలింది. చల్లగా వస్తున్నగాలికి సీతాకోకచిలుక రెక్కలు తాకుతున్నట్లుగా ఆ కర్లీ హెయిర్‌ అజ్ఞాత్‌ మెడకు, చెవికి తాకుతున్నాయి. వెంటనే ఆ అమ్మాయి వైపు తిరిగి చూశాడు. ఆ అమ్మాయి సీతాఫలం కన్ను తెరిచి చూస్తున్నట్టు అజ్ఞాత్‌నే చూస్తూ ఉంది.
   ''హారు ఐయామ్‌ అజ్ఞాత్‌. మీ పేరేమిటి.?''
   ''అశ్విని'' అన్నది విరభూసిన చెట్టులా నవ్వుతూ''.
   '' ఎక్కడికెళ్తున్నారు.?'' యాదగిరి గుట్టకు వెళ్ళొస్తున్నం. మా అమ్మమ్మకు మొక్కు ఉందంటే నేనూ మా అమ్మ వచ్చినం.''
   పక్కనే ఉన్న వాళ్ళ అమ్మమ్మను, అటువైపు సీట్లో ఉన్న వాళ్ళమ్మను చూపించింది.
   ''వాళ్ళిద్దరు గుండు చేయించు కున్నారు. మీరు చేయించుకోలేదూ.?'' అది వాళ్ళ చాదస్తం. నేనెందుకు చేయిం చుకోవాలి.! ''
   '' మీరు దేవున్ని నమ్మరా.?'' నమ్మను. నాకు అవన్నీ నచ్చవు. నీ చేతిలో ఉన్న హీరోలానే. నాకు భగత్‌సింగ్‌ అంటే చాలా ఇష్టం. బ్రతికితే ఆయనలా బ్రతకాలి. మా నాన్నకు భగత్‌ అంటే ప్రాణం. ఆయన ద్వారానే నాకు ఈయన గురించి తెలుసు. నాకు భగత్‌సింగ్‌ను పరిచయం చేసిన మా నాన్న ఇప్పుడు లేడు. చనిపోయాడు.'' అంటూ సైలెంట్‌ అయిపోయింది.
   ''సారీ అశ్వినీ''
   ''సరేలే. అది జరిగిపోయింది. కానీ మీరేం చదువుతున్నరు అజ్ఞాత్‌.?''
   '' ఎమ్మెస్సీ ఫిజిక్స్‌'' మరి భగత్‌ సింగ్‌ బుక్స్‌ మీకెలా.!''
   స్టూడెంటు ఆర్గనైజెషన్‌లో పనిచేస్తున్నాను.'' అవునా సూపర్‌'' మీరేం చేస్తున్నారు అశ్విని.?''
   '' బి.ఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌.''
   '' తర్వాత ''
   ''ఎం. ఫార్మసీ''
   '' తర్వాత ''
   '' జాబ్‌. నిజానికి నాకు డాక్టర్‌ అయ్యి గ్రామాల్లో ప్రజలకు వైద్యం చేయాల నుండే. కానీ సీటు రాలేదు. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లకు డబ్బులు లేక ఫార్మసీలో జాయిన్‌ అవ్వాల్సివచ్చింది. అది సరే అజ్ఞాత్‌. మీరేం చేయాలనుకుం టున్నారు.? ''
   '' ప్రజల్ని చైతన్యం చేసే వృత్తి చేస్తున్నాను. ఇక మీదట కూడా అదే చేయాలనుకుంటున్నాను.''
   బస్‌ అక్కడక్కడ ఆగుతూపోతుంది. కానీ అశ్వినీ, అజ్ఞాత్‌లు మాట్లాడుకోవడం మాత్రం ఆగడంలేదు.
   '' ప్రజల్ని చైతన్యం చేసే వృత్తి అంటే.! ''
   ''అంటే.! భగత్‌సింగ్‌ కోరుకున్న సమసమాజం రావడంకోసం కృషి చేయడమే జీవితంగా పనిచేయడం.''
   '' ఓ...అయితే దట్స్‌ గ్రేట్‌ వర్క్‌. అందరూ జీతంకోసం పని చేస్తుంటే మీరు మాత్రం ఆ జీవితాలను మార్చడంకోసం పనిచేస్తున్నరు. అసలు ఈ జనరేషన్‌లో మీలాంటి వారు కలవడం చాలా ఆనందంగా ఉంది అజ్ఞాత్‌. ''
   ''నువ్వు కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సాధారణ అమ్మాయిలు కూడా ఎంత ప్రోగ్రెసివ్‌గా ఆలోచించగలరో తెలిసొచ్చింది నాకు.''
   '' లేదు అజ్ఞాత్‌. ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారనే నమ్మకం నిన్ను కలిశాకనే వచ్చింది. నాకు అది ఇంకా ఎక్కువ ఆనందాన్నిస్తుంది.''
   ''అవునూ నేనొక అబ్బాయిని, నువ్వొక అమ్మాయివి. సహజంగా అయితే నాపక్కన మీ అమ్మమ్మ కదా కూర్చోవాలి.
   '' కావచ్చు. నిజానికి ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ నేను అవన్ని పట్టించుకోను. దాని వల్లనే మీరు కలిశారు కదా అజ్ఞాత్‌.! మీ పేరు మాత్రం చాలా కొత్తగా ఉంది.''
   '' ఇది నా పేరు కాదు. భగత్‌సింగ్‌ పేరు. తను స్వాతంత్య్ర పోరాట కాలంలో తన మిత్రులకు లెటర్స్‌ అజ్ఞాత్‌ పేరుతోనే రాసేవాడు. ఆయన పేరే నాకొచ్చింది.''
   '' అవునా! ఏమైనా నీ పేరు మాత్రం చాలా బాగుంది అజ్ఞాత్‌.''
   '' నీ కర్లీ హెయిర్‌ కంటేనా.!''
   '' ఇలాంటి హెయిర్‌ చాలా మందికి ఉంటుంది అజ్ఞాత్‌. కానీ నీలాంటి పేరు నీకొక్కడికే ఉంటుంది.''
   '' థాంక్యూ అశ్విని. మీ హెయిర్‌ ఏ షాంపు రహాస్యం.? '' షాంపా పాడా.! షాంపు పెడితే గుండే గతి. దట్‌ సీక్రెట్‌ ఓన్లీ కుంకుడుకాయ. అంతే.''
   ఇలా సరదా విషయాల నుండి సీరియస్‌ విషయాలదాక ఇంకా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. రోడ్డుమీద చెట్ల నీడల వలన బస్‌లో వెలుతురు సాంద్రతలు మారుతున్నాయి. అచ్చం అలానే వారు చర్చిస్తున్న అంశాలనుబట్టి వారి ముఖకవలికల్లో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
   '' వి.టి కాలని స్టాప్‌ ముందుకు రావాల'' అని కూతేశాడు కండక్టర్‌.
   '' మీ ఫోన్‌ నంబర్‌ ఇందాక చెప్పిన 086824400 నే కదా.! బారు అజ్ఞాత్‌.'' అని చెప్పి దిగి వెళ్ళిపోయింది అశ్వినీ.
   టౌన్‌లో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఏ దారిలో వెళ్ళినా పనులు జరుగుతున్న గుర్తులు కనిపిస్తున్నాయి. సగం తీసి వదిలేసిన మ్యాన్‌ హోల్స్‌ చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు చోట్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజికోసం తీసిన గుంటల్లో, మ్యాన్‌ హోల్స్‌లో పడి ఇరవైనాలుగు మంది గాయపడ్డారు. అందులో విద్యార్ధులే ఎక్కువ. పనులు త్వరితగతిన జరగడంలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనిమీద స్పందిస్తే బాగుంటుందని చాలమంది అజ్ఞాత్‌ని కోరారు. దాంతో ఓ పెద్దమనిషి ద్వారా వాటిలోతుపాతులు స్టడీ చేసాడు అజ్ఞాత్‌. యువజనసంఘంతో కలిసి ''సేవ్‌ టౌన్‌ - సేఫ్‌ హెల్త్‌'' నినాదంతో పనిలో పడ్డారు. ఒకపక్క మ్యాన్‌ హోల్స్‌ దగ్గర ఇండికేషన్‌ బోర్డ్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోప్రక్క వందల మ్యాన్‌ హోల్స్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, రోడ్డు పనుల్లో నాణ్యత లేమితో పాటు ప్రొసీడింగ్స్‌కు విరుద్దంగా జర్గుతున్న పనుల లోపాల్ని ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రజలతో సంతకాలు సేకరించి విజిలెన్సు, ప్రజారోగ్య, మున్సిపల్‌ శాఖలన్నింటితోపాటు లోకాయుక్తకు ఫిర్యాదుచేసి న్యాయపోరాటం కూడా నడిపారు.
   అలా తన మిత్రులతో సంవత్సరం పోరాటం చేసిన ఫలితంగా అప్పటివరకూ లేని విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్‌ ఆఫీస్‌ను సైతం ఆ జిల్లాకు రప్పించారు. అధికార పార్టీ కాంట్రాక్టర్ల నుండి కోట్లరూపాయల ప్రజాధనం రికవరీ చేయించారు.
   '' హారు బ్రో గుడ్‌ న్యూస్‌. ఎట్టకేలకు సాధించా.'' అన్నాడు యువరాజు
   '' ఏంటో తమరు సాధించినది '' అన్నాడు సిద్దు.
   '' మొత్తానికి అశ్వినీ అడ్రస్‌ తెలిసింది.''
   '' నిజమా.? ఎక్కడ.? అడిగాడు అజ్ఞాత్‌
   ''చెప్పను. జస్ట్‌ నన్ను ఫాలో అవండి చాలు'' అన్నాడు యువరాజ్‌.
   సీబీజడ్‌ బైక్‌ స్టార్ట్‌ అయింది. అజ్ఞాత్‌ నడిపుతుంటే జుమ్మున దూసుకుపోతుంది బైక్‌.
   ''మీరు కలుసుకొని సంవత్సరం దాటింది అంటున్నావు. అది కూడా బస్‌లో. గుర్తుపడుతుందా అజ్ఞాత్‌ నిన్ను.! అసలు ఆరోజే చెప్పేస్తే అయిపోయేది కదా.! నువ్వు ఎంత లీడర్‌ అని ఫీల్‌ అయినా యంగ్‌ స్టార్‌వే కదా.! అది మరిచిపోతె ఎలాడ్యూడ్‌.'' అన్నాడు సిద్దూ
   '' సెటైర్లాపి జరగాల్సింది చూడండి.'' అన్నాడు అజ్ఞాత్‌.
   '' ఆ చూస్తాం చూస్తాం. అమ్మాయిలతో తిరగాలన్న వయస్సు కూడా మర్చిపోయి. అక్రమాలు, అవినీతిని వెలికితీస్తాం అని తిరిగి అంతా అయిపోయాక అమ్మాయి కావాలి. పెళ్ళి చేసుకోవాలి. అంటే ఎలా.? అసలు ఈ రోజుల్లో ఎవరు ఖాళీగున్నారో తెల్సా.! సారొస్తారొస్తారు అని పాటేసుకుని ఎదురుచూస్తుందట నీకోసం పద వెళ్దాం. సంఘం సంఘం అని నిద్రపోడు మమ్మల్ని పోనియ్యడు.'' అని గొణుక్కుంటున్నాడు సిద్దూ.
అశ్విని వాళ్ళింటిముందాగింది బైక్‌. యువరాజు ముందు నడుస్తుండగా లోపలికి అడుగుబెట్టారు.
   అజ్ఞాత్‌ ఆరడుగుల ఎత్తున్న యువకుడు. అందం తన ఆనందంలోనే ఎక్కువ కనిపిస్తుంది. మంచి మాటకారి. పరిస్థితులు అనుకూలించాలే కానీ తన మాటలకు పడిపోని వారెవరుండరూ. సహజంగానైతే అజ్ఞాత్‌ను వద్దనుకునే కారణాలేమి ఉండవు. కానీ ఏం జరుగుతుందో ఏమో చూద్దాం. అని ఊహించుకుంటున్నాడు సిద్దు.
   '' హారు అశ్విని'' అన్నాడు అజ్ఞాత్‌
   ''మీరూ'' '' ఆ మీరూ...! '' అని నవ్వుతూ కూర్చున్నారు.
   ''హే...రియల్లీ. నేను గుర్తుపట్టలేదు. సారీ ఎవరో చెప్పొచ్చు కదా.!'' అన్నది అశ్విని.
   ''ఇతను సిద్దూ, అతను యువరాజు, నేను నేనే'' అన్నాడు అజ్ఞాత్‌.
   ''వాళ్ళనెప్పుడూ చూడలేదు. మిమ్మల్ని మాత్రం దగ్గరగా చూసినట్లు ఉంది. కానీ గుర్తుకు రావడంలేదు. చెప్పొచ్చు కదా.!''
   '' మీకు తనే చెప్తాడు మాకు పనుంది ఊర్లో వరకు వెళ్ళొస్తాము.'' అని సిద్దు యువరాజు వెళ్ళిపోయారు.
   ''నన్ను అజ్ఞాత్‌ అంటారు. అప్పుడప్పుడు బస్‌ జర్నీ చేస్తుంటాను.''
   ''సారీ సారీ...ఒకసారే కదా చూసింది. అదికూడా చాలా కాలమైంది కదా మర్చిపోయాను.'' అంటూ వాటర్‌ తెచ్చిచ్చింది.
   '' ఏంటీ సడన్‌గా మా ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.?''
   '' నిన్ను చూసి మాట్లాడి వెళ్ధామని వచ్చాను''
   ''అసలు నన్ను చూడాలనుకోవడమేంటీ.!''
   '' నిన్నంటే నిన్ను కాదు. నీ కర్లీ హెయిర్‌ను.''
   ''నా హెయిర్‌ను వదలవా ఇక.!''
   హెయిర్‌ అంటే హెయిర్‌ను కాదు దాని ఓనర్‌ను. సంవత్సరం క్రితం నీ కర్లీ హెయిర్‌లో నా కళ్ళే చిక్కుకున్నాయనుకున్నాను. కానీ కాదు. హృదయం చిక్కుకుని పోయింది. అప్పుడు తీసుకోవడం కుదరలేదు. ఇప్పుడు దాన్ని తీసుకెళదామని వచ్చాను.''
   ''అజ్ఞాత్‌.! ఏమైంది నీకు. కవిత్వం చెప్పుతున్నవా.! జోక్స్‌ ఆపి కొంచెంనాకు అర్ధమయ్యేలా చెప్పవా.?''
   ''చెప్తా.'' అని కాసేపాగి గట్టిగా శ్వాస పీల్చి మాట్లాడాడు.
   ''మనిద్దరం కలిసి బ్రతుకుదామా అశ్విని.!'' షాక్‌కు గురైనట్లు చూస్తుంది తను.
   ''అదే అశ్వినీ నువ్‌ నా లైఫ్‌ పార్టనర్‌ అవగలవా.?''
   కొద్దిసేపటి వరకు తేరుకోలేదు అశ్విని. తర్వాత మాటలు కలిపింది.
   ''అజ్ఞాత్‌ టీ తాగుతావా.!'' అని అడిగింది.
   ''నీ చేతితో విషమిచ్చినా తాగుతాను. కానీ అది ఇప్పటివరకేనా.! లైఫ్‌ టైమా.! అనే క్లారిటీ ముందు ఇచ్చి, ఆ తర్వాత ఏమిచ్చినా పరవాలేదు.'' చిక్కని బర్రెపాలతో టీ చేసుకొచ్చింది.
   ''డియర్‌ కామ్రేడ్‌ టీ'' అన్నది.
   ''ఇ'టీ'రు అన్నాడు.''
   ''అబ్బా ఈ సమయంలో కూడా ప్రాసలా.! ఎంత సమయస్ఫూర్తో.! అన్నది.
   ''అది సరే కానీ. అడిగినదానికి ఆన్సర్‌ చేయకుండా ఈ కమ్మటీ టీ కలిపావు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో.! '' అంటూ దీర్ఘం తీశాడు.
   ''ఎల్లుండి సాయంత్రం అయిదు గంటలకు లైబ్రరీకి వస్తాను. అక్కడ మాట్లాడుకుందాం అన్ని విషయాలు.''
   సరే వెళ్ళొస్తా అని చెప్పి బ్రిడ్జ్‌ దగ్గర ఉన్న టీ స్టాల్‌లో టీ తాగుతున్న సిద్దు, యువరాజు ఉన్న దగ్గర కొచ్చాడు అజ్ఞాత్‌. పక్కన పాలిటెక్నిక్‌ కాలేజీ స్టూడెంట్స్‌ సిగరెట్లు కాల్చుతున్నారు. వాళ్ళు వదులుతున్న పొగ రింగులుగా తిరుగుతుంది. అజ్ఞాత్‌ అటువైపే చూస్తున్నాడు. ఇంతలో యువరాజు కలుగజేసు కున్నాడు.
   ''అజ్ఞాత్‌ ఆ స్టూడెంట్స్‌ను ఏమనకు. సిగరెట్లు చాలా ప్రమాదమైనవని కాబట్టి, అవి ఉండకూడదని కాల్చుతున్నామని చెప్పారు. ఇందాక సిద్దు అడిగినప్పుడే.'' అని నవ్వుతున్నారు.
   గుండె గడియారం సెకన్ల ముల్లు కంటె స్పీడుగా కొట్టుకుంటుంది. కానీ గోడ గడియారం సెకన్ల ముల్లు మాత్రం గంటల ముల్లుకంటే కూడా స్లోగా కదులుతున్నట్లనిపిస్తుంది. తను ఆలోచించుకోవడానికే ఎల్లుండివరకు అని టైం అడిగి ఉంటుంది. పైగా లైబ్రరీకి వస్తన్నదంటే నీకు తగిన అమ్మాయే. అని ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు సిద్దు, యువరాజులు. అందులో కొన్ని మాత్రమే అజ్ఞాత్‌కు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తను తన లోపలి ప్రపంచంలో ఉన్నాడు. అశ్విని సూటిగా మాట్లాడే మనిషి. తన మనస్తత్వం ప్రకారం అప్పటికప్పుడే ఏ నిర్ణయం అయింది తేల్చి చెప్పాలి. కానీ అలా జరగలేదంటే ఏదో బలమైన కారణం ఉండాలి. అశ్వినిని కలిసినప్పుడు కూడా చీకటిని కాటుకలా దిద్దుకున్న తన కళ్ళకి, వెన్నెలకు పూచినట్టుండే తన పెదాలు మాట్లాడే మాటలకు అస్సలు సింక్‌ అవ్వలేదు. కళ్ళు దగ్గరగా, మాటలు దూరంగా చూసాయని ఆలోచిస్తున్నాడు. నిజానికి అజ్ఞాత్‌ కళ్ళను చూస్తూ మాట్లాడే మనిషి. అందుకే అతనికేదో అర్ధమయ్యిందని భావిస్తున్నారు. అతని మనసులోతు, ప్రేమ గాఢత తన రూమ్‌ మేట్స్‌ అయిన సిద్దు, యువరాజులకు బాగాతెలుసు. అందుకే అజ్ఞాత్‌ కంటే వాళ్ళే ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారు.
   ఎట్టకేలకు సమయం దగ్గర పడింది. చెక్స్‌ షర్ట్‌ బ్లాక్‌ ప్యాంట్‌ వేసుకుని, టక్‌ చేసుకుని ఓ దేహం నడుస్తుంది. ఆయన్ను అలా చూసిన ప్రతివారికి తనో సైనికుడిలానో, కమాండర్‌లానో అనిపిస్తాడు. తన నడక, ఆ ఆత్మవిశ్వాసం అలా ఉంటుంది మరి. లైబ్రరీలో సైన్‌ చేసి ప్రజాశక్తి పేపర్‌ పట్టుకున్నాడు. ఇంతలోనే బ్యాగ్‌ వేసుకుని అశ్విని వచ్చి సైన్‌ చేసి అజ్ఞాత్‌ను చూస్తుంది. ఇద్దరూ కలిశారు. నిశబ్దంగా పలకరించుకున్నారో లేదంటే నిశబ్దమే పలకరింపులా ఉన్నదో.! కానీ ఇద్దరి మద్యలో మాత్రం ఓ శతాబ్దనిశబ్దమేదో దాగి ఉన్నట్లున్నది. ఒకరిననుసరిస్తూ ఒకరు లైబ్రరీ ముందున్న గ్రాస్‌లోకి నడిచి కూర్చున్నారు.
   అశ్విని తన ముందు భద్రంగా బ్యాగును పెట్టుకుని కూర్చుంది. అందులో పిన్‌ లీవ్‌ చేసిన గ్రెనేడ్‌ ఏదో ఉన్నట్టు పదే పదే బ్యాగ్‌ వైపు ప్రత్యేకంగా కనిపెడుతున్నది.
   '' అశ్వినీ.! నిన్నొకటడగనా.? ''
   ''అడుగు అజ్ఞాత్‌ ''
   ''మీ ఇంటికొచ్చి నేను ప్రపోజ్‌ చేసినప్పుడు నీకళ్ళకి మాటలకి సింక్‌ అనిపించలేదు. నిజమా.!''
   '' నిజమే''
  '' ఎందుకు.? ''
   '' ఎందుకేంటి అజ్ఞాత్‌.? నువ్వు అలా మాట్లాడుతావని నేను ఊహించలేదు తెలుసా.? అసలు నువ్వు నాకోసం వస్తావని కలలో కూడా అనుకోలేదు తెలుసా.! అలా రావడం, అలాంటి ప్రపోజల్‌ చేయడం నిజమా కలా.! నేను నమ్మలేకపోయాను చాలాసేపటి వరకు. అంతా అయోమయంగా అనిపించింది. చాలా గర్వంగా, ఒకింత ఆనందంగా, మరింత బాధగా ఉంది అజ్ఞాత్‌. అసలిన్ని రోజులు ఏమైపోయావు.? నాకు చాలా కోపమొస్తుంది తెలుసా.! ఊపిరి కూడా ఆడట్లేదు. ఇంకొన్ని రోజుల ముందొస్తే నీ సొమ్మేమన్న పోయేదా.? నీతో కలబడాలనిపిస్తుంది. అసలు నువ్వు రాకుంటే ఎంత బాగుండునో. నువ్వు రావడం వలన జీవితాంతం నిన్ను తిరస్కరించాననో, కోల్పోయాననో బాధపడేలా చేస్తున్నావు. ఇదంతా జరగలేదని మర్చిపోయే మెడిసిన్‌ ఏదైనా ఉంటే చెప్పు.'' అంటూ అజ్ఞాత్‌పై ఏదో హక్కుతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తుంది.
   ''అశ్వినీ.! కొంచెం కూల్‌గా మాట్లాడుతావా అర్ధమయ్యేలా...''
   ''చెప్తాను చెప్పక చస్తానా. నేను నీకు సంవత్సరం కిందినుంచి మాత్రమే తెలుసు. కానీ నువ్వు మాత్రం నాకు నాల్గు సంవత్సరాల క్రితమే తెలుసు. ప్రొగ్రెసీవ్‌ కాలేజీలో మీరు మోడల్‌ ఎంసెట్‌ ఎగ్జామ్‌ కండక్ట్‌ చేసినప్పటి నుంచే. ఆ రోజు నువ్వు పోటీ పరీక్షలనెలా ఎదుర్కోవాలో, మనుషులు తన బ్రెయిన్‌ ఎంతశాతం వాడుకుంటున్నారో, ఈ విద్యావ్యవస్థ పోటీ పరీక్షల పేరుతో ఎడ్లపందాలు నిర్వహిస్తుందని సెటైరికల్‌గా మాట్లాడావు గుర్తుందా! ఆ రోజు నుంచే నువ్వు తెలుసు నాకు. తెలియడమే కాదు ఇష్టపడుతున్నాను కూడా. ప్రతిరోజు నిన్ను న్యూస్‌లో చూసేదాన్ని. కానీ నిన్ను కలవడం ఎలాగో అర్ధమయ్యేది కాదు. వెళ్ళి పార్మసీలో జాయిన్‌ అయ్యాను. ఆ కాలేజి చూస్తే ఊరుబయట. ఇంకెక్కడ కలిసేది.? ఎలాగ అని చూడగా చూడగా గొప్ప అవకాశంగా బస్‌ ప్రయాణం దొరికింది. అందుకే నేనొచ్చి నీ పక్కన కూర్చున్నాను. నీతో మాట్లాడుతూ నువ్వేంటో ఇంకా అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాను. నీకు గుర్తుందో లేదో నీ దగ్గర తీసుకున్నది ఆఫీస్‌ ఫోన్‌ నంబర్‌ అనుకుంట. ఎప్పుడూ నువ్వు ఏదో ఊరెళ్ళావని చెప్పేవారు. ఫోన్‌ చేసీ చేసీ అలసిపోయాక, అంతా అయిపోయాక నువ్వు ఇంటికొచ్చావు. అందుకే నీవు ఇంటికొచ్చినప్పుడు కావాలనే కోపంతో మీరెవరని అడిగాను. నీ కోసం నువ్వు బ్రతకడం కాకుండా ప్రజలకోసం బ్రతికేతనం. జనంకోసం జైళ్లకు కూడా పోవడానికి వెనుకాడని గుణం. అన్నింటికి మించి భగత్‌సింగ్‌ మార్గంలో నీ పనితనం. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఈ సమాజంలో ఏ అమ్మాయికయినా తన కుటుంబాన్ని వదిలి నీలాంటి వారితో జీవితాంతం నడవడానికి మించిన అవకాశం ఏముంటుంది.? కానీ మనం ఒక జీవితకాలం లేటున్నాము అజ్ఞాత్‌.'' అన్నది భారంగా.
   తన కనురెప్పల హృదయం ధమనులూ సిరలవలె నిశోదయాలను వడబోస్తున్నది. తన మాటల చప్పుడు గతమూ, వర్తమానాల కాలంతో నిరాయుధంగా యుద్ధం చేస్తున్నది. రెండు నిజాల మద్య ఉన్న ఉచ్వాస నిచ్వాసల ఈక్వేషన్‌ ఆలోచనల తీరంలో పోటెత్తుతున్నది.
   ''నీకు తెలుసుకదా మా నాన్న లేడు. మా కుటుంబ పరిస్థితులు కూడా బాగోలేవు. అందువలన కలవని నీకోసం సాకులు చెప్తూ ఎక్కువకాలం మావాళ్ళను ఆపలేకపోయాను. ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోని మా మేనమామల చొరవతో చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నా పెళ్ళి కుదిరింది.'' అంటూ అజ్ఞాత్‌ చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. ఇన్నేళ్ళ తన జ్ఞాపకాలను, కలలను ఒక్కొక్కబొట్టు చేసి కన్నీళ్ళలా కార్చుతుంది. అజ్ఞాత్‌ కూడా ఏం చేయాలో అర్థం కాక, మాటలు రాక మైనపు ప్రతిమలా ఉన్నాడు. అశ్విని బ్యాగ్‌లో నుంచి పెళ్ళికార్డ్‌ తీసి అజ్ఞాత్‌ చేతిలో పెట్టి ఐ మిస్‌ యూ డియర్‌ కామ్రేడ్‌ అంటూ వెళ్ళిపోయింది.
- ఎం. విప్లవ కుమార్‌, 9515225658

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహిర్గతం కాని రంగులు
కుందేలు పంజా
సహాయకారి
సరాగాల శ్రీమతి
షిర్‌ ఖుర్మా
తావు
ఇంకెన్నాళ్ళు !
పచ్చనాకు సాక్షిగా...
కానుగచెట్టు ఇల్లు..
ఎండి పోయిన చేపలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:03 PM

ఆరుగురు ఎస్సైలకు బదిలీలు

07:58 PM

ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్‌..

07:57 PM

రాహుల్ భ‌ట్ హ‌త్య అత్యంత దుర‌దృష్ట‌క‌రం : ఎల్జీ మ‌నోజ్ సిన్హా

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.