Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం

Sun 27 Mar 07:36:29.563877 2022

       స్వరాజ్యంగారి మరణవార్త సమస్త తెలుగు ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళా లోకానికే వన్నెతెచ్చిన వీరవనిత మల్లు స్వరాజ్యం. నైజాం ప్రభువుల కబంధ హస్తాల నుండి సమస్త ప్రజలకు విముక్తి కలిగించిన విప్లవ కెరటం. ఆమె జీవితం పోరాటకారులందరికీ స్ఫూర్తిని రగిలించే అగ్నికణం. మార్చి 2వ తేదీన బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకోవడం కష్టం అనుకున్నాము. కానీ 5వ తేదీన కోలుకుని అందరితో ఆత్మీయతను పంచుకున్నారు. ఐద్వా జాతీయ నాయకురాలిగా, ఐలమ్మ ట్రస్టు చైర్మన్‌గా వున్న అమ్మకి మా విప్లవ జోహార్లు...
       92సం||ల వయస్సులో 80 సంవత్సరాల పోరాట అనుభవాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మహిళలకు ఎనలేని సంపద. ముఖ్యంగా తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భారతదేశానికే కలికుతురాయి. పోరాటకారులందరికీ చక్కటి ఎజెండా అందించిందా పోరాటం. పురిటినొప్పులు భరించకుండా, రక్తం చిందించకుండా కొత్త శిశువు నేలపైకి రాదు. నాలుగు వేల మంది రక్తతర్పణ 3వేల గ్రామాల ప్రజలకు విముక్తినిచ్చింది. తెలంగాణలో భావితరాల భవిష్యత్తును మలుపు తిప్పింది. నీ బాంఛన్‌ దొరా కాల్‌ మెక్కుతా అంటూ వంగి దండాలు పెడుతూ దొరల గడీల ముందు గడగడ వణుకుతూ చేతులు కట్టుకుని (ముడుచుకుని) తిరుగాడిన ప్రజానీకం, 'బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతవు కొడకో నైజాము సర్కరోడా' అంటూ గొంతెత్తి అరవ గలిగే ధైర్యానిచ్చింది. సాయుధ పోరాటం ఆ చేతులే విప్లవ పిడికిళ్ళై, నల్లగొండ ఖిల్లా కింద నీ గోరీ కడతం కొడకో, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల జల్లితేను, వడిసెల్ల రాళ్ళు బెట్టి వడివడిగా విసిరితేను నీ మిలిట్రీ బారిపోయెరో నైజాము సర్కరోడా అంటూ పోరాటరూపాలనే పాటలుగా కట్టి, ప్రజలు ఏ ఆయు ధాలు పట్టుకుని ఎలా యుద్ధం చేయాలో నేర్పిన ఆచరణ అది.
ఈ మొత్తంలో స్వరాజ్యంగారి పాత్రను మాటలతో చెప్పలేము. ఆడవాళ్ళం అన్నింట్లో సగం అంటారు. ఆమె మహిళగా పుట్టినప్పటికీ, ఆమె జీవితం గురించి చదివిన వారు మహిళల గురించి ఏం చెప్పాలన్నా చాలా నిశితంగా పరిశీలించి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే మాట్లాడేవారు చులక నవుతారు. 11సం||ల వయసులో గ్రామంలో దొరల పెత్తనం కింద నలిగిపోతున్న జీతగాళ్ళను, కూలీలను ఏకం చేసి సమ్మె చేయాలని నిర్ణయించినందుకు అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డిని, చిన్నాయన కంప్లేంట్‌తో పోలీసులు బీమిరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే రేపు ఎలాగైనా సమ్మె జరిగేలా చూడు చెల్లీ అని అన్న వెళ్లగా మొదటి కర్తవ్యంగా ఆమె సమ్మె జరిపించారు. స్వరాజ్యం గొప్ప సృజనాత్మకత, సమయస్ఫూర్తి వున్న వ్యక్తి. ఊరి చివర డొంక దారిలో కాపుకాసి అటువైపు గుంపుగా వస్తున్న పాలేర్లను నిలబెట్టి కర్తవ్య భోదన చేసింది. తెల్లవారి దొర పాలేర్లను పిలిచి నిన్న పనికి రానందుకు మీకు కఠిన శిక్ష వేస్తానంటే సివంగిలా దొర ముందుకు వెళ్లి వాళ్ళను పనిలోకి రాకుండా నేనే ఆపాను. శిక్ష వేస్తే నాకువెరు అని 11సం||ల వయసులోనే పాలేర్లకు అండగా నిలిచి కాపాడిన ధీశాలీ.
       1931 సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆమె జన్మించారు. తల్లీ చొక్కమ్మ, తండ్రి భీమిరెడ్డి రామిరెడ్డి గార్లు ఆమెను ఎంతో స్వేచ్ఛగా పెంచారు. వీరతెలంగాణ సాయుధ పోరాట రధసారధి భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నయ్య, అక్క శశిరేఖ, తమ్ముడు కుశలవరెడ్డి, చెల్లెలు .... ఈ ఐదుగురు సంతానంలో మధ్యవారు స్వరాజ్యం. దొరల కుటుంబాల సాంప్రదాయాల్లో భాగంగా తండ్రి చిన్నప్పుడే గుర్రపు స్వారీ, ఈత వంటి సాహస విద్యలు నేర్పించారు. ఇంటివద్దే గురువును పెట్టి 4వ తరగతి వరకు విద్య నేర్పించారు. విద్య ఎన్ని తరగతులు చదివామని కాదు కదా వేమన సమాజ గమనాన్ని రచించినట్లు స్వరాజ్యంగారు ప్రజా విముక్తికి ఆచరణ సాధ్యమైన బాటలు వేసారు. 1917 రష్యా విప్లవ విజయానంతరం ఆ మార్గంలో చాలా దేశాలు స్వాతంత్య్రం స్వేచ్ఛల కోసం పోరాటం జరుగుతున్న కాలమది. అభ్యుదయ భావాలు గల చొక్కమ్మగారు, ఆమె బంధువు ఒకరు బొంబాయి సత్యాగ్రహంలో పాల్గొని ఇంటికి వచ్చి జాతీయోద్యమం గురించి చెప్పగా, అప్పటికి 20 రోజుల పాపగా ఉన్న తన కుమార్తెకు స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది. ఝాన్సీ లకిëబాయి, ఓరుగల్లు రాణి రుద్రమదేవి చరిత్రలు చిన్ననాడే విన్న ప్రభావం తనపై ఉండేదని స్వరాజ్యంగారు చెప్పేవారు. ఆ తెగువ, ధైర్యసాహసాలు ఆమె జీవిత పుస్తకంలో మనం చూస్తాము. మాక్సిమ్‌ గోర్కీ అమ్మ నవల చొక్కమ్మగారు తన చేత చదివించారని, ఆ అమ్మ నిర్వహించిన పాత్రను అన్నయ్యను, అక్కను, నన్ను ఉద్యమానికి అంకితం చేయడంతో మా అమ్మ కనబరిచిన చైతన్యం అని చెప్పేవారు. ఈ కాలంలోనే విసునూరు దేశ్‌ముఖ్‌ ఆగడాలు జమీందార్ల గుండాలు గ్రామాలపైబడి ధన, మాన, ప్రాణాలు దోచుకుంటున్న తీరు ఆంధ్ర మహాసభలో చర్చ జరిగింది. ఆ సభలో చాలామంది యువకులు పాల్గొన్నారు. స్వరాజ్యం కూడా పాల్గొన్నారు. వీరంతా జమిందారీ కుటుంబాలకు చెందినవారే. యూనివర్సిటీల్లో చదువుకునే ఆర్థిక స్థోమత వీరికే ఉండేది. ఇక్కడే భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వాన విస్నూరు జమిందారీ వ్యతిరేక ఉద్యమానికి బీజం పడింది. వీరనారి ఐలమ్మ ధిక్కార స్వరం అందుకుని ఈ నేతలంతా ఆ ఉద్యమం లో దూకి విజయం సాధించారు. పేదల విజయాన్ని దొరలు దోపిడీదారులు సహించలేక నైజాం ప్రభువుల శరణుజొచ్చారు.
అలా మొదలైంది నైజాం ఉద్యమం...
       అప్పటివరకూ మాటలతో, ఉపన్యాసాలతో నడిచిన ఉద్యమం దొరలు, నైజాం సైన్యాలు ఉక్కు పాదాలు తుపాకి తూటాలకు తట్టుకోలేక జనం వడిసెళలు, కారాలు, తుపాకులు పట్టవలసి వచ్చింది. ఇందులో స్వరాజ్యం పాత్ర అమోఘం. ఆమె సృజనాత్మకత ఎంతో గొప్పది. మహిళలకు దోపిడీ గురించి వివరించి, వందలాది దళాలు తయారు చేసి వారిలో సహజమైన మృధు స్వభావాన్ని పక్కనబెట్టి, ఉక్కు సైనికులుగా తీర్చిదిద్దింది. 16 సం||ల వయసులో పేరు మార్చుకుని (రాజక్కగా) కరడుగట్టిన నైజాం సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన పిల్ల శివంగి ఆమె.
       గ్రామాలపైబడి సైన్యాలు దాడులు చేస్తుంటే మహిళలంతా ఒకే ఇంట్లో చేరి కారాలు కుండల్లో నింపి ఉంచుకోమనేవారట. రోకలి బండలు దగ్గర పెట్టుకుని ప్రాణాల్ని రక్షించుకునే వారు. మా గ్రామం కూడ సూర్యాపేటకు దగ్గరగా ఉంటుంది. కూసుమంచి వద్దకు సైన్యాలు వచ్చేసరికి 3కి.మీ మేర ఆకాశంలో ఎర్రని దుబ్బ కనిపించేదట. మగవారందరినీ చంపేస్తారని పొలాల్లో దాక్కోమని స్త్రీలంతా ఒకే ఇంట్లో వెళ్ళి తలుపులు మూసుకుని కూర్చునేవారు. పిల్లలేడిస్తే నోట్లో గుడ్డలు అడ్డుపెట్టేవారమని చెప్పారు.
       మరొక గ్రామంలో మహిళలంతా కారం కుండలతో ఇంట్లో ఉండగా సైన్యం వచ్చింది. వీళ్ళు ఒకే మహిళ ఆ ఇంట్లో ఉన్నట్టు తలుపు సగం తీసి ఒక సైనికుడికి వేరే అర్థంతో సైగ చేసిందట. వాళ్ళు ఇద్దరు గబాగబా లోనికి వచ్చారట. ఇద్దర్నీ కారం కొట్టి చితకబాదారట మహిళలు. ఈ ఘటనతో సైనికులకు ఇండ్లలో దూరాలంటే భయం వచ్చింది అని స్వరాజ్యంగారు చెప్పేవారు. అంతేకాదు వీళ్ళు మామూలు ఆడోళ్ళు కాదురో అంటూ హిందీలో దుర్భాషలాడుతూ వెళ్ళేవారు. ఈ ఘటనల్లో మనకు మహిళల ఎడల ఆమెకెంత విశ్వాసముండేదో అర్థమవుతుంది.
       ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా పిండిప్రోలులో 300మంది మహిళలకు గెరిల్లా పోరాటంపై శిక్షణా శిబిరం నిర్వహించారు. స్వరాజ్యంగారు ఈ బాధ్యతలు చూసారు.
       పోరాటంలో పాల్గొనడంతో పాటు అండర్‌గ్రౌండులో ఉన్న కార్యకర్తలను సైన్యం కళ్ళుగప్పి కాపాడిన మహిళలు కూడా అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించేవారని ఆమె చెపుతుండేవారు. స్వరాజ్యంగారిని పట్టుకోవడానికి పోలీస్‌ కోయగూడేనికి వచ్చింది. ఒక గిరిజన మహిళ తన పసిబిడ్డ దగ్గర ఈమెను పడుకోబెట్టి తాను పోలీస్‌లకు ఎదురెళ్లింది. ఇక్కడ రాజక్కలేదు, ఎవరూ లేరని ఆపుతుంటే పోలీసు ముందుకు దూసుకొస్తుంటే అది చూసి స్వరాజ్యం ఆ బిడ్డనెత్తుకుని వెనక నుంచి తప్పించుకుందట. కొద్దిరోజులు ఆ బిడ్డ తనతోనే ఉంది. ఆవుల మందల దగ్గరకెళ్ళి పాలు పిండి తాగించారట. తల్లి దూరమవటంతో ఆ బిడ్డ మరణించింది. కొన్ని రోజులకు గిరిజన మహిళ వద్దకొచ్చి నీవు నన్ను కాపాడావు, నీ బిడ్డను కాపాడలేకపోయాము అంటూ ఆమెను హత్తుకుని ఏడుస్తుంటే, నీ తల్లి 11 సంవత్సరాలు పెంచి మా కోసం నిన్ను వదిలేసింది కదా. నా పసిపిల్ల కోసం నువ్వెందుకేడుస్తవు. మరి నీ తల్లెంత ఏడవాలి అన్నదట ఆ మహిళ. అనేక సందర్భాలలో ఇలా కాపాడేవారని ఇవి మరువలేని ఘటనలుగా ఆమె చెప్పేవారు. ప్రజా ప్రతినిధిగా, ఐద్వా లీడరుగా ఎప్పుడూ భూస్వామ్య దోపిడీకి, స్త్రీ అణచివేతకు ఉన్న సంబంధాన్ని గుర్తించి పనిచేయాలని చెప్పేవారు. అటు దొరలను, ఇటు పాలకులను స్త్రీ సమస్యలపై నిలదీసింది. దీనిపై పురుషుల్ని మేల్కొలిపింది. నాగళ్ళ మీదున్న ఉయ్యాలో నాయన్నల్లారా ఉయ్యాల, చీమునెత్తురు లేదా ఉయ్యాలో, తిరగబడరయ్య ఉయ్యాలో అంటూ పాట ద్వారా కార్యోన్ముఖుల్ని చేసింది.
       దొరల గడీల్లో మాత్రమే ఆడే బతుకమ్మను, బడుగుల వద్దకు చేర్చిన ఘనత ఆమెదే. కన్ను మూసేవరకు ప్రజా విముక్తి కోసమే పరితపించింది. మార్చి 9న ఆమెను చూద్దామని హాస్పిటల్‌కు వెళ్తే పెన్ను, పేపరు అడిగి భారతదేశ చరిత్ర ఇది, నేను చెపుతున్నా, రైతు రాజ్యం రాక తప్పదు అని రాసి మా చేతికిచ్చింది. చివరి కర్తవ్యాన్ని అందించింది మనకు. చివరిగా, ఆ చైతన్యమూర్తితో 2014 జూన్‌ నుండి చనిపోయే వరకు 7 సం||లు ఇద్దరం ఐద్వా ఆఫీసులో నివాసమున్నందున ఎన్నో అనుభవాలు అతి తగ్గరగా మాట్లాడుకునే అదృష్టం నాకు దొరికినందుకు ఆనందిస్తున్నాను. ఏది ఏమైనా కమ్యూనిస్టులు రాజ్యం తేలేరు, ఎక్కడా మీ పార్టీ అనేవారికి ఒకటే నిదర్శనం... పోరాటం మహా సముద్రం, అందులో అలల కెరటాలు పుడుతూ ఎగిసిపడుతూ ఒక్కో కెరటం ఒక్కో రకంగా ప్రయాణించి తీరం చేరుతుంది. సముద్రం నిశ్చలంగా నిలిచే ఉంటుంది. కెరటాలు నిరంతరం పుడుతూనే ఉంటాయి. అదే మానవ సమాజం. దోపిడీ ఉన్నంతకాలం ప్రతిఘటించే ఎందరో స్వరాజ్యాలు పుడుతూనే వుంటారు. పోరాటాలు కొనసాగిస్తారు.
అమ్మకు నా కన్నీటి జోహార్లు.

- బత్తుల హైమావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
12:31 PM

మంత్రి సబితాపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.