Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంఘటిత శక్తి..అంకాపూర్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

సంఘటిత శక్తి..అంకాపూర్‌

Sun 03 Apr 05:27:46.555875 2022

        ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని వారంతా ఎదురు చూడలేదు.. స్వశక్తితో ఎదగాలనుకున్నారు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలారు.. సంఘటితంగా ఏర్పడ్డారు.. శ్రమను పెట్టుబడిగా పెట్టారు.. ఆధునిక సాగు పద్ధతులతో పంటలపై పోటీతత్వాన్ని పెంచుకున్నారు.. విత్తనోత్పత్తి కేంద్రాలు నిర్మించి స్వేదంతో సేద్యం చిందించారు.. పాడిపంటలతో ప్రగతి బాట పట్టారు.. హరిత విప్లవానికి చిరునామాగా మారారు.. తెలంగాణ సాగుబడికే కొత్త ఒరవడిని నేర్పారు... ఇంతకు వారెవరు.. ఎక్కడుంటారు... ఏం సాధించారు..? తెలుసుకోవడానికే ఈ వారం 'సోపతి' కవర్‌ పేజీ కథనం...
          అంకాపూర్‌ దేశీచికెన్‌..అంకాపూర్‌ మక్కబుట్టలు.. అంటూ ఈమధ్య అక్కడక్కడ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కారణం..అంకాపూర్‌ అంటేనే వ్యవసాయంలో నాణ్యతకు పెట్టింది పేరు. నూతన సాగు పద్ధతులకు శ్రీకారం చుట్టిన ఊరు. గ్రామంలో పండే పంటలు, చేసిన ఉత్పత్తులు చాలా ప్రత్యేకం. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్‌ మండలం లోనిది ఈ గ్రామం. జనాభా 5,689, కుటుంబాలు 1528. భూవిస్తీర్ణం 2,205 ఎకరాలు కాగా అందులో సాగుభూమి 1790 ఎకరాలు, రెండు చెరువులు, 90 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు, మిగతాది ప్రభుత్వ భూమి. పొద్దున లేచింది మొదలు పొద్దు పోయే వరకు సాగులోనే గడిపేయడం వీరి జీవన విధానం. ఎన్నో ఏండ్ల కష్టానికి ఫలితంగా నేడు పచ్చని పంట పొలాలు.. పట్టణాన్ని తలిపించే భవంతులతో గ్రామం అలరారు తున్నది. నూతన పద్ధతుల్లో వీరు సాగు చేసిన వాణిజ్య పంటలకు దేశ, విదేశాల్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నిత్యం పర్యాటకులు, అధికారులతో గ్రామం బిజీగా కనిపిస్తోంది. విత్తనాల నుంచి మొదలుకుని ఉత్తర భారత దేశంలో పశువులకు అందించే దాణా వరకు కూడా ఇక్కడే పండించి సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకూ వ్యవసాయ పాఠాలు బోధిస్తున్నారు. పాలిహౌస్‌ల్లోనూ పూల సోయగాలు కురిపిస్తూ చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పంటలపై పోటీతత్వం...
          కావాల్సినంత భూమి, చేసేంత సంకల్పం ఉంది. కానీ నీటి వసతి లేదు. ఎక్కడో వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టు గ్రామం అంకాపూర్‌. కొంత కాలం కాలువ ద్వారా సాగుకు ఉపయోగపడ్డప్పటికీ పాతికేండ్లుగా చుక్కనీటిని కూడా నోచుకోని పరిస్థితి. ఎన్నో ఏండ్లు కరువు కాటకాలను, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇదే తరుణంలో అక్కడక్కడ రైతు ఆత్మహత్యలు, కొన్ని చోట్ల వలసలు ప్రారంభమయ్యాయి. కానీ వీరు మాత్రం ఆందోళన చెందలేదు. సాగునే బలోపేతం చేయాలనుకుని సంఘటితమయ్యారు. బోరు బావులను తవ్వించారు. మొదట్లో అందరి రైతుల్లాగే సంప్రదాయ పంటలు పండించారు. పెద్దగా లాభదాయకమనిపించ లేదు. తర్వాత ఇతర ప్రాంతాల రైతులతో పంటల్లో పోటీతత్వాన్ని పెంచుకున్నారు. ఎర్రజొన్న, సజ్జ, పసుపు, సోయాబిన్‌, పొద్దు తిరుగుడు విత్తనాలను విత్తనోత్పత్తి చేశారు. దీంతో పాటు కూరగాయలు, వాణిజ్య పంటలపైనా దృష్టిపెట్టారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తీసుకుంటూ పంటల మార్పిడి విధానాన్ని అనుసరించారు. ఒకేసారి వేసిన పంట మరో సారి వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధిక దిగుబడి కోసం ఎరువు, చెరువు మట్టిని వాడ టం మొదలు పెట్టారు. చక్కని యాజమాన్య పద్ధతులు పాటించారు. తక్కువ రసాయనిక ఎరువులు, ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వినియోగించారు. చాలా వరకు విత్తనాల ఉత్పత్తి ద్వారానే ఫలితాలు సాధించారు. విద్యుత్‌ కొరత కారణంగా సాగునీటి సమస్య రాకుండా నీటి నిలువ ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు.సాగులోపాలను రైతు కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసు కున్నారు. ఇప్పుడు వ్యవసాయంలో తమకు సాటి ఎవరూ లేరని నిరూపించుకుంటున్నారు.
'సంఘ'టిత శక్తి...
          1966లో 270 కుటుంబాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న గురడి రైతు సంఘం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వేదికైంది. అప్పుడు ఒక్కో కుటుంబ సభ్యత్వం రూ.25వేలు చెల్లించి రూ. 67లక్షల పైచిలుకు సేకరించిన డబ్బు ఇప్పుడు కోట్లాది రూపాయలను కూడబెడుతోంది. ఈ నగదుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమను స్థాపించారు. సంకరజాతి విత్తనాలైన ఆడ, మగ విత్తనా లను తీసుకొచ్చారు. జాతీయ రహ దారికి కొద్ది దూరంలో ఎకరం స్థలం కొనుగోలు చేసి రూ. 35లక్షలతో సీడ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.ఇది ఎంతగానో లాభాలు తెచ్చింది.2006లో రూ.30 లక్షలతో మరో విత్తనోత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఇలా మొదలైన సాగు విధానం అంచెలంచెలుగా ఎదిగింది.దీనికి తోడు 1984లో ఏర్పడిన గ్రామ అభివృద్ధి కమిటీ రైతులకు బాసటగా నిలిచింది. ఈ కమిటీలో అన్ని గ్రామాల్లో లాగా పెత్తందారులు, అగ్రకులాల ఆధిపత్యం ఉండదు. అన్ని కుల సంఘాల ప్రతినిధులతో కలిపి గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఈ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటారు. పంటల క్రయ, విక్రయాలు, వేలం నుంచి మొదలుకుని ఇంటి గొడవలైనా కమిటీలో మాట్లాడు కోవాల్సిందే. ఇంకా పేకాట, జూదం, మద్యం, గొడవపడటం నిషేధం.ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క పోలీస్‌ కేసైనా లేదంటే ఇక్కడి గ్రామస్తులు ఎంత ఐక్యమత్యంగా పలువురికి ఆదర్శంగా ఉంటున్నారో అర్థం చేసు కోవచ్చు. వారి పంటలతో వచ్చిన డబ్బులను వారి కుటుంబాలకే కాకుండా గ్రామ అభివృద్ధికి ఇస్తు ంటారు. రూ.లక్షలు వెచ్చించి పాఠశాల కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రామంలో 25 విత్తనోత్పత్తి కేంద్రాలను నెలకొల్పారు. ప్యాకింగ్‌ చేసిన విత్తనాలను ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌తో పాటు పక్కదేశమైన పాకిస్తాన్‌కు కూడా ఎగుమతి చేస్తారు. అందరికీ ఉపయోగపడేందుకు మార్కెట్‌ను నిర్మించారు. రైతుల కోసం కోల్డ్‌ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.దీనివల్ల పంటలకు తక్కువ ధర ఉన్నప్పుడు సరుకును స్టోర్‌ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ము కునేందుకు వీలుంటుంది. మరో ముఖ్యమైనది ఏంటంటే పంటలు, ఎగుమతుల మీద వచ్చిన లాభా లను రైతులు సమానంగా తీసుకుంటారు.ఏ రైతుకన్నా దిగుబడి తగ్గి నష్టం వాటిల్లినా వారికి తోడ్పా టునందించి ఆర్థికంగా ఆదుకుంటారు.
అంకా 'పూర్‌' కాదు..రిచ్‌...
          అంకాపూర్‌ ఈ పేరులోనే పూర్‌ ఉంది కాని గ్రామమంత రిచ్‌నే. ఒకప్పుడు అన్ని గ్రామాల్లాగే ఉన్న అంకాపూర్‌ను అప్పటి సర్పంచ్‌గా పనిచేసిన గడ్డం రాజన్న అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు గ్రామస్తులు చెబుతారు. సీడ్స్‌ ఉత్పత్తి ద్వారా పంటల్ని బలోపేతం చేసిన ఆయన దాదాపు 18 ఏండ్లు వరుసగా సర్పంచ్‌గా గెలిచాడు. గ్రామం కూడా అంతే అంచె లంచెలుగా అభివృద్ధి చెందింది. నేటికీ ఐదుసార్లు ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ప్రస్తుత సర్పంచ్‌ పూజిత కిషోర్‌రెడ్డి కూడా గ్రామస్తుల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అప్పుడు ఆటు పోట్లను ఎదుర్కొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన రైతులు ప్రస్తుతం ఆర్థికంగా చాలా స్థిరపడ్డారు. తమ వ్యవ సాయ క్షేత్రాలకు కార్లలో వెళ్లి పనులు చేసుకునే స్థాయికి ఎదిగారు. అదే కార్లలో వచ్చేటప్పుడు పశువుల మేతకు గడ్డిని తీసుకొస్తారంటే వ్యవసాయంపై వారికున్న శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో ఎక్కడ చూసిన హైదరాబాద్‌ వలే భవంతులే దర్శనమిస్తాయి. రహదారు లపై డివైడర్లు, ప్రతి వీధికి సూచిక బోర్డులు, కాలనీల్లో సీసీరోడ్లు, పక్కనే డ్రెయినేజీలు, హైమాస్ట్‌ లైట్లు, చెత్త డంపులు పట్టణంలాగానే ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామస్తుల కోసం బస్సు సౌకర్యం, తపాలా కార్యాలయం, సహ కార సొసైటీ, కూరగాయల మార్కెట్‌, పశువుల వైద్యశాల, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రంథాలయం, స్వచ్ఛంద సంస్థ, 7అంగన్‌వాడీ కేంద్రాలు, 4ప్రైమరీ స్కూల్స్‌, 3బ్యాంకులు, కల్యాణ మండపాలు, రైతు సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, జీపీ కాంప్లెక్స్‌ భవనం ఉన్నాయి. ఇక్కడి రైతుల కోసం బ్యాంకు వారు ప్రతి ఒక్కరికీ కిసాన్‌వాణి పేరుతో తక్కువ ధరకు గ్రిన్‌సిమ్‌లను అందించారు. ఇతర ప్రాంతాల్లో సాగు విధానాలు, సలహాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ను కూడా రైతులు ఏర్పాటు చేసుకున్నారు.
ప్రశంసలు.. అవార్డులు...
          అంకాపూర్‌ రైతుల నూతన సాగు పద్ధతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయం అభివృద్ధిలో పాలు పంచుకున్న గురడిరెడ్డి రైతు సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రంతో పాటు నాలుగేండ్ల పాటు గ్రామానికి రూ. 5లక్షలు చొప్పున అందించింది. విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న పిన్నమనేని పౌండేషన్‌ కూడా ఉత్తమ సంఘంగా గుర్తించింది. 2013 జనవరి 25న రిజ్వర్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ వైవీ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రశాంస పాత్రంతో పాటు రూ.లక్ష చెక్కును అందించింది. అవా ర్డులు, ప్రశంసలకన్నా గ్రామానికి వచ్చే పర్యాటకులు, సాగు విధానాలను తెలుసుకుని వారి ప్రాంతాల్లో అమలు చేయడమే తమ గ్రామానికి నిజమైన గుర్తింపుగా గ్రామస్తులు చెబుతుంటారు. అంకాపూర్‌ను నిత్యం ఇతర ప్రాంతాల రైతులే కాదు శాస్త్రవేత్తలు కూడా సందర్శిస్తారు. దేశ, విదేశాల నుంచి ప్రాజెక్టు వర్క్‌ కింద ఇక్కడి రైతుల, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు. జపాన్‌, భూటాన్‌, మంగోలియా, శ్రీలంక, సిరియా, కెన్యా, బంగ్లాదేశ్‌, బోస్నివియా, మారిషస్‌, అల్జిరియా, సెర్బియా, ఎరీరియా, కిర్గిస్తాన్‌, ఉగాండా, ఐవరీ కోస్ట్‌, క్యూబా, టాంజానియా, సౌత్‌ సుడాన్‌తో పాటు ఇంకా 17దేశాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు అంకాపూర్‌ను సందర్శించారు. ఎంతగానో ప్రశంసించారు. ఇక్కడి సాగు విధానం, నూతన పద్ధతులను అధ్యయనం చేశారు. వారి దేశాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. సాగులో సమస్యలు అధిగమించి పంట మార్పిడి విధానం, విత్తనోత్పత్తితో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే కాదు దేశ, విదేశాల్లోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అంకాపూర్‌ రైతులను అందరూ అభినందించాల్సిందే...
మహిళలే కీలకం...
          ఇక్కడి వ్యవసాయం అభివృద్ధి సాధించిం దంటే అందులో మహిళల పాత్రే కీలకం. ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ పట్టుదలే గ్రామానికి మరింత పేరు తీసుకొచ్చింది. పంటల్లో అధిక దిగుబడిని సాధించడానికి కారణమైంది. ఎప్పుడు ఏ పంట వేయాలి?. సాగుచేసే విధానమేంది.. ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందనేది ఈ ఊరి మహిళలకు తెలిసినంత వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా తెలియదేమో అనడం అతిశయోక్తేం కాదు. వీరు ఉదయమే పంటలకు కూలీలను తీసుకుని వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. వారితో పని చేయిస్తూ వారు కూడా పనులు చేస్తారు. పంటలకు కావాల్సిన ఎరువులు, క్రిమిసంహారక మం దులు తెప్పించడం, చల్లడం, కూలీలకు డబ్బులివ్వడం అన్నీ వారే చూసుకుంటారు. కోళ్లపెంపకం, పూల, పండ్ల తోటలూ సాగు చేసి లాభాలు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో పండించిన పంటలను పురుషులు మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారు. గిట్టుబాటు కోసం లారీలు, వ్యాన్‌లు, వాహనాల్లోనూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఈ గ్రామంలో రోజుకు సుమారు రెండు నుంచి మూడు లారీల టమాటను బయటి ప్రదేశాలకు పంపిస్తారు. ఇంకా కొత్తిమీర, మెంతి, పూదీన, మక్కబుట్టలకు బాగా డిమాండ్‌. దీన్ని ఆధారంగా చేసుకున్న మహిళలు పంటలమీదనే కాదు చిరు వ్యాపారాల్లోనూ వృద్ధి సాధించారు. ఇక్కడ దేశీచికెన్‌ ఫేమస్‌. జిల్లా వ్యాప్తంగా ఇక్కడి రుచులను ఆస్వాదిస్తున్నారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌కు అంకాపూర్‌ దగ్గరగా ఉన్నందున భోజన ప్రియులు ఆర్డర్‌పై వంటలు చేయించుకుంటారు. చేపల ప్రై, మటన్‌కర్రీ, జొన్నరొట్టెలు, మేతి చెమన్‌, పుల్కా ఇక్కడి ప్రత్యేకత. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సౌకర్యంగా ఉండేందుకు టీ హౌటల్స్‌, టిఫిన్‌ సెంటర్స్‌ను వారే నడుపుతూ పురుషులతో సమానంగా నిలబడుతున్నారు.
పాలిహౌస్‌లో విదేశీ పూల సోయగం...
          పాలిహౌస్‌ పద్ధతిలో విదేశీ పూలను సాగు చేయడం ఈ ప్రాంత రైతుల ప్రత్యేకం. అంకా పూర్‌తో పాటు గోవింద్‌పేట్‌, మిర్ధాపల్లి గ్రామాల్లోని రైతులు డ్రిప్‌ పద్ధతిలో పూలమొక్కల పెంప కాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో ఎప్పటి నుంచో అక్కడ అవలంభిస్త్ను పద్ధతులు ఇక్కడ అమలు చేస్తున్నారు. తక్కువ భూమిలో, చేరువగా ఉన్న నీళ్లతో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు.పైగా ఈ పద్ధతిలో సాగు చేసిన పూలకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉన్నది. మొక్కలు నాటిన రెండు నెలల్లోనే పూలు పరిమళిస్తాయి. వారం రోజుల పాటు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి పూలమొక్కలు నాటితే మూడేండ్ల వరకు దిగుబడులు వస్తాయి. పాలిహౌస్‌ల విధానంలో ప్రధానంగా జర్బరా, కార్నేషన్‌, గ్లాడియోలస్‌, ఎసియాటిక్‌ తది తర పూలు విరివిగా సాగవుతున్నాయి. గతంలో ఇలాంటి పూలను విదేశాల్లోనే సాగు చేసేవారు. తర్వాత పూణె, బెంగుళూర్‌, గుజరాత్‌, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నరు వంటి పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండేవి. వివాహాల్లో డెకరేషన్‌కు చాలావరకు ఇలాంటి పూలను వాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు అంకాపూర్‌ మార్కెట్లోనూ విదేశిపూలు దర్శనమిస్తున్నాయి.
అంకాపూర్‌ టూ అమెరికా...
          వ్యవసాయంలో లాభం వస్తే చాలామంది రైతులు మరికొంత భూమిని కొనుగోలు చేసి పంటల్లో రాబడి తెస్తారు. కానీ అంకాపూర్‌లో మాత్రం వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలనుకున్నారు. అన్నకున్నదే తడవుగా చాలామందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన సుమారు 75 మంది విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడే పలు కళాశాలల్లో ఇంజినీరింగ్‌ (బీటెక్‌) పూర్తిచేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా, ఇంగ్లాండ్‌, అస్ట్రేలియా, యుకేలకు వెళ్లారు. గ్రామానికి చెందిన మార అఖిల్‌, పడ్కంటి సుమంత్‌, స్నేహిత, జయంత్‌, చిట్టెడి వెంకట్‌ స్పందన రెడ్డి, దిలీప్‌, దైదీప్య, అరుణ్యరెడ్డి, గడ్డం సృజన్‌ అమెరికాలో రాణిస్తున్నారు. మరికొంత మంది డాక్టర్లుగా సేవలందిస్తూ పుట్టిన ఊరికి పేరును తెస్తున్నారు. ఇంకో 30మంది వరకు వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. వీరు తమను ఇంతవారిగా చేసిన గ్రామానికి అవసరమైన మేరకు సహాయం చేస్తున్నారు.
కర్షక నేస్తం..భాజన్న...
          'మన కోసం చేసేది మనతోనే పోతుంది. ఇతరుల కోసం చేసేది చరిత్రలో నిలబడుతుంది' అన్న నానుడికి సరిగ్గా సరిపోతారు అంకాపూర్‌కు చెందిన ఆదర్శ రైతు కేకే భాజన్న. తనకు తెలిసిన పంటల విధానాన్ని, సాగు పద్ధతులను గ్రామ రైతులకే కాదు ఇతర ప్రాంతాల రైతులకు వివరిస్తూ కర్షక నేస్తంగా మారారు. చిన్నప్పుడే ఆయనకు పోలియో ప్రభావంతో ఒక చేయి, కాలు పని చేయ కుండా చచ్చుబడిపోయాయి. కానీ ఆయన అధైర్యపడలేదు. వారి తల్లిదండ్రులు కొంత ఖర్చుపెట్టి ఆస్పత్రిలో చూపించగా చేయి బాగైంది. కానీ కాలు మాత్రం నడకకు సహకరిండం లేదు. తర్వాత కొంతకాలానికి నిమ్స్‌లో కాలుకు శస్త్రచికిత్స చేయించగా ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తూ వ్యవసాయం చేస్తున్నాడు. తనలో అవిటితనం ఉందన్న ఆందోళన ఎన్నడూ తన దరిచేరనీయలేదు. ఎప్పుడూ రైతులకు ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నాడు. గురడిరెడ్డి రైతు సంఘం కార్యదర్శిగా కొన్నేండ్ల పాటు సేవలందించాడు. వివిధ ప్రాంతాలే కాదు, దేశ, విదేశాల నుంచి వచ్చే రైతులను ఆప్యాయంగా పలకరిస్తాడు.వారికి భోజనం, ఉండడానికి వసతులు ఏర్పాటు చేస్తాడు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను గ్రామంలోకి వచ్చినా వారి పంటల వద్దకు తీసుకెళ్లి ఓపికగా వారి ప్రశ్నలకు బదులి స్తాడు. వారికి సాగులో వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తాడు. అంకాపూర్‌కు పర్యాటకులు ఎవరైనా వచ్చారంటే చాలు.. భాజన్నను తప్పక కలవాల్సిందే.

- నమిలికొండ అజరుకుమార్‌, 9490099140

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
01:01 PM

47.40లక్షల మందికి జగనన్న విద్యా కానుక

12:54 PM

అనుమానాస్పద స్థితిలో చిరుత మృత్యువాత

12:49 PM

కాళి చిత్ర పోస్ట‌ర్ వివాదం.. దర్శకురాలిపై కేసు

12:38 PM

విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడికి ఉపాధ్యాయుల యత్నం

12:31 PM

మంత్రి సబితాపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.