Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కానుగచెట్టు ఇల్లు.. | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

కానుగచెట్టు ఇల్లు..

Sun 03 Apr 06:06:20.127665 2022

      అప్పటి శబ్దం మటన్‌ బిర్యానీ విందురోజంత సందడిగా ఉండేది.. మొహల్లాలో ఇప్పటి నిశ్శబ్దం రోజా అంత ఉపవాసంగా ఉంది..
రోడ్లమీద గత కొద్ది రోజులుగా సాగిన ఖాకీ క్రీడలు అప్పుడప్పుడే ముగుస్తున్నాయి. ఏం పండుగో, ఎవరొస్తున్నారో వీధులకు మెలికలు మెలికలుగా తీగలు తీగలుగా ముళ్లు, ముళ్ళుగా ఇనుపకంచె తోరణాలు పోలీసు పనోళ్లతో కట్టించింది ప్రభుత్వం.. అవి ఇప్పుడే విప్పుతున్నట్టున్నారు..

'బైపాస్‌ రోడ్‌కు అవతలి మొహల్లా ఏరియా ఐడియా ఉందా'.. ఇంటర్‌ వ్యూ ఆఖరి ప్రశ్నగా అడిగాడు ఆ కొరియర్‌ ఏజెన్సీ బ్రాంచ్‌ మేనేజర్‌.. 'హా ఉంది సార్‌ ఆవాజ్‌ మొహల్లా'.. ఠక్కున బదులిచ్చాడు శ్యాం.. లేదంటే ఆ ఉద్యోగమూ రాదేమోనని.. 'ఆవాజ్‌ కాదు అనాజ్‌.. కె.. నో ప్రాబ్‌ పూర్తిగా తెలియకపోయినా కొద్దిగా పరిచయమున్నా చాలు.. వారంలో అదే అలవాటవుతుంది.. ఆక్చువల్లీ ఆ టు టవున్‌ ఏరియా డెలీవరీ చేసే ప్రసాద్‌ అనే అబ్బాయి సడెన్‌గా మానేశాడు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. ఏమయ్యాడో తెలీదు. ఎన్నాళ్లని చూస్తాం. అందుకే ఈ ఇంటర్‌ వ్యూ' అన్నాడు మెనేజర్‌ పాన్‌ ఊసేందుకు కిటికీలో తలపెడుతూ..
గుడ్డపేలికలు, అక్కడక్కడ నారింజరంగు కాగితాలు చినిగి, నలిగి పడి ఉన్నాయి.. కాలి చల్లారిన కాష్టంలా ఉంది గుర్రాల మంద తొక్కుకుంటూ పోయినట్టు ఆ వీధంతా పొక్కిలై ఉంది.. శతదేశ దాడుల ప్రాంతమంత బిక్కుబిక్కుగా ఉంది.. అప్పుడే ఏదో మూక అరుచుకుంటూ పోయినప్పుడు గాయపడ్డ నిశ్శబ్దమంత నిశ్శబ్దంగా ఉంది.. వీధి లైటొకటి భయధ్వని గుండెలా అదిరదిరిపడుతోంది..
'రెండు పోర్షన్లతో ఆరుగదుల ఇల్లు.. ఇంటి ముందు కానుగ చెట్టు ప్రహరీకి పెద్ద గేటు'.. ఆ వీధిలో అటుఇటు చూస్తూ చెప్పిన ఆనవాళ్ళు పోల్చుకుంటూ శ్యాం టూ వీలర్‌ ఆపాడు..
''చిన్నారి తల్లి చిన్నారితల్లి మా యింటి జాబిల్లి'' పాట మంద్రస్వరంతో ఆ ఇంటిలోంచి వినవస్తోంది.. జేబులో సెల్‌ ఫోన్‌ తీసి అతను రింగ్‌ చేసీ చేస్తుండగానే ఆమె విసురుగా తలుపు తోసుకొని బయటికొచ్చింది.. 'తేలిగ్గానే పట్టుకున్నావే' నడుచుకుంటూ వచ్చి అతని చేతిలోని పార్సిల్‌ అందుకుంటూ తురక యాసలో అంది.. 'పెద్దగా కష్టపడ్లేదు మేడం అడ్రస్‌ ఈజీనే' మాట తన గొంతులోంచి బయటికొచ్చేలోగానే ఆమె అంతే విసురుగా లోపలికెళ్లింది.. ఆ వెంటనే దడేల్‌ శబ్దంతో తలుపు మూసుకుపోయింది... శ్యాం బండి తిప్పుకుంటుండగా.. మాసిన గడ్డం, సోడాబుడ్డి కళ్ళజోడు చేతిలో కొన్ని వడ్రంగి సామాన్లతో ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంటి వైపు చూస్తూ.. 'ఆమె బయటికొచ్చిందా'.. ముక్కుదాకా జారిపోయిన కళ్లజోడు నుంచి కాక అద్దాల పైనుంచి నేరుగా చూస్తూ పలకరించాడు.. 'హా'.. అనగానే 'అరే.. ఇంకాసేపు ఇక్కడే ఉంటే బావుండేది' అని గొణుక్కుంటూ ఆ ఇంటి ముందుకెళ్ళాడు..
మట్టిరంగు మట్టిగాలేదు కమండల సన్యాసులు వస్త్రాలారేసిన మఠంలా ఉంది.. ఖణేల్‌ ఖణేల్‌ చప్పుడు చేస్తూ కానుగ చెట్టు పక్క ఖాళీ స్థలాన్ని కాకులు గడ్డపారలతో తవ్వుతుంటే ఆ మట్టి బయట పడుతోంది..
అంబాలరావం హరితవేట చాలించి గుళ్ళకొచ్చే సమయం.. ఆ అలికిడి ధ్వనికి కాకులు హడలి మినార్లు చేరుతు న్నారు హంసల్లాంటి పిల్లలకు రెక్కల చాటునిస్తున్నారు. గుడ్లను పాములు మింగుతున్నారు, కానుగ చెట్ల కింద గూళ్ళు చెల్లాచెదురై పడిఉన్నారు.. వాటి దేహాలు చీరుకుపోయి గాయపడి ఉన్నారు, కాకులు దాడులకు గురైనట్టు రక్తం ఎర్రగా సాక్ష్యం పలుకుతోంది..
కొద్ది రోజుల తరువాత.. కొరియర్‌ ఆఫీసులో తన రూట్‌ పార్సిల్స్‌ బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు శ్యాం.. బ్యాగ్‌లో వేయబోతూ ఒక అడ్రెస్‌ను మళ్లీ చదివాడు.. బ్యాంక్‌ కాలనీలో 'ఈ అడ్రెస్‌ ఎక్కడో చూశానే' అని మనసులో అనుకుంటుండగా.. 'నిన్న ప్రసాద్‌ వాళ్ళమ్మ కనపడిందిరా'.. వన్‌ టవున్‌ డెలివరీ బారు సురేష్‌ త్రీటవున్‌ వేణుతో అంటున్నాడు.. 'హా.. ఏమన్నా తెలిసిందటా' ఆసక్తిగా అడిగాడు వేణు.. 'ఏంటి తెలిసేది నీకేమన్నా తెలి సిందా బాబు అని నన్న డిగింది'.. అని అంటుం డగా.. 'ఆ రోజు లాస్ట్‌ సారి మయూరి సెంటర్‌లో ఆటో ఎక్కుతుండగా చూశా'.. అన్నాడు వేణు.. 'మనోడికేదో అఫైర్‌ ఉంది కదూ' బ్యాగ్‌ అందుకుంటూ అన్నాడు సురేష్‌.. 'అంటుంటారు బట్‌ మనకేం తెలుస్తుంది వాడి కుడిచేతిమీదుండే త్రిశూలం పచ్చబొట్టు తప్ప' అన్నాడు వేణు... తమ మాటల్ని శ్యాం ఆసక్తిగా గమనిస్తుండటం చూసి 'హే ఏంటలా దూరంగా నిలబడి పోయావ్‌.. కమాన్‌ మేమూ మొగాళ్లమే' అని జోక్‌ చేశాడు ..
డెడ్‌ఎండ్‌ కావటాన ఆ వీధికి ఒక వైపు నుండే వాహనాలొచ్చి వెనుతిరుగు తుంటారు, పెద్ద ట్రాఫిక్‌ ఉండదు.. మహా అయితే ఓ పదిళ్లు, మరో రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నారు..
సమయం ఉదయం తొమ్మిది గంటలు.. తలుపు తోసుకొని తను హడావిడిగా బయటికొచ్చింది .. దడేళ్‌ మని తలుపు మూసి తాళమేసింది.. చెల్లాచెదురుగా పడున్న చెప్పుల్లో తనవేవో గుర్తుపట్టి తొడు క్కుంది.. చాలా రోజులుగా తీయట్లేదనుకుంటా పేపర్లు వరండాలో పడున్నారు..
గేట్లోంచి భయంభయంగా బయటికొస్తూ బైపాస్‌ రోడ్‌ డివైడర్‌ దాటి వాహనాల రొదలో మాయమయ్యింది..
'మేడం నేను రోడ్‌ కొచ్చేశా.. మీరు బయల్దేరారా..' సెల్‌ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది.. 'వస్తున్నాం ఆయేషా ఆటో బయల్దేరింది'.. అవతలి గొంతు.. 'సరే మ్యాం ఆటో నంబర్‌ ఎంత' అడిగింది.. చెపుతుండగా ఆమె మనసులోనే నోట్‌ చేసుకుంటోంది..
'చిన్నారితల్లీ చిన్నారితల్లీ' పాట వినవస్తుండగా డెలివరీ బారు బండి ఆ ఇంటి ముందాపాడు.. పార్సిల్‌పై అడ్రస్‌ ఆ ఇంటి గోడ మీదున్న నంబర్‌తో పోల్చుకోబోతూ గమనించాడు.. నంబర్‌ అప్పుడే వేసినట్టు పచ్చిపచ్చిగా కానొస్తోంది.. ఎర్రగా ఉంది కానీ అది పెయింట్‌లా అనిపించలేదు.. గేట్‌ వద్దకెళ్ళి ఎప్పటిలా సెల్‌ ఫోన్‌కు రింగ్‌ చేశాడు..
'మేడం నేను'..అని అతను చెప్పబోతుండగా 'హా పార్సిల్‌ తెచ్చావా' అందామె.. 'నేను డెలివరీ బారునని ఎలా తెలుసుకున్నారు మేడం' .. 'మొన్నోసారొచ్చావుగా.. నాకు కాల్‌ చేసిన ఎవరి నంబరైనా సేవ్‌ చేసుకుంటా..' అంది.. 'ఎందుకు మేం' అడగాలనుకున్నా అడగలేకపోయాడు.. 'సర్లే నేను ఇంట్లో లేను ఆ పార్సిల్‌ గదిలో పెట్టి వెళ్ళు' అంది.. 'ఎలా మ్యాం' అన్నాడు తలుపుకు తాళం వైపు చూస్తూ.... 'తాళం తీసి' సూటిగా అంది.. 'ఎలా' సందేహ పడుతుండగా.. ఆమె ఏదో చెప్పింది.
గేటు తీసుకొని వరండాలోకి అడుగుపెడుతూ గమనించాడు.. కొన్ని ప్లాస్టిక్‌, ఇంకొన్ని ఫర్‌, ఫైబర్‌, క్లాత్‌, జ్యూట్‌.. బొమ్మలు అన్నీ బొమ్మలు కొన్ని పొనీటైల్‌. ఇంకొన్ని బాబ్డ్‌, ఇంకొన్ని రొండు జడలు, ఇంకొన్ని బారు జడవి.. వీధులు, ప్రభుత్వ కార్యాలయాలకు కళంకారి ఆర్ట్‌ అద్దినట్టు ఆ ఇంటి గోడమీద పలు భంగిమల్లో బొమ్మలు.. వాటికేనా అన్నట్టు అక్కడక్కడా.. షీలా, సలీమా, జుబేదా, నస్రీన్‌, జుబేదా, వహీదా, ఫర్హానా పేర్లు.. బొమ్మల్ని చూస్తూ పేర్లు చదువుతుండగా ఏదో అలికిడైతే తలెత్తి చెట్టువైపు చూశాడు.. చెట్టుకూ వేళాడుతూ, కొమ్మల్లో ఇరికించి, కాండానికి గుచ్చి ఇంకొన్ని బొమ్మలు.. చెట్టుమీది బొమ్మల్ని, గొడమీది చిత్రాల్ని మార్చిమార్చి చూశాడు.. చిత్రాలు బొమ్మలకు నకలులా ఉన్నాయి అన్నీ ఒకే వర్ణం.. చెట్టు మీది బొమ్మలే ఫొటోలు తీయించుకొని గోడకు ఫ్రేములు వేళాడ దీసుకున్నట్టున్నాయి.. బొమ్మల్ని మరింత పరిశీలించాడు.. అన్నిటికీ కళ్ళు తప్ప ఆ ముఖ ఆకతిలో వేటికీ ముక్కు, నోరు, చెవులు కనపడటం లేదు..
కిటికీ పక్క డబ్బాలో ఉన్న తాళాన్ని ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం దొరికించుకొని గదిలోకి అడుగుపెట్టాడు..
కంపువాసన గుప్పుమనగానే కడుపులో దేవినట్టయ్యింది.. ఇల్లంతా మురికి మురికిగా ఉంది.. గది చీకట ిచీకటిగా ఉంది.. పరిశీలనగా చూస్తే ఆ గదిలో వివిధ కంపెనీలకు చెందిన పార్శిళ్లు గుట్టలుగా పడున్నారు.. అన్నీ ముఖానికి కట్టుకునే వస్త్రాలు.. కొన్ని పార్శిల్‌ చించి ఉన్నారు.. అన్ని రకాలను చూసి ఆశ్చర్యపోతూ తన చేతిలోని పార్శిల్‌ను అప్పుడు గమనించాడు అది కూడా అదే వస్త్రం.. 'వామ్మో ఇన్నెందుకు' అని అనుకుంటుండగా.. అతని ఫోన్‌ రింగయ్యింది.. 'ఏరు దొరికిందా తాళం..' 'హా మ్యాం..' 'వెళ్ళావా లోనికి..' 'హా మ్యాం..' 'అక్కడపెట్టేరు..' అని ఫోన్‌ కట్‌ చేసింది.. శ్యాం పార్సిల్‌ టేబుల్‌ మీదపెట్టి వెనుతిరిగాడు..
మరుసటిరోజు ఉదయం తొమ్మిదిగంటలు.. బైపాస్‌ రోడ్‌ నుండి ఆటో కదిలింది.. ఆయేషా ముఖ వస్త్రం విప్పుతుండగా.. 'ఏంటమ్మారు ముఖం అలా పాలిపొతోంది రక్తం లేనట్టూ..' ఆమె కొలీగ్‌ అనగానే 'అవును మ్యాం తక్కువుందట' కుడిచేతిని పైకెత్తి చూపుడు వేలు చూసుకుంటున్నట్టుగా అంది.. 'అయ్యో ఆ వేలేంటి అంత గాయం అయ్యింది' ఆందోళనగా అంది. 'షుగర్‌ టెస్ట్‌ చేసుకోటానికి రోజూ నీడిల్‌ గుచ్చుతాను మ్యాం'.. 'అయితే మాత్రం అలా చాకుతో కోసినట్టు ఎలా అవుతుందమ్మారు'.. తను అడుగుతుండగా ఆయేషా తన వేలును దీర్ఘంగా చూస్తూ 'మొదట నీడిల్‌ వాడేదాని మ్యాం, ఆ తరువాత చాకుతో చిన్న గాటు, ఆ తరువాత చాకు అవసరం లేని పెద్ద గాయం రోజూ సాగుతోంది'..అంది.. 'అలా ఎందుకు చేస్తున్నావ్‌ నీకేమన్నా పిచ్చా' అంది కొలీగ్‌ 'హా మ్యాం ఈ మాట ఇంకాస్త హై టెంపోలో మీరు వాళ్లని అడగాల్సింది'..అంది.. 'ఇంతకూ ఎందుకు చేస్తున్నావిలా'.. 'మాలోనూ వాళ్ళ వంట్లోలా ఎర్ర రక్తమే ప్రవహిస్తోందని చెప్పటానికి' అంటుండగా సిటీకి ఇరవరు కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరులో వాళ్లు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..
'ఇదిప్పట్లో తెగేది కాదు పరిస్థితులు సద్దుమణిగే దాక ఇద్దరూ కొన్నాళ్ళు ఊరు విడిచిపోండి' అక్కడికి కొద్ది దూరంలోని రచ్చబండ కాడ ఎవరో తీర్పు చెపుతున్నారు..
'మళ్ళీ ఆ ఇంటికి పార్సిలొచ్చింది'.. బ్యాగ్‌లో పార్సిళ్లు సర్దుతూ అడ్రస్‌ చదివాడు శ్యాం.. 'మళ్లీ అదే గార్మెంట్‌.. అయితే కానిరు లే మనకెందుకు' అనుకుంటూ బండి స్టార్ట్‌ చేశాడు..
'ఆయేషా మీ అమ్మాయి కర్ణాటకలోనే చదువుతోందా'.. లీజర్‌ అవర్‌లో కొలీగ్‌ ప్రశ్నించేసరికి 'లేదు మ్యాం ఆ మూక గొడవల తరువాత ఇంటికొచ్చేరు బిడ్డా అన్నాను వచ్చేసింది'... అంది ఆయేషా.. వాళ్ళు మాట్లాడుతుండగా..
'మేడం పార్సిల్‌' ఫోన్‌ చేసి చెప్పాడు శ్యాం.. 'ఇంట్లో లేను ఇంకారాలేదు.. లోనపెట్టేసి వెళ్లు' అంది.. తాళం విషయం ఈసారి అడగలేదు.. గేటు దాటి లోనికెళుతుండగా..పేపర్‌ తలకు తగిలి కిందపడింది.. పేపర్‌ బారు గిరాటేస్తే చెట్టు కొమ్మల్లో చిక్కుకొని ఇప్పుడు గాలికి కింద పడిందేమో అనుకుంటూ కిందపడిన పేపర్‌ తీతూ పక్కనేయబోయాడు.. అది ఆరోజు పేపర్‌ కాదు నెల రోజుల క్రితంది.. ఆశ్చర్యపోతూ హెడ్డింగ్స్‌ చూస్తుండగా.. ఘోర ప్రమాదం టిప్పర్‌ కింద నుజ్జు నుజ్జైన ఆటో డ్రైవర్‌ సహా నలుగురు ఉపాధ్యాయినిల మతి అనే హెడ్డింగ్‌ కనిపించింది.. దాన్ని పట్టించుకోకుండా పడేసి లోనికెళ్ళాడు.. పార్సిల్‌ పెట్టబోతుండగా అతని ఫోన్‌ రింగయ్యింది.. 'వెళ్ళావా లోనికి'.. 'హా జస్ట్‌ మ్యాం'... 'ఇవాళ స్పెషల్‌'.. 'ఏంటి మ్యాం'.. 'వెయ్యి రకాలు తెప్పించాలనుకున్నా ఈ రోజు నువు తెచ్చిన వాటితో పూర్తయ్యారు.. సరే.. అక్కడ పెటెళ్ళు'.. 'ఓకే మ్యాం' అనబోతుండగా..'ఆ ఒక్కమాట', 'ఏంటి మ్యాం'..
'రెండు సింగిల్‌ కాట్‌లు కనిపిస్తున్నారు కదా నిజానికి వాటిని ఈపాటీ ఎవడో హౌం గార్డుకు అమ్మేసి ఉండును.. ఆ రాత్రి నాబారు ఫ్రెండ్‌ ఆ గొడవ చేసి ఉండకపోతే.. సరే.. ఇంకెవరన్నా ఉంటే చెప్పు ఇచ్చేద్దాం.. పోనీ నువ్వైనా తీస్కెళ్దువు ఒకసారి చూడు' అంటూ కాల్‌ కట్‌ చేసింది ఆయేషా.... సింగిల్‌ కాట్‌ చూద్దామని వంగగానే దుర్వాసన మరింత గుప్పుమంది.. ఏంటోనని రెండు మంచాల కింద చూస్తే ఎవరో యువకుడి శవం కుళ్లు కంపుకొడుతోంది.. అది చూడగానే చెమటలు పట్టాయతనికి.. ఇంట్లో శవమేంటి.. అదీ కుళ్లిపోయుండటమేంటి అనుకుంటూ గబగబా ఫోన్‌ తీసి ఆమె నంబర్‌కు రింగ్‌ చేయగానే 'బంగారు తల్లి బంగారు తల్లి ' రింగ్‌ టోన్‌తో ఆ ఫోన్‌ అక్కడే దిండు పక్కగా రింగయ్యింది.. భయపడుతూ కట్‌ చేసి వణుకుతున్న చేతులతో మళ్లీ రింగ్‌ చేశాడు.. ఆ ఫోన్‌లో శ్యాం ఫొటోతో కాలర్‌ ఐడీ చూపిస్తోంది.. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తి గేటు దాటుతుండగా 'ఆమె ఇంకా ఇంట్లోంచి బయటికొస్తోందా'.. అన్న మాట వినిపించింది.. ఇతన్నెక్కడో చూశానే అనుకుంటుండగా గుర్తొచ్చింది.. మొదటి రోజు పలకరించిన సోడాబుడ్డి కళ్లజోడు వ్యక్తి అని..
ఆటో వెనక్కు బయల్దేరింది.. 'ఆయేషా.. పర్సనల్లీ నిన్నొకటి అడగొచ్చా'.. 'ష్యూర్‌ మ్యాం'.. 'మీవారు పోయి పదేళ్ళు కదా స్టిల్‌ ఆర్‌ యూ సింగిల్‌'.. 'నో మ్యాం ఐ యాం కమిటెడ్‌'... 'ఆర్‌ యూ కంఫర్ట్‌ విథ్‌ హిం'.. 'యా..కంఫర్ట్‌ బట్‌ పర్ఫెెక్ట్‌లీ నాట్‌ మ్యాం'.. 'అదేం విరోదాబాస అలా ఎలా'.. 'అతను ఆ మతంలాంటోడు మ్యాం' .. 'అంటే'.. 'రోజూ వేధిస్తుంటాడు'..
మొరంతోలారు, గుంటలు పూడ్చారు పొక్కిలి రోడ్ల బుగ్గలు నిమిరారు.. వీధికి ఎప్పటిలా మందపు మట్టిచీర కట్టారు.. ఆ రాత్రి రోమియో వానొకటొచ్చి దాన్ని తడిపింది..
కాకులు తవ్వుతున్న కొద్ది షేరాలు బయట పడుతున్నారు, ఆకుపచ్చ జెండాల అవశేషాలు అగుపడుతున్నారు.. అలసి పోతున్న సమయంలో ఎర్రమనుషులు కొందరు చెట్లపై వాటికి గూళ్లల్లుతున్నారు.. పొద్దుగూకుతోంది ... భయపెట్టే శబ్దం ఇప్పుడు భయపెట్టలేదు.. చెట్టు మీది ఒక బొమ్మ కదిలి ముందుకొచ్చింది.. ముఖానికి ముసుగేసుకుంటూ గొంతు విప్పింది.. బొమ్మలు ఇప్పుడక్కడ ఏమీ లేవు ఇప్పుడిక్కడ ఏమీ లేవు చెట్టు ఖాళీ, గోడ ఖాళీ.. ఇంట్లో హిజాబ్‌లన్నీ ఖాళీ .. ఎదురొస్తున్న మందలో కొన్ని రంకెవేయబోయారు.. కళ్లల్లో కాకి ధైర్యాన్ని చూసి వెనుతిరిగాయి.. ఇప్పుడావీధిలో గిట్టల్ని తరిమిన పాదాల ఆనవాళ్లు.. సరిగ్గా అప్పుడే ఆవాజ్‌...
సెల్‌ఫోన్‌ పెద్ద సౌండ్‌తో రింగ్‌ కావటంతో నిద్రలోంచి మేల్కొన్నాడు శ్యాం.. 'మొన్న ఇంటర్‌ వ్యూ కొచ్చావు కదా.. నువ్వు సెలెక్ట్‌ అయ్యావయ్యా. రేపట్నుంచి డ్యూటీలో జాయిన్‌ అవ్వు'.. అంటూ కొరియర్‌ సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి చెపుతుంటే.. ఇంతసేపు నేను కలలో ఉన్నానా అనుకున్నాడు ..
డ్యూటీలో చేరిన మొదటిరోజే శ్యాం ఆశ్చర్యపోయాడు.. పార్సిల్‌ డెలివరీ చేయబోతున్న ఇల్లు అచ్చం కలలో చూసినట్టే ఉంది.. ఆ వీధి డెడ్‌ ఎండ్‌గానే ఉంది.. ఇల్లు అలానే ఉంది.. ఇంటి ముందు కానుగచెట్టు అలానే పెద్ద కొమ్మలతో ఆ ఇంటోళ్లకేకాక ఆ ఇంటిని ఆనుకొని ఉన్న బ్యాంక్‌ సిబ్బంది, కస్టమర్ల వెహికిల్స్‌కు, వీధిలోని చాలా ఇళ్ళ వాళ్లకు నీడనిస్తోంది.. వీధి పొక్కిలిగా లేదు అడుగుల ముద్రలతో లేదు.. అది సీసీ రోడ్డు..
గేటు ముందు నిలబడి శ్యాం రింగ్‌ చేశాడు బయటకు ఎవరొస్తారో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు.. 'బండరాళ్ళను చిరాయువుగా చేసి తేనెలొలికే పూబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడ్ని ఏది కోరేది'.. శివ నిందాస్థుతి వినవస్తుండగా.. తలుపు మామూలుగానే తెరుచుకుంది.. ఇంట్లో నుంచి ఒక బక్క పలుచని మహిళ నైటీలో బయటికొచ్చింది.. 'ఇప్పుడు దీన్ని డేటీ అని పిలుస్తారా వీళ్లు' ..తనలో తాను జోక్‌ వేసుకున్నాడు శ్యాం.. ఆమె కలలోచూసిన ఆయేషాలా లేదు.. తను ఆయేషా కాదు .. ఆ పార్సిల్‌ హిజాబ్‌ కాదు.. ఆ వీధిలో గతంలో చూసిన ఆ ఇల్లు, అంతకు ముందు రోజు టీవీలో చూసిన కర్ణాటక కళాశాలలో హిజాబ్‌ వివాదం న్యూస్‌.. తన కలకు కారణం అనుకున్నాడు..

- శ్రీనివాస్‌ సూఫీ, 9346611455

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్యూషన్‌
మలుపు
మా అక్కయ్య
బ్లాక్‌ లేక్‌
మాటల మూటలు
నిర్లక్ష్యం ఖరీదు
స్టాట్యూటరీ వార్నింగ్‌
ఎవడైతేనేం
పరీక్ష
అర్థం - పరమార్థం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
02:14 PM

బీజేపీ సమావేశాల్లో కలకలం..!

02:08 PM

బీజేపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.