Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చదివింది గుర్తుకు రావడం లేదా...? | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • చైల్డ్ హుడ్
  • ➲
  • స్టోరి

చదివింది గుర్తుకు రావడం లేదా...?

Sat 09 Apr 23:56:50.244421 2022

            పరీక్ష సమయం రాగానే చాలా మంది విద్యార్థులు పుస్తకాల తో కుస్తీ పడుతూ ఉంటారు మరికొంత మంది విద్యార్థులు ఇప్పుడే పుస్తకం తీసి చదవడం ప్రారంభిస్తారు అయితే ఎలా చదివినా చాలా వరకు గుర్తుండవు అంటారు మరికొంత మంది విద్యార్థులు.
పుస్తకాలు ఒక్కో విద్యార్థి ఒక్కో విధంగా చదువుతాడు ఎలా చదివినా గుర్తుండడం చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌ అందుబాటులో ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా సెల్‌ఫోన్‌పై అతిగా ఆధార పడడం మొదలయింది. ఒకప్పుడు నోటితో లెక్కలు చెప్పెవారు ఇప్పుడు సెల్‌ఫోన్‌లో క్క్యాలిక్యులెటర్‌ ఓపెన్‌ చేసి చెబుతు న్నారు. ఇలా అతిగా సెల్‌ఫోన్‌పై ఆధారపడడం వల్ల మనం గుర్తుపెట్టుకొనే అవసరం చాలా వరకు తగ్గిపోయింది ఫలితంగా మన మెదడుకు పని చెప్పడం కూడా తగ్గిపొయింది.
ఈ ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులను పరిశీలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుని పనిచేసే వారే అని ఋజువైంది. కాబట్టి మనం ఎక్కువ విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంతో అవసరం.
మన జ్ఞాపకశక్తిలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. మనం ప్రతీరోజూ అనేక పనులు చేస్తూ ఉంటాం పాటలు వింటాం, సినిమా చూస్తాం, ఇష్టమైన వారితో కబుర్లు చెబుతాం. ఇలా మనం చేసే పనులు అన్నీ కూడా మన మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. మనం చదివిన విషయాలు కూడా మన మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. ఇలా అన్ని విషయాల సముచ్చయం లో నుండి మనం చదివిన విషయం గుర్తుకు రాదు. ఒక్కోసారి కొంత గుర్తుకు వస్తుంది కొంత రాదు. ఇటీవలి పరిశోధనల ప్రకారం మనం ఉదయం చదివిన విషయం మధ్యాహ్నం వరకు 50శాతం, సాయంత్రం వరకు 20శాతం, మరుసటిరోజుకు కేవలం 10శాతం మాత్రమే గుర్తుంటుంది. కాబట్టి చదివింది గుర్తుకు రాకపోవడం సాధారణ విషయమే...
ఎక్కువ రివిజన్‌ చేయడం ద్వారా....
మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఎక్కువగా రివిజన్‌ చేయడం ఎంతో ముఖ్యం. ముందుగానే చెప్పుకున్నట్లు మన మెదడులో అనేక విషయాల సముచ్చయం ఉంటుంది. వాటిలో మనం చదివిన విషయం త్వరగా గుర్తుకు రావాలంటే ఎక్కువగా రివిజన్‌ చేస్తూ ఉండడం ఎంతో అవసరం.
ఒక ప్రశ్నకు సమాధానం చదివిన తర్వాత రెండో ప్రశ్న మొదలు పెట్టే ముందు తిరిగి మరలా మొదటి ప్రశ్న సమాధానం రివిజన్‌ చేసిన తర్వాత రెండో ప్రశ్న మొదలు పెట్టాలి. మూడవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా రెండు ప్రశ్నల సమాధానాలు రివిజన్‌ చేసిన తర్వాత మూడవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టాలి. నాలుగవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా రెండవ ప్రశ్న సమాధానం, మూడవ ప్రశ్న సమాధానం రివిజన్‌ చేయాలి. నాలుగవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా మూడవ ప్రశ్న సమాధానంరివిజన్‌ చేయాలి. తిరిగి ఆదివారం అన్ని ప్రశ్నలు రివిజన్‌ చేయాలి.
ఇలా రివిజన్‌ చేయడం వల్ల మొదటిసారి చదివినప్పుడు ఒక గంట సమయం పడితే రెండవ సారి రివిజన్‌ చేసినప్పుడు అరగంట, మూడవసారి రివిజన్‌ చేసినప్పుడు కేవలం పది నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది.
విజువలైజేషన్‌ ద్వారా....
సాధారణంగా కంప్యూటర్లు మనం అందించిన సమాచారం అంతా బైనరీ కోడ్‌ రూపంలో నిలువ ఉంచుకుంటుంది. అలాగే మనం చదివిన సమాచారం అంతా మన మెదడులో బొమ్మల రూపంలో నిలువ ఉంటుంది. అందుకే మనం చూసిన సినిమాలు ఎక్కువగా, చూసిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి. కాబట్టి చదివేటప్పుడు ఎక్కువగా ఊహించుకుంటూ చదవడం ద్వారా ఎక్కువగా గుర్తుంటాయి.
ప్రశ్నించుకుంటూ చదవడం ద్వారా......
ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు? ఎక్కడీ అని ప్రశ్నించుకుంటూ చదవడం ద్వారా మనకు జిజ్ఞాస ఏర్పడుతుంది కనుక మనం చదివిన విషయం కూడా మన మెదడులో ఎక్కువగా గుర్తుంటుంది.
నిమోనిక్స్‌ ద్వారా....
ఈ పద్ధతి ప్రకారం మీరు చదివిన అధ్యాయంలో నుండి ప్రధాన అంశాలను తీసుకుని వాటితో గుర్తుండిపోయే పదాన్ని లేదా వాక్యాన్ని తయారు చేసుకోవాలి.
ఉదాహరణకు ఇంద్రధనుస్సులో వివిధ రంగులను గుర్తుపెట్టుకోవడానికి VIBGYOR అనే పదం రూపంలో గుర్తుపెట్టుకోవడం. V-Violet, I-Indigo, B-Blue, G-Green, Y-Yellow, O-Orange, R-Red.
అలాగే మరొక ఉదాహరణ ఒక చిన్న వాక్యం ద్వారా సౌర కుటుంబంలోని అన్ని గ్రహలను గుర్తుపెట్టుకోవడం
My Very Educated Mother Just Shouted Us Nine Planets., ఇక్కడ  M-Mercury, V-Venus, E-Earth, M-Mars, J-Jupiter, S-Satarn, U-Iranus, N-Neptune and P-Pluto.
ఈవిధంగా మనం యూనిట్‌లోని ముఖ్యమైన భాగాన్ని వాక్యం రూపంలో మార్చి గుర్తు పెట్టుకోవచ్చు.
ఎక్రోనిమ్స్‌ ద్వారా......
త పదముల సమూహం నుంచి మొదటి అక్షరాన్ని ఉపయోగించి ఒక కొత్త కోడ్‌ ని రూపోందించె పద్దతినె ఎక్రోనిమ్స్‌ లేదా అక్షరసంకేతం అంటారు.
ఉదాహరణకు.
ISRO - Indian Space Research Organization
SBI - State Bank of India
NGRI- National Geological Research Institute
ఈవిధంగా ఒక పదం లోని మొదటి అక్షరాన్ని కోడ్‌ గా ఉపయోగించి గుర్తుంచుకోవడం.
మరొక ఉదాహరణ B H A J S A B అనే కోడ్‌ మొఘలు వంశ ముఖ్య పాలకులను గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
B- Babar, H- Humayan, A- Akbar, J- Jehangir, S- Shahjahan, A- Aurangazeb, B- Bahadur Shah Zafar.
ఈ విధమైన పద్దతులు ఉపయోగించి చదవడం ద్వారా ఎక్కువగా గుర్తుంటాయి.

- ధర్మారపు జ్ఞానేష్‌, 8367572018
  మానసిక నిపుణులు, తొర్రూరు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనిషే గొప్ప
రోగానికి సేవ
పత్రంతో ఛత్రం
పిల్లకాకి
వృద్ధ దుప్పి సలహా
రాము - కుక్కపిల్ల
గీయించిన బొమ్మ
సాధించాలి
నాన్న ఇచ్చిన ఆస్తి
నిర్మల హృదయం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.