Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎండాకాలం - జాగ్రత్తలు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

ఎండాకాలం - జాగ్రత్తలు

Sun 17 Apr 04:23:00.867817 2022

            ప్రతీసారి వేసవికాలం రాగానే మనుషులు బెంబేలెత్తడం మామూలయ్యింది. ఈ మధ్యకాలంలో భూ ఉపరితల వాతావరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. ప్రతీ ఏడు వేసవి వేడి ఎంతోకొంత పెరగడం తద్వార మనుషుల ఆరోగ్యం పైన అది ప్రభావాన్ని చూపడం, మరణాలు సంభవించడం రానురానూ పెరుగుతూనే ఉన్నది. 20వ శతాబ్దం మధ్య కాలం నుండి భూవాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు అటు శాస్త్రవేత్తలనూ ఇటు సామాన్యమానవులనూ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 'నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌' (నాసా) వారి గోడ్డార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ వారి అధ్యయనాల ప్రకారంగా చూస్తే, 1952 రెండి 1980 వరకు జరిగిన వాతావరణ మార్పుల కంటే 2015 నుండి 2021 వరకు రికార్డు చేయబడిన ప్రపంచ ఉష్ణోగ్రతల్లో ఘణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచ శీతోష్ణ స్థితుల్లో వస్తున్న మార్పులపైన 'ఐపిసీసీ' ఇచ్చిన నివేదికలో దీనికి ప్రధాన దోషిగా మానవుడినే చూపెట్టింది.
            భూవాతావరణంలో పెరుగుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి ఉద్గారాలే ఈ విపత్తుకు కారణం. 21వ శతాబ్దంలో పెరుగుతున్న భూతాపాన్ని ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ సైన్స్‌ అకాడమీలు గుర్తించ గలిగాయి. పెరుగుతున్న భూతాపంతో సముద్ర మట్టం పెరిగి వేడి గాలులు వీయడం ఎక్కువవుతుంది. పచ్చని అడవులను మానవులు నాశనం చేసి ఎడారులు పెరగడం దీనికి మరింతగా దోహదపడుతున్నది. మారుతున్న భూ వాతావరణ పరిస్థితుల పైన ఐక్యరాజ్య సమితి ముసాయిదా కన్వెన్షన్‌ (యుఎన్‌ఎఫ్‌సిసి) గొడుగు కింద ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయం జరిగింది. 1994లో ఏర్పడ్డ ఈ కమిటిలో ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించి గ్లోబల్‌ వార్మింగ్‌ను కట్టడి చేయాలన్న నిబంధనకు ఆమోదం తెలుపుకున్నాయి. 2016లో పారిస్‌లో జరిగిన ఈ ఒప్పందం పెద్దగా ఫలితాలను ఇచ్చినట్టుగా లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది. ఉద్గారాలను తగ్గిస్తామంటూ ప్రపంచ దేశాలు చేస్తున్న వాగ్దానాలు నీరసపడి పోతున్నాయి.
            కేవలం ఈ వాగ్దానాలు భవిష్యత్తులో ఏర్పడబోతున్న భూతాపాన్ని తగ్గించడానికి సరిపోవు. పారిశ్రామిక విప్లవం తరువాత భూమిపైన పెరిగిన గ్రీన్‌హౌస్‌ వాయువుల పరిమాణం పెరిగి కార్బన్‌డై ఆక్సైడ్‌, మీథేన్‌, ట్రొపోస్పియర్‌లోని ఓజోన్‌ సీఎఫ్‌సీలు, నైట్రస్‌ ఆక్సైడ్‌ల నుండి రేడియేషన్‌ వత్తిడి పెరిగింది. అటవీ నిర్మూలన కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఓ కారణం. అడవులను నరికి ఎడారులుగా మార్చడం వలన ఉపరితలంపైన వెలుతురు ఎక్కువయ్యి సూర్యరశ్మి ప్రతిబింబ ప్రకాశం పెరుగుతుంది. అంటే సూర్యరశ్మి రిఫ్లక్ట్‌ జరుగుతుంది. దీనితో మేఘాలను ప్రభావిం చేసే ఏరోసోల్స్‌, ఇతర రసాయనాల సమ్మేళనాలు విడుదలై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతుంది.
            సూర్యుని నుండి భూమికి చేరే శక్తిలో పెరుగుతున్న మార్పులే వేడి పెరగడానికి కారణమని సామాన్య ప్రజలు భావిస్తారు. కానీ 16వ శతాబ్ది మధ్య కాలం నుండి జరుగుతున్న కొలతల రికార్డుల ప్రకారంగా సూర్యుడి నుండి భూమికి చేరే వేడిలో ఎలాంటి మార్పులు లేవు. భూమిపై జీవించే మానవులు ఉత్పత్తి చేస్తున్న ఉద్గారాలే అందుకు కారణం.
మనుషులపై వేసవి ప్రభావం
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మనిషి శరీరం అనేక రకాల మార్పులకు గురయి ఇబ్బంది పడుతుంది.
            మానవ శరీరానికి సంబంధించినంత వరకు బయటి వాతావరణంలోని ఉష్ణోగ్రతలు 18 నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉండవచ్చు.అప్పుడే మానవ శరీరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగితే శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలని శరీరం లోపలి నుండి బయటకు తోయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో శరీరం బాహ్య చర్మానికి వేడి నుండి రక్షించుకునేందుకు ఎక్కువ మోతాదులో రక్త ప్రవాహాన్ని చర్మానికి అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి స్థితిలోనే మనకు చెమట పడుతుంది. చెమటతో వీలైనంత వరకు శరీరం తనకు తాను చల్లబరుచుకుంటుంది. కానీ మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగితే అంటే సుమారుగా 39 నుండి 40 సెంటిగ్రేడ్‌ల వరకు రాగానే కండరాల వేగం తగ్గించడానికి మెదడుకు సంకేతాలు పంపవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మెదడు ఈ పనికి పూనుకుంటుందో ఆ భారం మెదడుపైన పడుతుంది. దీనితో మనిషి వెంటనే అలసటకు గురి కావడం జరుగుతుంది. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగి 41 డిగ్రీలకు చేరుకుంటే శరీరం ఇంకా అనేక ఆటుపోట్లకు గురికావలసి వస్తుంది. చర్మానికి రక్తాన్ని ప్రసారం చేసుకోవడం కష్టమయ్యి చెమటల పట్టడం తగ్గిపోతుంది. వివిధ రసాయనిక చర్యలకు లోనైన శరీరం మొద్దుబారి పోతుంది. ఇక్కడే మనిషి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నది.
చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
            ఎండాకాలంలో శరీరంలో జరిగే ముఖ్యమైన మార్పు నీరు తగ్గిపోవడం శరీరం ఎక్కువగా నీటిని కోల్పోవడం వల్ల చర్మం నాజూకుతనాన్ని మృధుత్వాన్ని కోల్పోయి గరుకుగా తయారవుతుంది. దానితో చర్మం ఎర్రబారి పొడిగా మారుతుంది. దురదలు లాంటివి మొదలయ్యి చికాకు పరుస్తాయి. బయటి వాతావరణంలోని వేడికి శరీరం ఎక్కువ చెమటను, నూనె పదార్థాలను చర్మ కణాలు ఎక్కువగా విసర్జించవలసిన అవసరం ఏర్పడుతుంది. మనం బయట ఎండలోకి వెళ్ళినపుడు యూవీ (ఆల్ట్రావైలెట్‌) కిరణాలు నేరుగా చర్మంపై పడడం వలన చాలా రకాల చర్మ సమస్యలతో పాటు ఇది కొన్ని సందర్భాల్లో చర్మ కాన్సర్‌కు కారణం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వేడి, తేమతో కూడిన పరిస్థితుల వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డు చెమటతో కలిసి చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. మొటిమలు వచ్చే చర్మ లక్షణం ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.
ఉష్ణోగ్రతలు పెరుగుదల వల్ల సెబాషియస్‌ గ్రంథులు ఎక్కువగా పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. దీనితో చర్మం పొడిబారి ప్యాచ్‌లుగా ఏర్పడుతుంది. సూర్యకిరణాల తీవ్రత వల్ల చర్మంలో మెలనినిన్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల చర్మం ముదురురంగులోకి మారుతుంది. అతి వేడి వల్ల చర్మ రంధ్రాలు ఎక్కువగా తెరుచుకుంటాయి. దీనితో బ్యాక్టీరియాలు సోకే అవకాశం లేకపోలేదు.
            వేసవి కాలంలోకి మారుతున్నప్పుడు ఫేస్‌వాషలు వాడే వారు వాటిని మార్చవలసిన అవసరం ఉంటుంది. చర్మం శుభ్రంగా ఉండటానికి ఎక్కువసార్లు ముఖాన్ని కడుక్కోవడం అవసరం.
            ఎండాకాలంలో యాంటి ఆక్సిడెంట్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్‌లు గల క్రీములు, లోషన్లు ఆహార పదార్థాలు వాడటం వలనల వేసవి పర్యావరణం వలన చర్మాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నది. యాంటి ఆక్సిడెంట్‌లు కొర్లాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడం వల్ల కెల్లాజెన్‌ అధికంగా ఉత్పత్తి అయి చర్మం పాడవకుండా కాపాడుతుంది. సిట్రస్‌ పండ్లు, ఆకుకూరలు, గ్రీన్‌ టీ, తృణ ధాన్యాలు లాంటివి వేసవిలో చర్మ రక్షణకు ఉపయోగపడతాయి. వీలైనంత వరకు ముఖం, చర్మం ఎండకు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవడం మంచిది. బయటకి వెళ్ళినపుడు చర్మాన్ని కప్పి ఉంచే విధంగా చూసుకోవడం అవసరం.
            వేసవి మేకప్‌ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ముఖ చర్మానికి వీలైనంత గాలి సోకేందుకు ఇది దోహదపడుతుంది. ముఖంపై వేసుకున్న మేకప్‌ వల్ల ఏర్పడే పొర చర్మ రంధ్రాలకు గాలి సోకే అవకాశం ఇవ్వదు.
            సెబాషమన్‌ గ్రంథుల పని తీరు మెరుగు పరచడం కోసం మీ ముఖాన్ని అప్పుడప్పుడు టోన్‌ చేసుకోవడం మంచిది. తాజా కీరదోసకాయ కానీ, కలబంద గుజ్జుతో కానీ టోన్‌ చేసుకుంటే చర్మం ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నది.
మార్కెట్‌లో దొరికే మాయిశ్చరైజర్లు, టోనర్లు, ఫేషియల్‌ క్లెన్సర్‌లు వాడేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.
            ఓట్స్‌, దోసకాయ, పెరుగు, రోజ్‌ వాటర్‌, పుదీనా మొదలైనవి చర్మం పొడిబారకుండా చూస్తాయి.
            వేసవిలో మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాంసాహారం తీసుకోకుండా ఉండడమే మేలు. శాఖాహారం తీసుకోవడం మేలు చేస్తుంది. రోజుకు 1000 మిల్లీ గ్రాముల యాంటీ ఆక్సిడెంట్‌లు తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం రక్షణ వ్యవస్థ బలపడి చర్మాన్ని కాపాడుతుంది.
బయటకు వెళ్ళేటప్పుడు వాడే సన్‌స్క్రీన్‌ లోషన్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి.
వాడాల్సిన సన్‌స్క్రీన్‌ లోషన్లు
            మన చర్మంపైన నేరుగా తగిలే సూర్యరశ్మి వల్ల వేసవిలో చర్మం పొడిగా మారి నల్లబారుతుంది. చర్మం ఎర్రబారడం పొక్కులు రావడం, చర్మం పొరలు ఊడిపోవడం, దురదలు రావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడాల్సి వస్తుంది. అయితే వాటి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ఆక్సిబెంజాన్‌, జింక్‌ ఆక్సైడ్‌, ఎవోబెంజిన్‌ డై ఆక్సైడ్‌, ఎవో బెంజిన్‌ వెక్సొరిల్‌ 5 ఎక్స్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్లు ఎంచుకోవడం మంచిది. వాటిల్లో ఉండే ఎస్‌పిఎఫ్‌ను కూడా పరిశీలించాలి. ఎస్‌పిఎఫ్‌ అంటే సన్‌ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ అని అర్థం. మనం వాడే సన్‌స్క్రీన్‌ లోషన్‌లలో ఇది 15 శాతానికి తగ్గకుండా ఉండే ప్రొడక్స్ట్‌ను ఎన్నుకోవాలి. 30 శాతం వరకు ఎస్‌పిఎఫ్‌ కలిగిన ఉత్పత్తులైతే 90 శాతం వరకు చర్మానికి రక్షణ కలిగించి కాపాడుతాయి.
చల్లని పానీయాలు
            వేసవి కాలంలో బయటకు వెళ్ళిన చాలా మంది చేసే పని కూల్‌డ్రింక్స్‌ తాగడం. ఎండ వేడి నుండి ఉపశమనం పొందడం కోసం కూల్‌డ్రింక్స్‌ తాగడం ఏ రకంగానూ సరైనది కాదు. ఫాస్పరిక్‌ యాసిడ్‌ లాంటి తీవ్ర ప్రభావాన్ని చూపే రసాయనాలు ఈ కూల్‌డ్రింక్స్‌లలో ఉంటాయి. వీటి వల్ల చాలా సమప్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ ఫాస్పరిక్‌ యాసిడ్‌ పళ్ళను దెబ్బతీయడమే కాకుండా ఎముకలను బలహీనపరిచే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఇందులో ఉండే రసాయనాల ప్రభావంతో హార్మోన్‌ల అసమతుల్యత ఏర్పడుతుంది. కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్నది. వీటి స్థానంలో మీరు చల్లని మజ్జిగ, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం మంచిది.
గ్రామీణులపై వేసవి ప్రభావం
            పట్టణాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న అవగాహనతో వేసవి కాలంలో కొంత జాగ్రత్తలు తీసుకోగలరు. కానీ గ్రామీణులు వేసవి ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నది. భారతదేశంలో ఏటా జరిగే వడదెబ్బ మరణాలు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయి.
వ్యవసాయ పనులకూ ఇతరత్రా కూలి పనులకూ వెళ్ళే గ్రామీణులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనులు ముగించుకోవడం మంచిది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ రెండు నెలలు మధ్యాహ్నం ఇంటిపట్టున ఉండడం మంచిది. సాయంత్రం సమయాల్లో అయితే 4 గంటలు లేదా 5 గంటల తర్వా రాత్రి వరకూ పని చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, ఆటల కోసం, చెరువుల్లో ఈతల కోసం వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు గమనించాలి.
వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే కాలక్షేపం చేసేలా చూసుకోవడం మంచిది. మజ్జిగ లాంటి ద్రవాలు పదే పదే ఇస్తూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగే విధంగా ప్రోత్సహించాలి.
            వేసవిలో వడదెబ్బ తగిలితే శరీరంలోని నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఎక్కువగా జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు 104 నుండి 106 వరకు ఉండవచ్చు. అలాంటప్పుడు నీటిలో తడిగుడ్డ ముంచి ఒళ్ళంతా పదే పదే తుడుస్తూ ఉండాలి. ద్రవాలను ఎక్కువ తాగిస్తూ ఉండాలి. ఈ సమయంలో కొన్నిసార్లు నీళ్ళ విరేచనాలు కలగవచ్చు. దీనికి కావలసిన మందులను అందుబాటులో ఉంచాలి. ఎండదెబ్బతో శరీరం ద్రవాలను ఎక్కువగా బయటకి పంపిస్తుంది. అందులో పొటాషియం, సోడియంలు బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి పొటాషియం, సోడియం ఉన్న ద్రవాలను తాగించాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగడం ఇలాంటి సమయాలలో మేలు చేస్తుంది. బి.పి., షుగర్‌ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
            వేసవిలో ముఖ్యంగా పాటించవలసిన మొదటి నియమం నీటిని ఎక్కువగా తీసుకోవడం. బయటకి వెళ్ళే వారు కొంత ఎక్కువ నీటినే తీసుకోవాలి. పళ్ళ రసాలు లాంటి ద్రవ పదార్థాలనూ తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌ లాంటి కోలా పానీయాలను తీసుకోవడం శ్రేషస్కరం కాదు. ఎక్కువగా నూనెతో చేసిన వేపుళ్ళను తినకూడదు. ముఖ్యంగా యువద వేసవి కాలం వెళ్ళే వరకు 'ఫాస్ట్‌ఫుడ్‌' లాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్తిమీరా, దానిమ్మ, పుచ్చకాయ, పుదీనా వంటి వాటి రసాలను తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్ళే వారు సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడడం వల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. బయటకు వెళ్ళేవారు ఇంకో లీటరు లేదా రెండు లీటర్ల నీటిని అదనంగా తీసుకోవడం మంచిది.
కళ్ళు
            మనం బయటి ఎండలోకి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు అల్ట్రావయోలెట్‌ కిరణాలు వెలుతురు ఎక్కువగా కళ్ళకు సోకుతుంది. వీటిలో ఉండే హెచ్‌ఈవీ (హై ఎనర్జీ విజిబుల్‌) కిరణాల వల్ల కండ్లకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. నలభై సంవత్సరాలు దాటిన వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఎండలో తిరిగిన వారికి ప్రీమెచ్యూర్‌ ఎజినా లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అంటే తొంద కాటరాక్ట్‌ రావడం కంటి కండరాలు దెబ్బ తినడంతో పాటుగా అనేక రకాల కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల ఎండలోకి వెళ్ళేవారు వీలైనంత వరకు
- నల్ల కళ్ళద్దాలు వాడడం
- కళ్ళపైన నీడ పడే విధంగా చూసుకోవడం (టోపి లాంటివి ధరించడం)
- నీరు ఎక్కువగా తీసుకోవడం
- పండ్లు ఎక్కువగా తీసుకోవడం వంటి మొదలైన జాగ్రత్తలు పాటించాలి.
జంతువులపై ఉష్ణోగ్రతల ప్రభావం
            అధిక ఉష్ణోగ్రతలలకు మానవ శరీరాలు మాత్రమే ప్రభావితమవుతాయి అనుకుంటే పొరపాటే. భూ ప్రపంచంలోని చాలా జీవులు అధిక ఉష్ణోగ్రతలకు లోనయ్యే అవకాశం ఉన్నది. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మూడో వంతు గబ్బిలాలు చనిపోయినట్లుగా అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అడవిలో ఉండే ఇంకా అనేక జంతువులపైనా ఈ వేడి ప్రభావం ఉంటుంది. ఇళ్ళల్లో పెంచుకునే పెంపుడు జంతువుల విషయంలో వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు వాటికి వడదెబ్బ తగలకుండా చూసుకోవాల. ద్రాక్ష లేదా ఎండు ద్రాక్ష లాంటివి అస్సలు ఇవ్వకూడదు. ఈ రకం పండ్లు శరీరంలో ఉండే చల్లదనాన్ని హరించి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలను బయట ఎండలో ఉన్న కార్లలో ఒక్క నిమిషం కూడా వదలడం క్షేమం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లల్లో పెంచుకునే గేదెలు, ఆవులు లాంటి పశువులను చల్లని నీటితో పదే పదే తడపడం క్షేమదాయకం.

- చమన్‌సింగ్‌, 9440385563

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.